అవసరము ఉన్నoత వరకే తరువాత Ignore & repeat

Avasaramu Unantha Varake Taruvata Ignore & repeat - Telugu Moral Story | Sritha
అవసరము ఉన్నoత వరకే తరువాత Ignore & repeat - తెలుగు నీతి కథ | శ్రిత
Published in manatelugukathalu.com on 04/10/2026
మనుషులను అవసరానికి ఉపయోగించుకుని, పని పూర్తయ్యాక వారిని మరిచిపోయే స్వభావం సంబంధాలను ఎంతగా దెబ్బతీస్తుందో చెప్పే కథ ఇది. సరిత, రాహుల్ పాత్రల ద్వారా తీయటి మాటల వెనుక దాగిన స్వార్థాన్ని, మంచితనాన్ని తప్పుగా ఉపయోగించుకోవడాన్ని కథ చూపిస్తుంది.
సరిత చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె మాటలు వెన్నెలలా మృదువుగా ఉంటాయి, తేనెలా తీయగా ఉంటాయి.
కానీ ఆ తీయటి మాటల వెనుక మాత్రం మనుషులను తన అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన మనస్తత్వం దాగి ఉంటుంది.
ఎదుటివాళ్లను లెక్క చేయదు. తన అందం మీద ఆమెకు చాలా గర్వం. ఆఫీసులో తన అందానికి ఎవరైనా ఆకర్షితులై తన పని చేసిపెడితే, “నా అందానికి దాసులైపోయారు” అని లోలోపల మురిసిపోతుంది.
అవసరమున్నంతవరకు ఒక మనిషిని దగ్గర చేసుకోవడం, పని అయిపోయిన తర్వాత అతన్ని పట్టించుకోకపోవడం సరితకు అలవాటే.
ఆమె ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో రాహుల్ అనే సహోద్యోగి ఉండేవాడు.
సరిత అందంగా ఉందని, ఆమె మాటలు చాలా బాగుంటాయని అనుకుంటూ రాహుల్ ఆమె చెప్పిన పనులన్నీ చేసిపెడుతూ ఉండేవాడు.
ఒకసారి సరితకు ఒక ముఖ్యమైన డేటా అవసరమైంది.
“రాహుల్! ఆ డేటా నీ దగ్గర ఉందా? నాకు చాలా అర్జెంట్‌గా కావాలి,” అంది తీయగా.
“ఉంది. నేను వర్క్ చేస్తున్నాను, నీకు కావాలంటే చూసుకో,” అన్నాడు రాహుల్.
సరిత తన మధురమైన మాటలతో అతన్ని మరోసారి తన మాయలో పడేసింది.
రాహుల్ లాగిన్ చేసి పని చూపించాడు. సరిత మాత్రం ఆ డేటాను తన పని కోసం ఉపయోగించుకుంది.
కొద్దిరోజుల తర్వాత మేనేజర్ ఆమె పనిని చూసి, “సరిత! ఈ డేటాను చాలా బాగా ప్రెజెంట్ చేశావు,” అని మెచ్చుకున్నాడు.
ఆ ప్రశంసలు వింటూ సరిత మనసులో, “చూశావా… నా టాలెంట్!” అని అనుకుంది.
కానీ కొన్ని రోజులకు అసలు విషయం రాహుల్‌కు తెలిసిపోయింది.
టీమ్ లీడర్ ఒకసారి లాగిన్ వివరాలు పరిశీలిస్తుండగా అసలు డేటా ఎవరి లాగిన్ నుంచి వచ్చిందో తెలిసింది.
“సరిత! ఈ డేటా నువ్వే చేశావా?” అని అడిగాడు.
సరిత తడబడింది. “లేదు సర్… నేను…”
“ఇది రాహుల్ లాగిన్ నుంచి వచ్చింది. నువ్వు రాహుల్ సహాయం తీసుకున్నావు. పని చేసేది ఎవరు, పేరు తెచ్చుకునేది ఎవరు? నువ్వు మంచి గేమ్ ప్లేయర్‌వి. ఇది నీకు లాస్ట్ వార్నింగ్.
