ముద్దపప్పు ఆవకాయ
- Kotha Viritha
- 16 minutes ago
- 3 min read
ముద్దపప్పు ఆవకాయ, కొత్త విరిత, తెలుగు వ్యాసం, జీవిత పాఠాలు, మనవాళ్లు, అనుబంధాలు, నిజమైన స్నేహం, కుటుంబ ప్రేమ, తెలుగు సాహిత్యం, ఆలోచింపజేసే కథనం, జీవిత తత్వం, మనుషుల విలువ, ఇంటి వంట, ముద్దపప్పు, ఆవకాయ, తెలుగు రచనలు, motivational Telugu article, emotional Telugu article, life lessons Telugu, human relationships

Muddapappu Avakaya - Telugu Inspirational Article | Kotha Viritha
ముద్దపప్పు ఆవకాయ - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Publishes in manatelugukathalu.com on 25/06/2026
కొత్త మనుషులు, కొత్త అనుభవాలు, కొత్త రుచులు... ఇవన్నీ జీవితాన్ని రంగులమయం చేస్తాయి. అయితే ఎంత కొత్తదనం వచ్చినా, మనసుకు ప్రశాంతతను ఇచ్చేది మాత్రం మన ఇంటి ప్రేమ, పాత స్నేహాలు, నిజమైన అనుబంధాలే. "ముద్దపప్పు ఆవకాయ" అనే ఈ ఆలోచనాత్మక రచన, ఇంటి వంట రుచిని జీవిత సంబంధాలతో పోలుస్తూ, మనుషుల విలువను ఎంతో సరదాగా, హృద్యంగా వివరిస్తుంది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన అందమైన జీవిత వ్యాసం.
సరదాగా ఒక సాయంత్రం అల్లం టీ తాగుతూ ఉండగా ఒక సరదా పొంతన వచ్చింది.
మనం కొత్త కొత్త రుచులు తినాలని రోజూ ఆరాటపడతాం. ఈరోజు బిర్యానీ ఆర్డర్ చేద్దాం, రేపు పిజ్జా, ఎల్లుండి బర్గర్, మధ్యలో పునుగులు… ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే రెస్టారెంట్ మెనూ మొత్తం చదివినట్టే ఉంటుంది. అచ్చం మన జీవితంలోకి వచ్చే కొత్త మనుషుల పరిచయాల్లా.
కొత్తలో సంభాషణలు బాగానే కమ్మగా అనిపిస్తాయి. ప్రతి మాటలో కొత్తదనం, ప్రతి పరిచయంలో ఉత్సాహం. కానీ పోను పోను… "అబ్బా… ఈరోజు మళ్లీ బిర్యానీనా" అనిపించినట్టు, "అదే మాటలు మళ్లీనా" అనిపించే పరిచయాలు కూడా ఉంటాయి. అప్పుడు మనసు నెమ్మదిగా ఇంటి వైపు పరుగెత్తుతుంది.
కమ్మగా వేడి అన్నంలో ముద్దపప్పు, కొంచెం నెయ్యి, ఆవకాయలో ఊరిన వెల్లుల్లి, పక్కనే మామిడి ముక్క… ఆహా, తలుచుకున్నా నోట్లో నీళ్లు వస్తాయి. అచ్చం మన ఇంట్లో ఉండే మనుషుల ప్రేమలాగే, మనసుకి దగ్గరైన స్నేహితుల ఆప్యాయతలాగే. కొత్త రుచులు అప్పుడప్పుడు బాగానే ఉంటాయి.
కానీ ఇంట్లో చేసే వంటకి ఏ బిర్యానీ సాటి రాదు. అలాగే కొత్త పరిచయాలు ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్లు, మన సంతోషంలో నిజంగా సంతోషపడే వాళ్లు, మన బాధలో పక్కన నిలిచే వాళ్లు మాత్రం చాలా అరుదు. ఎందుకంటే, మనం కలిసే ప్రతి మనిషి మన మనిషి కాదు. అందరితో నవ్వుతూ మాట్లాడొచ్చు, అందరితో సమయం గడపొచ్చు, కానీ అందరూ మన హృదయంలో చోటు సంపాదించలేరు.
కొంతమంది జీవితంలో ఒక రుచిలా వచ్చి వెళ్లిపోతారు. మరికొంతమంది మాత్రం ఇంటి వంటలా, ఎంత కాలం గడిచినా మనసుకు అదే ఆప్యాయత, అదే తృప్తిని ఇస్తారు. అందుకే కొత్త రుచులను ఆస్వాదించండి. కానీ ఇంటి వంటను, మన వాళ్ల ప్రేమను, పాత స్నేహాలను మాత్రం ఎప్పుడూ "ఆర్డర్ క్యాన్సిల్" అనొద్దు. జీవితంలో ఫైవ్ స్టార్ భోజనం కంటే, ప్రేమతో పెట్టిన ఒక ముద్ద అన్నమే ఎక్కువ తృప్తినిస్తుంది.
చివరగా ఒక సరదా మాట,
"బిర్యానీకి మనసు పడొచ్చు, కానీ ఆకలి తీరేది మాత్రం ఇంటి ముద్దపప్పుతోనే."
అలాగే, పరిచయాలు ఎన్నైనా పెరగొచ్చు… కానీ మనసుకు నచ్చిన వాళ్లు, మనసును అర్థం చేసుకున్న వాళ్లు మాత్రం జీవితంలో కొద్దిమందే ఉంటారు.
"అందరూ పరిచయస్తులే కావచ్చు… కానీ అందరూ మన వాళ్లు కాలేరు."
ఇది ఏదో వంటింటి సాహిత్యం అని మాత్రం అనుకోకండి,
జీవితంలో మనుషులను అర్థం చేసుకోవడం కోసం, కొన్ని సార్లు ముద్దపప్పు ఆవకాయ కూడా గొప్ప పాఠాలే చెబుతాయి.
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
***************************************
కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.


