కల్పతరువు - పార్ట్ 13
- Surekha Puli

- Feb 7, 2024
- 5 min read
Updated: Feb 12, 2024

'Kalpatharuvu - Part 13' - New Telugu Web Series Written By Surekha Puli
Published In manatelugukathalu.com On 07/02/2024
'కల్పతరువు - పార్ట్ 13' తెలుగు ధారావాహిక
రచన: సురేఖ పులి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
బాంబు దాడిలో సత్యలీల భర్త డి. ఎస్. పి. విశ్వం మరణిస్తాడు. మిగిలిన జీవితం ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్‌లో సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది.
పక్క పోర్షన్ అచలాదేవి తో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల, తన భర్త త్యాగిసోనీని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో, అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగిసోనీతో వివాహం జరిపిస్తారు.
పెళ్ళికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు ఆమె బావ పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండక పోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి మకాం మారుస్తాడు ఆమె తండ్రి నారాయణ. ప్రజ్ఞను కొందరు ఆకతాయిలు వేధిస్తుండటంతో తోడుగా తన అసిస్టెంట్ ఆనంద్ ని పంపుతాడు ఆమె తండ్రి స్నేహితుడు కేశవరెడ్డి.
త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక, తనకు జస్ప్రీత్ అనే మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు అంగీకరిస్తాడు త్యాగి. విడాకుల కాగితాల మీద అచల సంతకం చేస్తుంది.
టూర్ కి వెళ్లిన ప్రజ్ఞ తలిదండ్రులు ప్రమీల, నారాయణ తిరుగు ప్రయాణంలో మరణిస్తారు. ఆమెను కేశవ రెడ్డి స్వంత కూతురిలా చూసుకుంటాడు. తనకు ప్రజ్ఞ అంటే ఇష్టమని కేశవరెడ్డితో చెబుతాడు ఆనంద్.
ప్రజ్ఞ, ఆనంద్ ల వివాహం జరిపిస్తాడు కేశవరెడ్డి.
అచల, జ్వాల, అన్నావదినాలతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంది సత్యలీల.
ఇక కల్పతరువు ధారావాహిక 13 వ భాగం చదవండి.
శ్రీవైష్ణోదేవి మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి రూపాల్లో దర్శన భాగ్యం కల్గింది. వచ్చిన భక్తులందరకి పూజారి సిక్కాను బహుమానంగా ఇస్తున్నారు. మరొక ప్రక్కగా ఉన్న శిఖరం మీద ఒక పిండరూపంగా వున్న భైరవనాధుని ఆలయం దర్శించారు.
దేవతల మహిమనో, ప్రకృతి మహత్తరమో అందరి మనసులు ఏదో హాయిని, ప్రశాంతతను పొంది వుల్లాసవంతంగా కొండను దిగ గలిగారు.
>>>>>>>>>>
అలసి వచ్చిన కొడుకు పృథ్వీధర్ కు అన్నం వడ్డించింది సౌభాగ్య.
“అమ్మా, నాన్నగారిని కూడా రమ్మను. ఇద్దరమూ కలిసి భోజనం చేస్తాం. ”
“నీ కోసం చాలా సేపు చూసి, యిక నీ ఆలస్యం భరించలేక భోజనం చేసేశారు. ”
చివర్లో పెరుగన్నం వాయి రాగానే “ప్రజ్ఞ సుఖంగా కాపురం చేస్తున్నా, చేయక పోయినా; పిల్లల్ని, భర్తను కాదని నీ పైన దయతలచి నీ జీవితంలో వస్తుందని ఏమిటీ నీ ధైర్యం?”
“నా మనసు చెబుతున్నది, ప్రజ్ఞ తన మనసులో నాకొక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిందని, తప్పదు కదా అని భర్తతో కాపురం చేస్తుందే తప్ప, నేనంటే, నా ప్రేమన్నా..
అది కాదులే; నాకు జరిగిన అన్యాయం తెలిస్తే ప్రజ్ఞ నాకు తోడుగా వస్తుంది, ఐ యాం షూర్. ”
“నీ లవ్ మేరేజ్, నీ విడాకులు సంగతి ప్రజ్ఞకు తెలియదు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత గానీ ఆమె నిర్ణయం తెల్సుకో, తొందర పనికి రాదు. ” సౌభాగ్య ప్రస్పుటించింది.
