'Nenu Premisthunnanu - Episode 10' - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 05/03/2024
'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్.
వంశీ, కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి. వంశీ, స్వాతి ఇంటికి వెళ్లి తనతో క్లోజ్ గా మూవ్ అవుతాడు.
పిక్నిక్ లో లక్ష్మి అనే అమ్మాయిని కాపాడతాడు వంశీ.
లక్ష్మికి వంశీ అంటే ప్రేమ పుడుతుంది.
వంశీకి సరైన జోడీ లక్ష్మీయేనని భావించి తను తప్పుకోవాలనుకుంటుంది స్వాతి.
ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 10 చదవండి.
స్వాతి ఏ కాలేజీ లో చదువుతున్నాదో తెలుసుకోవాలని వంశీ తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ పనివాడు దగ్గరకు వెళ్లి.. కావలసిన విషయాన్ని అడిగాడు. ఒక పచ్చ నోటు చూపించి.. కాలేజీ డీటెయిల్స్ తెలుసుకున్నాడు. డబ్బుతో కానిది ఏముంది ఈ లోకంలో అనుకున్నాడు.
ఇక్కడ తనకి ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి.. ముందు వాటి మీద దృష్టి పెట్టాలనుకున్నాడు. అందుకు రాత్రి.. పగలు.. చాలా కష్టపడి చదివాడు. ఎగ్జామ్స్ అయిపోగానే.. స్వాతి ఉన్న ఊరికి బయల్దేరాడు వంశీ.
ఊరు చేరగానే తన ఫ్రెండ్ రూమ్ లో దిగి.. అక్కడ నుంచి స్వాతి ఉన్న కాలేజీ గురించి వివరాలు తెలుసుకున్నాడు. అక్కడ కాలేజీ హాస్టల్ లో ఉంటున్న స్వాతి తో ఎలాగైనా మాట్లాడాలని అనుకుని.. ఫోన్ నెంబర్ సంపాదించాడు. బయట ఫోన్ బూత్ నుంచి అక్కడ పని చేసే అమ్మాయితో ముందు మాట్లాడించి.. అక్కడ స్వాతి ని పిలవమని చెప్పించాడు వంశీ..
"హలో.. ! అని అవతల నుంచి స్వాతి వాయిస్.. ఎవరు?"
"హలో.. ! అని వంశీ అన్నాడు.. "
"హలో వంశీ.. నువ్వేకదా.. నీ గొంతు నేను గుర్తుపట్టాను.. "
"అవును 'స్వా'.. "
"ఇప్పుడు దొరికావు.. నన్ను 'స్వా' అని పిలిచేది నా వంశీ మాత్రమే.. "
"ఎలా ఉన్నావు స్వాతి.. ?"
"ఏదో ఇలా ఉన్నాను.. నువ్వు ఎలా ఉన్నావు వంశీ.. నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు.. ?"
"మీ ఇంట్లో పనివాడి ద్వారా తెలిసింది.. "
"ఎంతైనా నా వంశీ తెలివైనవాడు.. ఎప్పటికైనా నువ్వు వస్తావని నాకు తెలుసు.. "
"నా మీద అంత ప్రేమ ఉన్నదానివి ఎందుకు చెప్పకుండా వచ్చేసావు స్వాతి.. ?"
"ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లడకూడదు.. ఈ రోజు సాయంత్రం మనం కలుద్దాం వంశీ.. బై.. "
ఆ రోజు సాయంత్రం వంశీ స్వాతి ని కలిసాడు తన కాలేజీ బయట.. స్వాతి వంశీ ని అక్కడ చూసి చాలా ఆనందించింది. వంశీ ఆమె దగ్గరకు రాగానే.. కన్నీరు పెట్టుకుని పలకరించాడు. ఆనందంలో, స్వాతి నవ్వుతూ పలకరించింది.
"స్వాతి.. ! నన్ను నువ్వు అర్ధం చేసుకున్నది ఇంతేనా! నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతే, నేను నీకు దూరమైపోతానా చెప్పు? నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఇంట్లో వారి బాధ చూడలేక ఇలా దూరంగా వచ్చేసావు అంతే! నాకు తెలియదా చెప్పు.. ?"
