top of page

కస్తూరి రంగ రంగా!! 14


'Kasthuri Ranga Ranga Episode 14' Telugu Web Series
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో..

పున్నయ్యను విచారిస్తారు కస్తూరి రంగ, వసంత్ లు.

తనకేమీ తెలియదంటాడతను.

బయటకు వచ్చాక భూషణ్ కి కాల్ చేస్తాడు.

గోపాలయ్యగారి అడ్వాకెట్ కృష్ణమూర్తి అని పుండరీకయ్య ద్వారా తెలుసుకుంటాడు రంగా.

అతని అడ్రస్ నోట్ చేసుకుంటాడు.

అతన్ని కలుస్తాడు.

అతను సరైన సమాధానాలు ఇవ్వడు.

అతన్ని కలవడానికి గోపాలయ్య, అతని కూతురు కస్తూరి వచ్చారని తెలియడంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

హైవే రెస్టారెంట్ దగ్గర దుర్గాదేవి, కస్తూరిలా ఫోటో తీస్తాడు వసంత్.

ఆ ఫోటోలను రంగా మొబైల్ కి పంపుతాడు.

హైవేలో గంజాయి లోడ్ తో వెళ్తున్న లారీని సీజ్ చేస్తాడు రంగ.


ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 14 చదవండి.


సయ్యద్ సార్ పెద్దకొడుకు ఇర్ఫాన్ దాదాపు రెండు నెలలుగా జీవితాన్ని పైలా పచ్చీస్ అన్ని విషయాల్లో పరమానందంగా ముంబైలో గడుపుతున్నాడు.

రెండువారాలకోసారి అతని మేనమామ ఖాజా... అతనికి కావలసినంత డబ్బును భూషణ్ కుమార్ వద్దనుంచి వసూలుచేసి పంపేవాడు.


కస్తూరి రంగ సయాన్లోని ఐ.జి. ఆఫీస్ కు వెళ్లి సక్సేనా ఐ.జి.ని కలుసుకొన్నాడు. ఇర్ఫాన్ ఫొటోను వారికి ఇచ్చి జరిగిన కథనంతా వివరంగా చెప్పాడు. ఐ.జి. సక్సేనా అంతా విన్నాడు. వారి శిష్యుల వివరాలన్నింటినీ నోట్ చేసుకొన్నాడు... కస్తూరిరంగ ఇచ్చిన ఇర్ఫాన్ ఫొటోను అన్ని స్టేషన్లకు పంపించే ఏర్పాట్లు చేశాడు ఐ.జి.సక్సేనా…


"సార్... థాంక్యూ... ఎలాట్!!..." సంతోషంతో చెప్పాడు కస్తూరి రంగ.


"ఎందుకు... మిస్టర్ కస్తూరి రంగ!.. ఇటీజ్ అవర్ డ్యూటీ... ఎస్.. ఇటీజ్ అవర్ డ్యూటీ..." చిరునవ్వుతో చెప్పాడు సక్సేనా…


తర్వాత ఈమధ్య కాలంలో నలుగురు వ్యక్తులచేత బలాత్కరింపబడి (రేప్ ) చంపబడిన వుమెన్ వెటర్నరీ డాక్టర్ (6.12.2019) డాక్టర్ ప్రియాంకారెడ్డి కేసును గురించి... కరోనా బాధితులకు ట్రీట్మెంటు చేస్తూ తన ఆరోగ్యాన్ని కూడ లెక్క చేయక మరణించిన డాక్టర్ కె. రోజీ ఆంధ్రా (23 సం.లు) ను గురించి.. మరికొందరు ముఖ్యులను గురించి విచారించి.. వారికి తన సానుభూతి తెలియచేసారు ఐ.జి. సక్సేనా.


"సార్!... ఒక సందేహం... మీరు బొమ్మలుకూడ బాగా వేస్తారని విన్నాను... నిజమేనా!...” అడిగాడు కస్తూరి రంగ.

"అవును... మీ సందేహం ఏమిటి?..."


"ముమ్మూర్తుల మనిషిని పోలిన మనిషి వుండగలరా!..."

