top of page

నాకు సమాధి కట్టండి - పార్ట్ 1 'Naku samadhi Kattandi - Part 1/2' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 20/02/2024

'నాకు సమాధి కట్టండి పార్ట్ 1 /2పెద్దకథ ప్రారంభం

రచన, కథా పఠనం: పెనుమాక వసంతశాంతమ్మ, ఊరి పంచాయితీకి, వచ్చింది. నేత చీరతో, మొహంలో ముడతలతో కళ్ళజోడుతో, ఒక రకమైన, నిస్తేజంతో వుంది. చేతిలో కర్ర, ఇంకో చేతి సంచిలో కాగితాలున్నాయి. ఎండకు నడిచి రావటం మూలానా చేతి కొంగుతో, మొహం మీద చెమటను మాటిమాటికీ తుడుచుకుంటున్నది


 ఆ ఊరిలో, పంచాయితీ నడి బొడ్డునున్న పెద్ద వేపచెట్టు కింద జరుగుతుంది. పంచాయితీలో ఊరి, సర్పంచు రాయుడు, ఇంకా పెద్దలు, కూర్చుని ఉన్నారు. 


 రాయుడుకు బాగా తెలిసిన వ్యక్తి మూలానా శాంతమ్మ తో "ఏంది, పిన్నమ్మ, ! పంచాయితీ, పెట్టమన్నావు దేనికి" అడిగాడు రాయుడు. 

 

 "రాయుడు, బాగుండావా! అమ్మ బాగుందా"అనడిగింది. "బాగుందిగాని. ఎందుకొచ్చావో! చెప్పు ముందు. "


 "ఎందుకా! నాకు, సమాధి కట్టాలి. "

 

 అక్కడున్న, అందరూ! శాంతమ్మ మాటలకు ఆశ్చర్యపోయారు. 

 

 "నువ్వు బతికే వుండావుగా! ఎట్లా సమాధి, కడతారు ఎవరు కడతారన్న!" రాయుడు, మాటలకు, అక్కడున్న ఊరి, పెద్దలు గొల్లుమని నవ్వారు. 


 "ఏంది మతుండే, మాటాడుతున్నావా!" అని ఇంకొంతమంది మాట్లాడటంతో "ఆ నాకు మతి పోలేదు, గానీ! నవుతూలకు సెప్పటం లేదు. సత్తెపెమానకంగా సమాధి, కట్టాలి, నేను బతికుండగానే. 


 "ఓరి! నీ బండ, .. పడ, పిన్నమ్మా! నువ్వేమైనా బ్రహ్మం గారివా! బతికుండగా నీకు, సమాధి కట్టటానికి" అన్న రాయుడు మాటలకు అక్కడున్న వాళ్ళు మళ్ళీ, పెద్దగా, నవ్వారు. 


 "అట్లా, నవ్వమాకండి, ఆ బండను నా సమాధి మీదెయ్యండి సాలు. ఒకేలా మీకు సేతకాకపోతే, సెప్పండీ, ! పక్కనే ఉన్న, నే పుట్టిన ఊరెళ్ళి ఆడన్నా నాకు సమాధి కట్టమని అడుగుతా! ఆ సర్పంచు, నా మాట ఇంటాడని శాంతమ్మ కదలబోతుంటే... "అరె ఆగు పిన్నమ్మ అంత, తొందరెందుకు, ఈడ, కూచో నేనున్నాగా! ఏమి జరిగింది సెప్పు!" అన్నాడు, " రాయుడు. 


 ఆ ఊరి సర్పంచుకు, ఈ రాయుడుకు పడదు. 'ఈ శాంతమ్మ నికార్సైన మడిసి, సరిగా ఏదన్నా! జరక్కపోతే ఊరుకునే రకం కాదు. ఈమె ఆ ఊరెళ్ళి సర్పంచుకు సెపితే, 

 వాడు అధికార, పార్టీ ఎంఎల్ఏకు సెపుతాడనుకునీ!' ముందు, నీ సమస్య యేంది" సెప్పు పిన్నమ్మ, నవ్వుతూ" అన్నాడు రాయుడు. 


 "నేను. మా పిల్లలు, సూడక ఈ వూరి సివరున్న, వుద్దాశ్రమములో ఉన్న సంగతి నీకు ఎరుకేగా!"


 "ఆ అవును! పక్క టౌన్లో ఉన్న, మన ఊరి, డాక్టర్ రమణగారు, సుందర తులసీ! వృద్ధులాశ్రమం, పెట్టారు. అందులో, నువ్వు ఉంటన్నావు. ఇపుడైమైంది ఆడ, వాళ్ళు, నిన్ను సూడటం లేదా!, సెప్పూ ఏదన్నా ఇబ్బందుంటే, నేను, డాక్టర్గారితో మాటాడతాగా మనూరు వచ్చినప్పుడు" అన్నాడు రాయుడు. 


