top of page

కస్తూరి రంగ రంగా!! 13


'Kasthuri Ranga Ranga Episode 13' Telugu Web Series


Written By Ch. C. S. Sarma



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

పున్నయ్యను బైక్ లో ఫాలో చేస్తాడు కస్తూరి రంగా.

అతను తనకు మేనమామ అవుతాడని వసంత్ తో చెబుతాడు.

పున్నయ్యకు భూషణ్ కుమార్ తో ఉన్న పరిచయం గురించి అతన్ని ప్రశ్నిస్తాడు.

ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 చదవండి.


"చూడు మామా!.. మనం విడిపోయి పదహారేళ్లకు పైమాట... అప్పటికి నీలో నాలో ఎంతో తేడా... నేను పోలీస్... పోలీస్!.. మరి నీవు ఎవరు?... ఏంచేస్తున్నావ్?..... చిరునవ్వుతో అడిగాడు కస్తూరి రంగ.


"కాంట్రాక్టర్!..."

"ఎక్కడ?..."

"హైదరాబాద్లో..."

"వుండేది?..."

అక్కడే!..."


"ఇక్కడికి ఎందుకొచ్చావ్?...".

"కాంట్రాక్టు పని మీదనే..."

"మొన్న ఆ మధ్యన రేపల్లెలో జరిగిన బాంబ్ బ్లాస్ట్... హైవేలో సయ్యద్ సార్ చిన్నకొడుకు సుల్తాన్ ఇతరులు... జీప్ బ్లాస్ట్ కు కారకులు ఎవరో నీకేమైనా తెలుసా మామా!..." అనునయంగా అడిగాడు రంగ.


"సార్!.. నాకేం తెలీదు సార్... తెలీదు.." తొట్రుపాటుతో చెప్పాడు పున్నయ్య.

"చూడు పున్నయ్య మామా!..." చిరునవ్వుతో రంగా…


దీనంగా చెమట కారుతున్న ముఖంతో కస్తూరిరంగ ముఖంలోకి చూచాడు. పున్నయ్య.

"నాకు... ఆ బ్లాస్ట్ లకు నీ ఫ్రెండ్ భూషణ్ కుమార్ కు సంబంధం వుందన్న అనుమానం. నీకు తెలిసిన నిజాలు చెబితే నీకు సన్మానం చేస్తా. అబద్ధం చెప్పావో... వసంత్!... ఏంచేస్తావో చెప్పు..." నవ్వుతూ అన్నాడు కస్తూరిరంగ.


"మామా!..." వసంత్ పిలుపు.

ఉలిక్కిపడి పున్నయ్య వసంత్ ముఖంలోకి దీనంగా చూచాడు.


"వీరు నాకు అన్నయ్యగారు... కనుక మీరు నాకూ... అదే వరుస... మీ మాటలో తేడా వుంటే... మీ షేపే మారిపోద్ది మామ..." అనునయంగా చెప్పాడు వసంత్...

రంగా చిరునవ్వుతో పున్నయ్య ముఖంలోకి చూచాడు…


అతనిలోని నీతి... అవినీతి కస్తూరిరంగకు అతని ముఖంలో స్పష్టంగా గోచరిస్తోంది.

"ఆ.. మామా!... రాగిణీ రంజనీలకు పెండ్లి అయిందా!... వారిద్దరు ఏంచేస్తున్నారు?... అత్త బాలమ్మ ఆరోగ్యంగా వుందా?..."

"ఆ... మీ అత్త బాగానే వుంది బాబూ!... రంజనీ నర్సు... ఉస్మానియా హాస్పిటల్లో.. పెండ్లి అయింది... బాగుంది..." మౌనంగా కన్నీరు కార్చసాగాడు.


"రాగిణి ఏమయింది మామా!..."

భోరున ఏడ్చాడు పున్నయ్య…


"సార్!... ఆ నీచురాలని గురించి ఏంచెప్పేది?... అది ప్యాషన్ డిజైనర్... ఎవరో నార్తు ఇండియన్ తో ఐదేళ్లక్రితం లేచిపోయింది..." కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ విచారంగాచెప్పాడు పున్నయ్య.


"ఏం... మీరు ఆ అబ్బాయిని ఇష్టపడలేదా?...".

"వాళ్ల ప్రేమ విషయమే రంజనీ మాకు చెప్పలేదు...".


