top of page
Original.png

అంటే… మరి!

5 hours ago
2 min read

“అంటే… మరి!” తెలుగు రచనకు సంబంధించిన చిత్రం. ఒక మహిళ ఎదుటివారితో మాట్లాడేటప్పుడు బయటకు చిరునవ్వుతో కనిపిస్తున్నప్పటికీ, ఆమె మనసులో చెప్పలేని అనేక భావాలు, మాటలు తిరుగుతున్నట్లు ప్రతీకాత్మకంగా చూపించారు. మొహమాటంతో మనసులోని మాటను చెప్పకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చనే భావాన్ని చిత్రం సూచిస్తుంది.

Ante Mari - Telugu Inspirational Article | Kotha Viritha

అంటే… మరి! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 04/10/2026


మనసులో ఒక మాట ఉండి, నోటికి వచ్చేసరికి ఇంకో మాటగా మారిపోవడం మనలో చాలామందికి తెలిసిన అనుభవమే. బాధ కలిగినా “ఏం లేదు”, నచ్చకపోయినా “పర్లేదు”, ఎదుటివారి తప్పు కనిపించినా “నీ ఇష్టం లే” అంటూ అసలు భావాన్ని మనసులోనే దాచేస్తుంటాం. కానీ చెప్పాల్సిన మాట చెప్పకపోవడం వల్ల మౌనం ఒక్కోసారి అపార్థాలకు కారణమవుతుంది. మొహమాటం, భావోద్వేగాలు, సంబంధాల్లో స్పష్టమైన సంభాషణ అవసరాన్ని సరదాగా గుర్తుచేసే కొత్త విరిత రచన “అంటే… మరి!”



మనసులో ఒక మాట ఉంటుంది… నోటికి వచ్చేసరికి ఇంకో మాట అవుతుంది. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి… మొహమాటం ఉంటే కారణాలు చాలు కదా! 


ఎదుటివాడి తప్పు కనిపిస్తుంది… కానీ “నువ్వు తప్పు చేస్తున్నావు” అని చెప్పలేరు. బదులుగా “నీ ఇష్టం లే” అని చెప్పి, మనసులో మాత్రం వంద మాటలు మ్యూట్‌లో మాట్లాడుకుంటారు. 


బాధ కలిగితే చెప్పరు, అవతలివాడు అర్థం చేసుకోవాలని మాత్రం ఆశిస్తారు. 


కోపం వస్తే బయట నవ్వుతారు… ఇంటికి వెళ్లాక ఆ నవ్వుకు అర్థం వెతుకుతూ ఏడుస్తారు. 

నచ్చనిది నచ్చలేదని చెప్పలేరు కానీ “పర్లేదు” అనే పదాన్ని మాత్రం బాగా వాడతారు. 


ఏం అనిపించినా “ఏం లేదు” అంటారు… తర్వాత “ఎవరూ నన్ను అర్థం చేసుకోరు” అంటారు. మాట్లాడితే సమస్య వస్తుందని మౌనంగా ఉంటారు… కానీ మౌనమే పెద్ద సమస్య అవుతుందని మర్చిపోతారు. 


ఎదుటివాళ్లు దాన్ని అవకాశంగా భావిస్తారు. చెప్పాల్సిన మాటను చెప్పలేక… చెప్పని మాటకు బాధపడటం వీళ్ల ప్రత్యేకత! ఒక్కసారి నోరు తెరిచి నిజం చెప్పి ఉంటే, సగం అపార్థాలు అక్కడికక్కడే చచ్చిపోయేవి. కానీ మొహమాటం ఉన్న చోట నిజం కూడా అనుమతి తీసుకుని బయటకు రావాల్సి వస్తుంది. అందుకే, ప్రతి నవ్వు ఆనందం కాదు, అలాగే ప్రతి మౌనం అంగీకారం కాదు. 


కొన్నిసార్లు ఎదుటివాడు మనసు చదవాలని కాదు, మనమే మనసు విప్పి చెప్పాలి. 

మొహమాటంలో మొహం మీద అనలేని మాటలు… చివరికి మనసులోనే పెద్ద శబ్దంగా మారతాయి. 


చివరికి మనసులో నానుతూ బయటికి అనే ఒక్కటే మాట “అంటే… మరి"! ! 

***

కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page