వంశీ మాటలు వినగానే, స్వాతి వంశీని కౌగలించుకుని.. "వంశీ! నీ గురించి తలవని క్షణం లేదు.. తెలుసా.. ?"
"మా నాన్న కోసం.. నేను చదువుకోడానికి ఇక్కడకు వచ్చేసాను.. ఐనా ఆ లక్ష్మి ని పెళ్ళి చేసుకోవొచ్చు కదా.. నీకోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిని ఎందుకు వదులుకున్నావు?"
"నాకు ఇష్టం లేని అమ్మాయి.. ప్రాణం ఇచ్చిన నాకు ఎందుకు.. ? నీ లాంటి అమ్మాయి నాకు జీవితాంతం తోడు కావాలి.. "
"ఆ మాట వినగానే స్వాతి మరింత ఆనందం తన ముఖంలో కనిపించింది. మరింత గట్టిగా వాటేసుకుంది.
"స్వాతి! నేను ఇక్కడే వేరే కాలేజీ లో జాయిన్ అవుతున్నాను.. ఇక మనం రెగ్యులర్ గా కలవొచ్చు.. "
"మీ ఇంట్లో అడిగితే ఏమిటి చెబుతావు వంశీ.. ?"
"నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ కుడా చేస్తున్నాను.. అదే చెబుతాను.. "
"నువ్వు చాలా స్మార్ట్ వంశీ.. నా కోసం ఇంత కష్టపడుతున్నావు.. క్యాంపస్ సెలెక్షన్స్ లో నువ్వు టాప్ కంపెనీ లో జాబ్ ఆఫర్ ని వదులుకుని.. నా కోసం ఇక్కడకు వచ్చేశావు.. "
"అంతా మన కోసమే కదా.. అయినా.. ఇక్కడ చదువు అయిపోగానే, మంచి జాబ్ వస్తుంది.. అప్పుడు మనం హ్యాపీ గా ఉండొచ్చు.. "
అలా.. వంశీ, స్వాతి తో ఎప్పటిలాగానే.. ప్రేమతో స్నేహంగా ఉంటూ వారి చదువులు పూర్తి చేసుకున్నారు. రోజూ ఇద్దరు బయట కలుసుకునే వారు. ఆ తర్వాత.. వంశీ కి మంచి ఉద్యోగం వచ్చింది. అప్పటికి తాను ఆ ఊరు వచ్చి.. మూడు సంవత్సరాలైంది.
ఒక సంవత్సరం తర్వాత స్వాతి చదువు కూడా పూర్తి అయిపోయింది. నాలుగు సంవత్సరాలు, ఇద్దరు ప్రేమలో ఉన్నా.. ఎప్పుడు హద్దులు దాటలేదు.
ఇద్దరు తమ ఊరికి వచ్చేసారు. వంశీ తన పేరెంట్స్ కి స్వాతి ని పరిచయం చేసి.. ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వంశీ తల్లిదండ్రులు తమ కొడుకు కోరిక మన్నించి పెళ్లి మాటలకు స్వాతి ఇంటికి వెళ్లారు.
స్వాతి డాడీ పెళ్ళికి ఒప్పుకున్నారు. వంశీ లాంటి మంచివాడిని ఇప్పుడు వదులుకోలేరు. మంచితనం, మంచి ఉద్యోగం దానికి కారణం. స్వాతి వాళ్ళ పెద నాన్నగారు లేకపోవడం తో వంశీ ను గుర్తు పట్టేవారు ఎవరు లేరు.
వంశీ.. స్వాతి ని పెళ్ళి చేసుకుని.. ఇద్దరు జీవితాంతం హాపీ గా ఉన్నారు. ఇంక అక్కడ స్వాతి ఫ్రెండ్ స్నేహ.. తన బావ తో హ్యాపీ గా ఉంది. ఇప్పుడు తల్లి కుడా అయ్యింది. మిగిలిన వాళ్ళు మంచి జాబ్ లో సెటిల్ అయ్యారు..
=============================================================================
సమాప్తం
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ తాత మోహనకృష్ణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
=============================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Commentaires