top of page
Original.png

ది కోడ్


“ది కోడ్” అనే తెలుగు జీవన వ్యంగ్య రచనకు సంబంధించిన చిత్రం. ప్రాచీన అడవిలో పులి నుంచి పరుగెత్తుతున్న ఆదిమ మనిషి నుంచి ఆధునిక నగర అపార్ట్‌మెంట్‌లో ట్రెడ్‌మిల్‌పై అలసిపోయినా పరుగెడుతున్న భారతీయుడి వరకు పరిణామాన్ని చూపిస్తుంది. చుట్టూ పని, లక్ష్యాలు, నోటిఫికేషన్లు, డిజిటల్ ఒత్తిడిని సూచించే హోలోగ్రాఫిక్ స్క్రీన్లు కనిపిస్తాయి. చిత్రం మనిషి ఎప్పుడూ పరుగెత్తాలనే పురాతన జీవన కోడ్‌ను, ఆధునిక జీవితంలోని నిరంతర పురోగతి ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది.”

The Code Telugu Inspirational Article | Kotha Viritha

ది కోడ్ తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Published in manatelugukathalu.com on 21/08/2026


“ఏదో ఒకటి చేయాలి…” అనే ఆలోచనతో రోజంతా కంగారు పడుతున్న ఆధునిక మనిషి మనస్తత్వాన్ని సరదాగా ప్రశ్నించే వ్యంగ్య రచన “ది కోడ్”. ఆదిమ మనిషికి పరుగెత్తడం ఆకలి కోసం అవసరమైతే, ఆధునిక మనిషికి ఆగిపోవడమే ఒక నేరంలా అనిపిస్తోంది. అడవులు పోయాయి, పులులు పోయాయి… కానీ ఎప్పుడూ పరుగెత్తాలనే ఆ పాత కోడ్ మాత్రం ఇంకా మన మెదడులో పనిచేస్తూనే ఉంది.



"ఏదో ఒకటి చేయాలి... "

అని రోజంతా కంగారు పడుతున్నారా?

అభినందనలు! మీరు వెనకబడలేదు... అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. 


మీ మెదడులో లక్షల సంవత్సరాల క్రితం ఇన్‌స్టాల్ చేసిన "ది కోడ్" ఇంకా ఎలాంటి బగ్‌లు లేకుండా పనిచేస్తోంది. 

ఆదిమ మనిషి ఆగిపోతే ఆకలి. 

ఆధునిక మనిషి ఆగిపోతే... 

"జీవితంలో నువ్వేం చేస్తున్నావ్?" అనే ప్రశ్న. 


అడవులు పోయాయి... 

పులులు పోయాయి... 

కానీ పరుగెత్తాల్సిందే అనే ప్రోగ్రామ్ మాత్రం అన్‌ఇన్‌స్టాల్ కాలేదు. అందుకే ఐదు నిమిషాలు ఖాళీగా కూర్చున్నా... ఏదో నేరం చేసినట్టు అనిపిస్తుంది. విశ్రాంతి తీసుకుంటే... సోమరినని మెదడే నోటీసు పంపుతుంది. చివరికి మనిషి జీవితమంతా, ఆఫ్ చేయలేని ఒక సాఫ్ట్‌వేర్‌కు

"పురోగతి" అనే అప్‌డేట్లు ఇస్తూనే గడిచిపోతుంది. వింత ఏంటంటే... ఈ కోడ్‌నే మనిషిని నాగరికుడిని చేసింది. 


బాధాకరమైన విషయం ఏంటంటే... ఇప్పటికీ దీనికి "పాస్" బటన్ మాత్రం లేదు. 


"పరుగో... పరుగు... "

అంటూనే ఉంది... 

ది కోడ్. 


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కొత్త విరిత

రచయిత్రి పరిచయం: కొత్త విరిత

నా పేరు కొత్త విరిత

B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Haritha kotha
Haritha kotha
6 hours ago
Rated 5 out of 5 stars.

Nice 👌🏻👌🏻👌🏻👌🏻

Like

Kishan Kotha
Kishan Kotha
6 hours ago
Rated 5 out of 5 stars.

అసలు కథంతా ...ఇతరు మనల్ని గురించి ఏమనుకుంటారో అనే భయం. ఇది వదిలితే మనకు నచ్చినట్టు మనం బ్రతుకొచ్చు...బిందాస్

Like

rangarao kokku
rangarao kokku
6 hours ago
Rated 5 out of 5 stars.

Wow ..viritha garu emm rassaruu.. super..

Like
bottom of page