top of page
Original.png

భౌతిక వ్యాయామ విద్య

Jun 21
3 min read

ఫిజియోథెరపీ క్లినిక్‌లో భుజం నొప్పికి చికిత్స పొందుతూ వ్యాయామాలు చేస్తున్న మహిళ.
ఫిజియోథెరపీ క్లినిక్‌లో భుజం నొప్పికి చికిత్స పొందుతూ వ్యాయామాలు చేస్తున్న మహిళ.

Bhouthika Vyayama Vidya - Telugu Article on Yoga | Yasoda Gottiparthi

భౌతిక వ్యాయామ విద్య - తెలుగు వ్యాసం | యశోద గొట్టిపర్తి

Published In manatelugukathalu.com On 21/06/2026


ఆరోగ్యం మనిషికి అత్యంత విలువైన సంపద. అయితే ఆధునిక జీవనశైలి, వయస్సు పెరగడం, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, ఆర్థరైటిస్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మందులపైనే ఆధారపడకుండా, భౌతిక వ్యాయామాలు మరియు ఫిజియోథెరపీ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. శరీర కదలికలను పునరుద్ధరించడం, నొప్పులను తగ్గించడం, స్వీయ విశ్వాసాన్ని పెంపొందించడం వంటి అనేక ప్రయోజనాలను ఫిజియోథెరపీ అందిస్తుంది.

ఈ వ్యాసంలో భౌతిక చికిత్స ప్రాముఖ్యత, ఆర్థరైటిస్ రకాలు, కారణాలు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలికి అవసరమైన సూచనల గురించి తెలుసుకుందాం.


"అందరికీ అన్నీ రోగాలే కానీ అడ్డెడు గుండెకు ఏ రోగం లేదు" అనే ఒక ప్రాచీన సామెత నేటి కాలంలో సార్థకం చేసుకుంది. పోషక విలువలున్న ఆహారం తింటున్నా కానీ జబ్బులేని మనిషి, మందులు వాడని వ్యక్తి కనిపించడం లేదు. తినే ఆహారంలో కల్తీ, త్రాగే నీళ్లలో కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నాం.


చాలా కాలం నుండి నాకు పాదాల నొప్పుల కారణంగా ఎక్కువగా నడవలేక, కొంత దూరం నడవగానే కండరాల బలహీనత, మోకాళ్ల నొప్పులు, కొంత సేపు విశ్రాంతి తీసుకుంటేనే కానీ మళ్ళీ నడవగలిగే పరిస్థితి వచ్చింది. వైద్యులను సంప్రదిస్తే పరీక్ష చేసి కాల్సియం మాత్రలు, ఇంజక్షన్ రూపంలో కొంత కాలం వాడడం వల్ల ఉపశమనంగా ఉండేది. ఎంత పనివాళ్ళున్నా కొన్ని ఇంటిపనులు నేనే స్వయంగా ఇష్టంగా చేస్తే కొంత సంతోషంగా అనిపించి చేస్తుండేదాన్ని.


అనుకోకుండా కుడి భుజం పూర్తిగా కదలక, చిన్న బరువు పట్టినా నొప్పి ఎత్తలేక పోవడం, వంట చేయడం కూడా కష్టమై, కేర్ హాస్పిటల్లో అర్థరైటీస్ డాక్టర్ మందులు, ఇంజెక్షన్స్ ఇచ్చిన తక్కువ కాక పోగా, ఫిజియోథెరపీ వైద్యం ప్రారంభించమన్నారు. దానితో మీకు నయం కాకపోతే భుజం జాయింట్ మధ్య ఇంజెక్షన్ ద్వారా గుజ్జును పెంచవచ్చు లేదా ఆపరేషన్ చేయవలసి రావచ్చు అన్నారు. నేను ముందుగా నమ్మలేదు. ఒక రెండు వారాల్లోనే ఫిజియోథెరపీ వల్ల భుజం నొప్పి చాలా వరకు తగ్గింది.


మేము ఖమ్మంలో ఉద్యోగ రీత్య అక్కడ ఉన్నప్పుడు ఫిజియోథెరఫీ (భౌతిక చికిత్స) వైద్యంలో ప్రత్యేక హాస్పిటల్, స్పెషలిస్ట్ పేరు గుర్తులేదు కానీ అక్కడి వైద్య సేవలు ఇప్పటికీ మరువలేను. జబ్బు బాధ కన్నా, మంచి ధైర్యం, సంతోషంతోనే తొందరగా భుజం నొప్పి తగ్గిపోయింది. మందులు లేని, చిన్న ఆవిరి యంత్రం, ఆయింట్మెంట్ సహాయంతో, స్కాన్ చేయడం, వేడి ఆవిరి బట్టతో నొప్పిని తగ్గించారు. భుజం కదిలించడానికి కొన్ని వ్యాయామాలు చేయించేవారు. పరికరాల సహాయంతో చేతిని రౌండ్ గా తిప్పడం, బరువులు పట్టించడం మాత్రమే చేయించారు.


