top of page
Writer's pictureMohana Krishna Tata

నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 9



'Nenu Premisthunnanu - Episode 9'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata Published In manatelugukathalu.com On 27/02/2024

'నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీ గా ఉంటాడు. పద్మ చాలా ఓర్పు, నేర్పు ఉన్న ఇల్లాలు. కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్. 


వంశీ, కాలేజీ లో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్ లో పడతాడు. స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధ పడతాడు వంశీ. తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు. ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి. వంశీ, స్వాతి ఇంటికి వెళ్లి తనతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. 


పిక్నిక్ లో లక్ష్మి అనే అమ్మాయిని కాపాడతాడు వంశీ. 

లక్ష్మికి వంశీ అంటే ప్రేమ పుడుతుంది. 


ఇక నేను ప్రేమిస్తున్నాను - ఎపిసోడ్ 9 చదవండి. 


ఇది ఇలా ఉండగా.. స్వాతి డిగ్రీ లో జాయిన్ అవకముందు, ఇంజనీరింగ్ కోసం ఎంట్రన్స్ రాసింది. పెద్ద ర్యాంక్ రావడం చేత డిగ్రీ లో జాయిన్ అయ్యింది. కానీ చాలా సీట్లు ఉండిపోవడం చేత, మళ్ళీ తనని కౌన్సిలింగ్ కు పిలిచారు. స్వాతి డాడీ తనని కౌన్సిలింగ్ కు తీసుకుని వెళ్లి, చివరకు ఏలూరు లో ఒక కాలేజీ లో జాయిన్ చేసేసారు. స్వాతి కి ఇష్టం లేదు. కానీ తండ్రంటే భయం. ఏం చేస్తుంది? 


అసలు విషయం వేరు. స్వాతి తండ్రికి ప్రేమలంటే అసలు ఇష్టముండదు. ఇక్కడుంటే, ఎక్కడ ప్రేమ లో పడుతుందో అని, అక్కడ హాస్టల్ లో జాయిన్ చేసి చదివిస్తున్నారు. పైగా ఇంజనీరింగ్ అంటే మంచిది కదా! ఇదంతా స్వాతి తండ్రి తల్లితో చెబుతుంటే విన్నది స్వాతి. 


జరిగిన ఈ విషయాన్నీ వంశీ కు చెబుదామని కాలేజీకు త్వరగా వెళ్ళింది స్వాతి. క్లాస్ లో బుక్స్ పెట్టడానికి వెళ్తుండగా లోపల నుంచి వినిపిస్తున్న మాటలు గోడ చాటు నుంచి వింటుంది స్వాతి. అక్కడ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు.. 


లక్ష్మి కి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ. ఎప్పుడూ ఫ్రెండ్స్ తోనే ఉంటుంది. ఆ రోజు ఎందుకనో.. ఇంకా ఇంటికి వెళ్ళలేదు లక్ష్మి. ఇంట్లో కుడా చుట్టాలతో ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. లక్ష్మి అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. అలాంటిది వంశీ కి ప్రపోజ్ చేసినా.. తనని అర్ధం చేసుకోవట్లేదు. సూసైడ్ ట్రై చేసిన తర్వాత కుడా.. మనిషి లో ఏ మార్పు రాలేదని ఫీల్ అయ్యింది లక్ష్మి. 


"లక్ష్మి! నీ లవర్ లైన్ లోకి వచ్చినట్టేనా.. లేదా?"

"లేదే ఇంకా!"

"ఎన్ని సార్లు 'ఐ లవ్ యు' చెప్పినా పట్టించుకోవట్లేదు. పైగా ఫ్రెండ్స్ గా ఉందాం అంటున్నాడు.. "

"ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమోనే!"

"నీ కన్నా.. అందమైన అమ్మాయి దొరుకుతుందా నీ లవర్ కి.. ?"

"మొన్న నేను బ్లేడ్ తో చేతి పైన కోసుకుంటే.. హాస్పిటల్ కు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. డాక్టర్ తో నేను తన ఫ్రెండ్ అని చెప్పాడు.. "


"లక్కీ! మీ ఇంట్లో నీ గురించి ఏమీ అడగలేదా.. ఎందుకు ఇలా చేసుకున్నావు అని.. ?"

"ఏం చెప్పమంటావే.. అదో పెద్ద సీన్. నా లవర్ నా పరిస్టితి చూసి.. ప్రేమ పుట్టి.. ప్రపోజ్ చేస్తాడని అనుకున్నాను. అప్పుడు మా ఇంట్లో జరిగినది చెప్పి.. పేరెంట్స్ ని ఒప్పిద్దామని అనుకున్నాను.. కానీ అలా జరగలేదు. ఇప్పుడు నేను నిజం చెప్పినా.. మా ఇంట్లో నమ్మరు. అందుకే, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు.. చెయ్యి కట్ అయ్యిందని అబద్దం చెప్పాను అంతే.. "

"ఎంతైనా.. నువ్వు చాలా తెలివైన దానివే లక్ష్మి! మీ లవర్ గురించి ఇంకా ఏమైనా చెప్పవే.. వినాలని ఉంది.. "


"నిన్న చాక్లెట్ తెమ్మంటే.. కిట్ కాట్ తెచ్చాడు.. "


అక్కడ బయట స్వాతి తలుపు పక్కన నిల్చొని ఇదంతా వింటూనే వుంది. ఆ ప్రేమికుడు ఎవరా? అని ఆలోచిస్తుంది.. 


