top of page
Original.png

మాట - మనసు

5 hours ago
4 min read

మాల్‌లో వాటర్ బాటిల్‌కు ప్రత్యేకంగా బిల్లు చేయమన్న మాటతో బాధపడుతూ ఆలోచనలో ఉన్న ఆదినారాయణ

Maata - Manasu - Telugu Family Story | B. N. Satyanarayana

మాట - మనసు - తెలుగు కుటుంబ కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 11/11/2026


‘మాట - మనసు’ కథ బంధాల్లో ప్రేమగా పలికే మాటల వెనుక దాగి ఉన్న భావాలను, చిన్న సంఘటనలు మనసుపై చూపించే ప్రభావాన్ని ఆవిష్కరిస్తుంది. ఆదినారాయణ అనుభవం ద్వారా కుటుంబ బంధాల్లో ఆప్యాయతతో పాటు మనసును అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది.


"సుమతీ! రేపు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి హైదరాబాద్ ఫిలిం సిటీ చూసేందుకు వెళ్తున్నాను," అన్నాడు ఆదినారాయణ.


"ఏమండీ! ఒక్కమాట. తరచూ మీరు మీ ఫ్రెండ్స్‌తో కలిసి సరదాల పేరుతో ఊర్లు తిరుగుతూ చాలా డబ్బు ఖర్చు చేసేస్తున్నారు. కొద్దిగా చూసుకోండి," అంది సుమతి.


ఆమె మాటలకు ఆదినారాయణ చిన్నగా నవ్వుకుంటూ దుకాణానికి వెళ్ళిపోయాడు.


సాయంత్రం ఇంటికి వస్తూ నానిగాడి కోసం, అదే నీరజ కొడుకు కోసం కొత్త బట్టలు, ఆడుకునేందుకు ఆటబొమ్మ కొని తెచ్చాడు. 


వాటిని చూసి బాగున్నాయంటూ సుమతి చాలా ఆనందపడింది.


నీరజ, ఆదినారాయణ అన్న కూతురు. హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త హరి... వారికి మేనల్లుడే అవుతాడు, అతడు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. వారికి ఒక్కడే కొడుకు, వాడే నాని.


మరుసటి రోజు ఆదినారాయణ సుమతితో చెప్పి బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్‌కు బయలుదేరాడు.


రెండు రోజులు హైదరాబాద్ అంతా మిత్రులతో కలిసి తిరిగి ఆనందించాడు. మిత్రులు తిరుగు ప్రయాణం కావడంతో ఆదినారాయణ నీరజకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు ముందుగా తెలియజేసి, క్యాబ్‌లో నీరజ ఇంటికి చేరుకున్నాడు.


డోర్ నాక్ చేయగా నీరజ వచ్చి తలుపు తీసింది. బాబాయ్‌ని చూసి ఆనందంగా, "రండి బాబాయ్!" అంటూ లోపలికి ఆహ్వానించింది.


ఆదినారాయణ లోపలికి వెళుతూనే ఎదురుగా వచ్చిన మనవడు, నీరజ కొడుకు నానిని ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దు పెట్టి వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. 


తన బ్యాగు తెరిచి వాడి కొరకు తెచ్చిన బొమ్మను బయటకు తీసి వాడికి ఇవ్వడంతో, వాడు ఆనందపడిపోతూ దానిని తీసుకుని ఆడుకునేందుకు తాతయ్య ఒడిలో నుండి క్రిందికి దిగి లోపలికి పారిపోయాడు.


అప్పటికే టీ కప్పుతో వచ్చిన నీరజ తెచ్చిన టీ కప్పు తీసుకుంటూ, నాని కొరకు తెచ్చిన బట్టల ప్యాకెట్ ఆమె చేతికి ఇచ్చాడు ఆదినారాయణ. 


