ఉపాయంతో తప్పిన అపాయం!

Upayamtho Tappina Apayam- Telugu Moral Story | Purushotham Boga
ఉపాయంతో తప్పిన అపాయం! - తెలుగు నీతి కథ | బోగా పురుషోత్తం
Published in manatelugukathalu.com on 09/11/2026
బలం కంటే బుద్ధిబలం గొప్పదని నిరూపించే ఆసక్తికర తెలుగు నీతి కథ ‘ఉపాయంతో తప్పిన అపాయం!’. రాజు వీరసూరుడు తన సమయస్ఫూర్తితో నకిలీ నోట్ల సమస్యను ఎలా పరిష్కరించాడో రచయిత బోగా పురుషోత్తం చక్కగా వివరించారు.
వీరపునాయనిపల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు ఉండేవారు. రాజ్యంలో ఏమి జరిగినా వారిద్దరూ గూఢచారులుగా వ్యవహరిస్తూ తగిన విశ్వసనీయ సమాచారం అందిస్తుండేవారు. ఎలాంటి సమస్యనైనా వారి సాయంతో రాబట్టి పరిష్కరించేవాడు.
ఒక్కోసారి రాజ్యంలో రాజు గారి భవనాలకు నిప్పు అంటుకుని రావణకాష్టంలా దహించుకుపోయి విలువైన వస్తుసామగ్రి కాలి బూడిదయ్యేది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక రాజు తలపట్టుకుని కూర్చుని దీర్ఘంగా ఆలోచించేవాడు. ఈ పని ఎవరు చేస్తున్నారో నిఘా వేసి కనుక్కోవాలని తన గూఢచారులైన ఇద్దరు సైనికులను ఆదేశించాడు.
ఆ ఇద్దరు సైనికులు అదోలా చూసి, ‘‘సరే ప్రభూ..!’’ అని తలలూపారు. మరుసటి రోజు ఇద్దరు చింపిరి జుట్టుతో ఉన్న మనుషులను లాక్కొచ్చి రాజు ముందు ఉంచారు. ఏమీ తెలియని అమాయకులైన ఆ ఇద్దరూ భయంతో వణుకుతూ రాజు వద్దకు వచ్చి నిలబడ్డారు.
‘‘నిప్పు పెట్టే పని ఎవరు చేస్తున్నారో చెప్పండి..? లేదంటే ఉరిశిక్ష వేస్తాను..!’’ హూంకరించాడు రాజు.
ఇద్దరి వెన్నులో భయం పట్టుకుంది. ‘‘ప్రభూ.. ప్రభూ.. మీకు దండాలు.. అంత పని చేయకండి.. మా పిల్లలు అనాథలు అవుతారు..’’ అని రాజు కాళ్ల మీద పడ్డారు.
వాళ్లు అలా వేడుకోవడంతో వీరసూరుడి మనసు వెన్నలా కరిగిపోయింది.
‘‘పోండి, వెళ్లండి.. ఇలా ఇంకోసారి చేశారంటే చంపేస్తా..!’’ అని హెచ్చరించి విడిచిపెట్టాడు.
కొద్దిరోజులు సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. వీరసూరుడికి హాయిగా కంటిమీద కునుకు పడుతున్న వేళ మరో సమస్య వచ్చి పడింది.
ఈసారి రాజు జారీ చేసే కరెన్సీ నోట్లకు బదులు నకిలీ నోట్ల సమస్య వచ్చి పడింది. ఏది అసలు నోటో, నకిలీ నోటో తెలియక ప్రజలు తికమకపడ్డారు.
వీరసూరుడికి నకిలీ నోట్ల గుట్టు తెలుసుకోవడం కష్టంగా మారింది. రాజ్యంలో తమ యంత్రాంగాన్ని పూర్తి నిఘా ఉంచాడు. అయినా ఏమాత్రం కనుక్కోలేకపోయారు.
ఈ సమస్య రాజుకు కొరకరాని కొయ్యగా మారింది. మళ్లీ రాత్రుల్లో నిద్ర కరువైంది. ఈసారి మెరుపులాంటి ఆలోచన వచ్చి అమలు చేశాడు.
నోట్లు రద్దుచేసి వస్తు మార్పిడి పద్ధతి ప్రవేశపెట్టాడు. పరిస్థితి చక్కబడిన తర్వాత నోట్ల పద్ధతిని పునరుద్ధరించాడు. మళ్లీ నకిలీ నోట్ల సమస్య ఎదురైంది. ఈసారి దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు.
దొంగనోట్లు తమ వద్దకు తీసుకొచ్చిన వారికి రెండు పది గ్రాముల బంగారు నాణేలు కానుకగా ఇస్తానని దండోరా ప్రకటించాడు.
ఇది విన్న నలుగురు వ్యక్తులు ఎంతో ఆశపడి తాము చెలామణి చేస్తున్న ఓ బస్తా దొంగనోట్ల కట్టలను రాజు వద్దకు తీసుకెళ్లారు. ‘‘ఇదిగోండి.. మీరు అడిగిన దొంగనోట్లు.. అన్నీ ఇచ్చేస్తున్నాం.. మీరు ప్రకటించిన పది గ్రాముల బంగారం ఇప్పించండి ప్రభూ, వెళ్లిపోతాం..’’ అని ప్రాధేయపడ్డారు.
వారిని చూసిన రాజుకు చిర్రెత్తు కొచ్చింది. ఇన్నాళ్లు దొంగనోట్లతో నిద్ర లేకుండా ముప్పుతిప్పలు పెట్టిన వారికి జీవిత కారాగార శిక్ష విధించాడు.
ఆ తర్వాత నకిలీ నోట్ల సమస్య తలెత్తలేదు. ప్రజలు, రాజు ప్రశాంత జీవనం గడిపారు.
రాజు ఉపాయంతో అపాయం తప్పించి సమస్యను పరిష్కరించినందుకు ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు.
***
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
బోగా పురుషోత్తం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: బోగా పురుషోత్తం https://www.manatelugukathalu.com/profile/purushotham/profile
1997 నుంచి బాలల కథలు రాస్తున్నాను. కార్టూన్లు గీస్తున్నాను. 1998లో నేను ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలలో ఎడిటోరియల్ కార్టూన్లు గీశాను. ఇప్పటి దాకా ప్రజాశక్తి, విశాలాంధ్ర వార్త, ఆంధ్రజ్యోతి వార పత్రికతో పాటు వివిధ వార, మాస పత్రికలలో 2 వేల కార్టూన్లు ప్రచురితమయ్యాయి. కథలు సైతం 150 దాకా రాశాను. అందులో అన్ని కథలు బుజ్జాయి, బాలజ్యోతి, బాలమిత్ర, మొలక, ఈనాడు (హాయ్ బుజ్జీ), ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, సాక్షి, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వి6 వెలుగు దినపత్రికల ఆదివారం అనుబంధం లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రజాశక్తి దినపత్రిక తిరుపతి డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను..










Comments