top of page

ది కిల్లర్ - ఎపిసోడ్ 10'The Killer Episode 10'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 26/02/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్. 


వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్. 


కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్. 


సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. 


నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు. 


నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది. ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్. లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నందా. 


ముసుగు మనిషిని పట్టుకుంటాడు రామ్. 


నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగు మనిషి. 

నాయక్ గతంలో మాయ అనే యువతిని రహస్యంగా వివాహం చేసుకుంటాడు. 


ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 10 చదవండి. 


నాయక్ తన ట్రిప్ ముగించుకుని.. తన కంపెనీ కి చేరుకున్నాడు. కొన్ని రోజుల పాటు మాయే గుర్తుకు వచ్చేది.. తను చేసిన బిజినెస్ లో సక్సెస్ రావట్లేదని.. దిగులు చెందాడు నాయక్. ఒకరోజు నాయక్ తన స్వామిజీ ని కలవాలని అనుకున్నాడు. ఒక మంచి రోజు చూసుకుని, స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు నాయక్. 


"గురుజీ కి నమస్కారం.. "


"నాయక్.. ఎలా ఉన్నావు.. ?"


"బిజినెస్ ఏమీ బాగోలేదు స్వామి.. మీరు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను.. కానీ.. కలిసిరావట్లేదు"


"కొంచం టైం పడుతుంది నాయక్.. "


"ఏదైనా.. యాగం గాని, హోమం గానీ చేయించమంటారా ?”


“ఒక లాగ చెయ్యొచ్చు.. కానీ.. దానికి చాలా తప్పులు చెయ్యాలి.. తర్వాత ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి.. అది కొంచం కష్టం.. అందుకే నీకు చెప్పలేదు.. "


"ఏమిటి అది గురుజీ.. బిజినెస్ సక్సెస్ కోసం ఏదైనా చేస్తాను.. "


"నీ జాతకం లో గ్రహాలు అంతగా అనుకులించట్లేదు నాయక్.. నువ్వు సక్సెస్ సాధించాలంటే, చాలా టైం పడుతుంది.. నీకేమో ఓర్పు లేదు. తొందరగా సక్సెస్ రావాలంటే, కొన్ని పూజలు.. హోమాలు.. జపాలు అన్నీ చేయాలి.. దానితో పాటు నర బలి ఇస్తే, ఫలితం చాలా అద్బుతంగా ఉంటుంది.. పెళ్ళి కాని అమ్మాయిని బలి ఇవ్వాలి "


"నర బలి ఇవ్వాలా.. ? కానీ, గురుజీ.. ఇదంతా ఎవరికీ అనుమానం రాకుండా చెయ్యడమనేదే చాలా కష్టం.. "


"దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.. ముందు పూజలు, హోమాలు చేయిస్తాను.. అన్నీ ఆఫీస్ దగ్గరే ఉన్న ఒక రహస్య ప్రదేశం లో చేయిస్తాను. బలి కూడా అక్కడే ఇవ్వాలి"


"బలి ఎవరిని ఇవ్వాలి?.. "


"మీ ఆఫీస్ లో నీకు సెక్రటరీ గా అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసి పెట్టుకో. అమ్మాయిది.. మేషరాశి అయి ఉండాలి.. పెళ్ళి కాని అమ్మాయి అయి ఉండాలి.. ఇలా ఒక ముగ్గురు అమ్మాయిలను బలి ఇవ్వాలి. బలి ఇచ్చేముందు.. ఆ అమ్మాయి తో నువ్వు శారీరకంగా కలవాలి.. ఆ తర్వాతే బలి ఇవ్వాలి.. జాగ్రత్త సుమీ.. అమ్మాయిలకు తల్లిదండ్రులు కాని, బంధువులు కాని.. ఎవరు ఉండకుండా చూసుకో.. "


"అలాగే గురుజీ.. మీ మాటే నాకు వేదం.. "


"నువ్వు అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసే పనిలో ఉండు.. నేను పూజలకు ఏర్పాట్లు చేస్తాను.. "


అలాగ నాయక్.. తన పనులు మేనేజ్ చెయ్యడం కోసం.. సెక్రటరీ కావాలని, ఇంటర్వూలు తానే స్వయంగా చెయ్యాడానికి పూనుకున్నాడు. దానికి తగ్గట్టుగా.. ఇంటర్వూలు ప్లాన్ చేసాడు. 


