తోడూ నీడ - పార్ట్ 1
- Lakshmi Sarma B

- May 2
- 6 min read
Updated: May 5

Thodu Needa - Part 1/2' - Telugu Family Story | Lakshmi Sarma Thrigulla
Published In manatelugukathalu.com On 02/05/2026
తోడూ నీడ - పార్ట్ 1/2 తెలుగు కుటుంబ కథ | లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ | ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
ప్రేమతో నిండిన కౌగిలి వెనుకఆధిపత్యం దాగి ఉందని తెలుసుకున్న క్షణం—ఆమె జీవితం నిశ్శబ్దంగా మారిపోయింది.
టింగ్... టింగ్! బెల్ అదే పనిగా మోగుతుంటే, “ఏమండీ! మీరు ఇక్కడే ఉన్నారు కదా! బెల్ మోగుతోంది, వెళ్లి తీయొచ్చు కదా! వంట గదిలో ఉన్న నేనే పరిగెత్తుకుంటూ రావాలా ఏంటి? ఒరేయ్ పిల్లలు! మీరు మీ వీడియో గేమ్ తప్ప ఇవతల ఏమవుతున్నా చూసేది లేదు. ఒంటి మీద ధ్యాస లేకుండా ఆడుకుంటారు. ఇంత రాత్రిపూట ఏం కొంపలు మునిగిపోయాయని ఎవరు వచ్చారో!” భర్తను, పిల్లలను విసుక్కుంటూ చెక్కిన చీర కుచ్చిళ్లు కిందకు లాగి తలుపు తీసింది రమణి.
చీకట్లో నిలుచున్న వ్యక్తి అటువైపు తిరిగి ఉండటంతో పోల్చుకోలేక, “ఎవరు కావాలండి?” అని అడిగింది అనుమానంగా.
“రమణి! నేనమ్మా!” అంటూ ఇటువైపు తిరిగిన మనిషిని చూసి, ఆశ్చర్యంతో పాటు నోట మాట రాలేదు రమణికి.
“బాగున్నారా అందరూ?” కూతురిని గట్టిగా కౌగిలించుకొని అడిగింది రమణి తల్లి వరలక్ష్మి.
“అమ్మా! నువ్వు ఇలా ఒంటరిగా ఇంత రాత్రి పూట వచ్చావేంటి? కబురు పెడితే నేనే వచ్చి తీసుకువచ్చేదాన్ని కదా! అయినా నాన్నెందుకు రాలేదు నీ కూడా? పోనీ అన్నయ్యకు చెబితే...”
“వాడు దిగబెట్టేవాడు. సరే, నువ్వు ముందు లోపలికి రా!” ఏదో జరిగినట్లుంది, అమ్మను నాన్న బాధపెట్టాడో లేకపోతే వదిన గుణం మంచిది కాదు ఏదో అని ఉంటుంది అనుకుంటూ...
తల్లి చేతిలోని బ్యాగు తీసుకుంటూ, ఇంకో చేత్తో తల్లిని పట్టుకుని లోపలకు వస్తూ, “ఒరేయ్ పిల్లలు! ఏవండీ! చూడండి ఎవరు వచ్చారో!” అని పిలిచింది.
“అరె! అత్తయ్యగారా! బాగున్నారా? మీరు ఒక్కరే వచ్చారా? మామయ్య ఎక్కడ?” తలుపు వైపు చూస్తూ అడిగాడు భాస్కర్.
“అమ్మమ్మా!” అంటూ ఇద్దరు పిల్లలు వినయ్, విజయ్ వచ్చి వరలక్ష్మమ్మను పట్టుకున్నారు.
తన్నుకొస్తున్న బాధను దిగమింగుకుంటూ, “బాగున్నారా అల్లుడుగారు?” అని భాస్కర్ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా అడిగింది.
“అమ్మను ఏమీ అడగకండి” అన్నట్టుగా సైగ చేసింది రమణి.
“ఆ! అత్తయ్యగారూ, మేము బాగున్నాము. రమణి! మీ అమ్మ ఎప్పుడు బయలుదేరారో ఏమో, లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టు,” అని చెప్పాడు భాస్కర్.
“అలాగే... అమ్మా! కాళ్లు కడుక్కొని రా. ఈలోపు వేడివేడిగా దోశలు వేస్తాను,” అంది రమణి.
దోశలు తింటున్నంతసేపు ఏమి మాట్లాడకుండా మౌనంగా తిన్నది. రమణి అడిగిన దానికి పొడిపొడిగా సమాధానం చెప్పింది.
రమణి కూడా ఎక్కువగా మాట్లాడించకుండా ఊరుకుంది. గదిలోకి వెళ్లి పడుకుందామనుకుంటుండగా మనవలు ఇద్దరూ వచ్చారు.
