top of page
Original.png

ఉచిత మద్యం పథకం

16 hours ago
3 min read

ఉచిత మద్యం పథకం నేపథ్యంలో మద్యపానం, కుటుంబ ఖర్చులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబించే సామాజిక చిత్రణ

Uchitha Madhyam Pathakam - Telugu Social Story | B. N. Satyanarayana

ఉచిత మద్యం పథకం - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 04/10/2026


మద్యపానం వ్యక్తిగత జీవితాలనే కాకుండా కుటుంబ ఆర్థిక పరిస్థితులను, సమాజ శ్రేయస్సును కూడా ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సమస్య. ఈ నేపథ్యంలో మద్య నిషేధం, ప్రభుత్వ ఆదాయాలు, సంక్షేమ పథకాలపై భిన్నమైన ఆలోచనను ముందుకు తెస్తుంది “ఉచిత మద్యం పథకం” అనే ఈ తెలుగు సామాజిక వ్యాసం. మద్యం ఉచితంగా పంపిణీ చేస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందనే రచయిత ప్రతిపాదనను ఈ కథనం పరిశీలిస్తుంది. ఈ ఆలోచనలోని అవకాశాలు, పరిమితులు పాఠకులను ఆలోచింపజేస్తాయి.


"ఉచిత మద్యం పథకాన్ని" ప్రభుత్వాలు తీసుకువచ్చిన నాడు అది సమాజానికి తప్పకుండా మేలుకరంగా ఉంటుందని చెప్పవచ్చు.


సాధారణంగా అందరూ కోరుకునేది "మద్య నిషేధం".


అయితే సంపూర్ణ మద్యనిషేధం వల్ల అక్రమ సారా వ్యాపారాలు, కల్తీ మద్యం, మద్యం దొంగ రవాణా వంటివి పెచ్చుమీరిపోతాయని, దానితో తాగుడుకు వ్యసనపడ్డవారి ఆరోగ్యాలు దెబ్బతింటాయని, అంతేకాకుండా ప్రభుత్వాలు తమ ఆదాయాలను కోల్పోతాయని... కాబట్టి "మద్య నిషేధం" ఆచరణయోగ్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, హితవు పలికింది.


అయితే "మద్యపానం" విషయంలో సమాజంలో మార్పు తేవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.


అందుకు "ఉచిత మద్యం పథకాన్ని" తీసుకురావడం ద్వారా దానిని నెరవేర్చే అవకాశాల గురించి ఆలోచన చేయాలి.


ముందుగా మద్యం అమ్మకాలు నిషేధించాలి.


"18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్కరికీ (మేజర్లు) అందరికీ వారి వారి ఆధార్ కార్డులపై, వారి ముఖ IDలు తీసుకుంటూ ప్రతిరోజూ 90 ml కల్తీ లేని మద్యాన్ని సీలు వేసిన పౌచ్ ప్యాక్లలో ప్రభుత్వమే ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. వాటి పంపిణీలో ఎటువంటి గందరగోళాలకు, అవినీతికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి."


ఒక వ్యక్తి రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును తాగుడుకే ఖర్చు చేసేస్తూ, ఇంటికి ఖాళీ చేతులతో పోతూ, ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి ఉచితాలతో అర్ధాకలితో బతుకుతున్న జీవితాలలో ఈ "ఉచిత మద్యం పథకం" తప్పక మార్పు తీసుకొస్తుందని చెప్పవచ్చు.


మద్యం రోజూ కొద్ది మోతాదులో ఉచితంగా లభిస్తుండడంతో, మొదట్లో ఆ మోతాదు వారిలోని తృష్ణను సంతృప్తి పరచలేకపోయినా, కొద్ది రోజులకే వారు ఆ మోతాదుకు అలవాటు పడి, పరిమితమవుతూ సంతృప్తి చెందుతూ ఆనందపడతారు.


దాంతో వారు కష్టించి సంపాదించిన డబ్బు మద్యం కొరకు ఖర్చు చేసే అవసరం లేకపోవడంతో, దానిని పూర్తిగా తమ కుటుంబాల కొరకు, వాటి పోషణ కొరకు, వాటి అవసరాల కొరకు, వాటి అభివృద్ధి కొరకు ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.


దానితో వారు ఆర్థికంగా కొద్దిగా బలపడి, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై ఆధారపడే అవసరాలు తగ్గుతాయి. తమ కష్టార్జితంపై వారిలో విశ్వాసం పెరుగుతుంది.


ఆలోచనలు అభివృద్ధి చెందుతాయి. వారి కుటుంబాలలోని స్త్రీలు కూడా తమ మగవారు తాగుడు నుండి బయటపడినందుకు ఎంతగానో సంతోషపడతారు.


వారు కూడా కష్టించి సంపాదించడాన్నే ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఒక మార్పును చూడగలుగుతాం.


ఇకపోతే, ప్రభుత్వాలు మద్యం అమ్మకాల నిషేధం వల్ల కోల్పోయే ఆదాయాన్ని, ఉచిత మద్యం పథకం అమలు పరచడం వల్ల కలిగే భారాన్ని... కొన్ని భారమైన (ఉదాహరణకు: స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వంటి) పథకాలు రద్దు పరచడం ద్వారా సమకూడే మిగులుతో కొంత మేర పూరించుకోవచ్చు. అటువంటి రద్దుల పట్ల ప్రజల నుండి ఎటువంటి వ్యతిరేకతలు రావు.


ఇక ధనికుల విషయానికి వస్తే, వారికి వీలైనంత ఎక్కువ ధరలకు, పబ్బులకు, స్టార్ హోటళ్లకు అనుమతులు పరిమితం చేస్తూ మద్యాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వం మరికొంత ఆదాయాన్ని మెరుగుపరచుకోవచ్చు.


ఈ ఆదాయంతో పాటు రద్దు పరచిన ఉచిత పథకాల వల్ల చేకూరే మిగులు ప్రభుత్వాల ఆదాయ లోటును మరికొంత మేరకు పూరించగలుగుతాయి.


వీటన్నిటినీ సమీక్షించుకుంటే, "ఉచిత మద్యం పథకం" అమలు పరచడం వల్ల సమాజం నైతికంగా, ఆర్థికంగా అన్ని విధాలా బలపడుతుంది. ప్రజల ఆలోచనల్లో వాడివేడి తగ్గి నేరాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో శాంతి నెలకొంటుంది.


తద్వారా ప్రభుత్వాలకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.


డిస్క్లైమర్: ఈ రచనలోని “ఉచిత మద్యం పథకం” రచయిత వ్యక్తిగత ఆలోచన మాత్రమే; ఇది ఏ ప్రభుత్వ అధికారిక పథకం లేదా సూచన కాదు. ఈ వ్యాసం మద్యపానాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినది కాదు; సామాజిక చర్చ మరియు అవగాహన కోసం మాత్రమే ప్రచురించబడింది.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page