'The Killer Episode 6' - New Telugu Web Series Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 05/02/2024
'ది కిల్లర్ ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్.
వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్.
కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్.
సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది.
తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు.
నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు.
ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 6 చదవండి.
ఆ రోజు రాత్రి చాలా హ్యాపీ గా ఉన్నాను. మర్నాడు నేను నాయక్ తో బిజినెస్ చెయ్యబోతున్నాను. అలాంటి టైం లోనే లత కాల్ చేసింది.
"హలో! ఏమిటి లత. నేను గుర్తొచ్చాను?"
"ఏం లేదు. ఏమిటి చేస్తున్నారో నందా గారు"
"ఏం చేస్తాం. రాత్రి కదా. పడుకుంటాం. "
"పెళ్ళి కుదిరింది. కాబోయే శ్రీమతి తో ఫోన్ లో మాట్లోడొచ్చు కదా. రాత్రైనా నేను గుర్తుకు రాలేదా?"
"రోజూ ఫోన్ చేస్తున్నాను కదా. రేపు ఉదయం నేను మా ఫ్రెండ్ ఆఫీస్ లో జాయిన్ అవ్వాలి. అందుకే ఈ రోజు ఫోన్ చెయ్యలేదు. పెళ్ళయ్యాక అన్నీ నీకే తెలుస్తాయి లే లత. "
"నేను మీకు బాగా నచ్చానా?" చిలిపిగా అడిగింది లత.
"నచ్చావు కనుకనే. పెళ్ళి చూపులలో ఓకే అన్నాను గా. "
"నాలో ఏమిటి నచ్చిందో తమరికి. "
"నీ అందం. అమాయకత్వం. అన్నీను. మొత్తానికే నువ్వు ఒక అందమైనా బొమ్మ కదా. మరి నాలో ఏమిటి నచ్చిందో లత గారికి"
"మీ మంచితనం. నిజాయితీ. అమ్మను బాగా చూసుకునే మీరు, నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం. "
"నీకు డబ్బు మీద ఆశ లేదా లతా. ?"
"ఆశ ఉంది గాని. అత్యాశ లేదు. ఒకటి మాత్రం మీరు నాకు హెల్ప్ చెయ్యాలి. "
"ఏమిటో అది. '
"నాకు ఎప్పటినుంచో ఉద్యోగం చెయ్యాలని కోరిక. ఈలోపు పెళ్ళి కుదిరింది. ఆ కోరిక మీరు తీర్చగలరు. ”
"అంతేగా. ముందు పెళ్ళి చేసుకుని. హనీమూన్. తర్వాత నీ కోరిక తీరుస్తాను లే. లతా"
"పడుకోవాలన్నారు. పడుకోండి నంద. బై"
"ఒరేయ్ నందా! ఎవరితో రా అర్ధరాత్రి కబుర్లు. "
"నీ కాబోయే కోడలు లే. నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. "
"నీ అమ్మను రా నేను. నా దగ్గరా నీ వేషాలు. "
మర్నాడు ఉదయం లేచిన తర్వాత నంద పేపర్ ఓపెన్ చేసి చూసాడు. బిజినెస్ న్యూస్ లో నాయక్ కంపెనీ గురించి రాసారు. కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిసింది. తండ్రి తర్వాత కంపెనీ సరిగ్గా రన్ చెయ్యలేక ఇంకా నష్టాలలో కూరుకుపోయిందని. న్యూస్ లో వచ్చింది. సరైన టైం లో నాయక్ హెల్ప్ అడిగాడనిపించింది నందా కు.
ఎలాగైనా తన ఫ్రెండ్ కంపెనీ లాభాలలోకి తీసుకుని వచ్చి, వాడి జీవితం బాగు చెయ్యాలని అప్పుడే అనుకున్నాను నేను. చదివిన చదువుకు ఇదే మంచి ఆవకాశం అనుకున్నాడు. ఇన్ని రోజులు ఏదో ఉద్యోగం చేసినా. తను చేసిన బిజినెస్ డిగ్రీ కి ఉపయోగం ఇప్పుడే కలగనుందని అనిపించింది నందా కు.