గదిలోకి వెళ్లి పడుకుందామనుకుంటుండగా మనవలు ఇద్దరూ వచ్చారు.
“అమ్మమ్మా! మేము నీతోనే పడుకుంటామంటే అమ్మ వద్దంటోంది,” అని తల్లి మీద ఫిర్యాదు చెబుతూ చెరోవైపు దుప్పటి కప్పుకుని పడుకున్నారు.
“ఒరేయ్! అమ్మమ్మ అలసిపోయి వచ్చింది. రేపటి నుండి పడుదురు గాని రండిరా!” అని రమణి పిలిచింది.
“పోనిలే రమణి! పిల్లలు సరదాపడుతున్నారు, పడుకోనివ్వు. నాకేం అలసట లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వెళ్లి పడుకో,” అని మనవలను ప్రేమగా నిమురుతూ చెప్పింది వరలక్ష్మి.
“అది కాదమ్మా! నువ్వు ప్రయాణం చేసి వచ్చావు. వీళ్లు నిద్రలో మామూలుగా పొర్లరు. వీళ్లను సవరించడమే నీకు సరిపోతుంది, నీకు నిద్ర పట్టదు.”
“రేపటి నుండి నీ దగ్గరే పడుకోనీ, నాకేం బాధలేదు,” అని రమణి నచ్చజెప్పబోయింది.
“ఏం పర్వాలేదు, నాకు అంతగా నిద్ర పట్టదులే. వాళ్లను ఏమనకు, వెళ్లి పడుకో తల్లి!” అని వరలక్ష్మి అనటంతో రమణి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది.
ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది.
“రమణి... ఏమిటి, మీ అమ్మ ఎన్నడూ లేనిది ఒంటరిగా రావడం ఆశ్చర్యంగా లేదు? పైగా మీ నాన్నను విడిచి ఎక్కడికీ వెళ్లదు. అలాంటిది ఇలా రావడం?” అని భాస్కర్ అడిగాడు.
“అవునండి! నాకు అదే అర్థం కావడం లేదు. ఏం జరిగిందో రేపు మెల్లగా అడుగుతాను. ఒకవేళ నాన్నగారు రాను అంటే గనుక మనను చూడడానికి వచ్చేదేమో! మనం వెళ్లి కూడా చాలా రోజులైంది కదా! ఏమో, నాకు ఏమీ తోచడం లేదు. ఒకవేళ మా వదినతో ఏమైనా గొడవ అయిందేమో!” అని అనుమానంగా అంది.
“సరేలే! రేపు మీ అమ్మ మనసు నొప్పివ్వకుండా అడిగి తెలుసుకో,” అని భార్యను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు భాస్కర్.
కళ్లు మూసుకుని పడుకున్నదన్న మాటే కానీ, వరలక్ష్మికి కంటిమీద కునుకు రావడం లేదు. ఎంత వద్దనుకున్నా తన గతమంతా కళ్ల ముందు రీళ్లలా గిర్రున తిరుగసాగింది.
చాలా బీద కుటుంబం. తల్లిదండ్రులకు ఆరుగురు ఆడపిల్లల్లో తాను పెద్దది. చదివించడానికి తాహతు లేదు, అలాగని మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసే స్థోమత లేదు.
పన్నెండేళ్లు రాగానే గంతకు తగ్గ బొంత అన్నట్టుగా, మామూలు పరిస్థితి గల కుటుంబం వాళ్లను చూసి పెళ్లి చేసేసి చేతులు దులుపుకున్నారు. కృష్ణమూర్తికి, వరలక్ష్మికి ఇరవై ఏళ్ల తేడా. చిన్నతనం కావటంతో పెళ్లి అంటే తెలియని ఆనందమే తప్ప, కష్టాలు కన్నీళ్లు ఉంటాయన్న విషయం తెలియని అమాయకత్వం వరలక్ష్మిది.
కృష్ణమూర్తి భార్యను ప్రేమగా చూసుకునేవాడు, కాకపోతే అతను పట్నంలో ఉద్యోగం చేయటం వల్ల వారానికొకసారి వచ్చేవాడు. చిన్నపిల్ల కావటంతో వరలక్ష్మి అత్తమామలతో ఉండేది. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఇంటెడు చాకిరీ చేయించేది కృష్ణమూర్తి తల్లి. మామను చూస్తే భయంతో వణికిపోయేది వరలక్ష్మి.
ఒకరోజు కృష్ణమూర్తి పట్నం నుండి వస్తూ మల్లెపూలు, మిఠాయి తెచ్చి భార్య చేతికి ఇచ్చాడు.
వరలక్ష్మి సంతోషంతో చక్కగా తయారై, నెత్తినిండా మల్లెపూలు పెట్టుకుని, మిఠాయి పట్టుకుని ఇవ్వడానికి వచ్చింది. అది చూసి వరలక్ష్మి అత్త కళ్లు భగ్గుమన్నాయి.