"వైనాట్... వుండవచ్చు... మన పెద్దలు అంటూంటారు కదా!... మనిషిని పోలిన మనుషులు ఏడుమంది వుంటారని!..." చిరునవ్వుతో చెప్పాడు ఐ.జి.


క్షణం తర్వాత... "అవును మిస్టర్ కస్తూరి రంగా!.. మీకు ఆ సందేహం ఎందుకు కలిగింది.?..." అడిగాడు ఐ.జి సక్సేనా…


"ఒక కేసులో నేను అలాంటి సమస్యను ఎదుర్కొనవలసి వుంటుంది సార్…


"సో... నీవు కూడా డబుల్ యాక్షన్ చేయవలసి వస్తుందేమో! నీవు చేయగలవు. నా మిత్రుడు అనంత్ నాగ్ నీ గురించి అన్నీ వివరాలు చెప్పాడు..." నవ్వాడు సక్సేనా…


"సార్... విత్ యువర్ కైండ్ పర్మిషన్... షల్ ఐ మేక్ ఎ మూవ్!.."

"వాటీజ్ టైమ్?..." అడిగాడు ఐ.జి.సక్సేనా.


వాచీని చూచి “వన్ థర్టీ సార్!..." రంగా జవాబు.

"ఆ... నేను హైదరాబాద్ మీ ఆఫీసుకు వచ్చివుండి... ఈటైమ్ దాకా డిస్కస్ చేసి... నీవు నాతో ఇపుడు చెప్పిన మాటను నేను చెబుతే... దీనికి నీవేమంటావ్?... నన్ను పొమ్మంటావా?..." చిరునవ్వుతో అడిగాడు ఐ.జి.సక్సేనా.


"సార్!... సార్!... ఇది భోజన సమయం కదా సార్... మీరు భోంచేయకుండా వెళ్లడానికి ఎలా ఒప్పుకుంటాను సార్!..." అనునయంగా చెప్పాడు కస్తూరి రంగ.


"సో... న్యాయం... నీకైనా నాకైనా ఒకటేగా!... పద భోజనం చేద్దాం... ఆ.. నీ ఫ్లయిట్ ఎన్ని గంటలకు?..."


"ఆరు గంటలకు సార్!...." గడియారాన్ని చూస్తూ చెప్పాడు.

"నౌ... వన్ ఫార్టీ... ఓకే!... చాలా టైముంది పద..." నవ్వుతూ చెప్పాడు ఐ.జి.సక్సేనా.


ఇరువురూ బయటికి వచ్చి కార్లో కూర్చున్నారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు.


బీచ్ రోడ్లో గేట్వేకి తూర్పు వైపున నైరుతీమూల వున్న తాజ్ హెూటల్ పోర్టికోలో కారు ఆగింది.


ఇరువురూ డైనింగ్ హాల్ కి వెళ్లారు. కూర్చున్నారు.

మెనూ కార్డును సక్సేనా కస్తూరి రంగకు ఇచ్చి... "యువర్ ఛాయిస్..." నవ్వాడు సక్సేనా.


"సార్.... ఈ హెూటల్ కు నేను ఇంతకుముందు రాలేదు.. ఇదే ఫస్ట్ టైమ్..సో... మీరే ఆర్డరు చేయాలి సార్!..." నవ్వుతూ చెప్పాడు కస్తూరి రంగ. సక్సేన ఆర్డర్ చేశాడు.

కస్తూరి రంగ సెల్ మోగింది.

"హలో... గుడ్ మార్నింగ్ సార్... నా పేరు సుగంధి ఎ.డి.యస్.పి.. నా ప్రక్కన మిత్రుడు యాదగిరి... వారూ ఎ.డి.యస్.పి.గారే... వున్నారు. ఐ.జి.సార్ మీకు ఫోన్ చేయమన్నారు... వుయ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇనస్ట్రక్షన్స్... సర్..." ఎంతో వినయంగా చెప్పింది.