అమ్మాయి కన్నె పిల్ల అయి ఉండాలి.. ముందూ వెనుకా ఎవరు ఉండకుండా ఉండాలి.. ఈ ప్రొఫైల్స్ కోసం ఇంటర్వూలు చేసాడు. అమ్మాయిని సెలెక్ట్ చేసిన తర్వాత.. ఆమె తో క్లోజ్ గా మూవ్ అవుతూ.. దగ్గర అయ్యేవాడు నాయక్. ఆమె రాశి సరిపోతేనే.. ఆమెను కంపెనీ లో ఉంచేవాడు. ఒకవేళ మేషరాశి కాకపోతే, ఆమెను కంపెనీ నుంచి తీసేసేవాడు. అలా, అందంగా.. అన్నీ కుదిరిన అమ్మాయి కోసం రోజుల తరబడి.. ఇంటర్వూలు చేసేవాడు నాయక్. 


ఒక ఫ్రెండ్ గా.. ఈ విషయాలు ఏమీ ఎప్పుడు నందా కు చెప్పేవాడు కాదు నాయక్. 


అలా అన్నీ కుదిరిన అమ్మాయితో దగ్గరగా ఉంటూ.. పెళ్ళి చేసుకుంటానని మాయ మాటలు చెబుతూ.. వారిని లోబర్చుకునే వాడు నాయక్. అలా, ఒక్కకరిని బలి కి సిద్దం చేసేవాడు. సెక్రటరీ కంపెనీ వదిలి వెళ్ళిపోయిందని.. అందరిని నమ్మించాడు. అలా, ముగ్గురు అమ్మాయిలను ఒకరి తర్వాత ఒకరిని బలి ఇచ్చాడు నాయక్. 


"నాయక్.. అనుకున్న విషయాలు అన్నీ బాగా జరిగాయి.. ఇపుడు నీకు అదృష్టం కలిసి వస్తోంది.. ఇంక నిన్ను ఆపడం దేని వల్ల కాదు. కాకపోతే, నీ మిత్రుడు నందా సహాయం తీసుకుంటూ.. కంపెనీ నడిపించు.. అతని రాశి నీకు బాగా కలిసి వస్తుంది. నీకు అంతా బాగున్న తర్వాత.. అతనిని కంపెనీ లో ఉంచినా, పంపించేసినా నీ ఇష్టం..” 


"ఇంత చేసిన గురుజీ.. మీకు నేను ఏమి ఇచ్చుకోగలను చెప్పండి?” అని గురుజీ ని కుడా బలి ఇచ్చేసాడు నాయక్.. 


ఆ తర్వాత.. కంపెనీ కి లాభాలు రావడం మొదలైంది. 


నాయక్ అప్పుడప్పుడు మాయ దగ్గరకు వెళ్లి వస్తూనే ఉన్నాడు. అలా వెళ్లడం ఒక బిజినెస్ ట్రిప్ లాగ ఉండేది అంతే! ఎవరికీ ఏమీ తెలియదు. 


మాయ కు ముగ్గురు ఆడపిల్లలు. నాయక్ చాలా ఆనంద పడ్డాడు. కానీ, ఆ సంతోషాన్ని లోకానికి తెలుపడానికి లేదు.. ఇద్దరి ఒప్పందం ప్రకారం. నాయక్ మాయ కు మాట ఇచ్చాడు.. పిల్లల్ని బాగా చదివిస్తానని. తాను తండ్రి అని లోకానికి తెలినివ్వలేదు. నందా పెళ్ళి ఊసు ఎన్ని సార్లు ఎత్తినా.. నాయక్ సీరియస్ గా అందుకే తీసుకోలేదు. కొత్తదనం కోసం, నాయక్ తన సెక్రటరీ ని తరచూ మారుస్తూనే ఉండేవాడు. 


=====================================================================

ఇంకా వుంది.. 

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

55 views0 comments

Comments


bottom of page