పున్నయ్య చెప్పిన అర్థంకాని జవాబులు విని కస్తూరిరంగా వసంత్ ముఖంలోకి చూచాడు. తనకూ ఏమీ అర్థం కాలేదన్నట్టు వసంత్ పెదవి విరిచాడు.

"పున్నయ్య మామా!..."

"సార్!..."

"మీకు గోపాలయ్యగారు బాగా పరిచయం కదూ!!..."

క్షణంసేపు ఆశ్చర్యంతో కస్తూరిరంగ ముఖంలోకి చూచి... "ఆ..ఆ... ఈ వూర్లో వుండగా పరిచయం సార్...".


"మీరు హైదరాబాద్ వెళ్లాక మరల వారిని ఎప్పుడూ కలవలేదా...".

“లేదు బాబూ!... వారెక్కడ?... నేనెక్కడ?..." విరక్తిగా నవ్వాడు పున్నయ్య.


చివరిరోజుల్లో వారు వారి అక్క దుర్గాదేవిగారి ఇంట్లో హైదరాబాద్ లోనే ఉన్నారట... ఆ విషయం నీకు తెలుసా...".

"తెలీదు సార్!...".

"విజయవాడలో వారి లాయర్ ఎవరో అదైనా తెలుసా?..."

"నాకు తెలవదు సార్"


"ఓకే... ఓకే... చూడు మామా!... సయ్యద్ సార్ బావమరిది ఖాజాసాబ్‌కు మీకు పరిచయం వుందా?"

"అహ... లేదు...".

"ఆహా.. లేదు.. ఇదే కదా మీ జవాబు.

"అవును సార్!!..."


"వసంత్.. మామగారి రెండు అడ్రస్ లు హైదరాబాద్... విజయవాడ నోట్ చేసుకొని... వారి ఫోన్ నెంబరు తీసుకొని వారిని పంపించేసెయ్యి...


"లేచి కస్తూరిరంగ రెస్ట్ రూమ్ లోనికి వెళ్లాడు. పున్నయ్య వివరాలను నోట్ చేసుకొని.. తలుపు తెరచి వసంత్ పున్నయ్యను బయటికి పంపాడు.

***

గది బయటకు రాగానే పున్నయ్య దుర్గాదేవి పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు ఫోన్ చేసి 'రంగా'ను గురించిన వివరాలను, అతను తనను గుర్తుపట్టి రూమ్ కు పిలిపించి అడిగిన ప్రశ్నలను గురించి వివరంగా చెప్పాలని ప్రయత్నించాడు. భూషణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రెండు మూడుసార్లు ప్రయత్నించాడు... ఫలించలేదు.. నిరాశతో నిట్టూర్చి తన నిలయం వైపుకు బయలుదేరాడు. గుండెల్లో... కస్తూరిరంగను చూచినప్పటి నుంచి గునపాలు దిగినంత భారం…


కస్తూరి రంగా రెస్టురూమ్ నుండి బయటకు వచ్చాడు. కాలింగ్ బెల్ మ్రోగింది. వసంత్ వెళ్లి తలుపు తెరిచాడు.

సయ్యద్ సార్... పుండరీకయ్యలు ద్వారం ముందు నిలబడివున్నారు. వారి వెనకాల హెడ్ కానిస్టేబుల్ సీతారామ్... అతని వదనం చాలా దీనంగా వుంది. ముందున్న సయ్యద్ సార్... పుండరీకయ్యలు ఏక కంఠంతో "నమస్కారం సార్!..." అన్నారు.


"నమస్తే... నమస్తే!... రండి... లోనికరండి..." ఆహ్వానించాడు రంగా... ముగ్గురూ గది లోనికి వచ్చారు.

వసంత్ తలుపు బిగించాడు.


వెనుకవైపున ఉన్న హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ ను రంగా చూచి... “ఓ...హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ గారూ వచ్చారా!... వసంత్!..." అదోలా వ్యంగ్యంగా నవ్వాడు రంగా....


"అవును సార్!... సీతరామ్ గారూ వచ్చారు!..." హెడ్ కానిస్టేబుల్ వైపు చూస్తూ వసంత్ ఆనందంగా నవ్వాడు.


"సార్!... మనం ఈరోజు ఇక రేపల్లె వెళ్లవలసిన అవసరం లేదనుకొంటాను!...". అడిగాడు వసంత్.

"ఆ... ఆ... అవును... అవసరం లేదు. మనం కలవాలనుకొన్న వారంతా ఇక్కడికే వచ్చేశారుగా..." చిరునవ్వుతో చెప్పి వారివైపు చూచి...