"ఓకే... ప్లీజ్ హేవ్ టాక్ విత్ వసంత్ దేశాయ్... డి.యస్.పి. అండ్ ఫాలో హిజ్ ఎడ్వయిజ్... మనం రేపు వుదయం కలుద్దాం..." సెల్ కట్ చేశాడు కస్తూరి రంగ.


భోజనం ముగిసింది. ఐ.జి. సక్సేనా, రంగాలు హెూటల్ ముందుకువచ్చారు.


***


కస్తూరి రంగ చూపులు గేట్వే వైపు మళ్లాయి. తర్వాత రోడ్ క్రాస్ చేస్తున్న జనాల మీద... గేట్ వే ముందు ఆహారాన్ని తింటూ ఆనందంగా ఎగురుతున్న పావురాల మీద…


"సార్!..."

"ఎలిఫెంటా కేవ్స్ ఇక్కడికి ఎంత దూరం?...".


"లెవెన్ కిలోమీటర్స్... బోట్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోపల చేరగలం... సుందర ప్రదేశం... పరమేశ్వర శిల్పాలు ఎన్నో విధాలుగా కనులకు మహదానందంగా వుంటాయి."

రోడ్ క్రాస్ చేస్తున్న వారిపై రంగా చూపు మ... పరుగున రోడ్ క్రాస్ చేశాడు. తమకు ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి చేతిని పట్టుకొని ఆపాడు. చేతిని విదిలించుకొని పారిపోయేదానికి వాడు ప్రయత్నించాడు. తన చేతి లాఘవాన్ని వాడి చెంపపై జోరుగా చూపించాడు. వాడు బిత్తరపోయి నేల కూలపడ్డాడు.

సక్సేనా రోడ్డు క్రాస్ చేసి వారిని సమీపించాడు.


"సార్!.. వీడే ఇర్ఫాన్..." ఆవేశంగా చెప్పాడు కస్తూరి రంగ తన జేబులో నుండి బేడీలు తీసి వాడి చేతులకు తగిలించి... జేబులోని సెల్ ను లాక్కొని... ఈడ్చుకొని వచ్చి కారు వెనుక సీట్లో త్రోశాడు.


కారు ఐ.జి.కార్యాలయానికి వెళ్లింది. ముగ్గురూ దిగారు. ఐ.జి. గారి ఆజ్ఞ ప్రకారం పోలీసులు ఇర్ఫాన్ ను లోనికి లాక్కొని వెళ్లారు…


"సార్!.. దైవనిర్ణయం ఎంతో విచిత్రం. మీరు నన్ను ఆ తాజ్ హోటల్ కు భోజనానికి తీసుకొని వెళ్లకుంటే... వీడు మనకు ఈరోజు దొరికేవాడు కాదు... ఎప్పటికి దొరికేవాడో!... ఏమో!..." ఆనందంగా నవ్వాడు కస్తూరి రంగ.


"కస్తూరి రంగా!... ఐ హ్యావ్ సీన్ యువర్ ప్రామ్ట్ యాక్షన్... ఎక్స్ లెంట్... నీ గురించి విన్నాను. ఈ రోజు ప్రత్యక్షంగా చూచాను. కంగ్రాట్యులేషన్స్... మా పనిని నీవే చేసేశావు..." కరచాలనం చేశాడు... ఐ.జి. సక్సేనా.


ఇరువురూ ఐ.జి.గారి ఛాంబర్లోకి వెళ్లి కూర్చున్నారు.

"సార్... ఒక ముఖ్యమైన విషయం..."

"చెప్పు... కస్తూరి రంగా!..."


