top of page
Original.png

ఖరీదైన స్నేహం


తండ్రి జీవితకాలపు కష్టార్జితంతో కొన్న ఆల్టో కారును స్నేహితుడు అడగడంతో ఆలోచనలో పడిన దరహాస్

Kharidaina Sneham - Telugu Moral Story | Harish Babu Pondugula

ఖరీదైన స్నేహం తెలుగు నీతి కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 02/09/2026


స్నేహం అంటే కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం, ప్రతిఫలం ఆశించకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవడం. కానీ ప్రతి స్నేహం వెనుకా అదే నిస్వార్థ భావన ఉంటుందా?


"ఒరేయ్ దరహాస్... ఆ ఆల్టో కార్ కాస్త నేర్చుకోరా... ఎటు అయినా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది" అంటూ బ్రతిమాలుతున్నారు రాఘవయ్యగారు తన కొడుకు దరహాస్ ని. ఆరు అంతస్తుల కట్టడాలపై సర్కస్ లాగా బ్యాలెన్స్ చేస్తూ, అరవై ఏళ్ల పాటు కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు రాఘవయ్యగారు.


ఆయన జీవితకాలపు కష్టార్జితం, రూపాయి రూపాయి కూడబెట్టిన పొదుపుతో తన కుటుంబం కోసం ఒక సరికొత్త మారుతి ఆల్టో కారును కొన్నారు. అది ఆయనకు కేవలం ఒక వాహనం కాదు, ఆయన నలభై ఏళ్ల కష్టానికి ప్రతీక. కానీ వయసు పైబడటం, డ్రైవింగ్ అంటే కాస్త భయం వేయడంతో రాఘవయ్యగారు తన కొడుకు దరహాస్‌ను పిలిచి, "నాన్నా, ఈ కారు డ్రైవింగ్ నా వల్ల కాదు రా... నువ్వు డ్రైవింగ్ నేర్చుకుని నన్ను తిప్పాలి" అని చెప్పారు.


తండ్రి కల నెరవేర్చడం కోసం దరహాస్ వెంటనే ఒక డ్రైవింగ్ స్కూల్‌లో చేరి లైసెన్స్ తీసుకున్నాడు. తండ్రి కారును రోడ్డు మీదకి తెచ్చే ధైర్యం చాలక, తన కాలేజీ రోజుల్లో మంచి స్నేహితుడైన చైతన్యను సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల్లో చాలా స్నేహపూర్వకంగా ఉండే చైతన్య, ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా మారిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ప్రతి దాంట్లోనూ లాభనష్టాలు బేరీజు వేసే స్వార్థపరుడిగా తయారయ్యాడు. అయినప్పటికీ, దరహాస్ మొహమాటంగానే అడిగాడు—"రోజుకి కేవలం పది నిమిషాలు నా పక్కన కూర్చుని డ్రైవింగ్ సరిగ్గా వచ్చేలా సాయం చేయరా" అని.


అయితే, దరహాస్ చైతన్య ఒప్పుకోడేమో, ఒప్పుకున్నా నాకేంటి అంటాడేమో అనుకున్నాడు. కానీ ఊహకు విరుద్ధంగా చైతన్య ఒప్పుకున్నాడు. పేచీలు, కండిషన్లు పెట్టకుండానే సరే అన్నాడు. అంతేకాదు, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వరుసగా నాలుగు రోజుల పాటు రోజూ సాయంత్రం దరహాస్ వెంటే ఉండి డ్రైవింగ్ నేర్పించాడు. ఇది చూసి దరహాస్ ఆశ్చర్యపోయాడు. "నాకోసం నిస్వార్థంగా సాయం చేస్తున్నాడే చైతన్య... నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా ఏంటి" అనుకుంటూ మనసులో చైతన్యను అభినందించుకున్నాడు.