"సార్ ముందు కూర్చోండి.. తొలి బస్సులో బయలుదేరి వుంటారు. వసంత్... కాపీ టిఫన్ ఆర్డర్ చేయి.”చెప్పాడు కస్తూరి రంగా.


వసంత్ ముగ్గురికి ఏంకావాలో కనుక్కొని ఆర్డర్ చేశాడు.

"ఇరవై నిముషాల్లో తెస్తాడు.. మీరు ఈలోపల ఫ్రెష్ అవ్వండి..." వారికి రెస్టు రూమ్ ను చూపించాడు వసంత్ దేశాయ్ డిఐజి.

ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు రెస్టు రూమ్ లోకి వెళ్లి వచ్చారు. సీతారామ్ రెస్టురూమ్ లో ఉండగా...

"సార్... ఆ బాంబ్ బ్లాస్ట్ వూర్లో చేసింది నా పెద్దకొడుకు ఇర్ఫాన్. హైవేలో నా చిన్నకొడుకుపై చేసింది ఎవరో... వాడిని పట్టుకొంటే తెలుస్తుంది..." చెప్పాడు సయ్యద్ సార్. కుమారుని ఫొటో ఇచ్చాడు.


"సార్... అందుకు సాక్షి ఆ సీతారామే సార్..." పుండరీకయ్య చెప్పాడు.

కస్తూరి రంగా సెల్ మ్రోగింది.

ఐ.జి. అనంత్ నాగ్ గారి కాల్…


సెల్ చేతికి తీసుకొని "గుడ్మార్నింగ్ సార్!..." అన్నాడు రంగ.

"యస్.. గుడ్మార్నింగ్ కస్తూరి రంగా!... హౌ ఫార్ యు ఆర్ ప్రోగ్రెస్డ్ ఆన్ రేపల్లె బాంబ్ బ్లాస్ట్?”


"చాలా వివరాలు తెలిసాయి సార్... ఒక ముఖ్యమైన సాక్షి. అతను ఒకనాటి రేపల్లెవాడే!... దొరికాడు. ఇన్వెస్టిగేషన్ చేశాను. అతను దుర్గాదేవి పెద్ద కొడుకు భూషణ్ కుమార్ కు ముఖ్యుడు. గోపాలయ్యగారిది కూడ సకాల మరణం కాదని నా అనుమానం... త్వరలో నిజాలన్ని వెలుగులోకి తప్పక వస్తాయి సార్... బాంబ్ బ్లాస్ట్ కు కారణం సయ్యద్ సార్ పెద్దకొడుకు ఇర్ఫాన్. వాడు పరారై బాంబేలో వున్నాడు. దానికి సాక్ష్యం.. అతని నాన్నగారు సయ్యద్ సార్ గారే...”.


"అలాగా!..."

"అవును సార్!..."

"యు డు వన్ థింగ్..."

"చెప్పండి సార్!...”.


"వెంటనే బాంబే బయలుదేరు. ఐ.జి. సక్సేనా నా మిత్రుడు. అతన్ని కలసి ఇర్ఫాన్ ఫొటో... కేసు వివరాలు సక్సేనాకు చెప్పి వచ్చేయి. ఆ ఇర్ఫాన్ గాణ్ణి అతను అరెస్టుచేసి హైదరాబాదుకు చేరుస్తాడు. నీవు ఈలోపల గోపాలయ్యగారి మరణ యదార్ధ గాధను ఎంక్వయిరీ చేద్దువుగాని... సరేనా!..." అడిగాడు ఐ.జి. అనంత్ నాగ్ గారు.

"యాజ్ యు సెడ్.. రైట్ సర్...".


"ఓకే.... టేక్ కేర్ డియర్... ఫర్ ఎవ్విరి మూమెంట్ అండ్ స్టెప్!..." ఐ.జి

అనంత్ నాగ్ గారి హెచ్చరిక.

"ఓకే సార్!... థాంక్యూ!..."


ఐ.జి. గారు సెల్ కట్ చేశారు. కస్తూరిరంగా వసంత్ దేశాయ్ ముఖంలోకి చూచాడు.

"సో బాస్... మూట బాంబేనా!..." నవ్వాడు వసంత్.

"హైదరాబాద్ టు బాంబే !.."


"ఆ.. సార్ మీరు ఉభయులూ..." అపుడే రెస్టు రూమ్ నుంచి వచ్చిన సీతారామ్ ను చూచి.. "మీరు ముగ్గురు వచ్చి మా శ్రమను తగ్గించారు..." చిరునవ్వుతో చెప్పాడు కస్తూర రంగా యస్.పి.