"మనం వీడిని ఇపుడో.. రేపో హైదరాబాద్ కు షిఫ్ట్ చేయము. వీణ్ణి మీ కస్టడీలోనే వుంచండి. వీడి మామ ఖాజాసాబ్... ఒకరున్నారు. వాడికి దుర్గాదేవి పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు మంచి లావాదేవీలు.... వీడి సెల్ నేను లాక్కున్నానుగా... దీనిమూలంగా వీడికి ఎవరెవరికి ఎలాంటి కాంటాక్ట్స్ వున్నాయో మనకు తెలుస్తాయి. వీడి రంగప్రవేశం ఎప్పుడనేది నేను మీకు తెలియచేస్తాను... అంతవరకూ వీడిని మీవద్దనే ఉండనీయండి సార్... ఖాజాకు ఇక్కడ అన్వర్ అనే ఏజంట్ వున్నాడు. వాడు చంబూర్ ప్రాంతంలో ఉంటాడు. వాణ్ణి మీరు పట్టుకోవాలి.”


"ఓకే!... అలాగే రంగా!... నీవు ఫ్లయిట్ క్యాచ్ చేయలేవు. ఎయిర్ ఇండియా ఆఫీసు కాంటాక్టు చేసి నైట్ ఫ్లయిట్ కు బుక్ చేయిస్తాను. మీ టిక్కెట్ ఇవ్వండి." అడిగాడు ఐ.జి. సక్సేనా.


బ్రీఫ్ కేస్ తెరచి కస్తూరి రంగా ఎయిర్ టిక్కెట్ ఐ.జి. గారికి ఇచ్చాడు.

ఇంటర్‌కమ్‌లో సెక్రటరీని పిలిచాడు.


రెండు నిముషాల్లో వారి సెక్రటరీ లీనా వచ్చింది. టిక్కెట్ట్‌ను లీనాకు ఇచ్చి విషయాన్ని చెప్పాడు...

టిక్కెట్ట్‌ను తీసుకొని లీనా వెళ్లబోయింది.

"బుక్ ఇమీడియట్లీ... అండ్ గెట్ టిక్కెట్ కన్ఫర్మేషన్..." అన్నాడు సక్సేనా.

"ఓకే సార్!.." లీనా వెళ్లిపోయింది.


"సార్!..."

"ఏమిటి కస్తూరి రంగా!..."


"శ్రీ మహాలక్ష్మి టెంపుల్ చూడాలనివుంది సార్. వీలవుతుందా!..." ప్రాథేయపూర్వకంగా అడిగాడు కస్తూరిరంగా.


"ఓకే!..." ఇంటర్కమ్‌లో లీనాతో చెప్పాడు...

"బుక్ ఫర్ లాస్ట్ ఫ్లయిట్... ఛాన్స్ లేకపోతే టుమారో మార్నింగ్ ఫస్ట్ ఫ్లయిట్... ఓకేనా!..."


"ఓకే సార్"... చెప్పింది లీనా.

"థాంక్యూ సార్!... సారీ... ఐ వుడ్ లైక్ టు యూజ్... యువర్ రెస్టురూమ్ ప్లీజ్"


"రంగా!... విత్ ప్లెజర్... ప్లీజ్..." ఎడం చేత్తో రెస్టురూమ్ డోర్ చూపించాడు సక్సేనా.

కస్తూరి రంగ సివిల్ డ్రస్ తీసుకొని రెస్టు రూమ్ కు వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని... డ్యూటీ డ్రస్ ను మడచి బ్రీఫ్ కేసులో పెట్టి లాక్ చేశాడు. పదిహేను నిముషాల్లో రడీ అయినాడు.


"కస్తూరి రంగా!..."

"సార్!..."


"యు ఆర్ టూ సింపుల్ పా!... వండర్... వండర్...”.

"ఏముంది సార్!... జీవితం చాలా చిన్నది... మనకు ఈ జన్మయను ప్రసాదించిన ఆ జగన్మాతా పితల ధ్యానంతో గడపటం అంటే నాకు ఎంతో ఇష్టం సార్!..." చిరునవ్వుతో చెప్పాడు కస్తూరి రంగా.


"ఈ పైజమా లాల్చీతో నీవు చూచేదానికి ఎలా వున్నావో తెలుసా రంగా!...".

"చెప్పండి సార్"


"సేట్ బేటేకే జైసా హై... మ్యారా ప్యారా భాయ్!..." గలగల నవ్వాడు ఐ.జి. సక్సేనా.

