'Vijaya Vijayam - New Telugu Story Written By Mohana Krishna Tata
'విజయ విజయం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
సురేష్ ఒక ఫేమస్ రచయత. తన కథలు చాలా పాపులర్ అవడం తో, అతనికి ఇంకా క్రేజ్ బాగా పెరిగింది. రోజూ.. ఎన్నో కాల్స్ వస్తుంటాయి. అందులో ఎక్కువ.. ఫ్యాన్స్.. అతని రచనలని పొగుడుతూ ఉంటారు.
అలా, ఒక రోజు రాత్రి, ఒక ఫోన్ వచ్చింది.
"హలో.... " అంటూ.. ఒక అమ్మాయి.. ఫోన్ చేసింది.
"హలో.... " అన్నాడు సురేష్.
"మీరంటే నాకు చాలా ఇష్టం" అని ఫోన్ కట్ చేసింది.
ఎవరో ఆకతాయిలు సరదాగా చేసిన కాల్ అనుకోని సురేష్ సీరియస్ గా తీసుకోలేదు.
మర్నాడు రాత్రి మళ్ళీ ఫోన్ వచ్చింది... అదే నెంబర్ నుంచి. ఈసారి ఆ అమ్మాయి ఏమి మాట్లాడలేదు. రోజూ, ఇలాగే కాల్స్ వస్తున్నాయి.
ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. తన సెక్రటరీ తో చెప్పి, ఆ నెంబర్ డీటెయిల్స్ తెలుసుకోమన్నాడు. సెక్రటరీ ఆ నెంబర్ తెలుసుకున్నాడు. ఆ నెంబర్ తెచ్చి సురేష్ కు ఇచ్చాడు. అది ఒక గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చింది అని చెప్పాడు.
"సార్! నేను వెళ్ళి ఆ అమ్మాయి కు వార్నింగ్ ఇవ్వనా?" అన్నాడు సెక్రటరీ.
"వద్దు! నేను వెళ్ళి అడుగుతాను" అన్నాడు సురేష్
అడ్రస్ కు వెళ్ళి, బెల్ రింగ్ చేసాడు. లోపల నుంచి వార్డెన్ వచ్చి, ఎవరు కావాలని అడిగింది. సురేష్ విజయ కోసం అడిగాడు. కొంతసేపటికి విజయ వచ్చింది. సురేష్ ను చూసి పారిపోబోయింది. సురేష్ ఆపి, "ఎవరు నువ్వు? నాకు ఎందుకు కాల్స్ చేస్తున్నావు?" అన్నాడు.
"మీరంటే నాకు చాలా ఇష్టం" అన్నది విజయ.
"నువ్వు ఎవరో, నాకు తెలియదు" అన్నాడు సురేష్.
"చిన్నప్పుడు మీరు కథలు రాసేవారు కదా!" అన్నాది విజయ.
"అవును! అయితే? "
"మీ కధలు నేను రెగ్యులర్ గా చదివేదానిని. మీకు అప్పట్లో, ఒక లెటర్ కుడా రాసాను. అది మీకు అందే ఉంటుంది. తర్వాత మీ కథలు పాపులర్ అయ్యాయి. మీ ఫోటో కూడా వేశారు. అప్పుడే నేను మీతో లవ్ లో పడిపోయాను. "
ఇన్ని సంవత్సరాల తర్వాత, మీ వివరాలు దొరికాయి. ఇక్కడే, నేను హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాను. ఇలా చేస్తే, మీరు నా కోసం వస్తారని చేశాను…”
"నా గురించి ఏమిటి తెలుసునని నన్ను ఇష్టపడుతున్నావు?"
"మీ ప్రొఫైల్ మొత్తం నాకు తెలుసు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో కూడా తెలుసు. మ్యాట్రిమోనీ లో చూసాను.
మీకు నచ్చే విధంగా, నన్ను నేను మార్చుకుని, ఇప్పుడు మీకు కాల్ చేశాను. మీ హాబీలు నా హాబీలు మ్యాచ్ అవుతాయి, మీ టేస్ట్ నా టేస్ట్ మ్యాచ్ అవుతాయి. నా హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను. మీకోసం వంట కూడా నేర్చుకున్నాను - సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్.
