గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 3

Gouri Sankarula Samvadam - Part 3 - Telugu Devotional Story | Bhaskara Rao B. R. K. V.
గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 3 - తెలుగు ఆధ్యాత్మిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 28/09/2026
గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 3 చదవండి.
మహాభారతం ఆధారంగా శ్రీ బి. ఆర్. కె. వి. భాస్కరరావు గారు అందిస్తున్న గౌరీ శంకరుల సంవాదం – పార్ట్ 3లో పరమశివుని విశిష్ట రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను పార్వతీదేవి ప్రశ్నల ద్వారా తెలుసుకుంటాం. శివుడు సుందరమైన నివాసాలను వదిలి స్మశానంలో ఎందుకు ఉంటాడు? భూతిపూత, ఎముకల దండ, శూలం వంటి వాటితో భయంకర రూపాన్ని ఎందుకు ధరించాడు? చంద్రుణ్ణి ప్రేమగా శిరస్సుపై ఎందుకు ఉంచుకున్నాడు? అనే ప్రశ్నలకు పరమేశ్వరుడు ఇచ్చిన సమాధానాలు ఈ భాగంలో చదవండి.
పరమేశ్వరి పరమేశ్వరుణ్ణి, "గొప్ప గొప్పవి, సాటిలేని సౌందర్యములైన నివాసాలు వదలి తమరు అపరిశుభ్రములైన, ఎముకలు, పుర్రెలు, దుర్వాసన భూయిష్టమైన మరియు చూడరానిది అయిన స్మశానంలో ఉండటానికి కారణం చెప్పండి?" అని అడిగింది.
దానికి కపర్ది, "క్రూరభూతాలు జనులను వధించడం వల్ల సమస్త జనాలు నశించడంతో, బ్రహ్మ తెలుసుకుని నా వద్దకు వచ్చి దానికి తగిన ప్రతిక్రియ చేయమని వేడుకున్నాడు. ఆ ప్రార్థన మన్నించిన నేను ఒక ప్రదేశంలో నిలిచి లోకాలను కాపాడాలని భావించాను. మోక్షమందు ఆసక్తి లేని వారు పవిత్రమైన స్థానంగా స్మశానాన్ని పొగుడుతారు. కనుక నాకు వల్లకాటి మీద మనసు కలిగి ఉండటానికి నిర్ణయించుకున్నాను. అక్కడే ఉండి లోకాలను ఆత్మలో భావించి రక్షణ చేస్తూ ఉంటాను. సమస్త ప్రాణులు ఒకేచోట కలసి తిరుగుతూ ఉండటం చూసి మిక్కిలి వేడుకతో ప్రీతి పొందుతాను. కనుక అది నా నివాసమైనది. దానికి సాటి అయిన నివాసాలు వేరే ఉన్నాయా?" అని సమాధానం చెప్పాడు.
"భూతిపూత, గొడ్డలి, ఎముకల దండ, శూలం అనే ఆయుధాలు ధరించి భయంకర రూపం ఎందుకు ధరించావు నిటళాక్షా?" అని అడిగింది పార్వతి.
"పరమేశ్వరీ! సమస్త లోకమంతా చల్లదనం, వెచ్చదనం అనే రెండు రూపాలతో కూడి ఉంటుంది. చల్లదనాన్ని విష్ణువు, వెచ్చదనాన్ని నేను భరిస్తూ ఉంటాము. ఈ రెండింటిని కలిపిన విశ్వాన్ని నేను వహిస్తూ ఉంటాను. కనుక అగ్ని సంబంధమైన భావంతో నిలిచి ఉన్న ఆకారాన్ని లోకహితం కొరకు దాల్చాను" అని, "ఇంకా ఏమి అడగాలో అడుగు..."
అని మల్లికార్జునుడు అడిగేసరికి...
"నీవు చంద్రుణ్ణి తలపై ప్రేమగా ధరించడానికి కారణం?" అని అడిగింది లలిత.
"దక్షయజ్ఞంలో నేను కోపగించి దేవతలందరినీ హింసించిన సమయంలో చంద్రుణ్ణి అడ్డదిడ్డంగా తొక్కివేశాను. అతను నన్ను శరణు వేడేసరికి మనసులో జాలి కలిగి, అతనికి చేసిన కీడు ఇలా చేస్తే కానీ పోదని భావించి తలపై ధరించాను" అని సమాధానం చెప్పాడు వామదేవుడు.
ఇట్లు చెప్పగా వినిన మునులందరు మహేశ్వరుని గొప్పదనాన్ని మనసులోనే ప్రశంసించి, భక్తితో వేయి నోళ్ల కొనియాడారు.
గౌరీ శంకరుల సంవాదం - పార్ట్ 4 త్వరలో మీ ముందుకు వస్తుంది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి







Comments