top of page
Original.png

మాతృదేవోభవ


అమ్మలందరికి   మాతృదినోత్సవ  శుభాకాంక్షలు 🙏🙏🌺🌺
అమ్మలందరికి   మాతృదినోత్సవ  శుభాకాంక్షలు 🙏🙏🌺🌺

mathrudevobhava - Telugu Article on Mother's Day | Neeraja Hari Prabhala

మాతృదేవోభవ -  మదర్స్ డే తెలుగు వ్యాసం | నీరజ హరి ప్రభల

Published In manatelugukathalu.com On 10/05/2026


అమ్మ…

ఆ పదమే అమృతం.

మన జీవితానికి ఆది, ఆప్యాయతకు ప్రతిరూపం, త్యాగానికి నిలువెత్తు నిర్వచనం తల్లి. గర్భంలో మోసి, గుండెలకు హత్తుకుని, జీవితాంతం పిల్లల సంతోషానికే బ్రతికే అమ్మ ప్రేమను ఎంత వర్ణించినా తక్కువే. ఈ భావోద్వేగ వ్యాసం ప్రతి ఒక్కరినీ తమ తల్లిని మరింత ప్రేమగా గుర్తు చేసుకునేలా చేస్తుంది.


నిత్యం  మనం  అమ్మని   స్మరించుకుంటూ  తల్లిని   పూజించాలి.  ఆవిడని పూజించకపోయినా  ఫరవాలేదు  ఆమెనీ, ఆమె  మనసుని  ఏమాత్రం నొప్పించకుండా   ప్రేమానురాగాలను  అందిస్తూ  కడదాకా  కంటికిరెప్పలా  చూసుకుంటే  అంతకన్నా  అమ్మకు  ఇంకేం  కావాలి ? 

దేవతే  మరో రూపంలో  అమ్మగా  మనకు దర్శనమిస్తున్నది. దేవుడు  తనకు మారుగా  అమ్మను   సృష్టించాడు.

కనిపించే, కని  పెంచే  ప్రత్యక్ష దైవం  అమ్మ. అనిర్వచనీయమైన  రూపం   అమ్మ. 

"అమ్మ"   అన్నది  అమృతము.

అమ్మతనము  లోనే  ఉంది  ఆ  కమ్మదనము. అప్పుడే   స్ర్తీ  జన్మకు   పరిపూర్ణత  సిధ్ధిస్తుంది.


అమ్మను  గురించి   ఏం చెప్పగలము?  ఎంత  చెప్పినా  తక్కువే. అసలు  చెప్పనలవికాదు. అది  అనంతం.


ఎన్ని  జన్మలెత్తినా  తల్లి  ఋణమును  తీర్చుకోలేము.🙏 తీర్చనలవి  కాదు.


నవమాసాలు మోసి  తను  మరో జన్మ (ప్రసవం అంటే మరో జన్మ)  ఎత్తి  మనల్ని  ఈ భూమి  మీదకు  తెచ్చి  తన పొత్తిళ్ళలో  పదిలంగా  పొదుపుకుని  గుండెలకు   హత్తుకుని  తనివితీరా  ముద్దాడి,  అప్పటిదాకా  తను  అనుభవించిన  ప్రసవ వేదనను  మర్చిపోయి  ఈ ప్రపంచాన్నే గెలిచినంత  సంతోషంతో  బిడ్డను  చూసి  మురిసిపోతుంది  అమ్మ.  అంత  అల్ప సంతోషి  అమ్మ. 

అమ్మ   పొత్తిళ్లలోని  ఆ వెచ్చదనము,  ఆ హాయిని  కడదాకా  మనం  మర్చిపోలేము. 


అమ్మ  ప్రేమకు  కొలమానం  లేదు. అది అమూల్యము. అనితరసాధ్యం.


ఆకాశమంత  విశాలమైన హృదయము,  భూదేవి  అంత  ఓర్పు, సహనం  కల  ప్రేమానురాగ  దేవత  అమ్మ.


బిడ్డకు  చనుపాలిచ్చి, లాలించి, పోషించి, గోరుముద్దలను  తినిపిస్తూ  వాడి  ఆటపాటలను  చూసి  మురిసిపోతూ, తప్పటడుగులు   వేయకుండా, పడిపోకుండా  వాడి చిటికిన  వేలును  పట్టుకుని  నడిపించే   మార్గదర్శి  అమ్మ.


నిద్రాహారాలు  మాని  తన  ఆరోగ్యాన్ని సైతం  లెక్కచేయకుండా   అహర్నిశలు  బిడ్డ  ఆరోగ్యం కోసం  తపిస్తూ  వాడి  ఆకలిని  తీర్చే    అన్నపూర్ణ  అమ్మ. 