"సార్ మీరూ వస్తారా!..." చిరునవ్వుతో అడిగాడు.


"లేదు... నీవు వెళ్లిరా... అన్నీ తెలిసిన అక్కడికి అనేకసార్లు వెళ్లిన శంభూ అనే ఇనస్పెక్టరు వున్నాడు. హి విల్ గైడ్ యూ."


ఐ.జి. గారు ఇంటర్ కమ్‌లో శంభూను పిలిచాడు. పదినిముషాల్లో ప్రక్క బిల్డింగ్ నుండి అతను వచ్చాడు.

ఐ.జి. శంభూకు కస్తూరి రంగాను పరిచయం చేశాడు.


"శంభూ!... ఎవరో అని భయపడకు. మనజాతివాడే!..." నవ్వుతూ చెప్పాడు సక్సేనా.

కస్తూరి రంగ... శంభూలు శ్రీ మహాలక్ష్మి ఆలయం (వెస్టు)కు కార్లో వెళ్లారు. కస్తూరీరంగా మాతాపితలను దర్శనం చేసుకొని తన ఇల్లాలికి సుఖప్రసవం కావాలని.. ఇల్లాలు బిడ్డతో త్వరలో వచ్చి మరోసారి దర్శనం చేసుకొంటానని మ్రొక్కాడు.


తీర్ధ ప్రసాదాలు సేవించాడు... ఐ.జి. ఆఫీస్ కు తిరిగి వచ్చాడు.


"రంగా... దర్శనం బాగా జరిగిందా!..."

"చాలా బాగా జరిగింది సార్. మనస్సుకు ఎంతో శాంతిగా వుంది..."


"ఓకే!... ఓకే!... ఇదిగో నీ టికెట్... తొమ్మిదిన్నరకు ఫ్లయిట్... త్రీ అవర్స్ టైము వుంది. శంభూ నిన్ను ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తాడు. ఓకేనా!..." అడిగాడు నవ్వుతూ సక్సేనా…


"ఓకే సార్!... థ్యాంక్స్ ఎ లాట్!" రెండు చేతులను జోడించాడు.

"సార్!... చిన్న మనవి!..."

"చెప్పు రంగా!..."


"మీరు పర్సనల్ గా సౌమ్యంగా వాణ్ణి విచారించండి..."

"ఓకే!... అలాగే... ప్లీజ్ క్యారీయాన్.." నవ్వుతూ చెప్పాడు సక్సేనా ఐ.జి.

రంగా కార్లో కూర్చున్నాడు... శంభూ కారు స్టార్ట్ చేశాడు.

***

కస్తూరిరంగ ముంబై ఎయిర్పోర్టుకు చేరేలోపల కీర్తి ప్రసాద్ కు వసంత్ ఫోన్ చేశాడు.


కీర్తి ప్రసాద్ పున్నయ్య కాపురం వుండేది హైదరాబాద్ బాలానగర్ అని చెప్పి అడ్రస్ యస్.యం.యస్. పంపించాడు. పున్నయ్యను పట్టుకొని సెల్ లాక్కొని తన కస్టడీలో పెట్టుకొని వున్నట్టుగా చెప్పాడు.


వసంత్ హైవేలో ఐ.ఐ.టి. దాటిన తర్వాత... ఎయిర్పోర్టు ఎంట్రన్స్ లో... మఫ్టీలో మనవాళ్లను వుంచానని... వారు దుర్గాదేవి భూషణ్ కుమార్... ఖాజా... మరెవరైనా అనుమానాస్పదంగా కనబడితే పట్టుకొనే ఏర్పాట్లను పకడ్బందీగా చేశానని... రేపల్లె విజయవాడలలో వారు కలసికొన్న వ్యక్తులను గురించి... జరిగిన సంభాషణలను గురించి... పట్టుకొన్న గంజాయి లారీని గురించి... కేరళ ముంబైల మధ్యన గంజాయి ప్యాకెట్స్ రవాణాను గురించి... వివరంగా ఐ.జి. అనంత్ నాగ్ గారికి వివరించినట్టు చెప్పాడు...


