భారత కరెన్సీ నోట్ల పై బొమ్మలు & రంగు
- P. V. Padmavathi Madhu Nivrithi
- 3 hours ago
- 4 min read
భారత కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, రూపాయి నోట్లు, RBI, మహాత్మా గాంధీ, కోణార్క్, ఎల్లోరా, హంపి, రాణి కి వావ్, సాంచి స్థూపం, ఎర్రకోట, మంగళయాన్, తెలుగు GK, మనతెలుగుకథలు

Images & Color on Indian Currency Notes - Telugu Inspirational Article | P V Padmavathi Madhu Nivrithi
భారత కరెన్సీ నోట్ల పై బొమ్మలు & రంగు - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | పి. వి. పద్మావతి మధు నివ్రితి
Published in manatelugukathalu.com on 21/07/2026
భారత కరెన్సీ నోట్లపై కనిపించే చిత్రాలు కేవలం అలంకరణ కోసం కాదు; అవి భారతదేశ చారిత్రక, సాంస్కృతిక, శాస్త్రీయ వారసత్వానికి ప్రతీకలు. ₹10 నుంచి ₹500 వరకు ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లపై ఏ ప్రదేశాల చిత్రాలు ఉన్నాయి? వాటి రంగులు ఏమిటి? రద్దు చేసిన ₹1000, ₹2000 నోట్ల విశేషాలు ఏమిటి? ఈ వ్యాసంలో పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోండి.
భారత కరెన్సీ నోట్ల పై బొమ్మలు & రంగు
[గమనిక: అన్ని కరెన్సీ నోట్ల "ముందు" వైపున ఇవి ఉంటాయి: మహాత్మా గాంధీ చిత్రపటం మరియు అశోక స్తంభం యొక్క సింహ రాజధాని చిహ్నం.]
-------------------------------------------------------------------
విలువ --- ["వెనుక" వైపు పై ఉన్న బొమ్మ & రంగు] (రూ: Rs)
--------------------------------------------------------------------
రూ 10: ఒక ప్రసిద్ధ రాతి రథ చక్రం సూర్య దేవాలయం (ఒడిశాలోని కోనార్క్‌లో) *చాక్లెట్ బ్రౌన్ బేస్ రంగు
రూ 20: ఎల్లోరా గుహలు (మహారాష్ట్రలో) పసుపుపచ్చ ఆకుపచ్చ రంగు
రూ 50: హంపి రథం - (కర్ణాటక) లేత నీలం రంగు
100: రాణి కి వావ్ (గుజరాత్‌లోని పటాన్‌లోని మెట్ల బావి) ఊదా రంగు
200: సాంచి స్థూపం (భోపాల్: మధ్యప్రదేశ్) ముదురు పసుపు రంగు (నారింజ రంగు)
500: ఎర్రకోట (కొత్త ఢిల్లీ) లేత ఆకుపచ్చ రంగు
---------------- రద్దు అయిన నోట్లు --------------------
రూ 1000: *2016లో రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఈ నోట్ల చలామణిని.
భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతీకలుగా నిలిచే వ్యవసాయం (సాగు), పరిశ్రమలు, అంతరిక్ష పరిశోధన (ఉపగ్రహం) లకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.
*ఎరుపు+గోధుమ రంగుల మిశ్రమం
రూ 2000: మంగళయాన్ మెజెంటా రంగు (ముదురు గులాబీ) (*మంగళయాన్: అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన భారత అంతరిక్ష నౌక)
(ఇది అంతరిక్షంలో భారతదేశం సాధించిన మొదటి అంగారక గ్రహ యాత్రను సూచిస్తుంది ... భారతదేశం యొక్క ఆధునిక శాస్త్రీయ - సాంకేతిక పురోగతిని విశదీకరించడం దీని అభిమతం)
ii) (*200 రూ నోటు) మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఉన్న సాంచి స్థూపం (బౌద్ధ కట్టడం), యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గౌరవించబడుతోంది మరియు భారతదేశంలోని పురాతన రాతి కట్టడాలలో ఒకటి. దీనిని మొదట అశోక చక్రవర్తి క్రీ.పూ. 3వ శతాబ్దంలో నిర్మించారు.
iii) (*100 రూ నోటు) రాణి కి వావ్ బావిని 11వ శతాబ్దంలో సోలంకీ రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమదేవ జ్ఞాపకార్థం నిర్మించారు. దీనిని యునెస్కో (UNESCO) 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
iv) (*రూ 50 నోటు) కర్ణాటకలోని హంపిలో గల ప్రసిద్ధ 'రథంతో కూడిన హంపి' చిత్రం ఉంది. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ కట్టడం యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
v) (*రూ 2000 నోటు) భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. *అయితే, 2023 మే నుండి ఈ నోట్ల చలామణిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపసంహరించుకుంది. అయినప్పటికీ, ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి.
---------------------- E N D సమాప్తం ---------------
గమనిక: ఈ జనాదరణ పొందిన ప్రతిష్టాత్మక వెబ్ మ్యాగజైన్‌లో ఇది మా 156వ. ఆర్టికల్ (కథ / వ్యాసం / క్విజ్)... సుమారు 1.5 సంవత్సరాలలో)
ధన్యవాదాలు ... ప్రసిద్ధ - ప్రతిష్టాత్మకwww.manatelugukathalu.com కు]
--------X X X --------- X X X ------- X X X ----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).