టిఫిన్ వచ్చింది.

"ఆ.. టిఫిన్ తినండి... తర్వాత మాట్లాడుకుందాం..." అన్నాడు రంగా.

బ్యారర్ ముగ్గురికి సర్వ్ చేశాడు.


కస్తూరి రంగా టీవీ ఆన్ చేశాడు. ఐదుగురులో ఇరువురు టీ తాగుతూ ముగ్గురు టిఫిన్ తింటూ టీవీ ప్రోగ్రాము చూడసాగారు... వారు ముగ్గురు టీ త్రాగిన తర్వాత...

"హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ గారూ!..." మెల్లగా పిలిచాడు కస్తూరిరంగ.


"సార్" అంటూ లేచి నిలబడ్డాడు సీతారామ్ గారు.


"కూర్చోండి! కూర్చోండి!!... మనుష్యులు తెలిసి తెలియక నేరాలు చేస్తుంటారు. తాను చేసింది నేరం అని తెలిశాక పశ్చాత్తాపంతో ఒప్పుకొంటే శిక్ష తగ్గుతుంది. మనకంటే తెలివిగలవారు లేరనుకొని ఎదుటి వారిని మోసం చేయాలనుకొనే వారికి నేర నిరూపణతో పడే శిక్ష... చాలా గొప్పది. మనిషిగా పుట్టినవాడు ధర్మాన్ని రక్షించాలే తప్ప... సమాధి చేయ ప్రయత్నించరాదు. ప్రస్తుతంలో మనందరికీ పాత్రలున్న ఈ నాటకంలో అసలైన నేరస్థులు ఎవరు? వారికి పడబోయే శిక్షలు... త్వరలోనే బట్టబయలౌతాయి. సార్... మీరుగా వచ్చి మీకు తెలిసిన నిజాలను చెప్పినందులకు... మీకు మా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను. మీకు తెలిసిన నిజాలు చెప్పండి..."


"అడగండి సార్!..." అన్నాడు సయ్యద్.


"మాకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా చెబుతాం..." అన్నాడు పుండరీకయ్య.


"ప్రస్తుతంలో గోపాలయ్యగారి ఆస్తి విలువ ఎంత వుండవచ్చు?".


సయ్యద్... పుండరీకయ్యలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

"సార్!.." అన్నాడు పుండరీకయ్య..

"చెప్పండి!..."


"దాదాపు వంద కోట్లకు పై మాటే సార్!..."

"వారి అడ్వకేట్ ఎవరు?..."

"కృష్ణమూర్తి... సీనియర్ లాయర్... విజయవాడ."

"వారి ఇల్లు ఎక్కడ?..." అడిగాడు రంగ.


అడ్రస్ చెప్పాడు పుండరీకయ్య. వసంత్ వ్రాసుకొన్నాడు... సయ్యద్... పుండరీకయ్యల సెల్ నెంబర్సు నోట్ చేసుకొన్నాడు.


"మీ సహకారానికి ధన్యవాదాలు... ఇక మీరు బయలుదేరండి సార్!... మేము అడ్వకేట్ గారిని కలవటానికి వెళుతున్నాము.." చిరునవ్వుతో చెప్పాడు రంగా.

ఆ ముగ్గురు లేచి నమస్కరించారు.


సీతారామ్ ను బయటకు వెళ్లమని చెప్పాడు రంగ.

అతను గదినుండి బయటకు నడిచాడు.

"సార్... మీ ఇరువురూ జాగ్రత్తగా ఉండండి. నేను మీ సెల్ కు ఒక అడ్రస్ పంపుతాను. మీరు అక్కడికి వెళ్లండి."

సయ్యద్... పుండరీకయ్య సరే అన్నారు. నలుగురూ గదినుండి బయటకు వచ్చారు.


వసంత్ కారును అడ్వకేట్ కృష్ణమూర్తిగారి ఇంటి ప్రక్క సందులో ఆపాడు. ఇరువురూ కారు దిగి... ఆ భవంతి వరండాలో ప్రవేశించారు.

కాలింగ్ బెల్ నొక్కాడు వసంత్…


ఒక నిముషంలోపలే ఇరవై సంవత్సరాల మోడరన్ యువతి వారి ముందు నవ్వుతూ నిలిచింది....


