top of page

ది కిల్లర్ - ఎపిసోడ్ 7



'The Killer Episode 7'  - New Telugu Web Series Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 10/02/2024

'ది కిల్లర్ ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక 

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కాంతం అండ్ సుబ్బారావులది చాలా అన్యోన్యమైన జంట. వాళ్ళ పిల్లలు అంకిత, ఆనంద్. 


వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్ లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ లో ఇన్స్పెక్టర్ రామ్, హత్యల గురించి చెబుతాడు. మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగుళూరు లో హత్య చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కోసం, వెళ్తున్న రామ్ ను ముసుగు మనిషి షూట్ చెయ్యడానికి చూస్తాడు. నాయక్ ఇంటికి వెళ్ళి. అక్కడ ఫోన్ నెంబర్ తీసుకుని. కేరళ వెళ్ళారని తెలిసి. నాయక్ ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్. 


కేరళ చేరిన రామ్ కు తన ప్రియురాలు రాణి, తనతో ఉన్న ఆ రోజులు గుర్తుకు వస్తాయి. ట్రిప్ కి బయల్దేరిన తల్లి దండ్రుల తో సహా రాణి ఆక్సిడెంట్ గురి అయ్యి చనిపోతుంది. రాణి కోరుకున్నట్టే పోలీస్ అవుతాడు రామ్. 


సుబ్బారావుకి జ్వరంగా ఉండడంతో కాలేజీకి ఒంటరిగా వెళ్లిన అంకిత కిడ్నాప్ అవుతుంది. తన కూతురు తప్పిపోయిందని, సుబ్బారావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాడు. 


నాయక్ ని, అతని ఫ్రెండ్ నందాలని కలుస్తాడు రామ్. నందా, ఇద్దరి గతం రామ్ కు చెబుతాడు. 


నందా లతను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. లత తనకు ఉద్యోగంలో చేరాలనే కోరిక ఉన్నట్లు చెబుతుంది.


ఇక ది కిల్లర్ - ఎపిసోడ్ 7 చదవండి. 


లత మళ్ళీ తిరిగి నాకు కాల్ చేసింది.. 


"భయపడ్డారా..? నందా గారు.."


"ఏమిటి అలా అనేసావు.."


"అది కొత్తగా వచ్చిన సినిమా పేరు. మనం ఆ సినిమా కు వెళ్దాము.."


లత కోసం సినిమా టికెట్స్ బుక్ చేశాను. మర్నాడు లత ను పిక్ చేసుకుని సినిమా హాల్ దగ్గరకు వచ్చేసారు ఇద్దరు.


"ఎందుకు అంత బుంగ మూతి లతా డియర్ .."


"అవును మరి మీరు చాలా బిజీ కదా...ఫోన్ కుడా చెయ్యరు.."


"అలాగనకు...ఆఫీస్ లో చాలా బిజీ అంతే!"


"మీకు నా మీద ప్రేమ లేదు.."


"ఎందుకు అలా అనుకుంటున్నావు?” అని జరిగినదంతా చెప్పాడు లతకు..


"అంటే, ఇప్పుడు నేను కంపెనీ బాస్ కు కాబోయే శ్రీమతి అనమాట..!"


"హమ్మయ్యా! నవ్విందండి..ఇందాకల నుంచు చూడలేక పోతున్నాను.."


"పదండి..సినిమా మొదలవుతుంది..అయినా ఎవరూ లేరేమిటి సినిమా హాల్ లో?.."


"మనం ఉన్నాము కదా..కార్నర్ సీట్స్ మనవే.."


"మిమల్ని తొందరగా పెళ్ళి చేసుకోవాలి, లేకపోతే తిన్నంగా ఉండరు.."


"చేసెయ్ మరి పెళ్ళి.."


"ముందు ఆ సినిమా చూడు..ఇది పక్కా లవ్ స్టొరీ సినిమా. ఆ రొమాంటిక్ సీన్స్ చూడు లతా.."


"చూస్తున్నాను..అంతా చూస్తున్నాను లెండి.."


"ఇప్పుడే ముహూర్తాలు పెట్టించమని చెబుతాను మా అమ్మతో..నెక్స్ట్ వీక్ పెళ్ళి. బీ రెడీ లతా.."