యాదగిరి... సుగంధి ఎ.డి.యస్.పీలు వారి బృందం... ఖాజా... భూషణ్ కుమార్ ఇళ్లప్రాంతంలో పోలీసులు మఫ్టీలో... తిరుగుతున్నారని... వారి కదలికలను ఫొటోలు కూడ తీస్తున్నామని అన్ని విషయాలు గంట గంటకు వివరంగా... వసంత్ దేశాయ్ గారికి తెలియచేస్తున్నామని వివరించారు.


కస్తూరి రంగ... హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగారు. వసంత్... రంగాను రిసీవ్ చేసుకొన్నాడు. వసంత్ కారు నడుపుతున్నాడు. రంగా ముంబై విషయాలని.... వసంత్ హైదరాబాద్ విషయాలను ఒకరి తర్వాత ఒకరు చెప్పుకొన్నారు.


కారు ఒకటింగ్ కాలు గంటలో లాయర్ కీర్తి ప్రసాద్ చెప్పిన బాలానగర్ ప్రాంతానికి చేరింది. రంగా మాటప్రకారం వసంత్... కారును ఆపాడు. ఇరువురూ దిగారు.


అడ్రస్ ప్రకారం... కొన్ని గజాలు నడచి ఓ ఇంటి ముందు ఇరువురూ ఆగారు.

"బాస్... ఇదే ఇల్లు!..."

"కాలింగ్ బెల్ వుందా... చూడు వసంత్!..."


"వుంది బాస్!..." అన్నాడు వసంత్.

"ప్రెస్ ఇట్..." కస్తూరి రంగ ఆదేశం...

వసంత్ కాలింగ్ బెల్ నొక్కాడు.


రంగా టైమ్ చూచాడు. ఒకటిన్నర... మంచి నిద్ర సమయం.... 'పాపం... నిద్రపోతున్నవాళ్లను లేపుతున్నాం...' విచారంగా అనుకొన్నాడు రంగ.


మూడవ కాల్ కు తలుపు తెరవబడింది. నలభై సంవత్సరాల ఆడమనిషి తలుపు తెరిచింది.

కస్తూరి రంగ తలుపును సమీపించాడు. ఆమెను పరీక్షగా చూచాడు.... ఆమె.. పున్నయ్య భార్య బాలమ్మ... ఆమె రంగాను వసంత్ ను చూచి బెదిరిపోయింది.


ఇరువురూ వేగంగా ఇంట్లో ప్రవేశించి తలుపు మూసారు.

రంగా బాలమ్మ భుజంపై చేయివేసి... "అత్తా!... నేను మీ రంగడిని... భయపడకు.. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను... అత్తా... భయపడకు... భయపడకు... నేను నిన్నేమి చేయను... నిజం చెప్పు!..."

బాలమ్మ ఏడ్చింది.


ఆ ఏడుపును విన్న రంజనీ.. ఆమె ప్రియుడు/భర్త దుర్గాదేవి ద్వితీయ కుమారుడు శ్యామ్ కుమార్ నిద్రలేచి హాల్లోకి వచ్చారు.


తన భర్త పున్నయ్య రెండు రోజులుగా ఇంటికి రాలేదని... ఫోన్ కూడ చేయలేదని... ఏడుస్తూ చెప్పింది బాలమ్మ.

"రాగిణి ఎక్కడ వుంది అత్తా!..." మెల్లగా అడిగాడు కస్తూరిరంగ.

"ఐదేళ్లయింది... ఎటు వెళ్లిపోయిందో తెలీదు బాబూ!..." దీనంగా చెప్పింది బాలమ్మ.


"అత్తా!... దుర్గాదేవి పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు... మామకు మంచి దోస్తి కదా!..." చిరునవ్వుతో అడిగాడు రంగ.

"అవును సార్!..." అన్నాడు శ్యామ్ కుమార్.


కస్తూరిరంగ మెల్లగా శ్యామ్ కుమార్ ను సమీపించాడు. అతని భుజంపై చేయి వేశాడు... నవ్వుతూ అతని ముఖంలోకి చూచాడు..