"ఎవరు కావాలి సార్!..." అడిగింది.

"అంటే!..." ఆశ్చర్యంతో అప్రయత్నంగా అన్నాడు వసంత్..."


"పెద్దయ్యా!... చిన్నయ్యా!..." నవ్వుతూ అడిగింది ఆ వనిత.

వసంత్ ఆశ్చర్యంతో రంగా ముఖంలోకి చూచాడు. అతనికి అయ్యల భాష అర్థం కాలేదు. రంగాకు ఆ భాష అర్ధం అయింది.

"పెద్దయ్యగారు!..." అన్నాడు.

"మీరు!..."


కస్తూరి రంగా వసంత్ లు సివిల్ డ్రస్ లో ఉన్నారు.

తన కార్డును ఇచ్చాడు రంగా... వెంటనే వసంత్ తన కార్డును ఇచ్చాడు.


"ఓ... సార్... ప్లీజ్ టేక్ యువర్ సీట్. సార్ గారికి చూపించి వస్తాను. ఇరువురు వ్యక్తులు వారి ముందున్నారు... డిస్కషన్ తో!...వారు వెళ్లగానే లోనికి మీరు వెళ్లుదురుగాని... ప్లీజ్ సిడవున్!..." ఎంతో వినయంగా చెప్పింది ఆ యువతి.


'ఇద్దరు పోలీసులు... పెద్దర్యాంక్ వాళ్లలా వున్నారు... ఎందుకొచ్చారో ఏమో!... అనుకొంటూ కృష్ణమూర్తిగారి గదిలో ప్రవేశించి వారి ముందు తన చేతిలోని విజిటింగ్ కార్డులను వుంచి గది బయటకు నడిచింది.


ఐదునిముషాలలో ఆ ముగ్గురూ గదినుండి బయటకు వచ్చి వీధిలో ప్రవేశించారు. గదినుండి బెల్ మ్రోగింది.

ఆమె రంగా వసంత్ లను సమీపంచి...

"సార్ పిలుస్తున్నారు... లోనికి వెళ్లండి సార్!..." వినయంగా చెప్పింది.


ఇరువురూ లాయర్ గారి గదిలో ప్రవేశించారు.

కృష్ణమూర్తిగారి తండ్రి... తాతగారు కూడ లాయర్లే...

"గుడ్మార్నింగ్ సార్...." ఇరువురూ విష్ చేశారు.


కృష్ణమూర్తి విష్ చేసి... "కరోనా కాలం... కరచాలనం బంద్..." నవ్వుతూ '‘కూర్చోండిసార్..." అన్నాడు లాయర్ కృష్ణమూర్తి.

ఇరువురూ వారి టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు.


"సార్!... విషయం ఏమిటి సార్?" అడిగాడు కృష్ణమూర్తి.

"రేపల్లె గోపాలయ్య గారికి మీరు పర్మినెంట్ అడ్వకేట కదాసార్!..."


అవును... నాకు వారితో పరిచయం వారి చివరి రోజుల్లో... మేబీ.. వన్ ఆర్ టూ ఇయర్స్... మా నాన్నగారికి వారికి మంచి స్నేహం.... వారు సమవయస్కులు...." చెప్పాడు లాయర్ కృష్ణమూర్తి...

"సార్!..."

"ఆ... అడగండి..."


"గోపాల య్య గారు తన ఆస్థినంత మొగపిల్లలు లేనందున ఎవరిపేర వీలునామా వ్రాశారో చెప్పగలరా?..."


"ఆ వీలునామా నాన్నగారు వ్రాశారు. ఎక్కడుందో వెతకాలి. టైమ్ పడుతుంది..." నిర్లక్ష్యంగా చెప్పాడు కృష్ణమూర్తి.


ఎంత టైమ్ సర్... ఆ ఫైల్సును మా ముందు వుంచితే మేమూ వెతుకుతాము సార్!... ప్లీజ్..." ప్రాధేయపూర్వకంగా అడిగాడు కస్తూరి రంగ.

రిసెప్షనిస్టు లోనికి వచ్చింది.


"సార్... హైదరాబాదు నుండి దుర్గాదేవి... వారి అబ్బాయి.. గోపాలయ్యగారి కుమార్తె పచ్చారు సార్.... మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు...."

కస్తూరి రంగ.... కృష్ణమూర్తిగారి టేబుల్ క్రింద తమిడాడు చిరునవ్వుతో…


కృష్ణమూర్తి లేచి బయటకు నడవబోయాడు.

