top of page
Original.png

రాజకీయ క్రీడ

2 hours ago
3 min read

ఓటుకు నోటు పంచి ఎన్నికల్లో ఓడిపోయిన ఆశారావు అప్పుల బాధలో చిక్కుకున్న దృశ్యం

Raajakeya Kreeda - Telugu Social Story | B. N. Satyanarayana

రాజకీయ క్రీడ - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 21/11/2026


“రాజకీయ క్రీడ” కథ ఓటుకు నోటు సంస్కృతి, రాజకీయ స్వార్థం, దురాశలపై చురుకైన వ్యంగ్యాస్త్రం. డబ్బుతో గెలుపు సాధించాలనుకున్న ఆశారావుకు చివరికి ఎదురైన పరిణామాలు ఆలోచింపజేస్తాయి.


ఆశారావు తన గ్రామంలో ఓటర్లకు ఇలా విజ్ఞప్తి చేసుకున్నాడు—

"ఇంతవరకు నేను మంచి కార్యకర్తగా పార్టీకి ఎంతో సేవ చేశాను. 


నా సేవలను గుర్తించకుండా జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్ సీటుకు టికెట్ నాకు ఇవ్వకుండా వేరొకరికి ఇచ్చేశారు. రాజకీయాలనే జీవితంగా ఎంచుకున్నాను. 


ముందుగా సర్పంచ్‌గా గెలిస్తే అంచెలంచెలుగా ఎదగొచ్చని ఆశపడ్డాను. అయితే, పార్టీ వారు నాకు టికెట్ ఇవ్వకుండా వేరొకరికి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీలో నిలవవలసి వచ్చింది. 


నేను మన గ్రామానికి ఎంత సేవ చేశానో మీ అందరికీ తెలిసిందే. నాపై అభిమానంతో మీ ఓటు నాకే వేసి నన్ను తప్పకుండా గెలిపించాలని వేడుకుంటున్నాను," అన్నాడు.


తరువాత కొంత గ్రూపును కూడగట్టుకుని ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించసాగాడు. 


అంతే కాదు, ఓట్లను లెక్కకట్టి నోట్లు పంచసాగాడు. ఆ నోట్లు తప్పకుండా తనకు ఓట్లు తెచ్చిపెడతాయని అతడి నమ్మకం. 


రాజకీయాల్లో చిన్న స్థానం దొరికితే చాలు అప్పనంగా, అక్రమంగా డబ్బు సంపాదించేయవచ్చు అనే ఆశ అతడిని నిలవనీయలేదు. 


అందుకే పోటీకి తలపడ్డాడు.


ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఆశారావు చిత్తుగా ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కూడా కోల్పోయాడు. 


దాంతో అతడికి ఒళ్ళంతా చమటలు పట్టేశాయి. రాజకీయాల్లో దూరి బాగా డబ్బు సంపాదించాలనే అతని ఆశ మొదట్లోనే బెడిసికొట్టడంతో ఆశారావుకు గుండె ఆగినంత పనైంది. 


"ఓటుకు నోటు ఇస్తే గెలుపు సునాయాసమే" అని నమ్మి అధిక వడ్డీకి పెద్ద మొత్తం అప్పు చేసేశాడు, పంచేశాడు. ఇప్పుడైతే డబ్బూ పోయింది, ఓటమీ మిగిలింది.


ఓడిపోయాడని తెలియడంతో అప్పులు ఇచ్చినవారు తమ డబ్బులు తమకు వెంటనే తిరిగి ఇవ్వాలని ఆశారావును వేధించడం మొదలుపెట్టారు. 


ఆశారావుకు ఏం చేయాలో తెలియడం లేదు. తల్లడిల్లిపోసాగాడు, అయోమయంలో పడిపోయాడు. ఆలోచనలు అతడిలో వేగంగా పరుగుతీయసాగాయి.


ఒక నిర్ణయానికి వచ్చాడు. తనకు ఓటు వేయని వారందరినీ తాను ఇచ్చిన డబ్బు వాపసు ఇవ్వాలని గడప గడపకూ వెళ్లి గొడవ చేయడం మొదలుపెట్టాడు. అయితే అతడి మాటలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు, ఖాతరు చేయలేదు.


"నీలా పోటీ చేసిన అందరూ డబ్బులు పంచారు. అందులో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాడికే ఓటు వేశాం, గెలిపించాం," అన్నారు. 


"ఎవడు ఎక్కువ డబ్బు ఇస్తే వాడికే మా ఓటు వేస్తామని నీకు తెలుసు కదా? గతంలో నీవూ ఇలాగే అందరి నుండి డబ్బులు తీసుకున్న వాడివే కదా! ఏం ముఖం పెట్టుకుని తిరిగి డబ్బులు అడుగుతున్నావు?" అంటూ అతడి ముఖం మీదే ఛీ కొట్టసాగారు.


దాంతో సిగ్గు పడిపోయాడు ఆశారావు. ఏమి చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అతడికి అర్థం కావడం లేదు. 


'రాజకీయాల్లో చేరి దోచుకోవాలనే తన దురాశకు తగిన శాస్తి జరిగింది' అనుకుని, తన బుద్ధి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ, ఇక చేసేదేమీ లేక అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తనకున్న కొద్దిపాటి భూమి పుట్రా అమ్మివేసి అప్పులు తీర్చేశాడు.


ఆశకు పోకుండా పార్టీలోనే కొనసాగి ఉండి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా అనుకుంటూ, 'రెండింటికీ చెడ్డ రేవడి' అయిపోయినందుకు మనసులోనే కుమిలిపోసాగాడు.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page