ఇరుగుపొరుగు
- Addanki Lakshmi

- Jun 2
- 4 min read
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Irugu Porugu - Telugu Comedy Family Story| Addanki Lakshmi
ఇరుగుపొరుగు - తెలుగు హాస్యభరిత కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 02/06/2026
ఇరుగుపొరుగు సంబంధాలు, అప్పులు–అరువులు, చిన్న చిన్న సంసార లెక్కల మధ్య జరిగే సరదా సంఘటనలతో నిండిన హాస్యభరిత కథ ఇది.
పెద్దల మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థం కాని చిన్నారి అమాయకత్వం నవ్వులు పూయిస్తుంది.
టింకూ చెప్పిన నిజాలు పక్కింటి వాళ్లను ఎలా ఇబ్బందుల్లోకి నెట్టాయో ఈ కథలో ఆసక్తికరంగా చూపించారు.
కుటుంబ జీవితం, ఇరుగుపొరుగు అనుబంధాలు, బాలల అమాయకత్వం కలిసిన చక్కని కథ.
"ఏం చేస్తున్నావే తాయారూ! పని అయిందా?" పక్కింటి పిన్నిగారు వచ్చింది.
"ఏదీ, సాయంత్రం ఇంకా వంట పని మొదలు పెట్టలేదు. మా ఆయన వచ్చే టైమ్ అవుతుంది కదా! వంట వండడం మొదలు పెట్టాలి. ఇంట్లో బొత్తిగా కూరలు లేవు,"
పక్కనే హోంవర్క్ చేసుకుంటున్న టింకు, "అదేమిటమ్మా? నిన్న నాన్నగారు బోలెడన్ని కూరలు తెచ్చారు కదా! కూరలు లేవు అంటావేంటి?" అని మళ్ళీ రాసుకోవడం మొదలు పెట్టాడు.
"వీడు ఇంతే! వీడిలాగే మాట్లాడుతాడు పిన్నిగారు. ఎప్పుడో కిందటి వారం తెచ్చారు. అది గుర్తుపెట్టుకుని ఇలా చెప్తుంటాడు."
"సరేలే గాని తాయారూ! మీ అన్నయ్యగారికి చెప్పాను, తేవడం మర్చిపోయారు. రేపు పొద్దున్నే మళ్ళీ ఎక్కడ పోతాం? కాస్త కాఫీ పౌడర్ ఇయ్యి, మళ్ళీ ఇచ్చేస్తాను."
"అయ్యో, కాఫీ పౌడరూ పిన్నిగారు, పూర్తిగా అయిపోయిందండి. నేను రెండు రోజుల నుంచి మా ఆయనకు మొత్తుకుంటున్నా, 'కాఫీ పౌడర్ తెండి, అయిపోయింది' అని. వింటే కదా మనిషి! ఒక్క మాట వినరు, ఏమీ గుర్తు పెట్టుకోరు.
రెండు రోజుల బట్టి టీ పెడుతున్నాను పొద్దున్నే."
"అమ్మా, అమ్మా! మొన్ననే కదా నాన్నగారు 1 కిలో కాఫీ పౌడర్ తెచ్చారు. లేదంటావేంటమ్మా?" అంటున్నాడు టింకు.
"నువ్వు ఊరుకోరా వెధవాయ్! నీకేం తెలుసు? అది కాఫీ పొడుం కాదు,
కారంపొడుం పిన్నిగారు!
మా ఆయనగారు చూశారా ఎంత అయోమయమో? కాఫీ పొడుం తెమ్మంటే కారంపొడి తెచ్చారు, మరి. ఇలా ఉంటుంది ఈయనతో గోల. వేగలేకపోతున్నాను అనుకోండి పిన్నిగారు."
"అమ్మా, అది కాఫీ పౌడర్. కారంపొడి కాదు. 'కాఫీ పొడి'యని తెలుగులో చక్కగా రాశాడు, నేను చదివాను."
"నువ్వు ఊరుకోరా బడుద్దాయి! నాకు తెలుసా, నీకు తెలుసా? వీడిలాగే అన్నిటిలోనూ కలగజేసుకుంటాడు. ఇంత వెర్రి మొహం ఎక్కడా లేడు.
కూర్చుని శుభ్రంగా చదువుకోక, ఈ ఆడవాళ్ళ కబుర్లు అన్నీ నీకెందుకురా!"
అంటూ కొడుకుని తాయారు కేకలేసింది.
"పోనీలే అమ్మా, నేను పక్కింటి సుజాతమ్మని అడుగుతాను నాలుగు చెంచాల కాఫీ పొడి.
నువ్వు మటుకు ఏం చేస్తావు? నీ దగ్గర లేకపోతే!
వస్తానమ్మా, పని చూసుకో" అంటూ వెళ్లిపోయింది పిన్నిగారు దుర్గమ్మగారు.
తాయారుకి కొడుకు మీద కోపం వచ్చింది.
"ఇలారా వెధవాయ్! ఆడాళ్ళు మేము ఏదో మాట్లాడుకుంటుంటే నీకు ఎందుకొచ్చిన గొడవ?
