'The Killer Episode 11' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 04/03/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్.
వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్.
కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్.
సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.
నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు.
నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది. ఉద్యోగంలో చేరిన లతను లొంగదీసుకోవాలనుకుంటాడు నాయక్. లతతో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతాడు నందా.
ముసుగు మనిషిని పట్టుకుంటాడు రామ్. నాయక్ గురించి చెప్పడం ప్రారంభిస్తాడు ముసుగు మనిషి. నాయక్ గతంలో మాయ అనే యువతిని రహస్యంగా వివాహం చేసుకుంటాడు.
గురూజీ సలహా మేరకు వ్యాపార అభివృద్ధి కోసం ముగ్గురు కన్నెపిల్లలను బలి ఇవ్వాలనుకుంటాడు నాయక్.
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 11 చదవండి.
"ఇవ్వన్నీ ఎందుకు చేస్తున్నానో నీకు తెలియాలంటే, నా ఫ్లాష్ బ్యాక్ నీకు చెప్పాలి.. నాయక్, నందా గురించి మీకు చాలా తక్కువ తెలుసు. నాయక్ పరమ కిరాతకుడు. అమ్మాయిలంటే పిచ్చి. ఆఫీస్ లో సెక్రటరీ ని తానే ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తాడు. అందం, అమాయకత్వం ఉన్న అమ్మాయిలని సెలెక్ట్ చేసి అతని సెక్రటరీ గా పెట్టుకుంటాడు.
డబ్బు ని ఆశ చూపి, లేక బ్లాక్‌మెయిల్ చేసో.. వాళ్ళని లోబరచుకుంటాడు. అలా, తరచూ ఇంటర్వ్యూ చేసి, కొత్త వారిని పెట్టుకుంటాడు. ఇలా చేసిన నాయక్ గురించి ఎవరికీ తెలియదు. ఫ్రెండ్ నంద కు కుడా అంతగా తెలియదు.
ఇంక అసలు విషయానికి వస్తున్నాను.. ఇంత వరకు నేను చంపిన అమ్మాయిలందరూ నాయక్ సొంత పిల్లలే. ఇది నీకు ఆశ్చర్యం అనిపించవచ్చు ఇన్స్పెక్టర్, కానీ ఇది నిజం. నాయక్ కు ఇంకో భార్య ఉంది.. ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచాడు నాయక్. బిజినెస్ ట్రిప్ మీద అప్పుడప్పుడు మొదటి పెళ్ళాం మాయ దగ్గరకు వెళ్ళేవాడు. ఆ పెళ్ళాం కన్న పిల్లలే ఈ అమ్మాయిలు. వీళ్ళ గురించి నాయక్ చెప్పడు. ఇప్పుడు గోనె సంచి లో తీసుకు వచ్చిన అమ్మాయి నాయక్ రెండో పెళ్ళాం సీమా కూతురు.
ఫస్ట్ మీరు నాయక్ ని అరెస్ట్ చెయ్యాలి.. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. అలాంటి వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు.. "
"ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలుసు?.. "
"మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె ను కుడా ఒక రోజు ఆ నాయక్ లొంగ దీసుకోవడానికి ప్రయత్నించాడు, కానీ మా అమ్మ విడిపించుకుంది. కానీ, ఆమె మనసులో ఆ బాధ, భయం ఆమెను వెంటాడుతూనే వుంది. మా అమ్మ ను ఎప్పుడు ఆ విషయం భయపెడుతూనే వుంది. మా అమ్మ చనిపోతునప్పుడు ఆ నాయక్ గురించి చెప్పింది.
***
డబ్బు ని ఆశ చూపి, లేక బ్లాక్‌మెయిల్ చేసో.. సెక్రటరీ గా ఉన్న అమ్మాయిలను లోబరచుకుంటాడు. అలా, ఎప్పుడూ ఇంటర్వ్యూలు చేసి, కొత్త వారిని పెట్టుకుంటాడు. ఒకసారి, మా అమ్మ నాయక్ ఫోన్ లో ఎవరితోనే మాట్లాడిన మాటలు విన్నది.
