top of page
Original.png

దేవుడికంటే గొప్పది తల్లి హృదయం


www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'దేవుడికంటే గొప్పది తల్లి హృదయం' కథలో కొడుకు క్షేమం కోసం మండే ఎండలో ఆవులను వెతుకుతూ తిరుగుతున్న వృద్ధ తల్లి ప్రేమను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'దేవుడికంటే గొప్పది తల్లి హృదయం' కథలో కొడుకు క్షేమం కోసం మండే ఎండలో ఆవులను వెతుకుతూ తిరుగుతున్న వృద్ధ తల్లి ప్రేమను ప్రతిబింబించే భావోద్వేగ దృశ్యం.

Devudikante Goppadi Thalli Hrudayam - Telugu Emotional Story | Routhu Srinivasa rao

దేవుడికంటే గొప్పది తల్లి హృదయం - తెలుగు భావోద్వేగ కథ | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 14/06/2026


శనివారం…

Half day ఆఫీస్‌.


నిన్న, మొన్న ఎండలు చూస్తుంటే…

ఈ పేద ప్రజలు, ముసలివాళ్లు, కష్టజీవులు ఎలా బతుకుతారో అనిపించింది.


సాయంత్రం వర్షం పడింది…

కానీ ఈరోజు కూడా ఎండ మాత్రం కరుణ లేకుండా మండుతోంది.


ఆఫీస్‌ నుంచి కిందకి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేస్తుంటే…

ఒక ముసలమ్మ చేతి ఊపి నన్ను పిలిచింది.


మా ఆఫీస్ ముందు అంతా కాంక్రీట్‌…

పచ్చని మొక్కలు కూడా కనిపించని వేడి ప్రపంచం.

ఆ మండే ఎండలో…

ఆమె ఒంటరిగా నిలబడి ఉంది.


దగ్గరకి వెళ్లాను.

“బాబూ… దగ్గరలో ఎక్కడైనా ఆవులు కనిపిస్తాయా?” అని అడిగింది.


ఆమెని చూసిన క్షణం…

నా గుండె కదిలిపోయింది.


డెబ్బై… ఎనభై ఏళ్ల వయసు.

ముఖం నిండా చెమట.

శరీరంలో శక్తి లేదు.

ఇంకో గంట ఆ ఎండలో ఉంటే వడదెబ్బ తగిలే పరిస్థితి.


నేనే ఆ ఎండని భరించలేకపోతున్నాను…

అలాంటి సమయంలో ఆమె మాత్రం…

ఆవుల కోసం తిరుగుతోంది.


“ఎందుకమ్మా ఈ ఎండలో?” అని అడిగాను.


ఆమె కళ్లలో ఒక్కసారిగా తల్లిప్రేమ మెరిసింది.

“బాబూ… ఈరోజు పూజ చేశాను.

శనగలు ఆవుకి తినిపించాలి.

మా అబ్బాయి మంచిగా ఉండాలి…” అంది.


ఆ మాట విన్నాక…

నా గొంతు ఆగిపోయింది.


ఆమెకు తన ఆరోగ్యం గుర్తు లేదు.

ఆ ఎండ గుర్తు లేదు.

ప్రాణం ప్రమాదంలో ఉందన్న భయం లేదు.


ఒక్క ఆలోచన మాత్రమే…

“నా కొడుకు బాగుండాలి…”


నా పక్కనే ఉన్న సతీష్‌ని చూసి…

“చూడు తమ్ముడు… తల్లి ప్రేమ అంటే ఇదే…” అన్నా...


మేమిద్దరం ఆమెను ఎక్కించలేక బాధపడ్డాం.

చివరకు అక్కడ పని చేస్తున్న ఒక కుర్రాడిని అడిగాము.


అతను వెంటనే స్పందించాడు.

“ఎండలో తిరుగుతుంటే వడదెబ్బ తగులుతుంది బాబూ… ఎక్కించండి…” 


ఆ కుర్రాడు ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

దేవుడి దయ వల్ల అక్కడ ఆవులు ఉంటే…

ఆమె చేతితో ఆవుకి శనగలు పెట్టి ఉండొచ్చు.

ఆ క్షణంలో ఆమె గుండెకు ఎంత తృప్తి కలిగిందో దేవుడికే తెలుసు.


కానీ నాకు మాత్రం…

ఈ సంఘటన మనసుని బాగా కలిచేసింది.


కథల్లో విన్నాను…

“కన్నప్రేగు” అని.

ఎన్నోసార్లు చూశాను కూడా.

కానీ ఈరోజు…

ఆ తల్లి ప్రేమని ఎండ మధ్యలో నిలబడి ప్రత్యక్షంగా చూసాను.


దేవుడు గొప్పవాడు అంటారు…

కానీ దేవుడికంటే గొప్పది తల్లి హృదయం.


దేవుడు ఆత్మని సృష్టిస్తాడు…

తల్లి ఆ ఆత్మకి రూపం ఇస్తుంది.

పంచభూతాలు మనల్ని పెంచుతాయి…

కానీ మనం పడిపోతే ముందుగా ఏడ్చేది మాత్రం తల్లే.


తన కడుపు మండినా…

మన జీవితం చల్లగా ఉండాలని కోరుకునేది తల్లే.


అందుకే…

ఈ ప్రపంచంలో దైవం తర్వాత కాదు…

దైవం కంటే ముందుగా నిలబడేది — “తల్లి”.


అమ్మలందరికీ నా హృదయపూర్వక వందనాలు


                   ***************************************


రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు

నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page