"నీ పేరు?..."

"శ్యామ్కుమార్!..."


"మీ అమ్మా... అన్నా మంచివాళ్లా.. చెడ్డవాళ్లా..!"

"చెడ్డవాళ్లు... మా మామయ్య గోపాలయ్యను వాళ్ల గొంతు పిసికి చంపారు." అమాయకంగా చెప్పాడు శ్యామ్ కుమార్.


"నీవు మా రంజనీని పెండ్లి చేసుకొన్నావా?.."

"నిన్ననే చేసుకొన్నా.. మంచిరోజు.. రంజనీ అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్... ఈ విషయం మావాళ్లకు తెలీదు..." ఎంతో అమాయకంగా చెప్పాడు శ్యామ కుమార్.


"అత్తా!... ఇక్కడవున్న మీకెవ్వరికీ ఎలాంటి భయం అనవసరం. నిర్భయంగా వుండండి. మళ్లీ కలుస్తాను..." అనునయంగా చెప్పాడు రంగ.


ఇరువురూ... రంగా వసంత్ లు ఇంటినుండి బయటకు నడిచారు.

"సోదరా!... వసంత్ !...''


"బాస్..."

"పోవలెను విజయవాడ..."

"ఓకే సార్!"

"వసంత్!..."

"ఇప్పుడు జరిగిన మా అత్తమ్మగారి ఇంటి మీటింగ్ మనకు రెండు నిజాలు తెలిసాయి. అవి ఏమిటో చెప్పగలవా?..." చిరునవ్వుతో అడిగాడు కస్తూరి రంగ.


"తమ ఆజ్ఞ ప్రభూ...."

"చెప్పుడు..."


"మొదటిది... దుర్గాదేవి రెండవ కుమారుడు.. శ్యామ్ కుమార్ తమ మామగారైన పున్నయ్యగారి రెండవ కుమార్తె చిరంజీవి రంజనీల వివాహం నిన్న జరిగినది... దుర్గాదేవి, భూషణ కుమార్ లకు తెలియకుండా... రెండవది గోపాలయ్యగారి మరణాన్ని దుర్గాదేవి భూషణ్ కుమార్ లు ఆస్థికోసం... వారు వీరి మాటలను కాదని అన్నందున... అంటే వారి కుమార్తె కస్తూరి దేవి గారిని దుర్గాదేవి పెద్ద కుమారుడు భూషణ్ కుమార్ కు పెండ్లి జరిపించనని అన్నందున... గోపాలయ్య గారిని ఆ తల్లీ తనయులు కలసి.... గొంతు పిసికి... అకాల మృత్యువుకు గురిచేసినారన్నది... మనకు ఇపుడు విదితమైన విషయములు ప్రభూ!..." ఆనందంగా నవ్వాడు వసంత్…


"వసంత్... గ్రేట్...గ్రేట్... ఆంధ్రభాష నీ నోటి నుండి అద్భుతముగా జాలువారుచున్నది... సంతసము... మిక్కిలి సంతసము... సోదరా!..." అందంగా ఆనందంగా నవ్వాడు కస్తూరి రంగ.


"వసంత్!... విజయవాడలో మనం చేయవలసిన పనులు రెండు... మొదటిది అడ్వకేట్ కృష్ణమూర్తి గారితో చర్చ... రెండవది లాయర్ కీర్తిప్రసాద్ కస్టడీలో వున్న మా మామయ్య పున్నయ్యగారితో చర్చ..."

"ఓకే... బాస్!..."


సమయం రాత్రి మూడున్నర... కారు హైవేలో 120 కిలోమీటర్ల వేగంతో విజయవాడ వైపుకు నడుపుతున్నాడు వసంత్... కస్తూరిరంగ... ఐ.జి. అనంత్ నాగ్ ను నిద్రలేపి అన్ని విషయాలు వివరించాడు.

---------------------------------------------------------------------------------------

ఇంకా వుంది...

---------------------------------------------------------------------------------------

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
27 views0 comments

Commentaires


bottom of page