 

బిడ్డను  ప్రేమగా  తన ఒడిలో  కూర్చోబెట్టుకుని పలక మీద   "ఓంనమశ్శివాయ"  అంటూ  వాడి  చేత  నోటితో  పలికిస్తూ  బలపం  చేత  తొలిపలుకులను  వ్రాయించే  సరస్వతి  అమ్మ.


 బిడ్డ  ప్రయోజకుడై  వృధ్ధిలోకి  రావాలని  ముక్కోటి  దేవతలను  ప్రార్ధిస్తుంది  అమ్మ. వాడి  అభ్యున్నతిని  చూసి  సంతోషంతో  ఉప్పొంగిపోతూ   మనసారా  దీవిస్తుంది. అమ్మ.  అమ్మ  దీవెన  తప్పక  ఫలిస్తుంది.


జీవితంలో  ఎన్ని  ఆటుపోట్లు,  ఒడిదుడుకులు  ఎదురైనా   ధైర్యంగా  వాటినన్నిటినీ  అధిగమించి  తన ప్రాణాల్ని  సైతం  లెక్క చేయకుండా   కంటికి  రెప్పలా  బిడ్డను కాపాడుకుంటూ  తుది దాకా  బిడ్డ కోసమే బ్రతుకుతూ  తనువు  చాలిస్తుంది  అమ్మ. 

దేవతే  మరో రూపంలో  అమ్మగా  మనకు దర్శనమిస్తున్నది.

 

"మాతృదేవోభవ‍"  అని  మనం  తొలిగా  నమస్కరించేది  అమ్మకే.   అటు వంటి  అమ్మను  గూర్చి ఎంత చెప్పినా తక్కువే. అద్వితీయము, అనిర్వచనీయమైన  రూపం  అమ్మ. 


అమ్మను  మరిచి పోతే  మనకు  ఉనికే  ఉండదు.


ఈ సృష్టిలో  తన కోసం   ఏప్రతిఫలము ఆశించని  ప్రాణి  ఏదైనా  ఉందంటే  అమ్మ ఒక్కత్తే.  అటువంటి  అమ్మకు  మనం  ఎప్పుడూ  ఋణపడి  ఉంటాము. ఎన్ని జన్మలెత్తినా  అమ్మ  ఋణం  తీర్చుకోలేము. తీర్చనలవి  కాదు.  అది  జన్మజన్మల బంధం. 


దేహం  ఒడలి  వృధ్ధాప్యదశ  వచ్చి,  అనారోగ్యం  దాపురించి  మృత్యువు  దరిచేర బోతోందని  తెలుస్తున్నా  బిడ్డ  యోగక్షేమాలకై పరితపించే  అనురాగ  దేవత  అమ్మ.

బిడ్డ  ఆస్తి  అంతస్తులను  అమ్మ  ఆశించదు. కడదాకా  చిటికెడు ప్రేమ,  కూసింత  ఆదరణను  కోరుకుంటుంది.


 నేటి యాంత్రిక  జీవన విధానంలో   అవి  కనుమరుగై  వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలలో  అమ్మలు  చేరబడుతున్నారు. నిజంగా  అది   చాలా బాధాకరం. దురదృష్టకరం. ఆస్ధితిని   తలుచుకుంటుంటే  గుండె  బరువెక్కుతోంది.


ఈ విశాల విశ్వంలో  చెడ్డవాళ్లైన  పిల్లలు  ఉండవచ్చేమో  కానీ  చెడ్డతల్లి మాత్రం  ఎక్కడా  ఉండదు. అమ్మ అంటే  దేవత. 


పిల్లలు   “అమ్మా”  అని  ప్రేమగా  పిలుస్తూ  గుప్పెడు  మెతుకులు  అమ్మకు  పెడితే  కొండంత  సంతోషంతో  నిండునూరేళ్లు  ఆరోగ్యంగా  బ్రతుకుతుంది  అమ్మ.  

సంతోషం  సగం  బలం. ఇంక  ప్రపంచంలో   వృధ్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు   తావుండదు.


హిమవత్పర్వతమంత  చల్లని  మనసు కలది  అమ్మ. ఆ  మేరునగరి  నీడలో  మనమంతా ఎప్పటికీ  పిల్లలమే.


మన మదిలో  దేవతలా  కొలువై  ఎల్లవేళలా  పూజలందుకుని  మనల్ని  ఆశీర్వదిస్తూ ప్రగతి పధాన  ముందుకు  నడిపిస్తుంది  అమ్మ.🙏


అమ్మలందరికీ  పాదాభివందనం.🙏


నీరజ హరి ప్రభల గారి కొన్ని ఇతర రచనలు:


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery








Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page