"సార్..." పిలిచాడు కస్తూరిరంగ. "కొంచెం అర్జంటు పనివుంది. వెళ్లాలి. మేము తర్వాత విత్ ఇన్ డే ఆర్ టూ వస్తాం సార్!..."


"అలాగా!..." కృష్ణమూర్తి క్షణంసేపు పరీక్షగా రంగా ముఖంలోకి చూస్తూ "ఓకే మీ యిష్టం" అంటూ వెళ్లిపోయాడు.

"బాస్!... ప్రత్యర్థులు..." మెల్లగా చెప్పాడు వసంత్.

"అవును!..."

"ఎందుకొచ్చినట్టు?..."

"ఎందుకైనా రానీ!... ముందు బయటకు నడు... వారి కంటపడకుండా!... మనం చూడవలసింది గోపాలయ్యగారి కూతురు గారిని, వీలైతే ఫొటో కూడా తీయాలి."

"చెప్పారుగా బాస్... ఓకే!..." నవ్వాడు వసంత్.


"షూట్!..."

"చేస్తాను..."


వసంత్... కస్తూరిరంగలు వేగంగా బయటకి నడిచి కార్లో కూర్చొని వెళ్లిపోయారు. రంగా కారును రైల్వే స్టేషన్ వెనుకవైపుకు పోనిచ్చాడు. తాను దిగాడు.


"వసంత్!... నీవు దుర్గమ్మగుడి వెనకాల వున్న ఓవర్ బ్రిడ్జి క్రిందకు చేరు. వారు తిరుగు ప్రయాణంలో ఆ దారిన వస్తే ఫోన్ చేయి... నేను నిన్ను కలుస్తాను. నాదారికి వస్తే నేను నీకు ఫోన్ చేస్తాను. నీవు నన్ను కలు. మనం వారిని తిరుగు ప్రయాణంలో ఫాలో చేయాలి. అమ్మాయిగారి ఫొటో నీకు వీలైతే నీవు... నాకు వీలైతే నేను తీయాలి. సరేనా!..." కాస్త ఆవేశంగా చెప్పాడు కస్తూరి రంగ...


"యస్... బాస్..." చెప్పాడు వసంత.


కస్తూరి రంగ రైల్వే స్టేషన్ వెనుకభాగంలో దిగి... వసంత్ ను దుర్గమ్మగుడి వెనుక భాగపు హైదరాబాద్ హైవేలో వుండవలసిందిగా చెప్పి పంపాడు. వసంత్ స్టేషన్ నుండి ఆ ప్రాంతానికి ఆటోలో బయలుదేరాడు. అరగంటలో చేరాడు.

తొమ్మిదిన్నర ప్రాంతంలో వసంత్ ఫోన్ చేసి వాళ్లు తనను క్రాస్ చేసి హైవేలో వెళ్లారని చెప్పాడు.


కస్తూరి రంగ పావుగంటలో వసంత్ వున్న ప్రాంతానికి చేరి వసంత్ ను ఎక్కించు కొని ముందుకు సాగాడు.

హైవేలో వారు భోజనానికి ఆగారు.


కస్తూరి రంగ గమనించాడు.... తన కార్ ను స్లో చేశాడు. ముందు కారునుండి దుర్గాదేవి... కస్తూరి... భూషణ్ కుమార్... దిగారు. వారి కారుకు వ్యతిరేక దిశలో రంగా కారును ఆపాడు.

సిటీ దాటగానే షర్టును తను మార్చి వసంత్ ను కూడ మార్చుకొనేలా చేశాడు.

ఇరువురూ కారు దిగారు.


దుర్గాదేవి.. కస్తూరి రెస్ట్ రూమ్ వైపుకు నడిచారు... తిరిగివచ్చే సమయంలో హెూటల్ ముందున్న నియాన్ దీపాల కాంతిలో వసంత్ ఇరువురినీ ఫొటో తీశాడు.


వారికి దూరంగా కూర్చొని డిన్నర్ చపాతీ డాల్, లస్సీలను సేవించారు మిత్రులిరువురూ.


దుర్గాదేవి బృందం డిన్నర్ ముగించి కార్లో కూర్చున్నారు. భూషణ్ కుమార్ కారును స్టార్ట్ చేశాడు...

వసంత్ తాను తీసిన ఫొటోలను కస్తూరిరంగాకు చూపించాడు.


రంగా ఎంతగానో ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు.