“అమ్మా, మనం ముగ్గురం అనుభవించిన నరకం, మానసిక బాధలు, నా ఒంటరితనం గురించి అంతా వివరంగా చెపుతాను. " రాత్రి బస్సులో హైదరాబాద్ ప్రయణమైనాడు పృథ్వీధర్.
***
గేటు తీసుకుని లోపలికి వస్తు ఇంటి ముందున్న ఖాళీ స్తలంలో బ్యాడ్మింటన్ ఆడుకుంటున్న ఇద్దరు అబ్బాయిలను వుద్దేశించి ఆనంద్ గారు వున్నారా? అన్నాడు పృథ్వీధర్.
ఆట మద్యలో ఆపి, “వున్నారు, మీరెవరు?”
“నా పేరు పృథ్వీధర్. నేను డి. ఆర్. డి. ఎల్ లో వుద్యోగం చేస్తున్నాను. ”
ఇద్దరు అబ్బాయిల్లో ఒకతను ఇంట్లోకెళ్ళి ఆనంద్ ను వెంట తెచ్చాడు. తగురీత్యా స్వపరిచయం చేసుకొని, షేక్ హ్యాండ్ల తదుపరి ఇంట్లోకి అడుగుపెట్టారు.
హల్లోకి దారితీస్తూ, “ప్రజ్ఞా, మీ బావ వచ్చారు. ” కిచెన్ వరకు వినిపించాలని కొంచెం స్వరం పెద్ద చేసి చెప్పాడు ఆనంద్.
హాల్ శుభ్రంగా వుంది. సోఫా చూపించి “కూర్చోండి” అంటూ ఎదురు సోఫాలో ఆనంద్ కూర్చున్నాడు.
బ్యాడ్మింటన్ ఆట మానేసి అబ్బాయి లిద్దరూ త్రీసీటర్ సోఫాలో కూర్చున్నారు.
“పెద్దబ్బాయి చాణక్య, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఐ. ఐ. టి. చిన్నవాడు చాతుర్య, బికామ్ హనర్స్ మొదటి సెం., శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్.. ఇద్దరూ డిల్లీలో చదువు తున్నారు. ” చాలా వినయంగా పృథ్వీధర్ కు నమస్కరించారు.
ఇంత పెద్ద పిల్లలా ప్రజ్ఞకు, మనసులో అనుకున్నాడు. ఏది ఇంకా ప్రజ్ఞ బయటకు రాదే!
“ఈ రాక్స్ లోని ప్రైజులన్నీ మా పిల్లల చదువుల్లో, ఆటల్లో వచ్చినవే. ” చాలా సంతోషంగా ఆనంద్ చెబుతుంటే చిరాగ్గా వుంది.
రాక్ లోని సితార్ కూడా చదువుల్లో, ఆటల్లో వచ్చినవేనా? సైంటిస్టు స్వగతంలోని ప్రశ్న.
“వీరు సేఠ్జీ.. అంటూ ఈజీ చైర్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేశవరెడ్డిని పరిచయం చేశాడు.
పృథ్వీధర్ కొత్తగా పరిచయమైన సీనియర్ సిటిజెన్ కు నమస్కారం చేశాడు.
“మీ చిల్డ్రన్” ఆనంద్ అడిగాడు.
“ఇంకా లేదండీ. ”
“లేట్ మేరేజ్, లేట్ చిల్డ్రన్ కంటే అన్నీ టైమ్లి అయితే బెటర్. ”
ఈయనకేం తెల్సు నా బాధ! పృథ్వీధర్ చిరాకు గుణించుకుంటున్నది.
చిరునవ్వుతో ప్రజ్ఞ మంచి నీళ్ళ గ్లాస్ పట్టుకొని వచ్చింది.
దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత మరదల్ని చూస్తున్నాడు. వయసు తెచ్చిన పుష్టి తప్ప ప్రజ్ఞ అందం, కళ్ళలో మెరుపు అలాగే వున్నాయి.
