కోడింగ్ నుండి కోళ్లఫారం దాకా
- Kotha Viritha

- Jun 8
- 3 min read
తెలుగు వ్యాసం, విద్యా వ్యవస్థ, ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ జీవితం, యువత కెరీర్, కోడింగ్, కోళ్లఫారం, స్వయం ఉపాధి, ఉద్యోగ ఒత్తిడి, ఇంజనీరింగ్ విద్య, ఆధునిక విద్య, తెలుగు రచనలు, కెరీర్ వ్యంగ్యం

Coding Nundi Kolla Form daka - Telugu Inspirational Article | Kotha Viritha
కోడింగ్ నుండి కోళ్లఫారం దాకా - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 08/06/2026
చదువు, ఉద్యోగం, కెరీర్... ఒకప్పుడు ఇవి జీవితాన్ని నిర్మించే మార్గాలు. కానీ నేడు అవే ఒత్తిడి, అప్పులు, అనిశ్చితి, నిరంతర పోటీకి చిహ్నాలుగా మారుతున్నాయా? చిన్ననాటి నుంచే కోడింగ్, రోబోటిక్స్, ఎంట్రన్స్ పరీక్షలతో పరుగులు పెట్టే విద్యార్థి, ఉద్యోగ జీవితంలోకి వచ్చేసరికి ఎందుకు మరో మార్గం కోసం వెతుకుతున్నాడు? ఆధునిక విద్యా వ్యవస్థ, ఐటీ ఉద్యోగ సంస్కృతి, యువత ఆలోచనల్లో వస్తున్న మార్పులపై వ్యంగ్యంతో కూడిన ఆలోచింపజేసే వ్యాసం.
ఒకప్పుడు చదువు అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు చదువు అంటే ఏ కోర్సులో ఎంత ఫీజు కట్టాలో అర్థం చేసుకోవడం. ఎల్‌కేజీకి లక్షలు, యూకేజీకి యూనివర్సిటీ ఫీజులు. మూడో తరగతి నుంచే ఏఐ, కోడింగ్, రోబోటిక్స్, స్పేస్ సైన్స్. పిల్లాడికి ఇంకా "అమ్మ" స్పెల్లింగ్ సరిగా రాకపోయినా, భవిష్యత్తులో నాసాకు పంపించే ప్లాన్ మాత్రం రెడీ.
ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు బోర్డులు, ఒలింపియాడ్లు, ఫౌండేషన్లు, ఎంట్రన్స్‌లు. చదువు కంటే పరీక్షలే ఎక్కువ. విద్యార్థి కన్నా తల్లిదండ్రులే ఎక్కువగా టెన్షన్ పడే వ్యవస్థ. ఇంటర్‌లో రెండు సంవత్సరాలు పుస్తకాలతో యుద్ధం. ఉదయం టెస్ట్, సాయంత్రం గ్రాండ్ టెస్ట్, ఆదివారం మెగా టెస్ట్. చివరికి మార్కులు బాగానే వస్తాయి కానీ "నాకు ఏమి ఇష్టం" అనే ప్రశ్నకు సమాధానం మాత్రం రాదు.
ఇంజనీరింగ్‌లో చేరాక కొత్త కథ. నాలుగేళ్లు చదివేసరికి మార్కెట్‌లో టెక్నాలజీ మరో నాలుగు సార్లు మారిపోతుంది. కాలేజీలో నేర్చింది ఒకటి, కంపెనీ అడిగేది ఇంకోటి. అప్పుడు మొదలవుతుంది కోర్సుల పరంపర. ఫుల్ స్టాక్, డేటా సైన్స్, క్లౌడ్, ఏఐ, డేవాప్స్; జాబ్ కోసం కోర్సు, కోర్సు కోసం లోన్, లోన్ కట్టడానికి జాబ్. లక్షలు ఖర్చు పెట్టి కోర్సులు చేసినా, చివరికి వచ్చే జీతం చూస్తే ఈఎంఐకే సరిపోదు. పని ఒత్తిడి మాత్రం సీఈఓ స్థాయిలో ఉంటుంది. జీతం జూనియర్ స్థాయిలో ఉంటుంది.
ఉదయం లాగిన్, రాత్రి లాగౌట్. మధ్యలో మీటింగ్స్, డెడ్ లైన్స్, ఎస్కలేషన్స్. ఉద్యోగం చేస్తున్నామా లేక సాఫ్ట్‌వేర్‌కి బానిసలమయ్యామా అన్న సందేహం వస్తుంది. ఇదంతా చూసి కొందరు యువకులు ఇప్పుడు కొత్త గణితం నేర్చుకుంటున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్, రెండు లక్షల కోర్సులు, ఐదు సంవత్సరాల అనుభవం తర్వాత వచ్చే జీతం కంటే, ఒక చిన్న వ్యాపారం, ఆటో రిక్షా నడపటం లేదా కోళ్లఫారం మెరుగేమో అని లెక్కలు వేస్తున్నారు.
ఇంకొన్ని సంవత్సరాల్లో "నువ్వేం చేస్తున్నావు" అని అడిగితే,"కోడింగ్ చేశా,ఇప్పుడు కోళ్లఫారం పెడుతున్నా" అని గర్వంగా చెప్పే రోజులు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.




Nice, it's a replica of present corporate jobs.No garranty of employment and life becomes uncertain and hence frustration
Nyc viritha garu..its xplaining the genuine feelngs of corporate emplys these days
Brilliant Article loved it..keep writing more❤️
Brilliant Article amma
Nice Article Akka❤️