"వసంత్ ఆ ఫొటోలను నాకు పంపు..." అన్నాడు రంగా సాలోచనగా...

"బాస్... ఏమిటా దీర్ఘాలోచన?..." చిరునవ్వుతో ఆడిగాడు వసంత్…


"వసంత్!... నీవు... నేను ముంబై నుండి తిరిగి వచ్చేవరకు ఆ ముగ్గురి మూమెంట్సును మారు వేషంలో గమనించు..."

"సరే బాస్!..." ఆ ఫొటోలను కస్తూరిరంగాకు పంపాడు.

డ్రైవింగ్.. రంగా... మౌనంగా 120, 130 కె.యం. స్పీడున వారి కారును ఫాలో చేశాడు…


వసంత్ ఎ.డి.యస్.పి.... సుగంధికి ఫోన్ చేసి ఖాజాసాబ్... దుర్గాదేవి పెద్ద కుమారుడు భూషణ్ కుమార్... విదేశాన్నించి తిరిగి వచ్చిన కస్తూరీల మూమెంట్స్ ను జాగ్రత్తగా గమనించాలి... ముఖ్యమైన సంభాషణలు ఏమైనా వారితో జరిగినా... మారువేషాల్లో ఫాలో చేసి రికార్డు చేయాలని... తాను వారిని రేపు ఉదయం కలుస్తానని చెప్పాడు.


రంగా మనస్సున... అమెరికా రిటన్ కస్తూరి... ఆమె తలపుకు రాగానే కనుబొమ్మలు ముడిపడ్డాయి... 'ఏమిటిది?... ఏమిటిది?... ఆశ్చర్యం! ఆశ్చర్యం!! ' అనుకొన్నాడు....

"వసంత్!..."

"సార్!..."


"కాల్ యాదగిరీ..."

వసంత్ యాదగిరి నెంబరు డయల్ చేసి రంగా చేతికి ఇచ్చాడు.

"యాదగిరి సార్...."

"సార్!..."


"ఐ.ఐ.టి. దాటి బాంబే హైవేలో ఓ నూరు కిలోమీటర్లలో రెండు మూడు చోట్ల వెళ్లే ట్రాఫిక్ లో... ప్రైవేటు కార్లును తనిఖీ చేయండి... ఖాజా... ఆర్ ఎనీపర్సన్స్ మీ ప్రశ్నలకు తడబడుతూ జవాబు చెపితే... పుట్ దెమ్ ఇన్ జైల్... ముఖ్యంగా దుర్గాదేవి... ఆమె పెద్ద కుమారుడు భూషణ్ కుమార్... కస్తూరి.... వీరు హైదరాబాద్ దాటి పోకూడదు.. మీ అనుచరులను కొందరిని ఎయిర్ పోర్టు ఎంట్రన్స్ లో వుంచి ఎవరైనా వస్తే అరెస్ట్ దెమ్... ఐ విల్ టాక్ విత్ జడ్జి... యు ప్రపేర్ ద అరెస్టు వారెంట్ అండ్ గెట్ సిగ్నేచర్ ఫ్రమ్ ఐ.జి. సార్... నేను ఇపుడే ఐ.జి.సార్ తో మాట్లాడుతాను. మీరు... సుగంధి మీ బృందం చాలా అలర్ట్ గా కొన్ని రోజులు పనిచేయాలి... సరేనా!..." నిశ్చలస్వరం... మాటలవేగం... శాసనం...


"అలాగే సార్!..." యాదగిరి జవాబు.

రంగా కట్ చేశాడు. ఐ.జి. అనంత్ నాగ్ నెంబరుకు డయల్ చేశాడు.

ఐ.జీ.గారు... "హలో!..."

"సార్!... కస్తూరి రంగ... గుడ్నైట్ సార్!...”


"కస్తూరిరంగా!... ఏమిటి?... ఈ సమయంలో?..."

"చిన్న విన్నపం సార్!..."