"గురువుగారు.. మీరు చెప్పిన్నట్టే, నా రాశి అయిన మేష రాసి లో జన్మించిన పెళ్ళి కానీ అమ్మాయిలను ముగ్గురిని బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాను. రేపే బలి.. నాకు ఇంక జీవితం లో తిరుగు ఉండదు కదా!.. మీరు చెప్పినట్టే చేస్తున్నాను.. "
అలాగ ఆ ముగ్గురి అమ్మాయిలను బలి ఇచ్చాడు ఆ నాయక్. ఒక సారి నాయక్ చేస్తున్న ఈ ఘోరాల గురించి మా అమ్మ తెలుసుకున్నది. ఇది తెలిసి మా అమ్మ మీద దాడి చేయబోయాడు నాయక్. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, ఊరి విడచి వెళ్ళిపోమని, చెప్పాడు నాయక్. తన ఫ్రెండ్ భార్య కాబట్టి.. ప్రాణాలతో వదిలేస్తున్నానని వదిలేసాడు.
మొదట నుంచీ నా మీద ఆశ పడ్డ నాయక్.. ఆ రోజు టైం చూసి.. అలా నన్ను అప్పుడు లొంగ దీసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, నేను తప్పించుకున్నాను. నాలాగే, అక్కడ చేరిన చాలా మందితో ఇలానే చేసాడు నాయక్. వాడు ఒక అమ్మాయిల పిచ్చోడు.
అలా మూఢ నమ్మకాలతో ముగ్గురు అమ్మాయిలను బలి ఇచ్చాడు. వాడికి బుద్ధి చెప్పేవరకు తన ఆత్మకు శాంతి లేదని చెప్పి చనిపోయింది మా అమ్మ.
***
ఈ విషయం మా నాన్న నంద కి కుడా తెలియదు. ఎందుకంటే నాన్న ఇంకా బాధ పడతారని అమ్మ చెప్పలేదు. ఆ రివెంజ్ నేనే తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. అనుకున్న ప్రకారం, అంతా ప్లాన్ చేసి చేసాను. కన్న పిల్లలను దారుణంగా చంపితే, ఆ నాయక్ గుండె పగిలి.. అతని మీద పగ తీర్చుకోవచ్చని ప్లాన్ వేసాను. ఇంకా, ఆ నాయక్ బతికే ఉన్నాడు. అదే నా బాధ అంతా! ఆక్సిడెంట్ నుంచి బయట పడి బతికి పోయాడు.
ఈలోపు సుబ్బారావు దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ రామ్ కు ఫోన్..
"హలో సుబ్బారావు గారు.. అమ్మాయిలు ఎలా ఉన్నారు?"
"వాళ్ళు సేఫ్ సర్.. "
ఎంత తెలివైన వాడైనా, ఎక్కడో ఏదో తప్పు చేస్తాడు.. అదే నువ్వు చేసావు.. నీ వ్యాన్.. అందుకే దొరికిపోయావు.
ఇంతకీ, అంకితను ఎందుకు చంపాలనుకున్నావు? ఆమె కి నాయక్ కు సంబంధం ఏమిటి? ఆమె సుబ్బారావు కూతురు కదా?
అవును నిజమే. ఆ రోజు అంకిత కాలేజీకి వెళ్లడం కోసం లిఫ్ట్ కోసం చూస్తుంటే.. నా వ్యాన్ లో నేను ఎక్కించుకున్నాను. చాలా బతిమాలితే ఓకే అన్నాను. కానీ, నా ముసుగు చూసి.. దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసింది. అదే తనని కిడ్నాప్ చెయ్యడానికి కారణం.. నా గురించి తనకి తెలిసిపోతుందని.. కిడ్నాప్ చేసి, ఇక్కడే బంధించాను. కోల్‌కాతా అమ్మాయి తో కలిపి ఇద్దరినీ ఒకేసారి చంపెయ్యడానికి. అందుకే, అంకిత కుడా నా టార్గెట్ అయ్యింది.
ఆ ముసుగు మనిషి ని పోలీస్ కస్టడీ లోకి తీసుకున్నాడు ఇన్స్పెక్టర్ రామ్.
చేసిన ఘోరాలకి.. ముసుగు మనిషికి, నాయక్ కు కోర్టు శిక్ష విధించింది.
=====================================================================
ఇంకా వుంది..
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Comments