top of page
Original.png

బద్ధకస్తుడికి బామ్మ పాఠం

#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #BaddakasthudikiBammaPatam, #బద్ధకస్తుడికిబామ్మపాఠం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 17

Baddakasthudiki Bamma Patam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 30/01/2026

బద్ధకస్తుడికి బామ్మ పాఠంతెలుగు కథ

రచన: వసుంధర రాణి మునిపల్లె 


బామ్మ గదిలోకి అడుగుపెట్టగానే చింటూ సోఫాలో హాయిగా కూర్చుని మొబైల్‌లో గేమ్స్ ఆడుతూ కనిపించాడు. గది చూస్తే అడుగు తీసి అడుగు వేయలేనంత ఘోరంగా ఉంది. నేల మీద ఇష్టమొచ్చినట్టు పడి ఉన్న బట్టలు, పుస్తకాలు, తిని పారేసిన ఖాళీ ప్యాకెట్లు అన్నీ కలిసి గదిని ఒక కుప్పలా మార్చేశాయి. 


బామ్మ అది చూసి, ఒరేయ్ చింటూ! గది ఇంత చిందరవందరగా ఉంది ఏంటిరా? వెంటనే లేచి ఇవన్నీ సర్దుకో అని గద్దించింది. దానికి చింటూ మొబైల్ నుంచి కళ్ళు తిప్పకుండా, అయ్యో బామ్మ! నేను లేద్దామనే చూస్తున్నాను కానీ ఈ సోఫా కింద ఏదో అయస్కాంత శక్తి నా కాళ్ళను బలంగా కిందికి లాగేస్తోంది, అందుకే నేను కాళ్ళు కింద పెట్టలేకపోతున్నాను అని ఒక వింత సాకు చెప్పాడు.


బామ్మ నవ్వుకుని, అవునా చింటూ! అయితే నీకు ఒక గాడిద కథ చెప్పాలి అంది. ఒకప్పుడు ఒక వ్యాపారి దగ్గర ఒక గాడిద ఉండేది, అది కూడా నీలాగే భలే బద్ధకస్తురాలు. ఒకరోజు అది ఉప్పు మూటలు మోసుకుని వెళ్తూ కాలువ దాటేటప్పుడు కాలు జారి నీటిలో పడింది. ఉప్పు నీటిలో కరగడం వల్ల దాని వీపు మీద బరువు తగ్గిపోయింది. ఇదేదో బాగుందని అది రోజూ కావాలనే నీలాగే అయస్కాంత శక్తి నా కాళ్ళను లాగేస్తోంది అన్నట్టుగా నటించి నీటిలో పడిపోతూ ఉప్పు బరువును తగ్గించుకోవడం మొదలుపెట్టింది. 


ఇది గమనించిన యజమాని ఒకరోజు దానికి బుద్ధి చెప్పాలని దాని వీపు మీద దూది మూట ఉంచాడు. అది ఎప్పటిలాగే కాలువ రాగానే నటించి నీటిలో మునిగింది. కానీ దూది నీటిని పీల్చుకుని పదింతల బరువు పెరిగింది. యజమాని ఏమాత్రం జాలి చూపకుండా ఆ బరువుతోనే దాన్ని నడిపించాడు, అప్పుడు నిజంగానే దాని కాళ్ళు వంగిపోయినా చచ్చినట్టు ఆ బరువును మోయాల్సి వచ్చింది.


చింటూ! ఇప్పుడు నువ్వు బద్ధకంతో అయస్కాంతం అని సాకులు చెప్పావు కానీ రేపు పొద్దున్న స్కూల్‌కి వెళ్లే టైమ్‌కి నీ పెన్సిల్ బాక్సో లేదా నువ్వు రాత్రంతా కష్టపడి రాసిన హోం వర్క్ నోట్‌బుక్కో కనబడలేదనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? గది అంతా చెత్తలా ఉంటే ఆ టెన్షన్‌లో వాటిని వెతుక్కోవడం ఆ దూది మూట మోయడం కంటే కష్టమవుతుంది, అప్పుడు నిజంగానే నీ కాళ్ళు వణుకుతాయి అని హెచ్చరించింది.


 అందుకనే ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడే పెట్టేస్తే ప్రతిసారి ప్రత్యేకంగా రూము సర్దుకోవాల్సిన పని ఉండదు అని బామ్మ చింటూతో చెప్పింది. ఆ మాటలకి చింటూకి నిజంగానే భయం వేసింది. రేపు పొద్దున్న పడే టెన్షన్ కంటే ఇప్పుడే సర్దుకోవడం మేలని గ్రహించి, వద్దు బామ్మ నాకు ఆ దూది మూట వద్దు ఆ టెన్షన్ వద్దు అంటూ వెంటనే సోఫాలోంచి లేచి గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టాడు.


 అందుకే బద్ధకంతో చెప్పే సాకులు తాత్కాలికంగా హాయినిచ్చినా భవిష్యత్తులో అవి మనకే పెద్ద భారంగా

మారతాయి.

*** 

సమాప్తం. 

వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె


నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.


నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.

ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page