"చెప్పండి!..." నవ్వాడు ఐ.జి... రంగా అన్న స్టయిల్ కు…


"సార్!... దుర్గాదేవి వారి పెద్దకొడుకు భూషణ కుమార్.. గోపాలయ్య గారి కుమార్తె కస్తూరి ఈ సాయంత్రం వారి అడ్వకేట్ కృష్ణమూర్తిగారి వద్దకు వచ్చారు. ప్రస్తుతంలో గోపాలయ్యగారి ఆస్తి విలువ వందకోట్లు. భూషణ్ కుమార్ కు కస్తూరి గారికి వివాహం జరిగితే... ఆ పందకోట్ల ఆస్తికి సర్వాధికారి భూషణకుమార్. మీ సెల్ కు ఒక మెసేజ్ పంపుతాను... ప్లీజ్ కాన్ఫిడెన్షియల్... ప్లీజ్ సీ... నేను హైవేలో వారి వెనక వున్నాను. యాదగిరిని... సుగంధిగారిని ఎలా వర్తించాలో వివరించాను. యాదగిరి మీ వద్దకు ఒక సంతకానికి వస్తాడు. పర్మిషన్... ప్లీజ్ సైన్... నేను రేపు ఫస్ట్ ఫ్లయిట్లో మీరు చెప్పినట్టుగానే ముంబై వెళుతున్నాను. వసంత్ మిమ్మల్ని కలుసుకొని అన్ని విషయాలు వివరంగా చెబుతాడు. ముంబైనుండి రాగానే నేను మిమ్మల్ని కలుస్తాను. గుడ్నైట్ సార్..." కస్తూరి రంగా చెప్పడం ముగించాడు.


"ఓకే... కస్తూరి రంగా!... టేక్ కేర్!... గుడ్లక్!!.." ఐ.జి. అనంత్ నాగ్ సెల్ కట్ చేశాడు.

"వసంత్!... అడ్వకేట్ కీర్తి ప్రసాద్ కు కాల్ చేయి..." చెప్పాడు రంగా.


వసంత్ డయల్ చేసి రింగ్ రావడంతో కస్తూరి రంగా చేతికి సెల్ ఇచ్చాడు.

"కీర్తిప్రసాద్... సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్... ఐ వాంట్ ఎ ఫేవర్ ఫ్రమ్ యు..."

"చెప్పండి సార్!... తప్పకుండా చేస్తాను"


"పున్నయ్య అడ్రస్ పంపుతాను. ఇపుడే వెళ్లి వాణ్ణి నీ కస్టడీలో రెండు రోజులు వుంచండి. సెల్ లాక్కోండి. వాడికి ఎవరి దగ్గర నుంచి కాల్స్ వస్తాయో గొంతు మార్చి మాట్లాడి నోట్ చేసుకోండి!... మీరు చేయగలరనే నమ్మకంతో... మీకు ఆ పని చెప్పాను. నేను ఉదయాన్నే ముంబై వెళుతున్నాను... రాగానే విజయవాడ వస్తాను. మనం కలుద్దాం. సరే సార్..." అనునయంగా అడిగాడు కస్తూరి రంగ.


"ఓకే..సార్!" కీర్తి ప్రసాద్ సంతోషంగా చెప్పాడు.

"బై..." రంగా సెల్ కట్ చేసి వసంత్ కు అందించాడు.


వర్షం... తూర ప్రారంభమయింది. చలిగాలి... ముందు వెళుతున్న లారీ టైర్ పంచర్....

రంగా లారీని సమీపించాడు.. కారును ఆపి దిగాడు. డ్రైవర్ క్యాబిన్ ను సమీపించాడు. డ్రైవరు భయంతో దిగాడు.


"లారీలో గంజాయి వుందా?..." మెల్లగా అడిగాడు కస్తూరి రంగ. రంగా పర్సనాలిటీని చూచి వాడు 'వుందని' నిజం ఒప్పుకున్నాడు.


వసంత్... "సార్.. ఇందులో గంజాయి వుందని మీరు ఎలా గుర్తించారు..." అడిగాడు.

జేబునుంచి బేడీలు తీసి డ్రైవర్ చేతికి వేశాడు. యాదగిరికి ఫోన్ చేసి లొకేషన్ చెప్పి వెంటనే రమ్మన్నాడు.

"వసంత్. అంతా అనుభవం... నీవు ఇక్కడే వుండు... వెనుక వచ్చేవాళ్లకి ఈ లారీకి ఏమైనా సంబంధం వుందేమో చూడు. యాదగిరి వస్తాడు. లారీతో సహా హైదరాబాద్ చేరండి."


డ్రైవర్ ను కార్లో కూర్చోబెట్టుకొని బయలుదేరాడు కస్తూరి రంగ. డ్రైవర్ని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్టేషన్లో ఉంచి తన క్వార్టర్ కి వెళ్లాడు.

----------------------------------------------------------------------------------------

ఇంకా వుంది...

-----------------------------------------------------------------------------------------

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link


Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



23 views0 comments

Commenti


bottom of page