చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు
- Patrayudu Kasi Viswanadham
- 18 hours ago
- 4 min read
చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు, తెలుగు కథలు, తెలుగు నీతి కథలు, బాలల కథలు, moral stories telugu, educational story, students motivation, inspirational telugu story, village story telugu, proverb meaning telugu, telugu children stories

Chaduvurani Moddu Kadalleni Eddu - Telugu Inspirational children Story | Patrayudu Kasi Viswanadham
చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు - తెలుగు ప్రేరణాత్మక పిల్లల కథ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 19/07/2026
"ఒక చిన్నారి... అందరికంటే వెనుకబడింది. కానీ నేర్చుకోవాలనే ఒక్క నిర్ణయం ఆమెను అందరికీ ఆదర్శంగా మార్చింది. ఎలా? హృదయాన్ని తాకే కాశీవిశ్వనాథం పట్రాయుడు గారి చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు కథలో తెలుసుకుందాం."
చుట్టూ ఎత్తైన కొండలు... పక్కనే గలగల పారే గోస్తనీ నది... కాలుష్యానికి దూరంగా పచ్చని ప్రకృతి ఒడిలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలోని చాలామంది రైతులు, రైతు కూలీలే.
ఆ గ్రామంలో జున్నుబాబు, సంకల్ప, ప్రతిష్ఠ, ప్రవేశ మంచి స్నేహితులు. ప్రతిరోజూ బడి నుంచి ఇంటికి రాగానే కాసేపు కలిసి ఆడుకునేవారు. ఆ తర్వాత అమ్మానాన్నలకు ఇంటి పనుల్లో సాయం చేసేవారు.
సాయంత్రం చీకటి పడగానే ఇంటి ముందున్న వీధి దీపం కింద అందరూ చేరి చదువుకునేవారు. బడిలో చెప్పిన పాఠాలను ఒకరికొకరు చెప్పుకునేవారు.
ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేసేవారు. చదువులో ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవారు.
జున్నుబాబు అందరిలో పెద్దవాడు. తెలివైనవాడు, చురుకైనవాడు. ఎవరికైనా ఏ సందేహం వచ్చినా ఎంతో ఓర్పుతో వివరించి చెప్పేవాడు.
ఒకరోజు అందరూ చదువుకుంటూ ఉండగా, చిన్నదైన ప్రవేశ మాత్రం తన పుస్తకాలు తీయకుండా దిగులుగా కూర్చుంది.
అది గమనించిన జున్నుబాబు, “ఏమైంది ప్రవేశా? ఎందుకు అలా ఉన్నావు?” అని ప్రేమగా అడిగాడు.
ప్రవేశ కళ్లు చెమ్మగిల్లి, “మా తరగతిలో అందరూ నన్ను ‘చదువురాని మొద్దు... కదల్లేని ఎద్దు’ అని ఎగతాళి చేస్తున్నారు” అంటూ బోరున ఏడ్చింది.
జున్నుబాబు ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాడు.“ఏడిస్తే చదువు రాదు ప్రవేశా! ధైర్యంగా ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది” అంటూ తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
ఆ తర్వాత పుస్తకంలో ఉన్న కొన్ని అక్షరాలు, పదాలు, అంకెలు చూపిస్తూ, “ఇవి చదువు చూద్దాం” అన్నాడు.
ప్రవేశ ఒక్కదానికీ సమాధానం చెప్పలేక తలదించుకుంది.
అప్పుడు జున్నుబాబు చిరునవ్వుతో ఇలా అన్నాడు.
“ప్రవేశా! వాళ్ల మాటలు నువ్వు పట్టించుకోవద్దు.చదవడం, రాయడం, లెక్కలు చేయడం, కొలతలు తెలుసుకోవడం మన జీవితంలో చాలా అవసరం.
అవి తెలిసుంటే ఎవరి దగ్గరా మోసపోము. అందరూ మనల్ని గౌరవిస్తారు. నేను ప్రతిరోజూ నీకు నేర్పుతాను. నువ్వు శ్రద్ధగా నేర్చుకో.”
“అయితే... నన్ను ఎద్దు అని ఎందుకు అన్నారు?” అని ప్రవేశ అమాయకంగా అడిగింది.
జున్నుబాబు నవ్వుతూ “కాదు ప్రవేశా! నిన్ను ఎద్దుతో పోల్చలేదు. చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు అనేది ఒక సామెత.” అని చెప్పాడు.
పొలం దున్నడానికి, బండి లాగడానికి ఎద్దు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ అదే ఎద్దు కదల్లేకపోతే ఎవరికీ ఉపయోగపడదు. అలాగే చదువు లేకపోతే మనలో ఎంత ప్రతిభ ఉన్నా అది బయటపడదు.
అందుకే చదువు లేకపోతే మన ప్రతిభ వెలుగులోకి రాదనే భావాన్ని చెప్పడానికి మన పెద్దలు 'చదువురాని మొద్దు కదల్లేని ఎద్దు' అనే సామెత చెప్పారు.
అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో... చదువు రాకపోవడం తప్పు కాదు. నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవడమే తప్పు. శ్రద్ధగా ప్రయత్నిస్తే ఎవరైనా బాగా చదువుకోగలరు. ఈ రోజు రానిది రేపు వస్తుంది.”
ఆ మాటలు విన్న ప్రవేశ ముఖంలో చిరునవ్వు మెరిసింది.
“ఇక నుంచి ప్రతిరోజూ నీ దగ్గర చదవడం, రాయడం నేర్చుకుంటాను. బాగా చదువుకుని అందరికీ నా ప్రతిభ చూపిస్తాను,” అని ధైర్యంగా చెప్పింది.
ప్రవేశలో వచ్చిన మార్పు చూసి సంకల్ప, ప్రతిష్ఠ ఎంతో సంతోషించారు. స్నేహితులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు.
నీతి:చదువు మనిషికి వెలుగు. నేర్చుకోవాలనే ఆసక్తి, శ్రద్ధ ఉంటే ఎవరైనా విజయం సాధించగలరు.
సమాప్తం
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి కొన్ని ఇతర రచనలు:
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi Viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷
పట్రాయుడు కాశీవిశ్వనాథం, Goranta Deepam Kondanta Velugu, గోరంత దీపం - కొండంత వెలుగు, moral story telugu |