దానిని తీసుకుంటూ, "ఎందుకు బాబాయ్ ఇప్పుడు ఇవి?" అంటూ... "బాబాయ్! టీ తాగి ఇదిగో ఈ పక్క గదిలో ఫ్రెష్ అవ్వండి," అని చెప్పి, "నాకు కిచెన్‌లో కొద్దిగా పని ఉంది వెళ్తాను," అని వెళ్ళిపోయింది.


ఆదినారాయణ టీ తాగి ఖాళీ కప్పు టీపాయ్ పై ఉంచి తన బ్యాగు తీసుకుని గదిలోకి పోయాడు. ఫ్రెష్ అయి బట్టలు మార్చుకుని లుంగీ కట్టుకుని బయట హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.


ఇంతలో నీరజ కూడా తన పనులు ముగించుకుని వచ్చి బాబాయ్ పక్కనే కూర్చొని, "బాబాయ్! పిన్ని, తమ్ముడు ఎలా ఉన్నారు?" అంటూ అడిగింది.


నీరజ అలా అడగడంతో ఆదినారాయణ, "మీ పిన్నికేం, బాగానే ఉంది. నేను మాత్రం ఆమెతో వేగలేకపోతున్నాను! ఎప్పుడు ఎక్కడకు వెళ్తానన్నా ఒకటే గోల చేసేస్తోంది. 


కొన్నాళ్లపాటు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతే బాగుంటుందనిపిస్తుంది," అంటూ హాస్యాన్ని జోడిస్తూ అన్నాడు.


దానికి నీరజ నవ్వుతూ, "పిన్నేమీ అలా అనదు. ఒకవేళ నిజానికి మీకు ఎప్పుడైనా అలా అనిపిస్తే మాత్రం ఎక్కడికో ఎందుకు? ఇక్కడికే, మా దగ్గరకే వచ్చేయండి! హాయిగా మీకు ఎన్నాళ్లు ఉండాలని అనిపిస్తే అన్నాళ్లు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటాను," అంది.


"ఊరికే అలా అన్నానమ్మా! మీ పిన్ని బాగానే ఉంది. నిన్ను మరిమరీ అడిగానని చెప్పమంది కూడా," అన్నాడు ఆదినారాయణ. అంటూనే కూతురు నీరజ అన్న మాటలకు లోలోన మురిసిపోతూ నవ్వుకున్నాడు.


రాత్రి డిన్నర్ అయిపోయాక... "బాబాయ్! వచ్చే వారం బాబును స్కూల్‌లో నర్సరీలో జాయిన్ చేస్తున్నాం. 


రేపు ఏదైనా మాల్‌కు వెళ్లి వాడికి అవసరమైన వస్తువులు తీసుకుందాం. అక్కడ నుండి మంచి హోటల్‌కు పోయి సరదాగా లంచ్ చేసొద్దాం," అంటూ... "బాబాయ్! చాలా టైమ్ అయింది. ఇక మీరు వెళ్లానిద్రపోండి," అంది.


ఆదినారాయణ లేచి గదిలోకి పోయి మంచంపై వాలి అలాగే నిద్రపోయాడు.


తెల్లవారే లేచి ఫ్రెష్ అయి హాలులోకి వచ్చి సోఫాలో కూర్చుని పేపరు తిరగవేయసాగాడు. 


కొద్దిసేపట్లో నీరజ టిఫిన్ చేయడానికి పిలవడంతో ఆదినారాయణ డైనింగ్ టేబుల్ వద్దకు పోయి కూర్చున్నాడు. అంతలో అల్లుడు హరి కూడా వచ్చి, "మావయ్య గారు గుడ్ మార్నింగ్," అని చెప్పి అతని పక్కనే కూర్చున్నాడు. కాఫీ టిఫిన్లు పూర్తి అయ్యాక, "రెడీ అవ్వండి బాబాయ్! అలా బయటకు వెళ్దాం," అంది నీరజ.


"సరే" నంటూ ఆదినారాయణ గదిలోకి పోయి బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు.