ఇవ్వడానికి వచ్చింది. అది చూసి వరలక్ష్మి అత్త కళ్లు భగ్గుమన్నాయి.
“ఏమిట్రా! ముందొచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా, నిన్నగాక మొన్న వచ్చిన నీ పెళ్లాం మీద ప్రేమ పొంగిపోతోంది! మిఠాయి నీ భార్య చేతికి ఇచ్చి పంచుమన్నావా? ఇప్పుడే నిన్ను చేతిలో పట్టుకుందంటే, రేపు రేపు మా చేతికి చిప్పే ఇస్తుంది. ఏమయ్యా! చూశారా?” అని భర్తను రెచ్చగొడుతూ కోడలి వైపు కొరకొరా చూస్తూ అడిగింది.
“ఏరా! మీ అమ్మ చెప్పింది నిజమేనా? చూడు, మన ఇంటా వంటా లేదు పెళ్లాం చేతిలో కీలుబొమ్మగా అవ్వడం!”
“నువ్వు తనకు అలసిచ్చావనుకో, రేపు అన్ని పనులు నీతో చేయిస్తుంది. అంతే కాదు, వాళ్ల వాళ్లను తీసుకొచ్చి నీ నెత్తిన రుద్దుతుంది. నువ్వు నీ భార్య కాళ్లకు మడుగులొత్తావంటే, నిన్ను చాతకాని దద్దమ్మను చేసి ఆడుకుంటుంది!”
“ఇప్పటికీ మీ అమ్మ నేను గీచిన గీత దాటదు తెలుసా? ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో జాగ్రత్త!” అని కోడలి వైపు ఉరిమి చూస్తూ కొడుకును గట్టిగా మందలించాడు. వరలక్ష్మి భయంతో వణుకుతూ తన చేతిలో ఉన్న మిఠాయి అక్కడే పెట్టి, ఏడుస్తూ తన గదిలోకి పారిపోయింది.
జాగ్రత్త,” కోడలి వైపు ఉరిమి చూస్తూ కొడుకును గట్టిగా మందలించాడు. వరలక్ష్మి భయంతో వణుకుతూ తన చేతిలో ఉన్న మిఠాయి అక్కడే పెట్టి, ఏడుస్తూ తన గదిలోకి పారిపోయింది.
తండ్రి చెప్పిన మాటలు కృష్ణమూర్తి మెదడు మీద బాగా పనిచేశాయి. అవును, భార్యను అదుపులో పెట్టుకోకపోతే తన స్నేహితుడి భార్యలాగా అడిగిందల్లా కొనిపెట్టాలి.
ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లాలి. డబ్బుల గురించి ఆలోచించదు. పాపం వాడు ఎన్నిసార్లు నాతో చెప్పుకుని బాధపడ్డాడో! నేను అలా కాకూడదు. నాన్న చెప్పినట్టు ఈరోజు నుండి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు.
అక్కడకి తీసుకెళ్లాలి. డబ్బుల గురించి ఆలోచించదు. పాపం వాడు ఎన్నిసార్లు నాతో చెప్పుకుని బాధపడ్డాడో! నేను అలా కాకూడదు. నాన్న చెప్పినట్టు ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు.
గదిలో వెక్కి వెక్కి ఏడుస్తున్న తనను భర్త వచ్చి ప్రేమగా ఊరడిస్తాడేమోనని ఎదురుచూసిన వరలక్ష్మికి, ఖంగుమని భర్త కంఠం వినగానే పై ప్రాణాలు పైనే పోయాయేమో అనిపించింది.
“ఇంకా ఎంతసేపు ఏడుస్తావు? బయటకు వచ్చి వంట సంగతి చూసేది ఉందా లేదా?” అని ఉరిమి చూస్తూ అడిగాడు గది తలుపు పట్టుకుని.
వస్తున్న ఏడుపును పళ్లబిగువున దాచి వంటగదిలోకి వెళ్లింది. ప్రేమగా చూసుకునే భర్తను తండ్రి మాటలతో మార్చేశాడు.
ఇక తనకు కష్టాలు కన్నీళ్లే తప్ప, ప్రేమకు నోచుకునే అదృష్టం లేదని గుండె రగిలిపోయింది. అయినా నోరు మెదపకుండా పనులన్నీ చేసుకుపోతోంది. ముగ్గురు కలిసి ఏం ఆలోచించారో కానీ, భర్తతో పాటు పట్నం పంపించారు.
ఊహించని ఈ పరిణామానికి వరలక్ష్మి భర్తకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.
తల్లిదండ్రి మాటలకు ఎదురుచెప్పకూడదని అలా కోపం చేశాడేమో! నా మీద ప్రేమ లేకపోతే నన్ను ఎందుకు ఇప్పుడే తనతో పాటుగా తీసుకువస్తాడు?
