top of page

కల్పతరువు - పార్ట్ 10



'Kalpatharuvu - Part 10' - New Telugu Web Series Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 23/01/2024

'కల్పతరువు - పార్ట్ 10' తెలుగు ధారావాహిక

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

బాంబు దాడిలో సత్యలీల భర్త డి. ఎస్. పి. విశ్వం మరణిస్తాడు. మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. 


పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు. 


పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. ప్రజ్ఞను కొందరు ఆకతాయిలు వేధిస్తుండటంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనంద్ ని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి. 


త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి. ఆతనితో సిమ్లా వెళ్లి ఆమెని కలుస్తుంది. అచలకు విడాకులిస్తే వారిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవచ్చని వాళ్లకు చెబుతుంది. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది.


ప్రజ్ఞ తలిదండ్రులు ప్రమీల, నారాయణ టూర్ కి టికెట్స్ బుక్ చేసుకుంటారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ మరణిస్తారు.


ఇక కల్పతరువు ధారావాహిక 10 వ భాగం చదవండి.


“థాంక్స్ అంకుల్జీ. " 


"ఆంటీజీ, అచల ఇప్పుడున్న ఇల్లు ఖాళీ చేసి, నాతో పాటే వుంటది. ఎందుకంటే, బట్టలు కుట్టినా వచ్చే రాబడి ఇంటి ఖర్చులకే సరిపోతున్నది. అందుకని ఒక నెల ముందే మీతో చెపుతున్నాము. ”


ఇరువురి ముఖాల్లో చిరునవ్వు ఎగిరి పోయింది, “అదెలా కుదురుతుంది, ఖాళీ చేస్తే సరే, కానీ మీ వద్ద వుంటే, మీరు రెండింతలు అద్దె కట్టాలి. ”


“రెండింతలు కిరాయి కాకుండా, ఒక వెయ్యి పెంచుతాము, ”


“లేదమ్మా, మేము నష్ట పోతాము. అంతగా భరించలేక పోతే కిరాయి తక్కువ వున్న ఇల్లు చూసుకొని అచల వెళ్ళి పోవచ్చును. ”


“ప్లీజ్ ఆంటీజీ, వేరే ఇల్లు అంటే అచలకే కాదు నాక్కూడా అభ్యంతర్యమే. ”


అచల సౌమ్యంగా అంది “ఆంటీజీ, మీరే అన్నారు కదా నేను మీ కూతురు లాంటి దానినని, నా బిజినెస్ లాభాల్లో రాగానే నేను పూర్తి అద్దె యిస్తాను. అంత వరకు సర్దుకోండి. ”


“అవును, నువ్వు మా కూతురు లాంటి దానివే, కాదన లేదు. పెళ్లి అయిన తరువాత పైసల విషయంలో మా కన్న కూతురైన కిరాయి కట్టాల్సిందే. ”


కొన్ని క్షణాలు అందరూ మౌనంగా వుండి పోయారు. ప్రతాప్ మెహతాగారు, “బేటీ, మాటలు పెంచి టైమ్ వేస్ట్ చేయకండి. మాకు రెండు కిరాయి లు కావాలి, లేకుంటే మీరు ఖాళీ చేయవచ్చు. ”


“అదే, అంకుల్జీ, నా పోర్షన్ ఖాళీ ఐన వెంటనే మీరు వేరే ఎవరికైనా రెంట్ కు ఇవ్వండి, నేను సత్యాగారి ఇంట్లో సర్దు కుంటాను. మీకు రెండు పోర్షన్ల రెంట్ వస్తుంది. ”


“అట్లా కుదరదు. సత్యలీల అగ్రీమెంట్లో తాను ఒక్కతే వుంటా అన్నది, ఇప్పుడు వేరే ఎవ్వరూ జత చేరినా డబల్ కిరాయి యివ్వాలి. ”


“యే మాటా నెల ముందే చెబితే మేము టులెట్ బోర్డు పెట్టుకుంటాము. ” ఆంటీ వంత పలికింది. 