నీట్ గా రెడీ అయ్యి. ఫ్రెండ్ ఆఫీస్ కు వెళ్ళాడు. సర్ మీటింగ్ లో ఉన్నారని, కూర్చోమని చెప్పింది రిసెప్షనిస్ట్. అక్కడ రిసెప్షన్ లో కూర్చున్న నందా ఆఫీస్ ను బాగా పరిశీలించాడు. ఎప్పుడూ నాయక్ తనని ఆఫీస్ కు రమ్మని అడగలేదు. తానూ వస్తానని ఎప్పుడూ అనలేదు. ఆఫీస్ చూడడం ఇదే. చాలా పెద్ద ఆఫీసు. స్టాఫ్ అంతగా లేరని తెలిసింది. అవును. నష్టాల్లో ఉంటే, స్టాఫ్ ఎక్కువ ఎందుకు? దండగా. అనుకున్నాడు. ఈ లోపు రిసెప్షనిస్ట్. నందా ను లోపలికి వెళ్ళమని చెప్పింది. అందంగా, నవ్వుతూ ఆమె చెప్పిన తీరు నందా కు బాగా నచ్చింది.
"రారా. నందా! నీ కోసమే చూస్తున్నాను. అయినా, వెయిట్ చెయ్యడమేమిటి రా! డైరెక్ట్ గా రాకుండా. "
"మీటింగ్ లో ఉన్నావు కదా. ఆఫీస్ రూల్స్ పాటించాలి కదా. అందుకే. వెయిట్ చేసాను. "
"నువ్వు మారలేదు గా. "
"మంచి అలవాట్లు మర్చుకోలేము కదా. "
"ఇంతకీ. నీ కాబోయే శ్రీమతి ఏమంటుంది?"
"ఏమంటుందీ. పెళ్ళి ఎప్పుడూ అంటోంది. "
"చేసుకోరా పెళ్ళి!. ఎందుకు ఇంకా వెయిటింగ్ "
"సరే గాని. నా పెళ్ళి లో హడావిడంతా నీదే ఉండాలి మరి. నాయక్ గారు. "
"ఓకే. అలాగే నందా సర్"
"ఇప్పుడు మన కంపెనీ గురించి ఆలోచించు నందా. నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క నిమిషం. మన స్టాఫ్ అందరిని పరిచయం చేస్తాను”.
బయటకు వచ్చి. స్టాఫ్ అందరినీ పరిచయం చేసాడు నాయక్. కొత్తగా తన బిజినెస్ పార్టనర్ నందా అని పరిచయం చేసాడు. అందరూ అతని మాట వినాలని చెప్పాడు. మన కంపెనీ కి అతను చాలా కీలకం అని కుడా చెప్పాడు. అందరూ నందాను చిరునవ్వుతో కంపెనీ లోకి ఆహ్వానించారు.
తర్వాత నాయక్ తన సెక్రటరీ ను పరిచయం చేసాడు. ఆమె పేరు రమ్య. నాయక్ కి సంబంధించి అన్ని విషయాలు చూసుకుంటుంది. చూడడానికి ఒక పాతిక లోపే ఉంటాయి. పెళ్ళి కుడా అయినట్టు లేదు. ఎంతైనా నాయక్ టేస్ట్ ను ఎవరూ బీట్ చెయ్యలేరు. లేడీ స్టాఫ్ ను చాలా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడనిపించింది.
ఆ రోజు నుంచి. ఆఫీస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవడం. అన్ని డిపార్ట్మెంట్స్ తో మీటింగ్స్. బిజినెస్ లో నష్టం రావడానికి గల కారణాలు, అన్నీ స్టడీ చెయ్యడానికి ఎన్నో రోజులు పట్టింది నందా కు. కొత్త స్టాఫ్ ను తీసుకున్నాడు. చాలా కష్టపడి పనిచేసారు స్టాఫ్ అంతా. కొద్ది రోజులలోనే, బిజినెస్ నష్టాలు లోంచి బయటకు రావడం మొదలైంది. ఇదంతా చేస్తూ. తన పెళ్ళి గురించి మర్చిపోయాడు నందా.
ఆ రోజు సండే, లత నాకు కాల్ చేసి. "నువ్వు నాకు నచ్చలేదు" అని చెబుతుంటే, ఫోన్ కట్ అయింది.
=====================================================================
ఇంకా వుంది.
=====================================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
Komentarze