top of page
Original.png

ఆయన అంతే…

12 hours ago
4 min read

DP Display Problems తెలుగు హాస్య కథలో సోషల్ మీడియాలో తరచూ డీపీలు, స్టేటస్‌లు పెట్టే దీప్తి మరియు వాటివల్ల ఎదురైన సరదా సమస్యలు, భద్రతా ప్రమాదం

Ayana Anthe - Telugu Family Story | Sritha

ఆయన అంతే… - తెలుగు కుటుంబ కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 28/09/2026


మన చుట్టూ ముక్కుసూటిగా మాట్లాడే, సామాజిక సందర్భాల్లో ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడే మంచి మనుషులు కనిపిస్తుంటారు. అలాంటి శ్రీను గారి అమాయకత్వం, నిజాయితీ, సరదా మాటల చుట్టూ అల్లుకున్న హాస్యభరిత కుటుంబ కథ ‘ఆయన అంతే…’.



1😎

ఆయన అంతే…


"ఆయన అంతే" అనేది ఒక వ్యక్తి కథ కాదు; మన చుట్టూ కనిపించే ఎంతోమంది మంచి మనుషుల కథ. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ఒక "ఆయన" ఉంటారు.


వాళ్లు చెడ్డవారు కాదు. ఎవరికీ హాని చేయరు. తమ పనిలో చాలా తెలివైనవాళ్లు, నిజాయితీ గలవాళ్లు. కానీ నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా మెలగాలో మాత్రం వారికి అంతగా తెలియదు. 


మనసులో ఏది ఉంటే అదే మాట్లాడేస్తారు. చూసేవాళ్లకు నవ్వు వస్తుంది. ఇంట్లో వాళ్లకు మాత్రం కొన్నిసార్లు తలనొప్పి వస్తుంది. చివరకు అందరూ ఒకే మాట అంటారు...

"ఆయన అంతే!"


అలాంటి వారిలో ఒకరు శ్రీను గారు. ఆయన భార్య లక్ష్మి.


ఒకరోజు సాయంత్రం లక్ష్మి వంటగదిలో చపాతీల కోసం పిండి కలుపుతోంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంది.

అంతలో హాల్లో నుంచి...

"లక్ష్మీ... లక్ష్మీ... లక్ష్మీ...!"

అని గట్టిగా కేకలు.


ఆ పిలుపు విన్న లక్ష్మి గుండె ఆగినంత పని అయింది.


"అయ్యో! ఏమైందండీ?" అంటూ పిండి చేతులతోనే పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది.

తీరా చూస్తే...

కిందింటి అక్కగారు తమ అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చారు.


వారిని ఎలా కూర్చోబెట్టాలో, ఎలా మాట్లాడాలో తెలియక శ్రీను గారు కంగారుపడి లక్ష్మిని పిలిచారు.


లక్ష్మిని చూసిన కిందింటి అక్క నవ్వుకుంటూ,

బొట్టు పెట్టి,

"మా అమ్మాయి పెళ్లి. తప్పకుండా రావాలి," అని ఆహ్వానించింది.


అలాగే నిలబడి ఉన్న శ్రీను గారు.

తో లక్ష్మి నెమ్మదిగా,

"కూర్చోమని చెప్పండి..." అంది.


"అలా కూడా చెప్పాలా?" అని అమాయకంగా అడిగారు.


లక్ష్మి తల పట్టుకుంది.

చేతులు కడుక్కొని వచ్చేసరికి శ్రీను గారు...

పెళ్లి మాట పక్కన పెట్టి చదువు, ఉద్యోగం, కంప్యూటర్ల మీద ఉపన్యాసం మొదలుపెట్టేశారు.


లక్ష్మి మనసులో...

"అయ్యో... ఆయన అంతే!"


కొన్ని రోజుల తర్వాత పెళ్లికూతురు కార్యక్రమం.

"మీరు వస్తారా?" అని అడిగింది లక్ష్మి.


"అక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు," అన్నారు.


"నేనున్నాను కదా," అని తీసుకెళ్లింది.