పోనిలే, ఇప్పటికైనా నా అదృష్టం పండినందుకు ఆనందంగా ఉంది. నా భర్తతో నేను సంతోషంగా కాపురం చేసుకుంటాను అని మనసులో పొంగిపోయింది వరలక్ష్మి.
“ఏమండీ! నా మీద ఇంత ప్రేమ ఉన్న మీరు ఆరోజు కోపగించుకుంటే నాకు చాలా భయమేసింది. నేను ఉన్నదాంట్లో తృప్తిగా నడుచుకుంటాను, మీకు కష్టం కలిగించను.”
అని భర్త కౌగిలిలో ఇమిడిపోతూ చెప్పింది.
“అబ్బ! లక్ష్మీ! ఇప్పుడు మాటలతో టైమ్ వృథా చేయకు,” అని తనలో పెల్లుబికి వస్తున్న ఉద్రేకాన్ని చల్లారేవరకు భార్యకు ఊపిరాడనివ్వలేదు ముద్దులతో ముంచెత్తుతూ.
ఉద్రేకాన్ని చల్లారేవరకు భార్యకు ఊపిరాడనివ్వలేదు ముద్దులతో ముంచెత్తుతూ.
భర్త ప్రేమలో తలమునకలవుతున్న వరలక్ష్మి తన అదృష్టానికి మురిసిపోయింది. అలసట తీరగానే ఇద్దరూ పడుకున్నారు.
“లక్ష్మీ! నేను ఆఫీసుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా ఉండు. ఇరుగుపొరుగు వాళ్లతో పనికిరాని ముచ్చట్లు వేసుకోకు. తలుపేసుకుని ఇంట్లోనే ఉండు,” అని కరకుగా చెబుతూ వెళుతుంటే...
“ఏమైందండీ! అంత కోపంగా ఉన్నారు?” అని అడిగింది.
“ఒకసారి చెబితే అర్థం కాదా! నేను చెప్పినట్టు వినాలి, ఎదురు ప్రశ్నలు వేయొద్దు! చెప్పింది విని నోరు మూసుకుని పని చేసుకో!” అని బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్లిపోయాడు కృష్ణమూర్తి.
తలమీద ఎవరో పెద్ద బండరాయి వేసినట్టు కూలబడిపోయింది వరలక్ష్మి. రాత్రి ఆయన చూపిన ప్రేమ వట్టిదేనా? అవసరం కోసం అలా ఉంటాడన్నమాట! ఈయనలో నేను ఆశించిన మార్పు కాదు, పంజరంలో బంధించాడన్నమాట! అంటే ఇక తను యాంత్రికమైన జీవితం గడపాలి.
మెల్లిగా తనను మార్చుకునే ప్రయత్నం చేస్తాను అనుకుంది మనసులో.
రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అయ్యాయే కానీ తను కోరుకున్న మార్పు భర్తలో ఇసుమంత కూడా రాలేదు.
మగవాడిని, పైగా మొగుణ్ణి అన్న అహంకారం రోజురోజుకూ పెరిగి పెద్దదయిందే తప్ప తగ్గలేదు. అరవై ఏళ్లు వచ్చి రిటైర్మెంట్ తీసుకున్నాక ఇంటిపట్టునే ఉంటాడు, అప్పుడైనా మనిషిలో నేను కోరుకున్న ఫలితం దొరుకుతుందనుకున్న నా ఆశ అడియాసగానే మిగిలిపోయింది. తప్ప తగ్గలేదు. అరవై ఏళ్లు వచ్చి రిటైర్మెంట్ తీసుకున్నాక ఇంటిపట్టునే ఉంటాడు
అప్పుడైనా మనిషిలో నేను కోరుకున్న ఫలితం దొరుకుతుందనుకున్న నా ఆశ
చెప్పాలంటే చాదస్తం కూడా ఎక్కువయ్యిందని చెప్పాలి.
ప్రతిరోజు ఎంత కమ్మగా వండి పెట్టినా మెచ్చుకుంటే నేనెక్కడ పొంగిపోతానోనని ఉప్పెక్కువయిందనో, పప్పు ఉడకలేదనో, రసం పుల్లగా ఉందనో కాపురానికి వచ్చినప్పటి నుండి వంక పెట్టడం ఇప్పటికీ మారలేదు. నలుగురిలో తన భార్యను అదుపులో పెట్టుకుంటున్నానని తెలియడం కోసం చెడామడా తిట్టడం. పోనీ తరవాతనైనా ప్రేమగా మాట్లాడుతాడా అంటే అదీ లేదు. ఇక భరించలేకపోతోంది. ఆలోచనలతో ఎప్పుడో కానీ నిద్రపట్టలేదు వరలక్ష్మికి.
6
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కొన్ని ఇతర రచనలు:
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.










Comments