లొల్లి
- Kotha Viritha

- May 30
- 2 min read
Updated: 1 day ago
#లొల్లి #TeluguArticle #LifeLessons #PositiveThinking #Philosophy #TeluguWriting #LifeJourney #InspirationalThoughts

Lolli - Telugu Inspirational Article | Kotha Viritha
లొల్లి - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 30/05/2026
జీవితంలో జరిగే ప్రతి విషయానికీ లాజిక్ వెతికే మనిషి, కొన్ని అనుభవాల ముందు మాత్రం మౌనంగా నిలబడిపోతాడు.
అనుకోని సహాయం, అర్థం కాని మార్పులు, ఊహించని అవకాశాలు... ఇవన్నీ కేవలం లెక్కలతో కొలవలేము.
మనిషి ప్రణాళికలకంటే జీవితం పెద్దదని గుర్తు చేసే ఆలోచనాత్మక రచన ఇది.
కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కంటే అనుభవించడం గొప్పదని చెప్పే హృద్యమైన వ్యాసం.
మనిషి జీవితంలో ప్రతిదీ లాజిక్‌తో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. కారణం, ఫలితం, లెక్కలు, సూత్రాలు, అల్లు పట్టడం, ఆవలించటం, సైన్స్ నియమాలు... ఇవన్నీ మనకు క్లారిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నిజం ఏమిటంటే, జీవితంలో కొన్ని విషయాలకు లాజిక్ ఉండవు. అవి లెక్కించలేము, కొలవలేము... కానీ గట్టిగా అనుభవించగలం.
ఒకసారి ఆలోచించండి.
ఎప్పుడూ ఊహించని సమయంలో ఎవరో సహాయం చేయడం, ఎన్నో మందులకు తగ్గని రోగం ఒక తాయత్తుకు తగ్గడం, ఎంత కష్టంలో ఉన్నప్పుడు ఒక చిన్న అవకాశం మన జీవితాన్ని మార్చేయడం..
ఇవన్నీ లాజిక్‌తో వివరించగలమా? లేదు కదా. కానీ ఇవి మనసుకు మాత్రమే తెలిసిన దైవ అనుభూతులు. దేవుడి అద్భుతాలు పెద్ద పెద్ద మిరాకిల్స్‌గా మాత్రమే ఉండవు. అవి చాలా సార్లు చిన్న చిన్న సందర్భాల్లో ఉంటాయి. మనం గమనిస్తే తెలుస్తాయి. మనం ఫీల్ అయితే అర్థమవుతాయి.
మన జీవితంలో కొన్ని తలుపులు ఎందుకు మూసుకుపోతాయి, ఎందుకు కొన్ని పనులు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి? అప్పుడు అది బాధగా అనిపిస్తుంది. కానీ తరువాత తెలిసేది ఏమిటంటే అది మన మంచికే జరిగిందని. మనిషి ఎంత తెలివిగా ఆలోచించినా, దేవుడి ప్లాన్ అతనికంటే పెద్దది. మనం చూసేది ఒక చిన్న ఎపిసోడ్ మాత్రమే. కానీ ఆయనకే పూర్తి సినిమా బిగ్ స్క్రీన్ లో తెలుస్తుంది. అందుకే కొన్ని సంఘటనలు అర్థం కాకపోయినా, అవి మన జీవితాన్ని సరైన దిశలో తీసుకెళ్తాయి.
అందుకే ప్రతిదీ లాజిక్‌తో అర్థం చేసుకోవాలనే ప్రయత్నం వదిలేయాలి. కొన్ని విషయాలు అనుభవించాలి, గుడ్డిగా నమ్మేయాలి. నిబంధనలు, నిమ్మకాయ బద్ధ అని ఆలోచించకుండా ఉంటే మంచిది.
అసలు జరిగే వాటికి లాజిక్ తెలిస్తే ఈ లొల్లి అంతా దేనికి, చెప్పండి?
-కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.




జీవితం లో కొన్ని లాజిక్స్ లేకుండా ఉంటాయి అవే అద్భుతం.. అవి జరిగినపుడు జస్ట్ ఫ్లో లో ఫాలో అయిపోవాలి.. awesome అక్క