ఫంక్షన్‌కు వెళ్లాక ఆడవాళ్లు లోపల, మగవాళ్లు బయట కూర్చున్నారు.

శ్రీను గారు మాత్రం నిలబడి అటూ ఇటూ చూస్తున్నారు.


"రండి సార్... కూర్చోండి," అని పిలిచారు.


"నమస్కారం," అని ఎవరో పలకరించారు.


ఆయన వెంటనే లక్ష్మివైపు చూశారు.

"ఏం చెప్పాలి?" అన్నట్టుగా.


లక్ష్మి నోటితో "నమస్కారం" అని చెప్పమని సైగ చేసింది.


ఆ తర్వాత టిఫిన్ వచ్చింది.

ఇడ్లీ తింటూ...

"ఒక్క ఇడ్లీకి ఖర్చెంత వస్తుందండీ?" అని అడిగేశారు.


అందరూ నవ్వుకున్నారు.

స్వీట్ పెట్టగానే పక్కవాడిని చూసి,

"మీకు డయాబెటిస్ ఉందా?" అన్నారు.


అతను ఆశ్చర్యంగా చూడగానే,

"ఉంటే ఒకటే తినండి..." అని సలహా కూడా ఇచ్చేశారు.


ఇంతలో ఒక పిల్లవాడు ట్యాప్ తెరిచి వదిలేసి వెళ్లిపోయాడు.

"నీళ్లు వృథా చేయకూడదు బాబూ..." అని ఐదు నిమిషాల క్లాస్ తీసుకున్నారు.


అక్కడున్న పెద్దాయన నవ్వుతూ,

"ఈ బాబు ఇంతే... మనిషి మాత్రం బంగారం!" అన్నాడు.

(కొనసాగుతుంది…)


ఆయన అంతే… (భాగం – 2)


పెళ్లికూతురు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు పెళ్లికి వెళ్లాల్సిన రోజు వచ్చింది.


లక్ష్మి మనసులో మళ్లీ అదే సందేహం.


"ఈయన్ని తీసుకెళ్దామా? లేక నేనే వెళ్లి వచ్చేయాలా?"


ఇంతకుముందు జరిగిన చాలామంది బంధువుల ఫంక్షన్లకు లక్ష్మే ఒక్కతే వెళ్లి వచ్చేది. ఎందుకంటే, అక్కడ ఈయన చేసే కామెంట్లు, అడిగే ప్రశ్నలు, చెప్పే సలహాలు... వాటిని మేనేజ్ చేయడం కంటే ఒంటరిగా వెళ్లి రావడమే సులభం.


కానీ ఇది దగ్గరి బంధువు పెళ్లి.


"ఈసారి మాత్రం ఇద్దరం కలిసి వెళ్దాం," అనుకుంది.


ఇద్దరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు.


ఆశ్చర్యంగా ఆయన గారు వచ్చిన వాళ్లకు కుర్చీలు చూపించడం, పెద్దవాళ్లకు నీళ్లు ఇవ్వడం, ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే సహాయం చేయడం మొదలుపెట్టారు.


అది చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది.


"ఈయనేనా మన ఇంట్లో ఉండే ఆయన?"

కానీ...


ఆయన అంతే


ఆయన అంతే… 3

😎

ఆయన అంతే… – వీడియోగ్రాఫర్ vs శ్రీను గారు


పెళ్లి మండపంలో మంత్రాలు మొదలయ్యాయి. అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు.

వీడియోగ్రాఫర్ కెమెరా భుజాన వేసుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు.


కొద్దిసేపటికి...

"వరుడు గారూ... వధువు గారూ... ఒకరి కళ్లలో ఒకరు చూసుకుని నవ్వండి."


శ్రీను గారు వెంటనే,

"బాబూ... ఇప్పుడే పెళ్లి అవుతోంది. ముందు పెళ్లి కానివ్వు. తర్వాత జీవితాంతం ఒకరినొకరు చూసుకుంటారు."


పక్కనే ఉన్న అత్తయ్య నవ్వుతూ,

"అయ్యో... నిజమే కదా!" అంది.