అందరూ కారులో కూర్చున్నారు. హరి డ్రైవ్ చేస్తూ ఒక పెద్ద మాల్ దగ్గర ఆపాడు. అందరూ లోపలికి వెళ్లారు. 


నీరజ తనకు కావలసిన వస్తువులు కొనడంలో బిజీ అయిపోయింది. ఆదినారాయణకు ఏమీ తోచక మాల్ అంతటా తిరగసాగాడు. అలా తిరుగుతుంటే అతడి దృష్టి ఒక అందమైన వాటర్ బాటిల్‌పై పడింది.


తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లవలసి వచ్చినా తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కొని వెళుతుంటాడు. ఇకపై బయట అలా కొనకుండా ఇంటినుంచే బాటిల్‌తో మంచినీళ్లు తీసుకుపోతే బాగుంటుందని అనుకుని, ఆ బాటిల్‌ను కొనాలనుకుని దాన్ని తీసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాడు.


అప్పుడే నీరజ కూడా కొన్ని వస్తువులు తీసుకుని వచ్చింది. బాబాయ్‌ని పలకరిస్తూ, "ఏం బాబాయ్! మీరేమైనా కొన్నారా?" అని అడిగింది.


"బాగుందనిపించి ఈ వాటర్ బాటిల్ కొన్నానమ్మా," అంటూ దాన్ని చూపించాడు ఆదినారాయణ.


అది చూసి నీరజ, "బాటిల్ చాలా బాగుంది బాబాయ్!" అంది.


కౌంటర్ ఖాళీ పడడంతో తాను కొన్న వస్తువులన్నీ అక్కడ పెట్టి బిల్ చేయించింది. తన బిల్లు కాగానే, "బాబాయ్! మీరు బిల్లు వేరేగా చేయిస్తారా?" అంది.


ఆ మాటకు ఒక్క క్షణం ఆదినారాయణ అలా ఉండిపోయాడు. సర్దుకుని, "ముందు నీ బిల్లు అయిపోనీ, నేను తరవాత చేయిస్తాను," అన్నాడు.


నీరజ తాను కొన్న వాటికి బిల్లు చెల్లించేసి, కొన్న వస్తువులను తాను తీసుకుని వచ్చిన బ్యాగ్‌లో పెట్టేసింది.


ఆదినారాయణ తాను కొన్న వాటర్ బాటిల్‌కు బిల్లు చేయించి, బిల్లు మొత్తం రూ.950 లు చెల్లించి ఆ బాటిల్‌ను నీరజకు ఇచ్చి ఆమె బ్యాగులో ఉంచమన్నాడు. నీరజ ఆ బాటిల్‌ని బ్యాగులో పెట్టింది. అందరూ కారు వైపు నడిచారు.


అక్కడ నుండి హోటల్‌కు పోయి సరదాగా భోజనాలు ముగించి ఇంటికి చేరుకున్నారు.

ఆదినారాయణ గదిలోకి పోయి కాసేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం నీరజ ఇచ్చిన టీ తాగి, ట్రైన్ టైమ్ కావస్తుండడంతో తన బ్యాగు సర్దుకుని నీరజ దగ్గర ఉన్న తన వాటర్ బాటిల్‌లో నీళ్లు నింపి ఇమ్మని చెప్పి... నానిని మరొక్కమారు ఎత్తుకుని ముద్దాడి నీరజ తెచ్చిన బాటిల్‌ను తన బ్యాగులో పెట్టుకున్నాడు.


ఊబర్‌లో బుక్ చేసిన క్యాబ్ రాగా అందులో కూర్చుని నీరజకు టాటా చెప్పి, ఆఫీసుకు వెళ్లిపోయిన హరిని అడిగానని చెప్పమని చెప్పి క్యాబ్‌వానితో పోవాల్సిందిగా చెప్పాడు.


క్యాబ్ కదిలింది. దానితో పాటు అతడి ఆలోచనలూ మాల్‌లో జరిగిన బిల్లింగ్ చుట్టూనే కదలసాగాయి!


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y





B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page