ఏం మనుషులు? 


ఓనర్ పెన్షన్ డబ్బులు, కొడుకు నేవీ ఆఫీసర్, మంచి జీతం. ఆర్మీ కాంటీన్ ఇచ్చే సబ్సిడీ సరుకులు, ఇంటి ఖర్చులు తక్కువ. కొన్నాళ్లు అచేతన స్త్రీకి సాయ పడలేరా? 


కుంచిత స్వభావాన్ని మనసులోనే చీదరించుకుని. “ఓకే ఆంటీజీ మేము ఏ సంగతి చెబుతాము. ” అంటూ లేచి వెళ్లారు. 



>>>>>>>>>>



డిగ్రీ చదువుతూనే సితార్, స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంది ప్రజ్ఞ. 


“ప్రజ్ఞా, నీకు పెళ్లి జరిపించాలిని అనుకుంటున్నాను. నీకు ఎలాటి అబ్బాయి కావాలో.. అంటే ఏం చదువు కోవాలి? ఏ ప్రాంతంలోని వాడైతే నీకు యిష్టం? పెద్ద కుటుంబమా, చిన్న కుటుంబమా.. వంటి ప్రశ్నలకు నీ సమాధానం కావాలి. ” తండ్రి పాత్ర నిర్వహిస్తున్న కేశవరెడ్డి అడిగాడు. 


“పెదనాన్నా, నాకు పెళ్లి గురించి ఎటువంటి కోరిక, అభిప్రాయము లేదు. ” క్లుప్తంగా జవాబు వచ్చింది. 


“కోరికా, అభిప్రాయమూ లేవు.. కాని మీ నాన్నకు నేను అన్నను. నాకు నీ పెళ్లి చేయాలిని, చూసి ఆనంద పడాలని నా కోరిక. నాకు నువ్వు తప్ప వేరే నా వాళ్ళు ఎవ్వరూ లేరు. 


నా ఇంట్లో పసిపాపలు పుట్టాలని, ఇల్లంతా పాకుతూ, ఆడుతూ కేరింతలు కొట్టాలని వుంది. తండ్రిగా నా కోరిక తీరలేదు. కనీసం తాతగా పసిపాపలు నా భుజాన ఎక్కితే, నువ్వు గోరు ముద్దలు తిని పించాలి..నా వీపు పైన గుర్రం స్వారి చేయాలి.. నా ఈ చిన్న కోరిక వూహల్లోనే కరిగి పోవలా తల్లీ?” భావోధ్యేగం ఆగలేదు. 


“పెదనాన్నా, నాకు-మీరు, మీకు-నేను వున్నాము, మన మధ్యలో వేరొకరు వస్తే మన జీవితాల్లో ఎలాంటి తుఫాను చెలరేగుతుందోనని భయం. ప్రశాంతంగా గడిచే జీవితాన్ని కెలకటం ఎందుకని నా ఆలోచన, అంతే కానీ మిమ్మల్ని యిబ్బంది పెట్టె మనసు కాదు. ”


“నీకు ఎలాటి భయాలు వద్దు. మనకు అన్ని విధాలా సరితూగే అబ్బాయిని వెతుకుతాను. మనిద్దరికి నచ్చిన సంబంధమే చూస్తాను. సరేనా?”


“నాకు నచ్చాల్సిన విషయం ముఖ్యం కాదు, మీకు నచ్చాలి; అంటే, ఒక అల్లుడు మాత్రమే కాదు, ఈ ఇంటి బాధ్యతను ఒక కొడుకు వలె ఆస్వాదించాలి. 


అట్టి అర్హతలు కల్గిన వ్యక్తి, మనలో కలిసి పోయే సహృదయత గల వారు దొరకటము కష్టమే. అందుకే నేను పెళ్లి గురించి ఎటువంటి అభిప్రాయం పెట్టుకోలేదు. ” 


“సరే, నువ్వు చెప్పావు కదా, నా ప్రయత్నం నేను చేస్తాను. ”


లోకం పోకడ తెల్సిన మనిషి కేశవరెడ్డి. మంచి యోగ్యతగల అబ్బాయి కోసం వెతకటము మొదలైనది. 