తాళి కట్టే సమయం వచ్చింది.

పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు.

ఇంతలో మరో కెమెరామెన్,

"సార్... ఒకసారి తాళి కట్టిన తర్వాత మళ్లీ యాక్ట్ చేస్తారా? క్లోజ్ షాట్ కావాలి."


శ్రీను గారు రెండు అడుగులు ముందుకు వచ్చి, "అంటే... ఈ పెళ్లికి కూడా రీటేక్ ఉంటుందా? దర్శకుడు ఎవరు? ముహూర్తం కూడా యాంగిల్ చూసుకుని వస్తుందా?" అన్నారు.


లక్ష్మి వెంటనే ఆయన చేతిని పట్టుకుని,

"అండి... కూర్చోండి."


"నేను నిజమే చెబుతున్నాను."


"అవును... నిజమే. కానీ ఇప్పుడు కాదు."

"సార్... మీరు మా జాబ్ చాలా కష్టంగా చేస్తున్నారు."


"నేనా? మీరు చేస్తున్నది ఇంకా కష్టం. ఒక పెళ్లిని సినిమా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను!"


"పెళ్లి ముందా... కెమెరా ముందా?"


"పెళ్లి ముందే."


"అయితే అదే తీయండి. పెళ్లిని ఆపి కెమెరా తీయొద్దు."


లక్ష్మి నవ్వుకుంటూ మనసులో అనుకుంది...

"చెప్పేది కొన్నిసార్లు గుచ్చుకున్నా... మనసు మాత్రం బంగారం."


ఆయన అంతే!


😎4


కానీ...


ఆయన అంతే!


పెళ్లికూతురు, పెళ్లికొడుకును ఆశీర్వదించడానికి అందరూ వరుసలో నిలబడ్డారు.


శ్రీను గారు ఒక్కసారిగా గమనించారు.


ఒక కుటుంబం లైన్‌ను దాటుకుని ముందుకు వెళ్లింది.


"అయ్యో... అలా కాదు అండీ. లైన్‌లోనే వెళ్లండి. అందరికీ ఒకే అవకాశం," అని గట్టిగా చెప్పారు.


లక్ష్మి మెల్లగా,

"వాళ్లు దగ్గరి బంధువులే అండీ..." అంది.


"దగ్గరి బంధువులైతేనే ఇంకా ఎక్కువగా రూల్స్ పాటించాలి!" అని ఆయన సమాధానం.


పక్కనే ఉన్న లక్ష్మి స్నేహితులు నవ్వు ఆపుకోలేకపోయారు.


ఒకరు సరదాగా,

"లక్ష్మీ... మీ ఆయనను ఈరోజు క్యూ మేనేజర్‌గా పెట్టారా?" అన్నారు.


అందరూ నవ్వారు.


ఆయన గారు మాత్రం సీరియస్.


"క్రమశిక్షణ అంటే క్రమశిక్షణే!"


చివరకు ఫ్రెండ్స్ అందరూ,

"నువ్వే మీ ఆయనతో రా. మేము ముందే ఆశీర్వదించి వస్తాం."


లక్ష్మి చిరునవ్వుతో,

"తప్పు కాదు అండీ... కానీ మీకు ప్రతి పెళ్లి ఒక ఫంక్షన్ కాదు... ఒక ఇన్‌స్పెక్షన్!"


ఆయన అంతే!


😎 ముగింపు


మీ ఇంట్లో కూడా ఇలాంటి "ఆయన" ఉన్నారా?

ఉంటే వారిని మార్చాలని ప్రయత్నించకండి... అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.


వాళ్లు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టరు. మనసులో ఏది ఉంటే అదే మాట్లాడేస్తారు. కొన్ని సందర్భాల్లో వారి మాటలు నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పిస్తాయి. కానీ వారి మనసు మాత్రం మంచిదే.


అందుకే కొన్నిసార్లు వాళ్లను అలాగే వదిలేయడమే మంచిది.

ఎందుకంటే...

వాళ్లు మారరు…


ఆయన అంతే! 😊


శుభం.


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page