top of page
Original.png

తింటే గారెలే తినాలి

ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

తెలుగు హాస్య కథ, comedy story Telugu, funny Telugu story, family comedy, garrelu story, Telugu short story, humorous story Telugu, husband wife comedy, Telugu literature, entertaining story, food comedy story, Telugu family story, lighthearted Telugu story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తింటే గారెలే తినాలి' కథలో గారెలంటే ప్రాణం పెట్టే ప్రసాదు ఆనందంగా గారెలు తింటుండగా, వంటగదిలో ఉప్మా చేస్తున్న అతని భార్య కనిపించే సరదా హాస్యకథ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తింటే గారెలే తినాలి' కథలో గారెలంటే ప్రాణం పెట్టే ప్రసాదు ఆనందంగా గారెలు తింటుండగా, వంటగదిలో ఉప్మా చేస్తున్న అతని భార్య కనిపించే సరదా హాస్యకథ దృశ్యం.

Thinte garele Thinali - Telugu Comedy Story |Mohana Krishna Tata

తింటే గారెలే తినాలితెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 18/06/2026


కొన్ని ఆహారాలపై మనుషులకు ఉండే ప్రేమ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే చక్కని హాస్యకథ "తింటే గారెలే తినాలి". గారెలంటే ప్రాణం పెట్టే ప్రసాదు, వాటిని తరచూ తినాలనే కోరికతో పడే పాట్లు, అతని భార్య పద్మ ఉప్మాలపై చూపే మక్కువ, స్నేహితుల సలహాలు, తద్దిన భోజనాల్లో గారెల కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ కలగలిపి పాఠకులకు కడుపుబ్బా నవ్వులు పంచుతాయి. తాత మోహనకృష్ణ ప్రత్యేక హాస్య శైలిలో రాసిన ఈ కథ కుటుంబ జీవితంలోని చిన్న చిన్న సరదా సంఘటనలను మన ముందుంచుతుంది.


'తింటే గారెలే తినాలి' అన్న మాట మన ప్రసాదుకి సరిగ్గా సరిపోతుంది. గారెలంటే మహా ఇష్టం అతనికి. కనీసం వారానికి ఒకసారైనా తినాలి అనుకునేవాడు.


ప్రసాదుకు పెళ్ళైన తర్వాత వారానికి ఒకసారి పెళ్ళాం చేత గారెలు వండించుకోవాలని అనుకునేవాడు. కానీ, పెళ్ళాం పద్మ అతని ఆలోచనలకు భిన్నంగా దొరికింది. వంట అంటేనే పెద్దగా ఇష్టం ఉండదు. పెళ్లికి ముందు పుట్టింట్లో, ఒక అరడజను ఉప్మాలు ఎలా చెయ్యాలో నేర్చుకుని కాపరానికి వచ్చింది. తిప్పి తిప్పి ఎప్పుడూ అవే ఉప్మాలు పాపం! మొగుడికి గారెలంటే ఇష్టమని తెలిసి, వంట పుస్తకం చదివి ఏదో తప్పక నేర్చుకుంది. ఆ పప్పు రుబ్బడం అంటే ఆమెకు మహా చిరాకు.


"పద్మా!"


"హా! ఏమిటో చెప్పండి?"


"ఈ రోజు నువ్వు ఎందుకో చాలా అందంగా కనిపిస్తున్నావు"


"నిజమా! ఇంతకూ మీకు ఏం కావాలో అది చెప్పండి"


"అదీ...అదీ..."


"వేడిగా ఉప్మా చెయ్యమంటారా?"


"కాదు...గారెలకు పిండి నానబెట్టి కొంచెం రేపు వెయ్యరాదు?"


"ఇప్పుడు అదంతా ఎవరు చేస్తారు చెప్పండి..ఉప్మా కావాలంటే చెప్పండి! రెండే నిమిషాలలో చేసేస్తాను"


"రోజు అదేగా చేసేది...రేపు గారెలు వేయచ్చుగా చక్కగా...తిని చాలా రోజులైంది"


"కిందటి సంవత్సరమే కదా పిండి రుబ్బి చేసాను...అప్పుడే మర్చిపోయారా?"


"చాలా టైం అయ్యిందిగా...మళ్ళీ తినాలనిపిస్తోంది...నాకైతే వారానికి ఒకసారైనా ఆ రుచి చూడాలని ఉంది"


"నా వల్ల కాదండీ! మీరు మరీ అడుగుతున్నారు కాబట్టి, ఇక మీదట ఆరు నెలలకోసారి చేస్తాను అంతే!"


ప్రసాదుకు గారెలు తినాలన్న కోరిక ఎక్కువైంది...ఏం చేస్తాడు? ఒకరోజు తన ఫ్రెండ్ రాజుతో తన బాధ చెప్పుకున్నాడు.


"ఈ రోజుల్లో గారెలు ఏ పండక్కో గానీ చెయ్యట్లేదు ఈ ఆడవారు. ఇక్కడ బయట హోటల్ లో గారెలు అంతగా బాగోవు...నువ్వు తినవు" అన్నాడు రాజు.


