జీవన సార్థకత

Jeevana Saarthakatha - Telugu Family Story | Chilakamarri Padmavathi
జీవన సార్థకత - తెలుగు కుటుంబ కథ | చిలకమర్రి పద్మావతి
Publishes in manatelugukathalu.com on 21/11/2026
తల్లిదండ్రుల బాధ్యతలు పూర్తయ్యాక కూడా జీవితం ఆగిపోదని, తమ జ్ఞానాన్ని సమాజానికి అందించడం ద్వారా జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవచ్చని చెప్పే హృదయస్పర్శి కథ “జీవన సార్థకత”.
"అమ్మాయ్... నేను విన్నది నిజమేనా?" అంటూ పక్కింటావిడ పలకరింపు...
"ఏం విన్నారు ఆంటీ?" వీలైనంత సౌమ్యంగా అంది ధీరజ.
"మీ అమ్మానాన్నా ఏదో ఆశ్రమంలో చేరారట కదా!
నువ్వూ మీ ఆయనా చక్కగా చూసుకుంటుంటే ఎక్కడికో అలా వెళ్ళిపోవడం ఏమిటి?
నాకు తెలియక అడుగుతా కానీ మీ ఆయన ఏమన్నా అన్నారా? ఇంకా ఈ రోజుల్లో కూడా అమ్మాయి ఇంట్లో ఉండటం అంటే ఏదో తప్పు చేసినట్టే చూస్తోంది లోకం.."
పక్కింటావిడే కాకుండా భర్త వైపు ఏదో దూరపు చుట్టరికం కూడా ఉండటంతో గట్టిగా ఏమీ అనలేకపోతోంది ధీరజ..
"అవును ఆంటీ... ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు..." అంటూ ఇంకో మాటకి ఆస్కారం ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది.
పక్కింటావిడని అయితే తప్పించుకుంది కానీ తన మనసుకు సమాధానం ఏం చెప్పుకోవాలో తెలియక బాల్కనీలో కూర్చుండిపోయింది..
తల్లిదండ్రులు వెళ్ళిపోయి మళ్ళీ ఇన్ని రోజులైనా ఎందుకు తిరిగి రాలేదా అనే బాధ మనసుని తొలిచేస్తూ ఉంది.. అడిగిన వాళ్ళకి జవాబు చెప్పలేని స్థితి..
అంతలోనే "అమ్మా" అంటూ స్కూల్ నుంచీ పిల్లలు రావడంతో అక్కడినుంచి లోపలికి కదిలింది..
ధీరజ వాళ్ళ అమ్మ జానకికి సుస్తీ చేయడంతో తప్పనిసరిగా వైద్య పరీక్షల నిమిత్తం, ఉన్న ఒక్కగానొక్క కూతురి ఇంటికి వచ్చారు జానకి, రఘురామ్..
పిల్లలకి వేసవి సెలవులు అవడంతో కొన్ని రోజులు బాగానే గడిచాయి మనవలకి కథలు చెప్తూ వాళ్ళతో ఆడుకుంటూ..
స్కూల్ సెలవులు అవగానే వాళ్ళ రోజువారీ పనులు గడియారంతో పరుగెడుతున్నట్టుగా ఉండటంతో పిల్లలు అమ్మమ్మ, తాత దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోయేవాళ్ళు..
తాత ఏమన్నా స్కూల్ వర్క్‌లో సహాయం చేస్తానన్నా "నీకు తెలీదులే తాత" అంటూ చూడనిచ్చేవాళ్ళు కూడా కాదు.. పోనీ కూతురికి ఏమన్నా సహాయం చేద్దామన్నా ఆ వేగాన్ని అందుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఆరోగ్యం బాగుపడినా కూడా ఏదో తెలియని నిరుత్సాహం పెరిగిపోసాగింది ఇద్దరిలో..
ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులుగా చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న వాళ్ళు..
ఇద్దరికీ అలా ఏమీ చేతకాని వాళ్ళల్లా కూర్చోవడం ఏమీ నచ్చడం లేదు.. అందుకే వార్తాపత్రికలో పడిన ఒక ప్రకటన చూడగానే ఎవరికీ చెప్పకుండానే దరఖాస్తు పెట్టడం, వాళ్ళు వెంటనే రమ్మనడం జరిగిపోయాయి..
ధీరజ మనసు నొచ్చుకోకుండా కొన్ని రోజులు ఆశ్రమంలో ఎవరినో స్నేహితులని కలిసి వస్తామని అబద్ధం చెప్పి బయలుదేరి వెళ్ళారు..