 "ఆడ, సూడలేదని, ఎవరు సెప్పారు! నీకు. వాళ్లుండి, ఏలకు ముద్ద పెట్టబట్టే, ఇపుడు నీ, ముందుకొచ్చి మాటాడుతున్నా! నాకు, నా పిల్లల మీద, నమ్మకం లేదు. అసలు మడుసులంటేనే, సిరాకుగా వుంది. ముందు, నా, ఐదుగురు పిల్లలకు, కబురెట్టి ఈడకు వున్న పలానా రమ్మనండి. అపుడే సేపుతా అంతా ఇవరంగా" అంటూ, చెట్టు అరుగుపై, ఒక వైపు, కూలబడింది. ఆ వూళ్లోనే వున్న, ముగ్గురు, కొడుకులు, ఇద్దరు, కూతుళ్లకు, కబురంపారు పంచాయితీకి రమ్మని. 


 పిల్లలందరూ! మళ్ళీ, ఈ ముసలిది, నెత్తి పైకి ఏమి తెచ్చిందోనని వురుకుతూ... వచ్చారు. 

 

 రాయుడు శాంతమ్మ పెద్ద కొడుకు, తన ఫ్రెండ్ అవటంతో ఏందిరా, శివ "మీ అమ్మ, తనకు సమాధి, కట్టమంటుంది, యేందీ, కతా! మీ అందరికీ తెల్సా ఈ యవ్వారం" అన్నాడు. 


 ఇద్దరు కూతుళ్ళు, 'యేమైంది, మా అమ్మకు' అనుకుంటూ "ఎందమ్మా! సమాధి కట్టటం ఏందన్నారు" ఆశ్చర్యపోతూ! 


 "అవునూ! నాకు, మతుండే సెపుతున్నా ఇనండి. మీరైదుగురు, కలిసి నాకు సమాధి, కట్టాలంది" శాంతమ్మ. 


 కోడళ్ళు, లోలోపల నువు సస్తే, ఎటూ సమాధి కడతాములే!ఎందుకంత తొందరని' గొనుక్కున్నారు. 

 

 "ఇపుడు, నీకేమి! తక్కువైంది. మా కాడ వుండమంటే, వుండకుండా ఆ ఆశ్రమంలో చేరావు. అప్పటికీ, ఆడికి, మేము వచ్చి నిను, సూత్తానే వుండాము. మళ్ళీ ఇపుడు ఈ సమాధి గోలేంది. ఇప్పటికే, నీవల్ల ఊళ్లో, తలెత్తుకోలేక పోతన్నామన్నారు" కొడుకులు


 "మీరు, బాగా సూత్తే, నేను ఆశ్రమము కాడికి, ఎందుకు పోతా... ! మీ నాయన, పోయినపుడు, మేముగ్గురము, నాల్గునెలల కాడికి, నన్ను, సూసుకుంటామని వంతులేసుకున్నారు. అపుడు మీ ఇళ్ళల్లో వుండి, సాకిరి సేత్తే బాగానే సూసుకొని నాకు ఓపిక తగ్గగానే, సూడటానికి వంతులేసుకున్నారు. నా ఒంట్లో బలం వుంటేనే నన్ను సూస్తారా!? నాకు, కూడెట్టక తిప్పలు పెడితేనేగా, నేను ఆ ఆశ్రమంలో చేరింది. "


 "మేము సూడలేదు సరే, నీ కూతుళ్ళనూ!, నిను సూస్తే, మేము, డబ్బులిత్తామన్నాముగా కానీ! నువు నీ కూతుళ్ళు, ఏడ, కట్టపడతారోని వాళ్ల కాడికి పోక ఆశ్రమానికి, పోయావు. ఇందులో మా తప్పెమిలేదన్నారు" కోడళ్ళు. "అద్గదీ!" అనీ, దానికి కొడుకులు వంత పాడారు. 


 "సానా, బాగుంది! మీరు సెప్పటం. ఇల్లు, పొలం మీకివ్వటం. నేనెల్లి! కూతుళ్ల, కాడ వుండటం. నేను వాళ్ల, కాడ, వుండను. వాళ్ళు బంగారం, పెట్టినా సరే. ఆస్తులు, మీకునూ! నాకు తిండి పెట్టేది వాల్లా ఏమి! నాయం. "


 "నీకాడున్న, బంగారం, నీ కూతుల్లకే, ఇచ్చి, ఆడనే, వుండమన్నాముగా మేమేమన్నా, అడిగామా!" కోడళ్ళు ఎంతో ఉదారంగా అక్కడున్న జనాల వైపు చూస్తూ, అన్నారు. 


 "నా కాడుంది, ఒక్క పుస్తెల తాడే మా ఆయనకు, రోగం వచ్చినప్పుడు మీ మొగుళ్ళు ఒక్కపైసా కూడా, ఇయ్యక, పోతే, నా పుస్తెల తాడమ్మి, బాగుచేయించా. అది మీకు, ఆనాడే సెప్పానంది" శాంతమ్మ. 


 "మేమూ! కొంత డబ్బులు నాన్న, రోగం బాగుసేయటానికి, వేసుకుండాముగా" అన్నాడు, చిన్న, కొడుకు. "ఏడ, ఏసుకుండారు. వాడు డబ్బు తీయలేదని నువ్వు, నువు తీయలేదని వాడు, మీ ఇద్దరినీ సూసి మీ అన్నా! డబ్బులేడ తీసారు. 

