top of page
Original.png

వెరైటీ

Funny Telugu family story, Baby naming story Telugu, పిల్లల పేర్లు


Variety -  Telugu Comedy Story |Mohana Krishna Tata

వెరైటీతెలుగు హాస్య కథ | తాత మోహనకృష్ణ

Published In manatelugukathalu.com On 22/05/2026

"రేపు మా పిల్లోడికి నామకరణం చేస్తున్నాం... మీ ఇంట్లో అందరూ రండి" అని కాంచన అందరినీ పిలుస్తోంది.


"పిల్లోడికి ఏం పేరు పెడుతుందో కాంచన? ఎప్పుడూ వెరైటీగా చేస్తుందిగా అన్నీనూ" అని అందరి మైండ్ వాయిస్.


"అవును! అవును! పెళ్ళిలో మధుపర్కాలు కట్టుకోమని పంపితే, వైట్ ఎందుకని గ్రీన్ కలర్ చీరలో వచ్చింది. అంతేకాదు... వాళ్ళాయన కూడా అదే కలర్ లో వచ్చేలా చేసింది. అనుకుంటే, సాధిస్తుంది కాంచన" అని అనుకున్నారు అంతా.


"కాంచన అంటే ఏమనుకున్నారు? అంతా వెరైటీ" అని ఎప్పుడూ అంటూ ఉంటుంది కాంచన.


"ఏమండీ! మన పిల్లోడి పేరు వెరైటీగా పెడదామని అనుకుంటున్నాను... ఏమంటారు?"


"ఎందుకే! ఏదో ఒక పేరు... సులువుగా ఉంటే చాలు కదా."


"మీరు ఉండండి! సుబ్బారావు, అప్పారావు, రమేష్, సురేష్ ట్రెండ్ పోయింది. ముందు ముందు నోరు తిరక్కుండా ఎంత కష్టంగా పేరు ఉంటే అంత గొప్ప మరి."


"వద్దే... ఎందుకే అలాగ?"


"మీకేమీ తెలియదు. ఉండండి. నేను పెట్టే పేరులో వెరైటీ ఉండాలి" అని పేర్ల పుస్తకం తిరగేస్తూ, తెగ ఆలోచిస్తోంది కాంచన.


"ఇది బాగుంది కదండీ... హైత్విక్ రేయాన్ష్."


"అంటే... ఏమిటి?"


"హైత్విక్ అంటే శివుడు... రేయాన్ష్ అంటే కాంతి కిరణం."


"దాని బదులు 'శివ' అంటే, పిలవడానికి చక్కగా, సులువుగా ఉంటుంది కదే! ఎప్పుడో ఇరవై ఏళ్ల తర్వాత వెరైటీ పేర్లు ఇప్పుడు పెడితే వింతగా ఉంటుందే. పలకడం కూడా కష్టమే."


"మళ్ళీ మొదటికే వచ్చారు... వెరైటీగా ఉండాలి పిలవడానికి. ఇదే ఖాయం చేసుకోండి. దేవుని పేరు... ఇక మాట్లాడకండి."


'అంతేలే! అంతేలే! పిల్లోడి పేరు కాదు, ముందు నా పెళ్ళామే వెరైటీ' అని మనసులో అనుకున్నాడు భర్త.


ఫంక్షన్ రోజు అందరూ వచ్చారు. అందరికీ అదే టెన్షన్. కాంచన ఏం వెరైటీ పేరు పెడుతుందా అని! పంతులుగారు పేరు చెప్పమన్నారు. 'హైత్విక్ రేయాన్ష్' అని పలికింది కాంచన.


"పేరు కొత్తగా ఉంది. కానీ పలకడానికే కొంచెం కష్టంగా ఉంది. నా బదులు కూడా పేరు మీరే పలికేయండి" అన్నారు పంతులుగారు.

(నాకెందుకు ఏం పేరు పెడితే... నా పని కాస్త నేను చూసుకుని వెళ్ళిపోతే సరి - పంతులుగారి మైండ్ వాయిస్)


పిల్లోడిని దీవించడానికి ఇప్పుడు పెద్దవారి వంతు. నానమ్మగారు "ఏమిటే వీడి పేరు? నాకు సరిగ్గా పలకడం రాదు. హైరే అనేస్తాను" అంటూ దీవించింది. అంత మంచి పేరు పెడితే, పేరుని కత్తిరించి పలకడం చూసి కోపం వచ్చింది కాంచనకి.


ఇప్పుడు తాతగారి వంతు.


పేరు బాగానే ఉంది, కానీ మా నోటికి అంతగా తిరగదు... ఏం చేస్తాం? ఏం అనుకోకమ్మా. "రే రే" అనేసాడు తాతగారు. అమ్మమ్మగారైతే 'హై గాడు మా బుజ్జి... హై గాడు' అని తెగ ముద్దులాడుతోంది. అది విన్న కాంచన వెంటనే పిల్లవాడిని తీసుకుని... 'ఒక్కరు కూడా నేను ఎంతో ముచ్చటగా పెట్టుకున్న పేరుతో పిలవట్లేదు' అని బాధపడింది.


సినిమాలో చూపించినట్టుగా కాంచన చేతిలో ఉన్న పిల్లవాడు అమాంతం పెద్దవాడైపోయి కిందకు దిగి ఎదురుగా నిల్చుని ప్రశ్నిస్తున్నాడు... 


"చూడమ్మా! నువ్వు పెట్టిన పేరు ఎంత కొంప ముంచుతోందో! అందరూ వెరైటీగా పిలుస్తున్నారు. "రే రే అంటా... హైరే అంటా... నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఏడిపిస్తున్నారు" అని అన్నట్టుగా కాంచనకు అనిపించింది. ఉన్నట్టుండి ఉలిక్కిపడింది కాంచన.


"ఏమైంది కాంచన? ఎప్పుడూ నిద్రలో కలవరింతలేనా?"


"కలవరింతలు కాదండీ... ఒక భయంకరమైన కల" అని అంతా భర్తకు చెప్పింది కాంచన.


"అవునా... నిజమా?"


"మీరు చెప్పినట్టుగానే మన పిల్లవాడి పేరు సింపుల్‌గా పెడదాము" అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోయింది కాంచన.

సమాప్తం. 

***********

 తాత మోహనకృష్ణ గారి కొన్ని ఇతర రచనలు:


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page