రోజులు గడిచాయి. చైతన్య చేసిన సహాయానికి దరహాస్ ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత, ఒక రోజు సాయంత్రం దరహాస్‌కు చైతన్య నుండి ఫోన్ కాల్ వచ్చింది.


చైతన్య: "హలో దరహాస్! ఎలా ఉన్నావు?"


దరహాస్: "బాగున్నాను చైతన్య! నువ్వు ఎలా ఉన్నావు? జాబ్ ఎలా నడుస్తోంది?"


చైతన్య: "అంతా బాగానే ఉంది రా. అసలు విషయం ఏంటంటే... ఈ వీకెండ్‌లో నేను మా సొంతూరికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఒక చిన్న రోడ్డు ట్రిప్ ప్లాన్ చేశాను."


దరహాస్: "ఓహో, మంచిదే కదా! ట్రిప్ ఎప్పుడు? ఎవరెవరు వెళ్తున్నారు?"


చైతన్య: "అదేలే... అది కాదు దరహాస్. నేను సొంతూరికి బైక్ మీద వెళ్లలేను కదా. క్యాబ్ లు కూడా ట్రై చేశాను దొరకలేదు... అందుకే నీకు ఫోన్ చేశాను... మీరు కొత్తగా తీసుకున్నారు కదా, ఆ ఆల్టో కారుని నాకు ఒక మూడు రోజులు ఇస్తావా? సొంతూరికి వెళ్లి, తిరిగిచ్చేస్తాను."


ఆ మాట విన్న దరహాస్ ఒక్కక్షణం షాక్‌తో నిశ్చేష్టుడయ్యాడు. కేవలం నాలుగు రోజులు, రోజుకి పది నిమిషాలు పక్కన కూర్చుని సహాయం చేసినందుకు... తన తండ్రి జీవితకాలపు కష్టార్జితపు కల, మూడు లక్షల విలువైన ఆల్టో కారును ఏకంగా 300 కిలోమీటర్ల దూరానికి మూడు రోజులు ఎలా అడుగుతున్నాడు? అని మనసులో మదనపడ్డాడు. కేవలం కొద్ది రోజుల చిన్న సహాయానికి ఇంత పెద్ద ప్రతిఫలాన్ని ఆశిస్తున్న చైతన్య స్వార్థపూరిత మనస్తత్వం దరహాస్‌కు అర్థమైంది.


తక్షణమే తేరుకుని, ఎంతో సౌమ్యంగా కానీ గట్టిగా ఇలా సమాధానం ఇచ్చాడు:


"చైతన్య, ఏమీ అనుకోకు భాయ్. నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పించినప్పుడు సాయం చేశావు, ఆ కృతజ్ఞత ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. కానీ... ఇది కేవలం నా ఒక్కడి కారు కాదురా. మా నాన్న అరవై ఏళ్ల పాటు ఎండ అనక, వాన అనక కట్టడాల మీద కష్టపడి, తన జీవితకాలపు సంపాదన అంతా కూడబెట్టి కొనుక్కున్న ముద్దుల కారు ఇది. మా కుటుంబం మొత్తానికి ఇదొక పవిత్రమైన కల.


దీన్ని బయటకు ఎవరికైనా ఇవ్వాలంటే మా నాన్న అస్సలు ఒప్పుకోరు; ఆ ఆలోచనే ఆయనకు గుండెకోత లాంటిది. రేపు ఏదైనా చిన్న గీత పడ్డా, ఏ చిన్న ఇబ్బంది జరిగినా నాన్న తట్టుకోలేరు. అందుకే ప్లీజ్... నా పరిస్థితిని అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను... ప్లీజ్ డోంట్ మైండ్."


అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేశాడు. లోకంలో చైతన్య లాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట అనుకున్నాడు. పది రూపాయలకి వంద రూపాయలు అడిగితే పరవాలేదు కానీ, పదికి లక్ష అడగటం అంటే మాత్రం టూ మచ్!!


-- సమాప్తం --


***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page