"నేను అన్నింటికీ రెడీ ...మీరే లేట్.."


పెళ్ళి రోజు నాడు సందడి మొదలైంది. కళ్యాణ మండపం చాలా బాగా అలంకరించారు. అందరూ బాగా రెడీ అయి కళ్యాణ మండపానికి వస్తున్నారు. ఎంట్రన్స్ లో స్వాగతం పలికే అమ్మాయిలు, గులాబీ పులు ఇచ్చే అమ్మాయిలు..బాగా సందడిగా ఉంది అంతా. పెళ్ళి కొడుకు నంద ముస్తాబై మండపం పైన కూర్చున్నాడు. పెళ్ళి కూతురు లత పక్కనే ఉన్నది. తాళి, తలంబ్రాలు అన్నీ గ్రాండ్ గా జరిగాయి. 


రాత్రి రిసెప్షన్ కి ఆఫీస్ స్టాఫ్ తో వచ్చాడు నాయక్. నాయక్ చేసిన సందడి ఇంతా అంతా కాదు. నాయక్ అందించిన గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసాడు నంద..పెళ్ళి హడావిడి అంతా అయిపోయిన తర్వాత.


"ఏమండీ! ఏమిటో అది..?"


"నాయక్ ఇచ్చిన గిఫ్ట్ కవర్.."


ఓపెన్ చేసి చూస్తే, అందులో హనీమూన్ ట్రిప్ టికెట్స్ ఉన్నాయి. 

"లతా! బ్యాగ్ సర్దు. రేపు మనం వెళ్దాము హనీమూన్..."


లత..నంద హనీమూన్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసారు. ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత...లత తన కోరిక గుర్తు చేసింది. ఆఫీస్ లో ఒక జాబ్ చెయ్యాలని ఉందని అప్పట్లో అడిగింది. 


"ఒప్పుకోండి..మీతో పాటే ఉంటాను కదా!"


"మరి జీతం ఎంత ఇచ్చుకోవాలో మేడం గారికి?"


"మీరు ఎంత ఇస్తే అంత..కానీ నన్ను హ్యాపీ గా ఉంచాలి..అంతే!"


"రేపు నాయక్ ను అడిగి చెబుతాను.."


మర్నాడు ఆఫీస్ లో బిజీ వర్క్ లో ఉన్న నందా ను నాయక్ కదిపాడు..


"హనీమూన్ ట్రిప్ ఎలా అయ్యింది?.."


"గుడ్...థాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ నాయక్"


"మరి మీ శ్రీమతి ఏమంటారు..?"


"ఆఫీస్ లో ఒక జాబ్ కావాలంట.."


"మీ శ్రీమతి అందంగా ఉంటుంది..బాగా మాట్లాడుతుంది..రిసెప్షనిస్ట్ గా చేస్తుందేమో కనుక్కో..జీతం ఎక్కువే ఇస్తామని చెప్పు.."

"అలాగే నాయక్.."


ఆ రోజు కొత్త సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాడు నాయక్. సాయంత్రం దాటినా...ఇంకా ఇంటర్వూలు చేస్తూనే ఉన్నాడు.


"ఒక సెక్రటరీ కోసం ఇన్ని ఇంటర్వూస్ ఎందుకు నాయక్ ?"


"నచ్చాలి కదా నందా.."


నేను పెద్దగా పట్టించుకోలేదు. తన ఇష్టమని ఊరుకున్నాను.


కంపెనీ నష్టాలు నుంచి బయట పడి..లాభాలు వచ్చాయి. దానికి నాయక్ చాలా ఆనందించాడు. చాలా రోజుల తర్వాత, కంపెనీ విషయం లో అంత ఆనందంగా ఉండడం చూసాను నేను. ఇప్పుడు పెళ్ళి చేసుకోమని అడిగితే..సరే అన్నాడు నాయక్.


మర్నాడు లత ఆఫీసు లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యింది. ఆఫీస్ లో లేని కొత్త హడావిడి అంతా వచ్చింది. లత ఎక్కడ ఉంటే, అక్కడ అంతే! అనుకుని నవ్వుకున్నాడు నంద. 