ఫిజియోథెరఫీ ఒక శారీరక చికిత్స. ఎటువంటి మందుల ప్రమేయం లేని చికిత్స. అనారోగ్యం, గాయం లేదా ఎముకలు విరిగినపుడు వాటి విధులను సక్రమంగా చేయనప్పుడు తిరిగి వాటిని పునరుద్ధరించడం, ప్రమాదాల బారిన పడ్డ తరువాత బాధను తగ్గించడానికి మందుల అవసరం లేకుండా చేసే చికిత్స. భౌతిక వ్యాయామాలు (ఫిజికల్ ఎక్సర్సైజ్) గా చెప్పవచ్చును. వ్యాధి కారణంగా శరీరంలో రుగ్మత ఎదుర్కోవటానికి నివారణ, రోగ నిర్ధారణలను చికిత్స ద్వారా శారీరక వైకల్యాన్ని నివారించడానికి, ఒక వ్యక్తికి పునరావాసం కల్పించే ప్రక్రియ. అన్ని వయసుల రోగులకు ఫిజియోథెరఫీ చేయవచ్చును.


వివిధ రకాల శస్త్ర చికిత్సల అనంతరం రోగుల జీవనవిధానం మెరుగు పరచడంలో ఈ భౌతిక వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎలాగంటే రోగి ఎవరిమీదా ఆధార పడకుండా తన పనులు సొంతంగా చేసుకునేలా ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. మునుపటి ఉత్సాహంతోపాటు స్వీయ విశ్వాసాన్ని అందిస్తుంది.


వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ళు, కాళ్ళు నొప్పుల సమస్య మొదలయ్యింది. అదే అర్థరైటీస్. జాయింట్ల మధ్య ఇన్ఫెక్షన్ కారణంగా కార్టిలేజ్ అనే పదార్థంతో పాటు లూబ్రికెంట్ గా ఉపయోగపడే ఒక రసాయనం కూడా తగ్గిపోతుంది. అందుకే కీళ్ల నొప్పులు అధికమవుతాయి.


ఆర్థరైటిస్ నాలుగు రకాలు:

* మొదటిది ఆస్ట్రియో ఆర్థరైటిస్

* రుమటాయిడ్ ఆర్థరైటిస్

* గౌట్ ఆర్థరైటిస్

* ఆంకిలోజింగ్ ఆర్థరైటిస్


ఆస్ట్రియో ఆర్థరైటిస్:- కీళ్లపై అధిక బరువు పడడం వల్ల ఆస్ట్రియో ఆర్థరైటిస్ సంక్రమిస్తుంది. నిద్ర లేవగానే కీళ్ళు గట్టిపడి మోకాళ్ళు, మోచేతుల కీళ్ళ నొప్పులు ఉంటాయి. వంశ పారంపర్యంగా వస్తుంది. వెయ్యి మందిలో ఒకరికి వస్తుంది. స్త్రీలలో అధిక శాతం వస్తుంది.


గౌట్ ఆర్థరైటిస్:- రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వస్తుంది. స్త్రీలకన్నా పురుషులలో ఎక్కువ. రక్తంలోని అధిక యూరిక్ యాసిడ్ కీళ్ళ లోనికి చొచ్చుకుని పోయి, ఆయా భాగాలలో వాపు వస్తుంది. ఆంకిలోజింగ్ ఆర్థరైటిస్ వెన్నెముకలో తీవ్ర నొప్పి ప్రారంభమై ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. ఇరవై ఏళ్ల యువకులలో ఈ వ్యాధి ఎక్కువ. వ్యాయామం వల్ల ఈ వ్యాధి సమస్యని పరిష్కరించవచ్చు.


కారణాలు:- వయసు పైబడిన వారిలో ఎక్కువగా కీళ్ళ నొప్పులు, స్మోకింగ్, ఆల్కాహాల్, జంక్ ఫుడ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జీవక్రియలో మార్పు, శరీరంలో తయారయ్యే రసాయనాల, హార్మోన్స్ సమతుల్యత, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి.


ఎండలో నిలబడాలి:- ఎముకలు గట్టిపడడం కాల్సియం మాత్రమే అవసరమనుకుంటారు. విటమిన్ D కూడా తోడు కావాలి. సూర్యరశ్మి, ఉదయం సూర్య కాంతికి కొంత సేపయినా ఉండాలి.


ముందు జాగ్రత్తలు:- శరీర బరువును నియంత్రించుకోవడం, కీళ్లపై ఎక్కడ ఒత్తిడి పడకుండా చూసుకోవడం మంచిది. ఈ సమస్య ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలు, క్యాబేజి, ఆకుకూరలు, సోయాబీన్, కాల్సియం గల ఆహారం, కీరా, బొప్పాయి, చేపలు, గ్రుడ్లు, పండ్ల రసాలు బాగా తీసుకోవాలి. సరిఅయిన సమయంలో ఆహారం, నిద్ర తప్పనిసరి. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.


శుభం


యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page