బాబోయ్…పెళ్ళా?

Baboy Pellaa - Telugu Inspirational Article | Kotha Viritha
బాబోయ్…పెళ్ళా? - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 02/09/2026
పెళ్లి అంటే రెండు కుటుంబాల కలయిక, ఇద్దరు వ్యక్తుల సహజీవనం, కలిసి సాగించాల్సిన జీవిత ప్రయాణం. కానీ నేటి యువతలో కొందరికి పెళ్లి మాట వినగానే ఆనందం కంటే ముందుగా భయం, సందేహాలు, అంచనాలు కనిపిస్తున్నాయి.
పెళ్లి… రెండు కుటుంబాల కలయిక, రెండు వ్యక్తిత్వాల సహవాసం, ఒక జీవితకాల వాగ్దానం. కానీ ఈ రోజుల్లో పెళ్లి మాట వినగానే కొందరి ముఖాల్లో చిరునవ్వు కాదు… “బాబోయ్!” అనే భయం కనిపిస్తోంది.
అమ్మను చూసిన అమ్మాయి “అమ్మలా అన్నీ భరించే ఓపిక నాకెక్కడుంది?” అంటుంది.
నాన్నను చూసిన అబ్బాయి “నా భార్య కూడా మా అమ్మలాగే ఉండాలి!” అంటాడు.
ఇద్దరూ తమ తల్లిదండ్రులను చూసి పెళ్లి గురించి పి హెచ్ డి చేసేసినట్టే!
ఇక సోషల్ మీడియా, వార్తలు కూడా తమ వంతు బాధ్యతగా “ఈ రోజు విడాకులు… రేపు అక్రమ సంబంధం… మరుసటి రోజు దారుణం” అంటూ పెళ్లికి మంచి పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నాయి!
అందుకే పెళ్లి అంటే ప్రేమకంటే ముందే భయం, అంచనాలు, పోలికలు వచ్చేస్తున్నాయి.
అమ్మాయికి భయం “నా స్వేచ్ఛ పోతుందేమో!”
అబ్బాయికి భయం “మా అమ్మలాగా చూసుకుంటుందా?”
మొత్తానికి ఇద్దరికీ ఒకే సమస్య… ఎదుటివారు తమ ఊహించిన పాత్రలో ఉంటారా లేదా? నిజానికి పెళ్లి అంటే అమ్మను కాపీ చేయడం కాదు… నాన్నను కాపీ చేయడం అస్సలే కాదు.
అది రెండు కొత్త మనుషులు కలిసి తమకంటూ ఒక కొత్త విధానం సృష్టించుకోవడం. తల్లిదండ్రుల జీవితాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు… కానీ సిలబస్‌గా కాదు. మీడియాలో కనిపించే ప్రతి పెళ్లి కథను భవిష్యత్తుకు జాతకంగా భావించాల్సిన అవసరం లేదు.
పెళ్లి మంచిదా? చెడ్డదా? అనే ప్రశ్న కంటే…“మన ఇద్దరం కలిసి దీన్ని ఎంత మంచిగా నడిపించగలం?” అనేదే ముఖ్యం. లేకపోతే… పెళ్లి చేసుకోకముందే దాని గురించి భయపడుతూ, పెళ్లి చేసుకున్నాక దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది?
పెళ్లి అంటే బాబోయ్ కాదు…
పెళ్లి అంటే ‘మన ఇద్దరం’ అనే కథ మొదలయ్యే చోటోయి!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Well said👏🏻👏🏻👏🏻👏🏻👏🏻