ఇంకోసారి వేరే వాళ్ల డేటాను నీ పని కోసం ఉపయోగిస్తే ఉద్యోగం నుంచి తొలగించాల్సి వస్తుంది.”
రాహుల్ కూడా అక్కడే ఉన్నాడు. సరిత పరిస్థితి చూసి అతనికి జాలి వేసింది.
“సర్! వదిలేయండి. ఇకపై ఆమె జాగ్రత్తగా ఉంటుంది,” అన్నాడు.
టీమ్ లీడర్ రాహుల్ వైపు చూసి, “నీ మంచితనం వల్లే ఈసారి వదిలేస్తున్నాను,” అన్నాడు.
రాహుల్ మనసులో మాత్రం ఒక్కటే అనుకున్నాడు: “ఈమె మారుతుందేమో…”
కానీ సరిత మారలేదు.
కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆమెకు ఒక పని విషయంలో సమస్య వచ్చింది. ఎంత ప్రయత్నించినా అది పరిష్కారం కాలేదు. మళ్లీ రాహుల్ దగ్గరకే వచ్చింది.
“రాహుల్… నువ్వు తప్ప ఇంకెవరూ నాకు ఈ పని చేయలేరు,” అంటూ మళ్లీ తన తీయటి మాటలు మొదలుపెట్టింది.
రాహుల్‌కు ఆమె స్వభావం కొంత తెలిసినా, ఆమె మాటలకు మరోసారి కరిగిపోయాడు. మళ్లీ ఆమె పని చేసిపెట్టాడు.
ఈసారి మాత్రం విషయం రాహుల్ ముందే బయటపడింది. టీమ్‌లో మిగతావాళ్లకు మాత్రం అసలు విషయం తెలియలేదు.
రాహుల్ మాత్రం ఆమెను చూస్తూ మనసులో అనుకున్నాడు:
“అందం ఉందని మనసూ అందంగా ఉంటుందనుకోవడం నా పొరపాటు. మాటలు తేనెలా ఉన్నాయని మనసు తీయగా ఉంటుందని అనుకోవడం ఇంకా పెద్ద పొరపాటు. అవసరం ఉన్నప్పుడు దగ్గరయ్యే వాళ్లు, అవసరం తీరగానే దూరమయ్యే వాళ్లు మనుషులు కాదు… అవసరాల క్యాలెండర్‌లో గుర్తులు పెట్టుకునే వాళ్లు!”
అయినా సరితలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. “రేపు ఎవరి దగ్గర ఏ సమాచారం తీసుకోవాలి? ఎవరి టాలెంట్‌ను తన పనికి ఉపయోగించుకోవాలి? ఎవరిని తన తీయటి మాటలతో పని చేయించుకోవాలి?” అనే లెక్కలే ఆమె మనసులో తిరుగుతున్నాయి.
దేవుడు కూడా విచిత్రమే… మనుషులను ఉపయోగించుకునేవాళ్లకు కావాల్సినంత ఇస్తాడు. వాళ్ల చేతిలో ఉపయోగపడేవాళ్లకు మాత్రం అనుభవాలనే ఇస్తాడు!
రాహుల్‌కి చివరికి అర్థమైంది: సరిత అందాన్ని చూసి మోసపోయింది అతని కళ్లే… ఆమె మనసును తెలుసుకోవడానికి ఆలస్యమైనది మాత్రం అతని బుద్ధి!
అయితే సరిత మాత్రం మారలేదు.
ఎందుకంటే ఆమెకు మనుషులు అవసరమున్నంతవరకే మనుషులు… అవసరం తీరిన తర్వాత మాత్రం కంప్యూటర్‌లోని ఫైళ్లలాగే—“Ignore & Delete!”, then ignore and repeat.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
***
శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: శ్రిత
శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.
ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.









Comments