ఈ సాహస కార్యక్రమంలో కల్పన లేని లోటు తెల్సి వచ్చింది. కల్పన వుంటే ప్రజ్ఞకు సులభంగా పెళ్లి సంబంధం చూసేదేమో.. ఆరు నెలలైన అబ్బాయి కోసం వేట ఆగిపోలేదు. 


..


ప్రతీ రోజు ఒక మారు సితార్ వాయించే ప్రజ్ఞ, ఆ రోజు కొంచెం ఎక్కువ సేపు వాయిస్తూ వుంది. కళ్ళు మూసుకునే వున్నా చేతి వేళ్ళు స్వరాలను పలికిస్తున్నాయి. 


పరోక్షంగా కిటికీ చాటుగా ఆనంద్ ప్రజ్ఞ సంగీతాన్ని వింటున్నాడు. 


కేశవరెడ్డి ఇంట్లోని మొక్కలను గమనిస్తూ, ఇంటి చుట్టూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే ప్రక్రియలో ఆనంద్ బుజం తట్టాడు. 


“ఆనంద్.. సంగీతం వినాలంటే రూమ్లోకి వెళ్ళి విను, ఇలా దొంగ చాటున వినే దుస్థితి ఎందుకు?” ప్రశ్నించాడు కేశవరెడ్డి. 


“సారీ సేఠ్జీ, ప్రత్యక్షంగా వింటే ప్రజ్ఞా మేడమ్ మనసులోని భావనలు తెలియవు. ఇట్లా చాటుగా వింటే.. ”


“ప్రజ్ఞ భావనలతో నీకేం పని?” కొంచం కటువుగా అన్నాడు యజమాని. 


ఆనంద్ తలవంచుకుని “సేఠ్జీ.. సార్.., నేను ప్రజ్ఞగారిని ఇష్ట పడుతున్నాను, మీ ఇద్దరి మనసులో నా పట్ల ఎలాటి అభిప్రాయం వుందో తెలియదు. 


ప్రతీ ఆదివారం న్యూస్ పేపర్లో మీరు మాట్రిమోనల్స్ ఏకధాటిగా చూస్తుంటే.., నా అభిప్రాయం మీకు చెప్పాలని.. ” మనసులోని కోరికను బయటకు రానిచ్చాడు. 


కేశవరెడ్డి ఆశ్చర్యం నుండి తెరుకొని, “ఆనంద్, ఎప్పుడూ ఒక్కసారి కూడా నువ్వు బయట పడలేదు. కనీసం ప్రజ్ఞకు తెలుసా నీ మనసులోని మాట.. ”


“లేదు, తెలియదు. తిరస్కరణ ఎదుర్కోవడము కంటే మౌనం శ్రేయస్కరం అని నేను ఊరుకున్నాను. ”


“మీ ఇంట్లో వాళ్ళ సమ్మతి తీసుకో.. ”


“అమ్మానాన్నలు లేరు. ఇద్దరలక్కల పెళ్ళిళ్ళు జరిగాయి. నేను ఎక్కువ టైమ్ ఇక్కడే గడుపుతాను కదా సర్. ” 

 

“మంచిది, నేను ప్రజ్ఞను అడిగి, నీకు యే సంగతీ చెబుతాను. ”

========================================================================

ఇంకా వుంది..


========================================================================


సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి





30 views5 comments

5 comentários


@surekhap4148 • 1 day ago

థాంక్స్

Curtir

@divikg5573 • 1 day ago

Interesting turn

Curtir

rakhee venugopal •22 hours ago

Very good going 10 th part

Curtir

Anil Gurram •1 day ago

👌🥳👌

Curtir

Tarani Swati •1 day ago

🎉🎉

Curtir
bottom of page