top of page
Original_edited.jpg

చివరి కోరిక - పార్ట్ 6

#MadduriBindumadhavi, #మద్దూరిబిందుమాధవి, #ChivariKorika, #చివరికోరిక, #TeluguWebSeries

ree

Chivari Korika - Part 6 - New Telugu Web Series Written By Madduri Bindumadhavi Published In manatelugukathalu.com On 23/11/2025

చివరి కోరిక - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక

రచన: మద్దూరి బిందుమాధవి 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ:

'శాంతి మహిళా సేవా సంస్థ' వార్షికోత్సవం లో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి. మెడికల్ చెకప్స్ లో ఆమె భర్త సత్యానికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలుస్తుంది. సుందరికి ఆసరాగా ఉన్న మరిది విశ్వాన్ని దూరంగా ఉంచమంటారు బంధువులు. 

ఇక చివరి కోరిక - పార్ట్ 6 చదవండి.


ఆ రోజు సత్యంకి .. చుట్టరికం దూరమే కానీ స్నేహం ఎక్కువ అయిన గోపాల్ కొడుకు పెళ్ళి. సుందరిని తప్పక రావలసిందిగా ఆహ్వానించాడు. 

ఆడ పెళ్ళివారు సుందరి పుట్టింటి వైపు చుట్టాలు. 


సుందరికి రెండువైపులా ఉన్న పరిచయం, చుట్టరికం వలన పెళ్ళికి వచ్చింది. 

పెళ్ళి కొడుకు, రుద్రకి భార్య వైపు చుట్టరికం తో పాటు మంచి స్నేహితుడు కూడా . 

అంచేత అతను కూడా పెళ్ళికొచ్చాడు. పెళ్ళి కూతురు తరఫు వారు రుద్రకి అంతగా తెలియదు. 


ఆ పెళ్ళికి సుందరి చిన్న తాతగారి మనవడు..పరమేశ్వరం కూడా వచ్చాడు. అతను వరసకి సుందరికి తమ్ముడవుతాడు.


సత్యం చిన్న తనంలో చనిపోవటం తో సుందరి ఇరుగు పొరుగు ఇళ్ళకి వెళ్లి అవమాన పడటం ఇష్టం లేక వెళ్ళేది కాదు. అలాగే పెళ్లిళ్లకి, ఇతర వేడుకలకి వెళ్ళటం  కూడా తక్కువే! పుట్టింటికి వెళ్ళినా రెండు-మూడు రోజులు ఉండి వచ్చేసేది. అందువల్ల ఈ మధ్యకాలంలో సుందరి కి వరసకి తమ్ముడైన పరమేశ్వరం ఆమెని  చూడ లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ....చాలా ఏళ్ళ తరువాత కనిపించిన రుద్రని కూడా వెంటనే పోల్చుకోలేకపోయాడు.


అందరి పలకరింపులని బట్టి సుందరి  కొడుకు రుద్ర గా గ్రహించి ఆప్యాయంగా భుజమ్మీద చెయ్యి వేసి "నన్ను గుర్తు పట్టావా? నేను మీ అమ్మ కజిన్.. అంటే నీకు మామయ్యని. నన్ను పరమేశ్వరం అంటారు. అందరూ కులాసాయేనా? మీ అమ్మ ...అదే నా అక్క సుందరి ఎలా ఉన్నది?" అని అడిగాడు. 


అన్నేళ్ళు గడిచినా రుద్ర కి తల్లి పట్ల ద్వేష భావం ఏమాత్రం తగ్గలేదు. మొహాన గంటు పెట్టుకుని.....అది అవతలి వారు గ్రహించకుండా తలపక్కకి తిప్పి "లేదు-చనిపోయింది" అని చెప్పి గబ గబా అక్కడినించి వెళ్ళిపోయాడు. 

రుద్ర సమాధానానికి పరమేశ్వరం అవాక్కయ్యాడు. 

ఆ పక్కనే అమ్మలక్కల మధ్య కూర్చున్న సుందరికి, కొడుకు సమాధానం వినేసరికి కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. భర్త పోయి ముప్ఫై సంవత్సరాలు గడిచినా ఆ సంఘటన సుందరి మనసులో పచ్చిగా ఇంకా అలాగే ఉన్నది. 


తను ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బాధపడుతున్నా.. భర్త "అభీష్టం"  నెరవేర్చటానికి నలుగురి మధ్యలో "సువాసిని" లాగా కనిపించటం...మిగిలిన వారికి కంటకింపుగా ఉన్నదని సుందరికి తెలుసు. 


ఇవేమీ పట్టించుకోకుండా ..కన్న బిడ్డ కంటే ఎక్కువైన మరిది -తోటికోడలు తనకి అండ దండలుగా ఉండి ఇప్పటివరకు తనని-తను కన్న పిల్లలని  కాపాడుతున్నారు. ఇవన్నీ మదిలో సుడులు తిరుగుతుండగా కళ్ళొత్తుకుంటూ అక్కడినించి లేచి వెళ్ళిపోయింది. 

******

ఆడది అందంగా ఉండటం శాపమా? 

చనిపోయిన భర్త ‘చివరి కోరిక’ నెరవేర్చటం దోషమా? 

విధి వంచితలైన ఆడ వారికి స్వంత కుటుంబ సభ్యులే అండదండలుగా నిలబడటం నేరమా? 


భర్తని పోగొట్టుకున్న ఆడది పవిత్రం గా బ్రతకలేదా? 

తోడు లేని ఆడది తప్పని సరిగా గీత దాటి తీరాలని సమాజం కోరుకుంటుందా? లేక గీత దాటి తీరుతుందని ఒక తీర్పుని ఇచ్చేస్తుందా?


ఒంటరిగా బ్రతకటం ఆడకైనా మగకైనా కష్టం అని చిన్న వయసులో తెలుసుకోలేని రుద్ర లాంటి చిన్న పిల్లల మనసులు కలుషితమై పోయేటంత గా విమర్శించిన సమాజం(అందులోను  పిన్ని గారి లాంటి స్వంత కుటుంబ సభ్యులు కూడా) ఒక్క రోజైనా వీరికి అండగా నిలబడిందా? 


ఇదే సుందరి.. అంత చిన్న వయసులో భర్తని పోగొట్టుకుని ....పిల్లల పెంపకం కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుని ఇంకొకరి నీడన చేరి ఉంటే హర్షించి నోరు మూసుకునేదా? 

తమకిష్టం వచ్చినట్లు మాట్లాడగలిగే స్వాతంత్ర్యం ఇతరులకి ఉన్నప్పుడు..తన మానాన బ్రతికే  స్వాతంత్ర్యం తనకి లేదా? 


ఏమో ఇలాంటి పరిస్థితులు, ఎవరికైనా సర్వజనామోదమైన ఒకే ఒక్క సమాధానాన్ని ఇవ్వగలవా? అని పరి పరి విధాల ఆలోచిస్తూ ఏభై అయిదేళ్ళ సుందరి భుజాల నిండుగా కొంగు కప్పుకుని కళ్ళల్లోంచి కిందికి దూకుతున్న ప్రవాహాన్ని రుమాలుతో తుడుచుకుంటూ ఇల్లు చేరింది. 

===============================================

                                                 ఇంకా వుంది..


                                      చివరి కోరిక - పార్ట్ 7 (చివరి భాగం ) త్వరలో..

===============================================


మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :  ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


ree



ree



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page