top of page
Original.png

మాయ రోగం

Jun 13
2 min read

మాయ రోగం, కొత్త విరిత, తెలుగు ప్రేరణాత్మక వ్యాసం, మానసిక ఒత్తిడి, టెన్షన్, ఆత్మపరిశీలన, జీవిత సత్యాలు, సానుకూల ఆలోచనలు, మానసిక ఆరోగ్యం, జీవిత పాఠాలు, తెలుగు వ్యాసాలు, ప్రశాంతత, భావోద్వేగ వికాసం, ఆలోచనల ప్రభావం, ఒత్తిడి నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, మనసు, ఆనందం, ప్రేరణ, తెలుగు సాహిత్యం

పార్కులో ఒంటరిగా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన వ్యక్తి, అతని చుట్టూ భయాలు మరియు అనవసర ఆలోచనలను సూచించే మేఘాలు, మరోవైపు ప్రశాంతతను సూచించే బంగారు కాంతి. మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత వైపు ప్రయాణాన్ని ప్రతిబింబించే దృశ్యం.
పార్కులో ఒంటరిగా కూర్చుని ఆలోచనల్లో మునిగిపోయిన వ్యక్తి, అతని చుట్టూ భయాలు మరియు అనవసర ఆలోచనలను సూచించే మేఘాలు, మరోవైపు ప్రశాంతతను సూచించే బంగారు కాంతి. మానసిక ఒత్తిడి నుంచి ప్రశాంతత వైపు ప్రయాణాన్ని ప్రతిబింబించే దృశ్యం.

Maya Rogam - Telugu Inspirational Article | Kotha Viritha

మాయ రోగం - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 13/06/2026


నేటి కాలంలో చాలా మంది మనుషులు నిజమైన సమస్యలతో కాకుండా, "ఏదైనా సమస్య వస్తుందేమో" అనే భయంతోనే ఎక్కువగా బాధపడుతున్నారు. ఒక ఫోన్ కాల్ ఆలస్యమైనా, ఒక మెసేజ్‌కు రిప్లై రాకపోయినా మనసు ఎన్నో ఊహల్లో మునిగిపోతుంది. ఈ కనిపించని మానసిక ఒత్తిడినే రచయిత "మాయ రోగం"గా అభివర్ణించారు. ప్రశాంతత, ఆత్మపరిశీలన, అనవసర ఆలోచనల నుంచి విముక్తి గురించి లోతైన సందేశాన్ని అందించే ఈ వ్యాసం ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తుంది.


ఈ కాలంలో మనిషి ఒక కనిపించని మాయ రోగంతో బాధపడుతున్నాడు.

మన జీవితాన్ని ఎక్కువగా తినేస్తున్నది పని కాదు మన ఆలోచనలే.

జరిగిన విషయాల కంటే జరగబోయే విషయాల గురించే మనం ఎక్కువగా భయపడుతున్నాం.


చిన్న సమస్యను కూడా మనసులో పెద్ద తుఫానుగా మార్చుకుంటున్నాం.

ఫోన్ ఎత్తకపోతే ఏమైనా జరిగిందేమో అనిపిస్తుంది.


ఒక మెసేజ్‌కు రిప్లై ఆలస్యమైతే సంబంధాలే మారిపోయాయేమో అనుకుంటాం.

రేపటి గురించి ఆలోచించడం తప్పు కాదు.కానీ ఇంకా రాని రేపు కోసం, ఈరోజు ప్రశాంతతను కోల్పోవడం బాధాకరం.


ఇప్పుడు మనుషులు సమస్యలతో కాదు

“సమస్యలు వస్తాయేమో” అనే భయంతో ఎక్కువగా అలసిపోతున్నారు.


ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాలనే ఒత్తిడి,

అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నం,

మనసును నెమ్మదిగా ఖాళీ చేస్తుంటాయి.


జీవితం మొత్తం ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండదు.

కొన్ని ప్రశ్నలకు సమయం మాత్రమే సమాధానం చెప్తుంది.

అవసరం లేని ఆలోచనలకు మనసులో స్థానం ఇస్తే,

శాంతి బయట ఎంత వెతికినా దొరకదు.


కొన్నిసార్లు ఆగిపోవాలి.

మనసుతో మనమే మాట్లాడుకోవాలి.

జరిగేది ప్రశాంతంగా చూస్తూ ఉండాలి.


“ఇది నిజంగా అంత పెద్ద సమస్యేనా”అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి.


ఎందుకంటే టెన్షన్ ఎక్కువగా ఉన్న చోట జీవితం నెమ్మదిగా తగ్గిపోతుంది.

ప్రశాంతత ఉన్న చోటే

నిజమైన ఆనందం మొదలవుతుంది.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.

4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super

Like

Radha R
Radha R
Jul 17
Rated 5 out of 5 stars.

Good

Like

Rated 5 out of 5 stars.

Excellent 👌👌👌

Like

Viritha
Viritha
Jun 13
Rated 5 out of 5 stars.

👏

Like
bottom of page