ఆటోవాలా
- Harish Babu Pondugula

- 47 minutes ago
- 3 min read

Autowala - Telugu Social Story | Harish Babu Pondugula
ఆటోవాలా - తెలుగు సామాజిక కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 24/08/2026
నగరాల్లో రోజువారీ ప్రయాణం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఒకప్పుడు ప్రయాణికులకు ప్రధాన ఆధారంగా ఉన్న ఆటోలు, నేడు ఉచిత బస్సులు, హైర్ బైక్స్, యాప్ ఆధారిత రైడ్లతో కొత్త పోటీని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో కొందరు ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యపు లేదా పొగరుబోతు ప్రవర్తన కూడా వారి వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ రెండు కోణాలను సరదా సంభాషణలు, రోజువారీ అనుభవం, చమత్కారమైన ముగింపుతో ఆవిష్కరించిన కథే “ఆటోవాలా.. కథ”. హరీష్ బాబు రాసిన ఈ కథ నవ్విస్తూనే మారుతున్న రవాణా వ్యవస్థపై, ప్రయాణికులు–ఆటో డ్రైవర్ల మధ్య సంబంధాలపై ఆలోచింపజేస్తుంది.
ఇంటి నుంచి కిలోమీటర్ దూరమే కదా, మళ్ళీ దీనికి కూడా కార్ ఎందుకు? తీరా పోయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, ఆటోలో వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరాను.
రోడ్డు పక్కన నుంచుంటే ఎంతసేపటికి కూడా ఒక ఆటో రాదు. ఒకవేళ వచ్చినా, ఆ ఆటో వాడు ఖాళీగా ఉన్నా ఆపకుండా వెళ్ళిపోతున్నారు.
వీళ్ళ దుంప తెగ! ఒకపక్క ఎక్కేవాళ్ళు లేరు అంటారు, చెయ్యి ఎత్తి "ఎక్కుతాను రా బాబు" అన్న కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, అని మనసులో తిట్టుకున్నాను.
చివరికి కాసేపటికి ఒక 50 ఏళ్లు పైబడిన ఒక ఆటో డ్రైవర్ ఆపాడు. సగం దూరం వస్తానని చెప్పాడు, "సరే పద" అన్నాను. దారి మధ్యలో ఇద్దరు ముగ్గురిని ప్యాసింజర్లు దింపేసిన తర్వాత అతన్ని అడిగాను:
"ఏంటండీ... ఆల్రెడీ 7 PM అయిపోయింది, 12 PM దాకా నడుపుతారా ఇలా?" అన్నాను.
"పన్నెండు దాకా నా పాడె! రాత్రి తొమ్మిది... మహా అయితే అంతే" అన్నాడు అతను.
అదేంటి అలసిపోయారా అని అడిగాను.
"లేదు సార్... ఈ ఫ్రీ బస్సులు వచ్చి పడ్డాయి కదా... అవి వచ్చాక లేడీస్ ఎవరూ మా ఆటోలు ఎక్కటం లేదు... పోనీ ఆఫీస్‌కి వెళ్లేవాళ్ళు, వచ్చేవాళ్ళు అన్నా ఎక్కుతారా అంటే, ఈ హైర్ బైక్‌లు వచ్చాక... జనాలు ఇంటి దగ్గర నుంచి ఆఫీసుకు బయలుదేరేటప్పుడు... ఆ యాప్ ఓపెన్ చేసి ఎవరో ఒకరిని ఎక్కించుకుని... ఆఫీస్ వరకు వెళ్లి పెట్రోల్ డబ్బులు సేవ్ చేసుకుంటున్నారు...
ఈ ఎంప్లాయిస్ ఇంకా సాటర్డే, సండే వస్తే కొంతమంది అయితే రోజు మొత్తం తిరిగేసి డబల్ శాలరీ సంపాదించేస్తున్నారు" అని దీనంగా వాపోయాడు.
"అయ్యో పాపం! ఈ ఆటో వాళ్ళ పరిస్థితి దుర్భరంగా తయారైంది కదా" అనుకున్నాను.
అతనికి డబ్బు ఇచ్చేసి ఇంకో ఆటో కోసం ఎదురుచూపు మొదలుపెట్టాను. ఇంతలో వచ్చాయి సెవెన్ సీటర్ షేర్ ఆటోలు.
"సార్ ఎక్కండి సార్, ఎక్కండి!" అంటున్నాడు.
పోనీ వెళ్తాడా అంటే వెళ్ళడు, వెయిటింగ్...
నేను వెళ్ళలేదు. ఒక కిలోమీటర్ కూడా లేదు. అతని ఆటోలో ఎక్కి కూర్చొని ఒక పావు గంట వెయిట్ చేసి, అతను మొత్తం ఆటో నింపుకున్నాక, ముందు సీట్ నుంచి వెనక్కి, వెనకనుంచి ముందుకి నన్ను తిప్పిన తర్వాత అప్పుడు ఆటో కదులుతుందట!
ఇంకా ఇది ఇలా కాదని కాస్త ముందుకు వెళ్లి నుంచొని ఆగాను. ఒక సెవెన్ సీటర్ ఆటో ఖాళీగానే ఉంది, వచ్చి ముందు ఆగింది.
"ఎక్కండి సార్" అన్నాడు.
సరే కదా అని ఎక్కి, "నువ్వైనా వెళ్తున్నావా? ఏమన్నా వెయిటింగ్ ఉందా?" అని అడిగాను.
నా మాటలో ఏం బూతుందో అర్థం కాలేదు.
"దిగేస్తే దిగేయండి సార్" అన్నాడు.
"అదేంటయ్యా నేను అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు ఏమన్నా ఆగేది ఉంటే నేను కాస్త దిగి ఇంకో ఆటో ఎక్కుతాను.. నేను వెళ్లవలసింది ఆఫ్ కిలోమీటర్ కూడా లేదు.." అని చెప్పాను.
నేను అంత మర్యాదగా మాట్లాడినా, "ఎక్కితే ఎక్కండి, దిగితే దిగండి సార్" అంటున్నాడు.
అప్పుడు అనుకున్నాను... వీళ్ళ గురించి బాధపడాల్సిన పనేలేదు. ఇంత ఒళ్ళు పొగరుగా జవాబు ఇస్తున్నారు కాబట్టి, వీళ్ళకి ఆల్టర్నేటివ్‌గా ఎవరో బాగా బాధపడే ఆ యాప్స్ కనిపెట్టారు అని!
పాపం కొంతమందికి ఉండే పొగరుబోతు ప్రవర్తన వల్ల మిగతా ఆటో డ్రైవర్లు కూడా నష్టపోతున్నారు అన్నమాట... అని అర్థమైంది. ఇంక నోరు మూసుకొని నా ప్రయాణం ముగించుకొని ఇంటికి బయలుదేరాను.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .








Comments