top of page
Original.png

మౌనమే నా ఆయుధం

తెలుగు కథ, మానవత్వం, యుద్ధ ప్రభావం, సామాజిక కథ, ప్రేరణాత్మక కథ, తెలుగు సాహిత్యం, సహాయం, మౌన సేవ, కుటుంబ కథ

యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం, సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్న మహిళను చూపించే భావోద్వేగ తెలుగు సామాజిక కథా పోస్టర్.
యుద్ధ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆహారం, సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్న మహిళను చూపించే భావోద్వేగ తెలుగు సామాజిక కథా పోస్టర్.

Mouname na ayudham - Telugu Inspirational Story | Vangeepuram Shashirekha

మౌనమే నా ఆయుధం - తెలుగు ప్రేరణాత్మక కథ | వంగీపురం శశిరేఖ

Publishes in manatelugukathalu.com on 30/04/2026


యుద్ధం అనేది కేవలం దేశాల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, లక్షలాది సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విషాదం.

అలాంటి సమయంలో మాటల కంటే చేతలు గొప్పవని నిరూపించిన ఓ మహిళ కథ ఇది.

తన చుట్టూ ఉన్నవారి కష్టాలను గమనించి వారికి అండగా నిలిచిన ఆమె మానవత్వాన్ని ఈ కథ ఆవిష్కరిస్తుంది.

సానుభూతి, సహకారం, మౌనసేవ యొక్క విలువను తెలియజేసే హృదయస్పర్శి రచన.


"అమ్మా, కాయకష్టం చేసుకొని మా దారిన మేము బతుకుతుంటే ఈ మాయదారి యుద్ధం మా ప్రాణానికి వచ్చిందమ్మా! మా ఇంటాయన ప్రాణాలు కాపాడుకోవడానికి రాత్రికి రాత్రి విమానంలో సీటుందని, అన్నీ ఎక్కడికక్కడ వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చేసాడు." 


మా పనమ్మాయి వాళ్ళాయన బెహ్రెయిన్‌లో డ్రైవర్‌లాగా పనిచేసేవాడు. దాదాపు నాలుగన్నర సంవత్సరాల నుండి ప్రతినెల అతను పంపించే డబ్బు ఇంకా తన రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తోంది. 


“మా అమ్మాయి కానుపు కూడా దగ్గరపడుతోందమ్మా, ఏం చేయాలో తెలియడం లేదు. మా ఎదురుకుండా వాళ్ళు కూడా రేపటి నుండి పనిలోకి రావద్దన్నారమ్మా. ఒక పదిహేను రోజులు వాళ్ళే చేసుకుంటారంట. పరీక్షలు అయిపోయాక ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతామన్నారు. ఎట్లానో ఏమో, నాకు వచ్చింది చిన్న కష్టం కాదమ్మా.” అని వాపోయింది మా పనమ్మాయి. 


ఎదురుకుండా ఫ్లాట్‌లో నలుగురు చదువుకొనే పిల్లలు కలిసి ఉంటారు. పాపం, అన్నీ ఖరీదు అవడంతో వాళ్ళ బడ్జెట్ తలకిందులై నట్లుంది.


ఇంట్లో పనిచేసేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పాలు పోసేవాళ్ళు — అందరూ ఏదో రకంగా ఇబ్బంది పడుతున్నవాళ్ళే! పాపం, నా దగ్గర వాళ్ళ గోడు వెళ్ళబోసుకునేవారు. వాళ్ళకు నాకు తోచినంత సహాయం చేసి ఆత్మస్థైర్యం కలిగిస్తుంటాను.


మా ఇంటి ఎదురుకుండా ఉండే పిల్లల్ని పలకరించాను, విషయమేంటో తెలుసుకుందామని. "ఆంటీ, గ్యాస్ దొరకడం లేదు. ఇంకా స్విగ్గీ, జొమాటోలు కూడా సమయానికి రావడం లేదు, ఆంటీ! ఒక మోస్తరు హోటళ్ళన్నీ మూతపడ్డాయి. దానితో మా బడ్జెట్ గల్లంతయింది” అన్నారు.


నెమ్మదిగా యుద్ధం మొదలై పదిహేను రోజులు దాటడంతో యుద్ధ పరిణామాలు నిత్యావసర వస్తువుల్ని ప్రభావితం చేయసాగాయి.


మరునాడు ప్రొద్దున్నే హుషారుగా లేచి మా ఇద్దరితో పాటు ఎదురుకుండా పిల్లలకి కూడా టిఫిన్, భోజనం తయారు చేసి మా పనిమనిషి సహాయంతో వాళ్ళ ఫ్లాట్‌లో పెట్టాను. "పరీక్షలు అయ్యేదాకా నేనే మీకు తినడానికి ఏర్పాట్లు చేస్తాను. మీ దృష్టి అంతా చదువు మీద పెట్టండి, ఇంకేమీ ఆలోచించకండి" అని గట్టిగా చెప్పివచ్చాను.


వంట పనిలో మా పనమ్మాయి సహాయం తీసుకొని ఆమెకు ఏదో కొంచెం సహాయం చేయొచ్చులే అనుకొని అదే మాట ఆమెతో చెప్పాను.


యుద్ధం నేపథ్యంలో టెలివిజన్ ఛానల్ వాళ్ళకి వాళ్ళ ప్రాముఖ్యత పెంచుకోవడానికి కావలసినంత అవకాశం. నాకు ఈ విషయమై వాదించే శక్తి కానీ ఆసక్తి కానీ లేవు. యుద్ధం పట్ల నా వ్యతిరేకత తెలపడానికి, నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళలో అత్యవసరం ఉన్నవాళ్ళని ఎంచుకొని వాళ్ళకి కొద్దోగొప్పో సాయం చేయడమే నా మౌనం ఆయుధంగా మలచుకున్నాను.


                        ***************************************


వంగీపురం శశిరేఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: వంగీపురం శశిరేఖ


నేను ఆదాయపన్ను శాఖలో ఇనస్పెక్టర్ గా పని చేసి విశ్రాంత జీవనం 

గడుపుతున్నాను,నాకు తెలుగు భాష అంటె ఎంతో మక్కువ.టీచింగ్ అంటే కూడా చాలా 

ఇష్టం.నా విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను.  మా మనవడు 

ఆరుష్ వియాన్ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page