బగళాముఖి క్షేత్రం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర
- Annapurna Somayajulu Vempati

- 2 hours ago
- 3 min read

Bagalamukhi Kshetram - Himachal Pradesh Yathra - Telugu Piligrimage Story | Annapurna Somayajulu
బగళాముఖి క్షేత్రం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర - తెలుగు తీర్థయాత్ర కథ | అన్నపూర్ణ సోమయాజులు
Published in manatelugukathalu.com on 06/09/2026
బగళాముఖి క్షేత్రం - హిమాచల్ ప్రదేశ్ యాత్ర
8.8. 2026, శనివారం
ఉదయం 8.30 గంటలకల్లా అల్పాహారాలు ముగించుకుని, బగళాముఖి క్షేత్రం చూడటానికి బయలుదేరాం.
బగళాముఖీ దేవి హిందూమతంలోని పది ప్రధాన తాంత్రిక దేవతలైన 'దశమహావిద్యలలో' ఎనిమిదవ దేవత. ఆమెను 'పీతాంబరా దేవి' అని కూడా పిలుస్తున్నారు, ఎందుకంటే ఆమె పసుపు రంగును ఇష్టపడుతుందట. అందువల్ల అమ్మవారిని పసుపు రంగు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరిస్తున్నారు
భక్తుల అంతర్గత (కామ, క్రోధాది) మరియు బాహ్య శత్రువులను, చెడు శక్తులను స్తంభింపజేసే శక్తి ఆమెకు ఉందనీ, ఈమెను ప్రార్థించడం వల్ల కోర్టు కేసులు, అప్పుల బాధలు తొలగిపోతాయని, వాదోపవాదాలలో విజయం లభిస్తుందని స్థానికంగా భక్తుల నమ్మకం.
అమ్మవారికి పసుపు రంగు పూలు, నైవేద్యాలు చాలా ప్రీతిపాత్రమైనవి.
గర్భాలయంలో, విఘ్నేశ్వరుడు, విశ్వేశ్వరులతో కలసి కొలువుతీరిన తల్లిని కళ్ళనిండుగా చూసి, మనసునిండా నింపుకుని బయటకు వచ్చాం.
ఆ తర్వాత శీతలాదేవి
హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లా బర్వైన్ ప్రాంతంలో ప్రసిద్ధ శీతలాదేవి ఆలయం ఉంది.
ఈ అమ్మవారిని కొలిస్తే మశూచి వంటి తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ తొమ్మిది దేవి ఆలయాలలో ఒకటి.
ఇది చింతపూర్ణి ఆలయానికి దగ్గరలోనే ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
తర్వాత, చింతాపూర్ణి/ ఛిన్న మస్తకా ఆలయ దర్శనానికి వెళ్ళాం.
చింతపూర్ణి దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలోనే , చింతపూర్ణి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ శక్తి క్షేత్రం. అమ్మవారిని మాతా చింతపూర్ణి / ఛిన్నమస్తకా దేవిగా భక్తులు ఆరాధిస్తారు. “చింతపూర్ణి” అంటే చింతలను తొలగించే అమ్మవారు అని స్థానికులు చెప్తున్నారు.
నాకేమో, చింతితములను తీర్చే తల్లి అనిపించింది.
చింతలు లేకుండా ఉండటమేగా మన చింతితం!!
కాబట్టి పద అర్ధం ఏదైనా, పరమార్ధం ఒక్కటే🙏
పురాణాల ప్రకారం, దక్ష యజ్ఞం అనంతరం శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా విభజించినప్పుడు, ఒక భాగం ఇక్కడ కూడా పడిందని నమ్మకం. అందువల్ల చింతపూర్ణిని పవిత్రమైన 54 శక్తిపీఠాలలో ఒకటిగా భక్తులు భావిస్తారు.
ఇక్కడ అమ్మవారిని సాధారణ విగ్రహ రూపంలో కాకుండా శిలా పిండి రూపంలో దర్శించుకుంటారు. ఆలయంలోని పిండి తెల్లని పాలరాతి పీఠంపై ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా నిత్యపూజలు నిర్వహిస్తారు.