"అవును నిజమే...పోపులో రవ్వ వేసేసి ఉప్మా చేసేస్తారు ఈ ఆడువారు. ఆ తర్వాత టీవీ చూడడమే...మన కోరికలు ఏం అర్ధం చేసుకుంటారు"


"ఏమో రా! కానీ ఒక ఉపాయం ఉంది"


"ఏమిటో చెప్పు!"


"తద్దినం భోజనంలో గారెలు ఖచ్చితంగా చేస్తారు"


"అయితే నాకేంటి లాభం?"


"మా ఫ్రెండ్ గిరి తద్దినం మంత్రాలకు వెళ్తాడు...వాడిని అడిగితే నీకు ఏదో దారి దొరకకపోదులే! నెంబర్ ఇదిగో...కాల్ చేసి నా ఫ్రెండ్ అని చెప్పు"


"హలో...గిరి గారా?"


"అవును...ఎవరు?"


"నేను రాజు ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను"


"హా! చెప్పండి...మీ గురించి రాజు అంతా చెప్పాడు"


"అదే..ఆ గారెల విషయం చూస్తారని!"


"రేపు నేను తద్దినానికి వెళ్తున్నా, అక్కడ భోజనం చెయ్యడానికి ఒక భోక్త తక్కువ అయ్యాడు. నువ్వు వచ్చేయ్.."


"నాకు మంత్రాలు గట్రా ఏం రావే..కనీసం పంచ కట్టుకోవడం కూడా చేతకాదు.."


"అదంతా నేను చూసుకుంటాను. ఒకసారి చేస్తే అదే వస్తుంది. ఇక మంత్రాలంటావా...నేను ఎలా చెబితే అలా చెప్పడమే, చెయ్యడమే. తర్వాత భోజనంలో గారెలు పెడతారు...చక్కగా తినొచ్చు"


"మీరు చెబుతున్నది వింటేనే నా నోరు ఊరుతున్నాది"


"మరెందుకు ఆలస్యం...రేపు పొద్దున్నే స్నానం చేసి, నేను చెప్పిన అడ్రస్ కు వచ్చేయండి..."

('మా ఆవిడకు తెలిస్తే నా పని అయిపోయినట్టే...తెలియకుండా రావాలి' - ప్రసాదు మైండ్ వాయిస్)


అలా వారానికి ఒకసారి గారెలు తింటున్నాడు ఎవడో మహానుభావుని తద్దినం పేరు చెప్పుకుని...


ఆ రోజు ఆదివారం తృప్తిగా భోజనం చేసిన తర్వాత ప్రసాదుకి బాగా నిద్ర పట్టేసింది. సాయంత్రం గిరి దగ్గర నుంచి ఫోన్...


"హలో! ప్రసాదు! రేపు ఒక మహానుభావుడు తద్దినం ఉందయ్యా! ఆయన పోతూ పోతూ, ప్రతి సంవత్సరం తద్దినానికి మాత్రం ఎక్కువ గారెలు వడ్డించాలనేదే ఆయన ఆఖరి కోరికంట..."


"ఎందుకో..?"


"పోయిన ఆయనకి నీలాగే గారెలంటే మహా ఇష్టం. నీ పంట పండింది పో...రేపు గారెలే స్పెషల్ అట్రాక్షన్"


"రేపు ఆఫీస్ లంచ్ టైం లో వచ్చేస్తాను...అవసరమైతే పర్మిషన్ పెట్టేస్తాను"


"సరే..నీ ఇష్టం"


ఇలాగే ప్రసాదు జీవితం, ఎర్రటి అల్లం చట్నీతో నచ్చిన గారెలతో అలా గడిచిపోతోంది...


ఒకరోజు...


"ఏవండీ...ఆరు నెలలు అయ్యిందిగా...రేపు గారెలు చెయ్యబోతున్నాను" అని గొప్పగా ప్రకటించింది పద్మ.


"ఇప్పుడు వద్దు లేవే...వచ్చే నెల చూద్దాం"


(నువ్వు చేసే గారెలకంటే, నేను బయట తినే గారెలే సూపర్. అప్పుడు తప్పక నిన్ను గారెలు చెయ్యమని అడిగా. నువ్వు గారెలు వేస్తే, అసలు టేస్ట్ ఉండదు. ఇప్పుడు  నాకు నీ గారెలు అవసరం లేదు - ప్రసాదు మైండ్ వాయిస్ ఆనందంలో )


"గారెలంటే ఎగిరి గంతేసే మా ఆయనేనా ఇలా అంటున్నది? అయినా నాకెందుకు...? ఆ ఉప్మా ఏదో చేసేసి, టీవీ చూసుకుంటాను" అని అనుకుంటూ...వంటింట్లోకి వెళ్ళింది పద్మ.

సమాప్తం. 

***********

 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page