“బాగున్నావా బావ?” అంటూ ఆనంద్ ప్రక్కనే కూర్చుంది.
“పెదనాన్నా, ఇతనే పృథ్వీధర్, మా అమ్మ అన్నయ్య కొడుకు, నాకు వరుసకు బావ అవుతాడు. ”
“ఓహో, అలాగా.. ” కేశవరెడ్డి వచ్చిన అతిధిని నఖశిఖ పర్యంతం చూశాడు.
క్షణం పాటు పృథ్వీధర్ కు అర్థం కాలేదు. ప్రజ్ఞకు పెదనాన్న ఏమిటి, ఆనంద్ కు సేఠ్జీ ఏమిటి.. ఇవేం వరుసలు.. ఏదో తిరకాసు వుంది.
అరగంట సేపు లోకాభి రామాయణం నడిచింది. కాఫీ, బిస్కట్స్ తీసుకున్నాడు.
“మీరు వచ్చిన పనేమిటో చెప్పలేదు?’ ఆనంద్ అడిగాడు.
“ఈ మధ్యనే నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నాకొక మంచి తోడు కావాలి, మా పేరెంట్స్ కు ఇంటి భాద్యత వహించే కోడలు అవసరం.
అందుకే సెకండ్ మేరేజ్ చేసుకోవాలని, మీకేమయినా తెల్సిన సంబంధాలు వుంటే.. ” కొంత నిజం మరి కొంత అబద్దం చెప్పాడు.
“ఇంత చదువు కున్నారు, మంచి జాబ్. విడాకుల వరకు ఎందుకు లాగారు?” చాలా సేపటి వరకు మౌనం.
ప్రజ్ఞ అన్నది “మీ బ్యాడ్మింటన్ అయిపోతే, వేరే గేమ్స్ లేవా? పెద్దవాళ్ళ మాటల మధ్యలో మీరేందుకు?”
పిల్లలు మారు మాట్లాడక బయటికి వెళ్లి ఆట సాగించారు. థాంక్స్ అని కళ్ళతోనే పృథ్వి సైగ సమాధానం.
“పెదనాన్నా, కూర్చొని చాలా సేపయింది, కొద్ది సేపు బెడ్ పైన పడుకోండి. ” ఆ డబల్ రోల్ ముసలాయన్ను చేయి పట్టుకొని బెడ్ రూమ్లోకి తీసుకెళ్లింది.
బరువైన గొంతులో మాటలకు దారి దొరకటము లేదు. “ప్రతీ విషయంలో, ప్రతీ రోజు నన్ను డామినేట్ చేసేది. టూమచ్ సోషల్ గా వుంటున్ది, అత్తా మామలకు మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వదు.
తన జీతం అంతా తన లావిష్ ఖర్చులకే, ఇంటికి అతిధుల వచ్చినా వంటి మీద సరిగ్గా బట్టలు కూడా వుండవు. అసలు వంటింటి ముఖమే చూడదు. ఎంతో సర్దు కోవాలని చూశాను, విసుగు తప్ప నాకేమీ మిగులలేదు.
మ్యూచువల్ డీవోర్స్ అనగానే టక్కున ఒప్పేసుకుంది, ఇసుమంత కూడా విస్మయం లేదు. ” మరొక గ్లాస్ నీళ్ళు తాగాడు.
“ఈ రోజుల్లో చాలా వరకు మాట్రిమోనల్ పెళ్లి సంబంధాలు చెలామణి అవుతున్నాయి. ఫేమస్ మాట్రిమోనల్లో రిజిస్టర్ చేయండి. ” ఆనంద్ సలహా ఇచ్చాడు.
ప్రజ్ఞ మాట్లాడితే బావుండును. ఆనంద్ కళ్ళలో కారం జల్లి, పిల్లల్ని కొట్టి, ప్రజ్ఞను లేవనెత్తుకు పోవాలని తొందర.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి.
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
పేరు :సురేఖ
ఇంటి పేరు: పులి
వయసు: 68 సంవత్సరాలు
భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్
ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.
పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.
ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.
మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.
స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.
HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత
ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.
చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.
మీ ప్రోత్సాహమే నా బలం 🤝
మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.
సురేఖ పులి




Comments