"ఈ రోజు ఎలాగైనా ఒప్పించాలి.. ఒప్పుకోకపోతే ఈ సారి విషం తీసుకుంటాను.. అది తేల్చుకోవడానికి.. వంశీ ని సాయంత్రం బీచ్ కు రమ్మన్నాను.. " అంది లక్ష్మి 


వంశీ పేరు వినగానే.. స్వాతి మనసు బద్దలైంది.. ఎన్నో ఆలోచనలు మనసులో రేగాయి.. 


వంశీ కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మి ని చూసి స్వాతి ఆనందించింది. తాను ఎలాగో తెగించి, మమ్మీ డాడీ మాట కాదనలేదు. కాబట్టి తాను తప్పుకుంటే, లక్ష్మి.. వంశీ కి దగ్గర అవుతుందని భావించింది స్వాతి. 


వంశీ.. స్వాతి కోసం చాలా ఎదురు చూసాడు. కాలేజీ కి రావడం మానేసింది. వొంట్లో ఏమైనా బాగోలేదేమో నని అనుకున్నాను. మర్నాడు కుడా ఇంకా కాలేజీ కు రాలేదు. ఫ్రెండ్స్ ద్వారా స్వాతి వేరే ఊరిలో.. కాలేజీ లో జాయిన్ అయ్యిందని తెలిసింది. కానీ ఏ కాలేజీ అనేది ఎవరికీ తెలియదు. ఆ విషయం స్వాతి నాన్నగారు బయటకు ఎవరికీ చెప్పలేదు. అందుకే, స్వాతి ఫ్రెండ్స్ కి కుడా తెలియదు. 


రెండు రోజుల తర్వాత వంశీ కి రెండు లెటర్స్ అందాయి.. 


మొదటి దానిలో.. 


"వంశీ! నన్ను మర్చిపో! నేను నీకు సరికాను. నాలాంటి పిరికి దాన్ని నువ్వు ప్రేమించావు. నన్ను చదువు కోసం వేరే చోటకి పంపిస్తున్నారు. నేను వెళ్ళనంటే.. మా డాడీ సూసైడ్ చేసుకుంటానని అన్నారు. నువ్వంటే అమితంగా ప్రేమించే లక్ష్మి ని పెళ్లి చేసుకో.. తాను చాలా మంచిది.. బై.. నీ స్వాతి.. "


రెండవ లెటర్ లో.. 


"వంశీ! ఈ రోజు సాయంత్రం నువ్వు బీచ్ కు రావాలి.. లేకపోతే నేను విషం తీసుకుంటాను.. నీ లక్ష్మి.. "


వెంటనే, తన బైక్ స్టార్ట్ చేసి, స్వాతి ఇంటికి బయల్దేరాడు వంశీ. అప్పటికే ఆమె వెళ్లిపోయింది. ఎక్కడకు వెళ్ళారో ఇంట్లో పని వాడిని అడిగి తెలుసుకున్నాడు వంశీ. ఒక పచ్చ నోటు చేతిలో పెడితే, విషయం తెలిసింది. వంశీ వాచ్ కేసి చూసాడు. టైం ఐదు అవుతోంది. లక్ష్మి ని కలవడానికి బీచ్ కు బయల్దేరాడు. అక్కడ లక్ష్మి వంశీ కోసం ఎదురు చూస్తుంది. 


"వంశీ! నన్ను ఎందుకు ప్రేమించట్లేదు.. ? నేను అందంగా లేనా?.. చెప్పు"

"లక్ష్మి! నేను నిన్ను ఎప్పుడూ నా ఫ్రెండ్ లాగే చూసాను. నిన్ను ఎప్పుడు ప్రేమించలేదు. నేను స్వాతి ని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకుంటాను. ఇన్నాళ్లు నువ్వు నన్ను ఆటపట్టించడానికి చేస్తున్నావని అనుకుని.. ఈ విషయం నీకు చెప్పలేదు. ఐ యాం సారీ. ఒక స్నేహితుడిగా నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా అడుగు. తప్పకుండా చేస్తాను.. " అని చెప్పాడు వంశీ


'అల్ ది బెస్ట్ వంశీ! నేను ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే, నన్ను మన్నించు.. నీ ప్రేమ ఎంత గొప్పదో ఇప్పుడే నాకు తెలిసింది.. "

"మనలో సారీ ఎందుకు? బాగా చదువుకో లక్ష్మి.. బై.. "


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

49 views0 comments

Opmerkingen


bottom of page