కళ్లు కాయలు కాచాయి
- Patrayudu Kasi Viswanadham

- 3 hours ago
- 2 min read

Kallu Kayalu Kachayi - Telugu Inspirational children Story | Patrayudu Kasi Viswanadham
కళ్లు కాయలు కాచాయి - తెలుగు ప్రేరణాత్మక పిల్లల కథ | పట్రాయుడు కాశీవిశ్వనాథం
Published In manatelugukathalu.com On 02/09/2026
ఒకరోజు సాయంత్రం లచ్చవ్వ ఇంటి అరుగుమీద జున్నుబాబుతో కబుర్లు చెబుతూ కూర్చుంది. ఇంతలో రామవ్వ దిగులుగా అక్కడికి వచ్చింది.
“ఏమైంది రామవ్వా? అలా దిగులుగా ఉన్నావు?” అని అడిగింది లచ్చవ్వ.
“ఏం చెప్పను లచ్చవ్వా! నా కొడుకు ఉద్యోగం కోసం కువైట్ వెళ్లి ఆరు నెలలైంది. వాడు ఎప్పుడు వస్తాడా అని రోజూ గుమ్మం వైపే చూస్తున్నాను. ‘రేపు వస్తా... ఎల్లుండి వస్తా...’ అంటూ వాయిదా వేస్తూనే ఉన్నాడు. మనవళ్లు రోజూ ‘నాన్న ఎప్పుడు వస్తాడు?’ అని అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదు” అంటూ రామవ్వ కళ్లలో నీళ్లు తిరిగాయి.
జున్నుబాబు ఆమె దగ్గరకు వెళ్లి కన్నీళ్లు తుడిచాడు.
“బాధపడకు రామవ్వా! త్వరలోనే నీ కొడుకు వచ్చేస్తాడు” అన్నాడు.
“వాడు ఫోన్ చేస్తాడేమోనని కూడా రోజూ ఎదురుచూస్తుంటాను. ఫోన్ మోగితే చాలు... వాడే అనుకుని పరుగెత్తుకుంటూ వెళ్తాను. తీరా చూస్తే ఎవరో వేరే వాళ్లు!” అంటూ రామవ్వ నిట్టూర్చింది.
“తప్పకుండా వస్తాడు రామవ్వా!” అంటూ లచ్చవ్వ ఆమెకు ధైర్యం చెప్పింది.
రోజులు గడిచాయి.
ఒకరోజు సాయంత్రం రామవ్వ ఆనందంగా లచ్చవ్వ ఇంటివైపు పరుగెత్తుకుంటూ వచ్చింది.
“లచ్చవ్వా! లచ్చవ్వా!” అని పిలిచింది.
జున్నుబాబు, లచ్చవ్వ బయటకు వచ్చారు.
“ఏమైంది రామవ్వా?” అని అడిగింది లచ్చవ్వ.
“నా కొడుకు ఫోన్ చేశాడు! సెలవు దొరికిందట. వచ్చే వారం ఇంటికి వస్తున్నానన్నాడు!” అంది రామవ్వ ఆనందంగా.
“ఎంత మంచి వార్త! రామవ్వా! ఆరు నెలలుగా నీ కొడుకు కోసం కళ్లు కాయలు కాచాయి!” అంది లచ్చవ్వ.
దిగులుగా కనిపించిన రామవ్వ కళ్లలో ఇప్పుడు ఆనందం మెరిసింది.
“కళ్లు కాయలు కాచాయా?” అని జున్నుబాబు ఆశ్చర్యంగా అడిగాడు.
లచ్చవ్వ నవ్వుతూ,
“అవును జున్నూ! ‘కళ్లు కాయలు కాచాయి’ అనేది ఒక జాతీయం. ఎవరి రాక కోసమైనా ఎంతో ఆత్రంగా, చాలాకాలం ఎదురుచూస్తే ‘కళ్లు కాయలు కాచాయి’ అంటారు” అని చెప్పింది.
“అవునుబాబూ! చాలా రోజులుగా వాడి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను” అంది రామవ్వ.
జున్నుబాబు వెంటనే,
“మరి ఇప్పుడు మాత్రం నీ కళ్లకు కాయలు కాచాల్సిన పనిలేదు... నీ కొడుకు వస్తున్నాడుగా!” అన్నాడు.
రామవ్వ నవ్వుతూ,
“అవును బాబూ! వాడు వస్తున్నాడనే వార్తే నా మనసులో ఆనందం నింపింది!” అంది.
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి కొన్ని ఇతర రచనలు:
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
కాశీవిశ్వనాథం పట్రాయుడు విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన బాలసాహితీవేత్త, రచయిత, ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు నారాయణరావు (లేటు), లక్ష్మీనరసమ్మ. వృత్తిరీత్యా పాఠశాల సహాయకులు (ఆంగ్లం).
వివిధ పత్రికల్లో 500కు పైగా బాలల కథలు, 200 బాల గేయాలు, 300 కవితలు, 50 సాంఘిక కథలు, 10 వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 12 పుస్తకాలు ముద్రితమయ్యాయి. అనేక సంకలనాల్లో రచనలు చోటు పొందడంతో పాటు పలు రచనలు బహుమతులు పొందాయి.
సహస్ర కవిమిత్ర, సహస్ర లేఖా సాహిత్య మిత్ర, సహస్ర వాణి, శత స్వీయ కవితా కోకిల, శతశ్లోక కంఠీరవ, సూక్తిశ్రీ, కవి విశారద, వేగావతీ భారతీ, బాలకథా తపస్వి, సామెతల సామ్రాట్ తదితర బిరుదులు పొందారు.
గురజాడ పురస్కారం, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జాతీయ ఉత్తమ బాలసేవక్ పురస్కారం, జాతీయ విశిష్ట సేవా పురస్కారం, బాలమిత్ర పురస్కారం, పెందోట బాలసాహిత్య పురస్కారం, అష్టమ సాహితీ పురస్కారం, తపస్వి మనోహరం ఉత్తమ బాలకథా రచయిత పురస్కారం. తదితర గౌరవాలు అందుకున్నారు. 2020లో వికీపీడియాలో ప్రముఖ బాలసాహితీవేత్తల సరసన వీరి పేరు నమోదైంది.









Comments