చదువు సంధ్య లేదు. అన్నీ ఆడవాళ్ళ మాటలే నీకు కావాలి!"
అంటూ టింకూ పైకి లేచింది.
"ఏంటమ్మా! అన్నీ అబద్ధాలు చెప్తూ ఉంటావు? ఇంట్లో ఉన్నాయి, 'లేదు లేదు' అని అబద్ధాలు ఎందుకు ఆడతావు?"
"నీకేం తెలుసురా? మా బాధలన్నీ! కాఫీ పౌడర్ తీసుకెళ్తే, మళ్ళీ తిరిగి ఇవ్వదురా బాబు! అసలే 500 రూపాయలు కేజీ.
ఇప్పటికప్పుడే పదిసార్లు తీసుకెళ్ళింది. ఎప్పుడూ తిరిగి ఇవ్వలేదు.
నీకేం తెలుస్తాయి మా బాధలన్నీ!
చిన్నపిల్లలు పెద్దల విషయాల్లో మాటలు దూర్చకూడదు. నీకెందుకు?" అంటూ కొడుకుని కేకలేసింది.
"అది కాదమ్మా, 'అబద్ధాలు చెప్పకూడదు' అంటావు కదా! మళ్ళీ నువ్వే ఎందుకు అబద్ధాలు చెప్తావు?" అమాయకంగా అడుగుతున్నాడు.
"నీకెందుకొచ్చిన వితండవాదం? పోయి ఆడుకోరా కాసేపు," విసుక్కుంది.
"లేదమ్మా, నాకు హోంవర్క్ ఉంది, చేసుకోవాలి. హోంవర్క్ చేయకపోతే క్లాసులో టీచర్ తంతుంది."
తాయారు వంటగదిలోకి వెళ్లి వంట మొదలు పెట్టింది.
ఇంతలో పక్క వాటాలోని కనకమ్మ,
"ఏం చేస్తున్నావ్ తాయారూ?" అంటూ,
"రండి ఆంటీ, రండి! ఇప్పుడే మా ఇంటికి దుర్గమ్మత్త వచ్చింది కాఫీ పౌడర్ కి.
మా అమ్మ అన్నీ అబద్ధాలు చెప్తుంది. మా నాన్న నిన్న కేజీ కాఫీ పౌడర్ తెస్తే, 'లేదని' అబద్ధాలు చెప్తోంది.
ఆవిడ పాపం ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది.
'ఎందుకు ఇవ్వలేదమ్మా.. ' అంటే, 'ఆవిడ మళ్ళీ తిరిగి ఇవ్వదు, పిసినారి మొహం' అని తిట్టింది.
మీరు కూడా మొన్న కందిపప్పు పట్టుకెళ్లారు కదా, ఈవిడ మళ్ళీ తిరిగి ఇవ్వదు మహాతల్లి, అంటూ విసుక్కుంటుంది మీ మీద ఆంటీ..."
అంటూ టింకు మొదలు పెట్టాడు.
ఆవిడకి నిజానికి పచ్చిమిరపకాయలు అయిపోయాయి, తీసుకువెళ్దామని వచ్చింది.
అంతకుముందు కందిపప్పు తీసుకెళ్లిన విషయం మర్చిపోయింది.
"వస్తాలేరా టింకూ! నాకు కొంచెం పని ఉంది!" అంటూ వెళ్లిపోయింది.
మళ్ళీ తాయారమ్మ కందిపప్పు గురించి అడుగుతుందని భయపడి.
"ఎవర్రా వచ్చారు?" అంటూ వంటింట్లోంచి తాయారమ్మ వచ్చింది.
"కనకమ్మ ఆంటీ వచ్చింది.
ఏదో గిన్నె పట్టుకొచ్చింది. ఏదో కావాలేమోను. మొన్న కందిపప్పు విషయం గుర్తు చేసేసరికి వెళ్లిపోయిందమ్మా!" అన్నాడు టింకు అమాయకంగా.
"పోనీలేరా, మంచి పని చేశావు! నీ అమాయకత్వం కాదు గానీ, ఒక్కొక్కసారి నన్ను రక్షిస్తూ ఉంటుంది," అంటూ నవ్వుకుంది తయారమ్మ.
"అమ్మా! నాకు అర్థం కాదు. 'అబద్ధాలు ఆడొద్దు' అని నాకు చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడతావు.
నాకేమీ అర్థం కావటం లేదమ్మా..." టింకుగాడు అమాయకంగా.
"ఒరేయ్, నీకు పెద్దై, పెళ్లయిన తర్వాత ఈ సంసార బాధలన్నీ అర్థమవుతాయి... చదువుకో! ఎందుకు వచ్చిన గొడవ?" అంటూ తాయారు మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది.
టింకుగాడికి ఆ చిన్న బుర్రకి ఈ గొడవలేమీ అర్థం కాలేదు. మళ్ళీ హోంవర్క్ చేసుకుంటున్నాడు అమాయకంగా.
***
అద్దంకి లక్ష్మి గారి కొన్ని ఇతర రచనలు:
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,










Comments