నా ప్రేమ నిజమైనది! ఒప్పుకోండి.... "
"నీకు నా మీద ఉన్న ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది. నా గురించి మారినందుకు చాలా థాంక్స్. నీ మనసు బాగా నచ్చింది!
కానీ... ఇప్పుడు నేను ఒక పెద్ద రచయతను. అది నీకు కూడా తెలుసు. నీకు నెల టైం ఇస్తున్నాను. నువ్వు నేను పెట్టిన పరీక్షలో నెగ్గితే.. నేను నీ గురించి ఆలోచిస్తాను, లేకపోతే నువ్వు నన్ను మర్చిపోవాలి. నేను రచయతను కాబట్టి, నాకు కాబోయే శ్రీమతి.. అలాంటి రంగంలో ఉండాలని నా అభిలాష”.
'ఓకే' అంది విజయ. నేను ఏమి చెయ్యాలి? సముద్రం లో దూకమన్నా దూకుతాను”.
“అలాంటివి చేయనవసరం లేదు. నేను ఇప్పటివరకు రాసిన లవ్ స్టోరీస్ అన్నీ నువ్వు చదవాలి. వాటితో నీకు నచ్చిన ఒక షార్ట్ ఫిలిం తియ్యాలి. దానిని నువ్వే డైరెక్ట్ చెయ్యాలి. దానికి చాలా ఎక్కువ వ్యూస్ రావాలి. ఇది నీకు నేను ఇస్తున్న కెరీర్ అండ్ లైఫ్ ఆఫర్ అని కూడా అనుకోవచ్చు. నా సహాయం నీకు ఉండదు”.
"అలాగే! నా ప్రేమను గెలిపించుకుంటాను" అంది విజయ
విజయ, సురేష్ రచనలన్నీ చదివి, అందులో తనకు నచ్చిన రచనని ఒక షార్ట్ ఫిలిం తీయాలని నిర్ణయించుకుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది. ఆ కథ లో రాసిన ప్రదేశాలకు వెళ్ళి, అందులో ఉన్నట్టుగా చిత్రీకరించింది. అనుకున్న దానికన్నా, ముందే షార్ట్ ఫిలిం కంప్లీట్ అయ్యింది.
దానికి అనుకున్న దానికన్నా, ఎక్కువ వ్యూస్ వచ్చాయి. విజయ చాలా సంతోషించింది. ఉప్పొంగిన ఆనందంతో, వెంటనే, సురేష్ వద్దకు వెళ్ళి, ఈ విషయాన్నీ చెప్పింది.
"విజయ! నాకు తెలుసు, నువ్వు సాధిస్తావని.. నీ కృషి, పట్టదల, నీ డెడికేషన్, అన్ని ఒక కంట కనిపెడుతున్నాము. కంగ్రాట్స్ విజయ... "
"నన్ను పెళ్ళి చేసుకుంటారా? ఇప్పుడు"
"దానికన్నాముందు, నీకు ఒక విషయం చెప్పాలి విజయ!"
"ఏమిటది"
"నువ్వు అప్పట్లో రాసిన లెటర్... అప్పుడే నేను చదివాను... నువ్వు మా ఊరు వచ్చి చదువుకుంటాను... అని వ్రాసావు... ఆ లెటర్ లో.... తర్వాత ఆ లెటర్ మా అమ్మ చింపేసింది... ఎక్కడ నా చదువు పాడైపోతుందని... అందుకే, నేను నిన్ను కాంటాక్ట్ చెయ్యలేకపోయాను.
ఇన్నాళ్ల తర్వాత, నువ్వే, మళ్ళీ కాంటాక్ట్ లోకి వచ్చావు.... అందుకే, నేనే స్వయంగా... నా హోదా ను వదలి... నీ కోసం వచ్చాను... గమనించావా?
నాకు నువ్వంటే ఆ రోజు ఇష్టం ఏర్పడింది. నేను పెట్టిన ప్రేమ పరీక్ష లో నీ విజయం కన్నా, నా కోసం నీ తపన చాలా కనిపించింది. నిన్ను నా జీవితం లోకి ఆహ్వానిస్తున్నాను.... మోస్ట్ వెల్కమ్ విజయ!!!” అంటూ దగ్గరకు తీసుకున్నాడు.
******
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments