భ్రాంతి
- Nandyala Vijaya Lakshmi

- Jun 19
- 3 min read
భ్రాంతి కథ, తెలుగు బాలల కథ, తాత మనవడు కథ, దెయ్యాల కథ, భయం మరియు అపోహలు, తెలుగు నీతి కథ, నంద్యాల విజయలక్ష్మి కథ, తెలుగు చిన్న కథ, కుటుంబ కథ, పిల్లల కథ

Bhranthi - Telugu Inspirational Story | Nandyala Vijaya Lakshmi
భ్రాంతి - తెలుగు ప్రేరణాత్మక కథ | నంద్యాల విజయలక్ష్మి
Published in manatelugukathalu.com on 19/06/2026
భయం చాలా సార్లు బయట ఉండదు... మన మనసులోనే ఉంటుంది. తాత మనవడు మధ్య జరిగే ఒక చిన్న సంఘటన ద్వారా భయం, అపోహ, ఊహాశక్తి ఎలా పనిచేస్తాయో చక్కగా చూపించిన కథ "భ్రాంతి". సరదా హాస్యంతో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని అందించే ఈ కథ పిల్లలకు, పెద్దలకు సమానంగా నచ్చుతుంది.
అనగనగా ఒక ఊరిలో ఒక తాత, మనవడు తీరుబడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఈ రోజుల్లో పిల్లలు వేసవి సెలవుల్లో కూడా తాత, అమ్మమ్మల ఇంటికి వెళ్లి సరదాగా గడపటం తగ్గిపోయింది. ముందు రోజుల్లో తాతా, మనవల బంధం ఇలా ఉండేది అని కథలా చెప్పవలసి రావచ్చు.
ఈ కథలో తాత మనవడితో సంతోషంగా ఆడుకుంటాడు, కబుర్లు, వింతలు, విశేషాలు చెబుతాడు.
అందుకని ఒకరోజు మనవడు రాజేష్ తాతను ఒక కథ చెప్పమని అడిగాడు. తాత ఒక షరతు పెట్టాడు.
"నేను కథ చెబుతున్నంతసేపు నువ్వు 'ఊ' కొట్టాలి. లేకపోతే కథ ఆపేస్తా" అన్నాడు తాత రామారావు.
"ఓస్ అంతే కదా! నువ్వు మంచి కథ చెప్పు" అన్నాడు రాజేష్.
“ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. కలిసే ఆడుకుంటారు, చదువుకుంటారు. వారి పేర్లు రవి, రాము.”
"ఊ..." ఆ తర్వాత చెప్పు? అని అడిగాడు రాజేష్.
“ఎండాకాలం నీటికి కరువు ఆ ఊరిలో. అందుకని అందరూ నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. కరెంటు కూడా కోత ఉంది.”
"ఊ" అన్నాడు రాజేష్.
“ఊరికి ఉన్న సమస్యను సంబంధిత అధికారులకు చెబితే పరిష్కారం చేస్తారు కదా అని ఆలోచించి రాము, రవి ఆ ఊరి కలెక్టర్ గారికి వినతి పత్రం పోస్ట్ చేశారు.
"ఊ..."
తాత రామారావుకి అనుమానం వచ్చింది. రాజేష్ మంచి నిద్రపోతున్నాడు. మరి ఇప్పుడు "ఊ" అన్నది ఎవరు? దెయ్యమేమో? చుట్టూ చూశాడు, ఎవరూ కనిపించలేదు.
చెట్టుమీద కీచురాయి గట్టిగా అరిచింది. ఎండుటాకుల చప్పుడు, ఎవరో పరుగెడుతూ వస్తున్నట్లు శబ్దం. ఒక్కసారి రామారావు ఉలిక్కిపడ్డాడు.
చింతచెట్టు మీద దెయ్యాలు ఉంటాయి అంటారు. ఏది ఏమైనా అక్కడి నుండి తొందరగా వెళ్లాలి అనుకుని రాజేష్‌ను లేపడానికి ప్రయత్నించాడు.
"తాతా కథ అయిపోయిందా?" లేవబోతూ అడిగాడు రాజేష్.
"కథ ఇప్పుడే మొదలైంది! దెయ్యం మన వెనకాల పడుతున్నట్లు అనిపించింది" అన్నాడు కొంచెం ధైర్యం తెచ్చుకుని.
"అవునా? నాకు దెయ్యాన్ని చూడాలని ఉంది. కొంచెం సేపు అయ్యాక దెయ్యాన్ని చూసి పోదాం."
ఉలిక్కిపడ్డాడు రామారావు. "పద! పద! భయపడి చస్తుంటే దెయ్యాన్ని చూస్తాడట ఈ ధీరుడు!"
అకస్మాత్తుగా రామారావు భుజంపై ఒక చెయ్యి పడింది.
"నేనే సోమయ్యని. పట్నంలో ఆలస్యమైంది. ఒక్కడినీ ఎలా రావాలా అనుకున్నా. సమయానికి మీరు కనిపించారు" అన్నాడు.
"అవును, మీరు చీకటి పడేదాకా ఎందుకు ఉన్నారు?"
రాజేష్ వెంటనే, "తాత దెయ్యాన్ని చూపిస్తాడు అనుకున్నా" అన్నాడు.
రామారావుకు తన పిరికితనం మీద తనకే కోపం వచ్చింది. ఇంతలో సోమయ్య, "దెయ్యాలు ప్రత్యేకంగా ఉండవు. మనతోనే ఉండి మనల్ని ఏడిపించే వాళ్లే అసలైన దెయ్యాలు" అన్నాడు.
ఈసారి సోమయ్య మాటలు విన్నాక, తనది భ్రాంతి అని రామారావుకు అర్థమైంది.
"నాకు ముందే తెలుసు దెయ్యాలు లేవని. సరదాగా తాతని భయపెడదామనుకున్నా" అంటూ రాజేష్ ఇంట్లోకి పరుగెత్తాడు.
ఈ మాటలకు ఉలిక్కిపడ్డాడు రామారావు. మనవడి మాటలకు "ఊ" కొట్టాల్సిందే అనుకున్నాడు.
***
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి
చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను .
రెండు వందలపైగా కవితలు మూడుకథానికలు రాసాను
యాభై పైగా సర్టిఫికెట్స్ సహస్రకవిమిత్ర బిరుదు పొందాను .
పుస్తకపఠనము పై నాకు ఆసక్తి .
విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను .ఇంకా ఎన్నో చదవాలని కోరిక .




Comments