 

 మీ నాయన శవాన్ని ఇంటికి తెచ్చిన కాడినుండి, డబ్బులేసుకుని, పెద్ద దినం, సేసి వూరంతా, బోజనాలు, పెట్టించారు, మేమంత, బాగా మా నాయనకు, కర్చు పెట్టామో అనీ! జనాలకి, సూపటానికి, ఇంకా సెప్పాలంటే, ఒక మడిసి, తిండి కర్చు తగ్గినదనుకొని సేసినట్లుగా వుండది. 


 బతికినప్పుడు, నాయన్ను, సూడని, మీరూ! సచ్చాక, గనంగా, దినబంతి సేయమని ఎవరేడ్చారురా!మిమ్మలను. నేను మీ నాన్నకు, సమాధి కట్టమంటే, ఇక మాకాడ, డబ్బులేవంటే! నా కాడ కూరలమ్మిన డబ్బులుంటే ఇత్తే.. , ఆటితో కట్టారు. అట్లా నేను, ఆయనకు సమాధి, కట్టించినా. ఇల్లూ, రెండెకరాల పొలం మిచ్చిన నాయన్నే, సరిగా, చూడని మీరూ రేపు నన్ను, తగలేస్తారనే, నమ్మకం లేదు. 


 నాకు, మనువైన కాడి నుండి, ఏనాడూ, సుకపడ్డది లేదు. మా ఆయన, తాగి పండుకుంటే, రెక్కల, ముక్కలు చేసుకుని, ఇంటిని పోసించా. ఈళ్ళను, సదువు కోండిరా అని బళ్లకి పంపితే పోకుండా నాతో పొలం పనులకు, వచ్చేవారు. మా పొలంలో పన్లు, లేకపోతే, రాయుడు, పొలంలో కూడా పనిచేసా. ఈ రాయుడు వాల్లమ్మ గంగది నాది, ఒకే వూరవటం వల్ల బాగుండేవాళ్లము ఇద్దరం. 


 "శాంతా, నువు మా ఇంటికి, పనికొచ్చినా! మనది, ఒకేవూరంటూ గంగ, సూసిసూడకుండా బియ్యం, సరుకులు, ఇచ్చేది. కాసేపు మా రాయుడిని, సూసుకో అంటూ నా సేతుల్లో పెట్టేది. మా ఇంటికి తెత్తే మా పిల్లలతో, ఆడేవాడు. మా పెద్దాడి వయసోడే ఈ రాయుడు"అంటే రాయుడు, "పిన్నమ్మ వాళ్ల పిల్లలతో పాటు నన్ను చూసేది నాకు అమ్మతో సమానమన్నాడు. "


 "పాడి సేసి, అందరిల్లలో పాలు పోసినా. ఆ వచ్చిన డబ్బుల్ని, వడ్డికిచ్చి సంపాదించా. ఆ డబ్బులతో, పిల్లలకు, లగ్గం చేసినా. కూరలమ్మినా, ఇల్లు పొలం, అమ్మకుండా ఆడపిల్లలను, బయటకు, పోనీకుండా మేనల్లులకు, ఇచ్చి చేసా. మా ఆయన తాగి వచ్చినప్పుడల్లా, ఇళ్ళమ్మమని, గోలసేసి, నేను ఇనక పోతే, గొడ్డును బాదినట్లు బాదేవాడు, అయినా, ఇంట్లొ నుండి నేను యాడికి, పోలేదు. 

 అదే ఒక, మగాడు పెళ్ళాం చనిపోతే పిల్లలను, పెంచలేక ఇంకో మనవు సేసుకుంటాడు. మరి, మేము ఆడాళ్ళం మొగుడు, తాగుబోతయినా!, వాడితో యేగుతూనే, పిల్లలను, సాకుతాము. మాకు మొగుడు పోయినా, ఇంకో మనువు సేసుకోకుండా, పిల్లల కోసం బతికితే, మాకు సివరాకరికి ఒక ముద్ద కూడా దక్కదు. 


 మా ఆయన్ను, నేనే సూసి సాగనంపినా. నన్ను, సాగనంపటానికి, వంతులేసుకోవటం ఏమి! దర్మం. వీళ్లయ్య, వీళ్ళను తలసి సూసి సాకింది లేదు. నేను కూడా, వీళ్ళ అయ్యతో వంతులేసుకని చూడకుండా ఉంటే, వీళ్ళు, ఇంతోల్లు అయ్యేవారా! ఇపుడు మటుకు, మాఅయ్య ఇట్లా, సేసేవాడు, అట్లా వుండేవాడని ఓ కబుర్లు, సెపుతారు. అంతేగానీ, ఆశ్రమములో పడున్న తల్లినీ! నా గూర్చి, అనుకునేవాడే లేడు” అంటూ కళ్ళు ఒత్తుకుంది శాంతమ్మ. 

========================================================================

ఇంకా వుంది..


========================================================================

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


 విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
57 views1 comment

1 Comment


@tulasidevisanka7094

• 23 hours ago

సూపర్ మేడం

Like
bottom of page