చింతపూర్ణి దేవిని నాలుగు దిక్కుల నుంచి శివుడు రక్షిస్తున్నాడనే స్థానిక విశ్వాసం ఉంది.
ఉత్తరాన ముచ్కుంద్ మహాదేవ్, దక్షిణాన శివ బారి,
తూర్పున కాలేశ్వర్ మహాదేవ్,
పశ్చిమాన నారాయణ మహాదేవ్.....
అనే శివాలయాలు ఉన్నాయని హిమాచల్ పర్యాటక శాఖ పేర్కొంటోంది.
ఆలయ ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంది. ప్రవేశద్వారం వద్ద పురాతన మర్రి చెట్టు ఉంది. ఆలయంలో పెద్ద ఇత్తడి గంటలు ఉన్నాయి. భక్తులు దర్శనానికి ముందు/తర్వాత ఆ గంటలు మోగించడం సంప్రదాయమట.
అధికారిక ఆలయ సమాచారం ప్రకారం,
ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 10:00 వరకూ ఆలయం తెరచే ఉంటుందట.
అయితే పూజా దర్శన సమయాలు పండుగలు, రద్దీ, ప్రత్యేక సందర్భాల్లో మారుతూ ఉంటాయట.
నవరాత్రుల సమయంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
తర్వాత జ్వాలాముఖి ఆలయం.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జ్వాలాముఖి ఆలయం. ఇది 54 శక్తి పీఠాలలో ఒకటి. గర్భాలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహం ఉండదు.
శివుడు సతీదేవి దేహాన్ని తన భుజంపై వేసుకుని సంచరిస్తున్నప్పుడు, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని భాగాలుగా విభజించినప్పుడు, ఆమె నాలుక ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి.
రాతి పగుళ్ల నుంచి నిరంతరం వెలువడే 9 జ్వాలలను దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలుగా (మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి తదితరులు) భావిస్తారు.
కొంతమంది పదకొండు జ్వాలలు ఉన్నాయి అన్నారు.
నాకు మాత్రం ఏడు జ్వాలలు కనపడినాయి.
అందరికీ తొమ్మిది కనపడినాయి అనేసరికి నాకు చిన్న అసంతృప్తి.
వెనక్కి వెళ్ళి అక్కడ అర్చకులను బతిమాలాను జాలిగా "మళ్ళీ ఒకసారి చూసొస్తాను లోపలికెళ్ళి. ఇందాక అన్నీ కనపడలేదండీ" అనీ.
అపుడు వాళ్ళు చెప్పిన సమాధానం,
"అమ్మవారు స్వయంప్రకటితం. ఆవిడ కనపడాలనుకుంటే కనపడుతుంది, నువ్వు చూడాలనుకుంటే కాదు. ఇందాక కనపడని జ్వాలలు ఇపుడు నువ్వు మళ్ళీ వెళ్ళినా కనపడవు. నీ ఆర్తి ఎంతో, నీకు ప్రాప్తి అంతే" అని.
నా స్థాయి అంతే అని తృప్తి పడ్డాను🙏
ఈ నీలి జ్వాలలు భూమి నుంచి వచ్చే సహజ వాయువుల వల్ల శాశ్వతంగా మండుతుంటాయని నమ్ముతారు.
మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ మంటలను ఆర్పడానికి నీటిని పోయించి, కాలువలు తవ్వించినప్పటికీ ఆ జ్వాలలను ఆర్పలేకపోయాడట. తన తప్పును తెలుసుకుని అమ్మవారికి బంగారు ఛత్రాన్ని సమర్పించాడని చరిత్ర చెబుతోంది.
(సశేషం)
*********
అన్నపూర్ణ సోమయాజులు
(సశేషం)
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
అన్నపూర్ణ సోమయాజులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అన్నపూర్ణ సోమయాజులు
పేరు : అన్నపూర్ణ సోమయాజులు. వెంపటి.
W/o. V.s. somayajulu.






Comments