రోజూ..ఉదయం ఇద్దరమూ కలిసి ఆఫీస్ కు వెళ్లి..సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళము. 


ఒకసారి నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసరికి లేట్ అవుతుందని ..ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను లతకు.


ఆ రోజు రాత్రి..ఇంటికి లేట్ గా వచ్చిన నాకు..లత ను చూస్తే, చాలా డల్ గా కనిపించింది. దగ్గరకు వెళ్తే, భయపడుతోంది..


"లతా! ఒంట్లో బాగుందా? ఎందుకు అలా ఉన్నావు?"


"లత కళ్ళలోకి చూసిన నేను..తను ఎందుకో బాధ పడుతుందని అర్ధమైంది.."


"ఏమైంది లతా?..నాతో చెప్పు.."


సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి బయల్దేరుతున్నప్పుడు, నాయక్ నన్ను పిలిచారు.


"లతాగారు! ఈరోజు సెక్రటరీ ముందు వెళ్లిపోయింది..కొంచం పని ఉంది.. చేసి పెడతారా?"


"ఏమిటో చెప్పండి.."


నా మీద చెయ్యి వేసి..లోపల ఉన్న రూమ్ లోకి రమ్మని అడిగాడు. చాలా ఇబ్బందిగా మాట్లాడాడు. తన కోరిక తీర్చమని, నందా కు చెప్పనని అన్నాడు. కొంతసేపటికి అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను నందా..నేను ఏ తప్పు చెయ్యలేదు.."


మొదట్లో లత చెప్పింది నేను నమ్మలేదు. 


"నీకు ఉద్యోగం నచ్చకపోతే, మానేసెయ్ లతా..కానీ నాయక్ గురించి అలా చెప్పకు ప్లీజ్.."


"నేను చెప్పేది నిజమే..నన్ను నమ్మండి.."



"సరేలే..ఊరుకో..ఇప్పుడు మనం డిన్నర్ కి బయటకు వెళ్దాము..రెడీ అయి రా.." 


తర్వాత కొన్ని రోజులపాటు లత ఆఫీస్ కు వెళ్ళలేదు. తర్వాత నాయక్ సెక్రటరీ తో చనువుగా ఉండడం చూసి..నాకు అనుమానం వచ్చింది. ఒక రోజు, లోపల రూమ్ లో ఏం జరుగుతుందోనని కిటికీ లోంచి చూసాను. నాయక్ చేస్తున్న రాసలీలలు..అయ్యో నా లత చెప్పింది నిజమే అనమాట..నాయక్ ఇంత అమ్మాయి పిచ్చోడు అనుకోలేదు. ఇక్కడ ఇంక నేనూ లతా ఉన్నంత కాలం నాయక్ తో ఇబ్బందే. ఎక్కడున్నా..లత హ్యాపీ గా ఉంటే చాలు..


ఆ రోజు రాత్రి ఇద్దరము ఊరు విడచి వెళ్ళిపోవాలని  నిర్ణయించుకున్నాము. నాకు మంచి ఉద్యోగం వచ్చిందని ..వేరే చోటు కి వెళ్ళిపోతున్నానని నాయక్ కు ఒక మెసేజ్ పెట్టేసి..వచ్చేసాము..ఇప్పుడు ఇది నా సొంత కంపెనీ..


****


"మీ స్టొరీ విన్నాక.. నాకు చాలా  ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ తరువాత మీరు నాయక్ ను కలవలేదా..?"


"లేదు..కలవాలని కుడా అనుకోలేదు.."


"మీకు ఎంత మంది పిల్లలు నందాగారు?.."


"ఒక అబ్బాయి.."


"ఏం చేస్తున్నారు.."


"జాబ్ చేస్తున్నాడు.."


"మీ శ్రీమతి తో మాట్లాడాలి..?"


"సారీ రామ్ గారు..నా లత అనారోగ్యం తో చనిపోయింది.."


"నాయక్ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా మీకు?..ఎంతమంది పిల్లలో తెలుసా?..."

"నాకు తెలియదు సర్.."


"ఓకే థాంక్స్..మళ్ళీ కలుస్తాను" అని రామ్ అక్కడ నుంచి వెళ్ళాడు.


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

47 views0 comments

Comentários


bottom of page