top of page
Original.png

అనుకున్నా... అంతే

Jul 11
2 min read

అనుకున్నా అంతే, కొత్త విరిత, తెలుగు వ్యాసం, సబ్‌కాన్షస్ మైండ్, మనసు ఆలోచనలు, మానసిక శాస్త్రం, సెల్ఫ్ టాక్, తెలుగు మోటివేషనల్ వ్యాసం, ఆలోచనాత్మక వ్యాసం, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అనుకున్నా... అంతే' వ్యాసంలో  మనసులో బాస్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధైర్యంగా మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ, బయట మాత్రం ప్రశాంతంగా స్పందిస్తున్న యువకుడి ఆలోచనలను ప్రతిబింబించే దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అనుకున్నా... అంతే' వ్యాసంలో  మనసులో బాస్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ధైర్యంగా మాట్లాడుతున్నట్లు ఊహించుకుంటూ, బయట మాత్రం ప్రశాంతంగా స్పందిస్తున్న యువకుడి ఆలోచనలను ప్రతిబింబించే దృశ్యం.

Anukunna Anthe Telugu Inspirational Article | Kotha Viritha

అనుకున్నా... అంతే తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 11/07/2026


మనసులో వందసార్లు చెప్పేస్తాం... కానీ బయట ఒక్క మాట కూడా అనం. బాస్‌తో, ఇంట్లో వారితో, స్నేహితులతో, ట్రాఫిక్‌లో, సోషల్ మీడియాలో... మనం చెప్పాలనుకున్న మాటలు చాలాసార్లు మనసులోనే మిగిలిపోతాయి. "అనుకున్నా... అంతే" అనే ఈ ఆలోచనాత్మక వ్యాసం మన అంతర్మనస్సు, ఊహల్లో జరిగే సంభాషణలు, బాధ్యతతో జీవించే మనిషి మనస్తత్వాన్ని సరదాగా, శాస్త్రీయ కోణంతో వివరిస్తుంది.


ఆఫీసులో బాస్‌కి... "ఏం చేసుకుంటావో చేసుకో... ఈరోజు పని చేయను!" అని అందాం అనుకున్నా. కానీ... "ఓకే సార్... వర్క్ ఇంకో గంటలో అయిపోతుంది. " అనేశా. 


ఇంట్లో మా అత్తకి, "ఇక చాలు... నాకు కూడా ఓపికకి లిమిట్ ఉంది!" అని అందాం అనుకున్నా. 


కానీ... "రాత్రి భోజనానికి గోధుమ రవ్వ ఉప్మా చేయనా?" అని అడిగేశా. 


ట్రాఫిక్‌లో హారన్ కొడుతున్నోడికి, "రోడ్డంతా నీ తాతగారి సొత్తా?" అని అందాం అనుకున్నా. 


కానీ... సిగ్నల్ గ్రీన్ పడేసరికి వాడు ఎడమ తిరిగాడు... నేను కుడి తిరిగాను. 


వాట్సాప్‌లో సీన్ చేసి రిప్లై ఇవ్వని ఫ్రెండ్‌కి... "ఇక నుంచి నేనూ మెసేజ్ చేయను!" అని అందాం అనుకున్నా. 


కానీ... ఐదు నిమిషాలకే "ఏం చేస్తున్నావ్?" అని నేనే మెసేజ్ పెట్టా. 


పిల్లలు ఇల్లంతా చిందరవందర చేసినప్పుడు... "ఇది ఇల్లా... చాపల మార్కెట్ అనుకున్నారా?" అని అరిచేద్దాం అనుకున్నా. 


కానీ... నేనే బొమ్మలు, బట్టలు సర్దడం మొదలుపెట్టా. 


ఇలా... మన జీవితంలో చెప్పిన మాటల కంటే... అనుకున్న మాటలే ఎక్కువ. మనసులో మాత్రం, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇచ్చుకుంటాం. బయట మాత్రం, "పర్లేదు సార్... ఓకే సార్... మీ ఇష్టం. "


అసలు కామెడీ ఏంటంటే, మన సబ్‌కాన్షస్‌కి నిజం, ఊహ మధ్య పెద్ద తేడా ఉండదు. మనసులో వందసార్లు వాదించేస్తాం... వందసార్లు తిట్టేస్తాం... వందసార్లు గెలిచేస్తాం... 


అంతే, మన బుర్రకు విషయం ముగిసిపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఎదురువాడికి మాత్రం... ఏం జరిగిందో కూడా తెలియదు!


అందుకే మన జీవితంలో ఎక్కువగా మాట్లాడేది నోరు కాదు... మనసులో నిత్యం రిపీట్ అవుతూ ఉండే "అనుకున్నా... " డైలాగులే!


మనసులో ఇచ్చే రిప్లైలకు ధైర్యం ఎక్కువ... బయట ఇచ్చే రిప్లైలకు బాధ్యత ఎక్కువ. 


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత
కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super

Like

Rated 5 out of 5 stars.

చాలామంది వ్యక్తులు తమలో తామే అనుకుంటారు తప్ప బయటకి చెప్తే ఏమనుకుంటారో ఏమో అనే చిన్న శంకతో, అనుకున్న మాటలు బయటికి రావు

Like

Rated 5 out of 5 stars.

Excellent 👌 👌 👌 👌

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

# Vikki
# Vikki
Jul 11
Rated 5 out of 5 stars.

Thoughtfully Written about the thoughts that are always hidden.

Like
bottom of page