ధర్మాచరణ
- Bhaskara Rao B. R. K. V.

- 2 minutes ago
- 3 min read

Dharmaacharana - Telugu Moral Article | Bhaskara Rao B. R. K. V.
ధర్మాచరణ - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 21/08/2026
ధర్మాచరణ అనేది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు; ప్రతి మనిషి తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తిస్తూ సమాజం, ప్రకృతి, సమస్త జీవరాశుల పట్ల బాధ్యతగా జీవించే విధానం. బి.ఆర్.కే.వి. భాస్కర రావు రాసిన “ధర్మాచరణ” వ్యాసం ధర్మం యొక్క అసలు అర్థాన్ని వివరిస్తూ, అత్యాశ, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం వంటి మానవ తప్పిదాలు సమాజానికే కాకుండా ప్రకృతి సమతుల్యతకు కూడా ఎలా ముప్పుగా మారుతున్నాయో ఆలోచింపజేస్తుంది. ధర్మ మార్గం సురక్షితమైన రహదారి అయితే, అధర్మం ప్రమాదకరమైన అడ్డదారి అనే చక్కని ఉపమానంతో మనిషి తన విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని ఈ వ్యాసం గుర్తుచేస్తుంది.
ధర్మాచరణ నేటి మానవులకు గగన కుసుమమే. కానీ ధర్మాన్ని ప్రతి మనిషి కర్తవ్యంగా భావించి ఆచరించాలి. కృతయుగంలో జనులందరికీ ధర్మం పట్ల ఆసక్తి ఉండబట్టే నాలుగు పాదాలతో నడిచినది కాస్తా త్రేతాయుగం వచ్చేసరికి కొంత సన్నగిల్లి మానవుల జీవన విధానం వల్ల ఇంకో కాలు పోగొట్టుకుంది. ద్వాపర యుగం మరొక కాలును విరిచేసింది. కలియుగం వేరొక కాలును బలితీసుకుని చావకుండా బతక్కుండా చేసింది గోవులాంటి ధర్మాన్ని.
గోమాతను పూజిస్తే ధర్మాన్ని అర్చించినట్లే.
ధర్మం అంటే మనం అనుకుంటున్న దానం కాదు. సమస్త జగత్తుకు కొన్ని నిర్దిష్టమైన విధులు విధించబడ్డాయి, వాటిని తుచ తప్పకుండా అనుసరించడమే ధర్మాన్ని అనుసరించడం. అంటే తమకు అప్పగించిన పనిని దైవంగా భావించి పూర్తిచేయాలి. వాటిలో తప్పిదాలు తెలిసికానీ, తెలియకకానీ జరిగితే ప్రళయాలు సంభవిస్తాయి. అదే ధర్మానికి హాని కలగడం అంటే.
సమస్త ప్రకృతిలో వివేకం కలవాడు మానవుడు. అతగాడికి మాత్రమే బుద్ధి వక్రించడం వల్ల సమస్త జీవరాశులు ఇబ్బంది పడి మార్గం తప్పుతాయి. తద్వారా ఊహించని పరిణామాలను జగత్తు ఎదుర్కోవలసి వస్తుంది.
మానవుని వక్రబుద్ధికి ముఖ్య కారణం అత్యాశ.
సహనం లేని మానవుడు కోరినదే తడవుగా తనకు కావాల్సిన సంపాదన కానీ, ఆహారం కానీ ఒకటేమిటి సర్వం మిగిలిన వారి కంటే ఎక్కువగానూ, తరతరాల తన వారసులకు కూడబెడతాడు. దానికోసం చేయని దుర్మార్గం లేదు, చంపని జంతువు లేదు, నరకని చెట్టు లేదు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. వానాకాలంలో ఎండలు, సీతాకాలంలో (శీతాకాలంలో) వానలు రాక ఏమవుతుంది???
ఇంద్రియ నిగ్రహం లేని మనిషి వావి వరుస లేని పశువులా తయారవుతాడు.
అమ్మలా చూడవలసిన అబలను ఆదిశక్తి అయ్యేలా ప్రవర్తించి అసువులు బాస్తున్నాడు.
ధర్మం గాడి తప్పకుండా చూడవలసిన రాజే దాన్ని అతిక్రమిస్తే భగవంతుడే అవతారమెత్తవలసి వచ్చింది ఆయా యుగాల్లో. కానీ కలియుగంలో అది సాధ్యం కాదు కనుక ప్రతి మనిషి ధర్మ వర్తనంతో తమ విధుల్ని నిర్వర్తించుకోవాలి.
ప్రకృతిని పరాశక్తిగా భావించే సనాతన భారతీయ సంప్రదాయం దానికి హాని చేస్తే అది విజృంభించి సర్వమూ హరింపచేయకుండా కాపాడుకోవాలి.
ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని మన పూర్వికులు ఏనాడో చెప్పారు, కాపాడారు కూడా.
భగవంతుడే స్వయంగా ధర్మానికి హాని కలిగినప్పుడు చూస్తూ ఊరుకోనని, తాను అవతరించి అధర్మాన్ని హతమారుస్తానని చెప్పాడు.
అధర్మ వర్తనులైన రావణుడు, కంసుడు, శిశుపాలుడు వంటి రాక్షస ప్రవర్తన కలవారిని సంహరించిన భగవంతుడు ఎవ్వరినీ ఉపేక్షించడు.
మనమంతా ఒక్కటి గమనించాలి; ధర్మ మార్గం తప్పేది మానవులే.... మనం నాటిన చెట్టు కానీ, మనం పెంచిన జంతువు కానీ వాటి ధర్మాలు అవి నిర్వర్తిస్తాయి.
ఒక్కటి మనం గమనించాలి. మనం ఒక రహదారిలో సుఖంగా ప్రయాణిస్తున్నప్పుడు క్షేమంగా ఇంటికి చేరుతాం. కానీ దగ్గర కదా అని అడ్డదారిలో ప్రయాణిస్తే అది ముళ్లతోను, గోతులు గొయ్యులతోను, విషకీటకాలతోను ఉండి ప్రాణాలకే ప్రమాదాన్ని కోరి తెచ్చి పెట్టుకుంటాం.
ధర్మం అనేది రహదారి అయితే, అధర్మం అడ్డదారి.
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి కొన్ని ఇతర రచనలు:
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి









Comments