అలా వెళ్ళిపోయి నెల రోజులు అవుతున్నా తిరిగిరాకపోవడంతో భర్తతో కలిసి ఒక సెలవు రోజు తల్లిదండ్రులని కలవడానికి వెళ్ళింది.
"ఈ వయసులో మీరు ఇలా కష్టపడటం ఎందుకు? మాతో ఇంటికి వచ్చేయండి.. చుట్టుపక్కల అందరూ అల్లుడి దగ్గర ఉండలేక వెళ్ళిపోయారని పలు రకాలుగా అనుకుంటున్నారు..
దయచేసి మీరిద్దరూ మా ఇంటికి వచ్చేయండి.. నాకు మా అమ్మానాన్నా ఎలాగో మీరు కూడా అంతే"
అంటూ బతిమాలుతున్న అల్లుడితో
"బాబూ మీరు మరోలా అనుకోవద్దు.. మేము చేసుకున్న అదృష్టం.. కొడుకులాంటి అల్లుడు దొరికారు.
వయసు మళ్ళిన మమ్మల్ని గురించిన ఆరాటం మీలో కనిపిస్తోంది..
కానీ ఒకసారి ఇక్కడ అందర్నీ గమనించండి.. మేము మాకు వచ్చిన విద్యని అందరికీ నేర్పడంలో ఒక రకమైన తృప్తిని పొందుతున్నాం..
మా అవసరం మీ ఇంట్లో కన్నా ఇక్కడే ఎక్కువ కనిపిస్తోంది.. తల్లిదండ్రులుగా మా బాధ్యత తీర్చుకున్నాం.. మీరు పిల్లాపాపతో సుఖంగా ఉన్నారు..
మేము ఒక మంచి పని చేస్తున్నాం అని సంతోషంగా వెళ్ళండి.. మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు..
ఇక్కడ పిల్లల అల్లరి మాటలు, చేష్టలు, ఈ ప్రశాంతమైన వాతావరణం మా అనారోగ్యాలను వెనక్కి తరిమేస్తున్నాయి.." అంటూ భార్య జానకి మొహంలోకి చూశారు..
జానకి ఎప్పటిలానే ఆయన మాటలే నా మాటలు అన్నట్టు తలూపుతూ కూతురి వైపు చూసింది.
తండ్రి మాట్లాడుతున్నంత సేపు కిటికీలోంచి బయట ఆడుతున్న పిల్లల్ని చూసిన ధీరజ మనసులో అనుకుంది... "నాన్న చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం..
ఆ పిల్లలకి అమ్మానాన్న లాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది.. వాళ్ళని ఇలాగే సంతోషంగా ఉండనిద్దాం"
బయటికి వచ్చాక అవే మాటలు భర్తతో అంది కూడా.
ఇల్లు చేరిన వాళ్ళను "అమ్మమ్మ, తాత ఏరీ? తీసుకురాలేదేంటి?" అని అడిగిన పిల్లలకి "మీలాంటి ఎంతో మంది పిల్లలకి చదువు నేర్పించే పనిలో నిమగ్నమై తీరిక లేకుండా ఉన్నారు" అని ఎంతో గర్వంతో చెప్పింది ధీరజ.
***************************************
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
చిలకమర్రి పద్మావతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: చిలకమర్రి పద్మావతి
నా పేరు చిలకమర్రి పద్మావతి
నేను విజయవాడ ఆంధ్రా బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగ విరమణ చేశాను.. మా వారు శ్రీ మరింగంటి సుందర శ్రీనివాస్ సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ నుండి రిటైర్ అయ్యాక ఇద్దరం విశ్రాంతి జీవితం గడుపుతున్నాము .మాకు ఇష్టమైన ప్రదేశాలన్నీ తిరగటం ,మా పిల్లల, మనవరాళ్ళ ఫోటోలు వీడియోలు చూడటం..ఇవే మా ఆనందాలు.. మొదటి నుంచి (పుస్తకాలు) కథలు నవలలు చదవటం అలవాటు..చిత్ర కళ లో కొద్దిగా ప్రవేశం వున్నా అన్ని లలిత కళలను ఆస్వాదించడం చాలా ఇష్టం..
మా మనవరాళ్ళకి కథలు చెప్పటం ఇంకా ఇంకా ఇష్టం.










Comments