top of page
Original.png

ఒక్క నిమిషం చాలు

Updated: Jun 15

Telugu Motivation, Telugu Inspirational, Life Lessons Telugu, Motivational Telugu Speech, Telugu Essay, Time Value, Telugu Literature, Inspirational Story Telugu, Life Changing Thoughts, Positive Thinking Telugu, Telugu Quotes

భారీ గడియారం ముందు నిలబడి కాలం గురించి ఆలోచిస్తున్న వ్యక్తి; జీవితం, మార్పు మరియు కాలం విలువను సూచించే ప్రతీకాత్మక దృశ్యం.
భారీ గడియారం ముందు నిలబడి కాలం గురించి ఆలోచిస్తున్న వ్యక్తి; జీవితం, మార్పు మరియు కాలం విలువను సూచించే ప్రతీకాత్మక దృశ్యం.

Okka Nimisham ChaluTelugu Inspirational Article | Kotha Viritha

ఒక్క నిమిషం చాలు తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 10/06/2026


మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ వాటి దిశను మార్చేది కొన్నిసార్లు ఒకే ఒక్క నిమిషం. ఒక నిర్ణయం, ఒక పరిచయం, ఒక అవకాశం, ఒక వార్త లేదా ఒక సంఘటన మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాలం విలువను, జీవిత సత్యాన్ని లోతుగా ఆలోచింపజేసే రచన ఇది.


జీవితం అనేది సంవత్సరాల ప్రయాణం. కానీ ఆ ప్రయాణానికి దిశ మార్చేది చాలా సార్లు ఒక్క నిమిషమే. ప్రేమ పుట్టడానికి ఒక్క చూపు చాలు. అలాగే ప్రేమ చనిపోవడానికి కూడా ఒక్క క్షణం చాలు. జీవితంలో అత్యంత శాశ్వతంగా కనిపించే బంధాలు కూడా కొన్ని నిమిషాల్లో జ్ఞాపకాలుగా మారిపోతాయి.


మరణం కూడా అంతే. నిన్న చూసిన వ్యక్తి, మొన్న మాట్లాడిన మనిషి ఈరోజు లేకపోవడం మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. "అలా ఎలా చనిపోయాడు" అని ప్రశ్నిస్తాం. 


కానీ చావు రావడానికి ఒక్క నిమిషం సరిపోదా, కాలం తన పని చేయడానికి ఒక క్షణమే చాలదా. వింత ఏమిటంటే, ప్రేమ కోసం, విజయానికి కోసం, ఆనందం కోసం, లేదా ఒక అద్భుతమైన మార్పు కోసం మనిషి జీవితకాలం ఎదురుచూస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క నిమిషం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మన జీవితంలో అద్భుతం జరగటానికి ఒక్క నిమిషం చాలదా ఏంటి.


అసలు మనిషి జీవితం అంతా ఆ ఒక్క నిమిషం కోసం చేసే నిరీక్షణే. పుట్టడానికి తొమ్మిది నెలలు పట్టినా, పుట్టిన క్షణమే జీవితం మొదలవుతుంది. అయితే ఆలోచిస్తే, మనిషి జీవితమంతా నిమిషాల సమాహారమే. గతం అనేది గడిచిపోయిన నిమిషాల జ్ఞాపకం. భవిష్యత్తు అనేది ఇంకా రాని నిమిషాల ఊహ. మన చేతిలో ఉన్నది మాత్రం ఈ ఒక్క నిమిషమే.


మనిషి కోల్పోయేది కూడా నిమిషాలనే, సంపాదించేది కూడా నిమిషాలనే. కాలం చాలా విచిత్రమైనది. మనం ఎదురుచూసే నిమిషాలు రావడానికి యుగాల్లా అనిపిస్తాయి. కానీ అవి వచ్చి వెళ్లిపోవడానికి మాత్రం క్షణం కూడా పట్టదు. అందుకే జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటనలు కాదు, వాటిని తీసుకొచ్చే ఆ ఒక్క నిమిషమే.


అద్భుతానికైనా... అంతానికైనా... ఒక్క నిమిషం చాలు.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

250 కి పైగా శీర్షికలు,కథలు,100 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్, టెక్ మహీంద్రా లో చేస్తున్నాను.


5 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

నైస్ ఆర్టికల్ అమ్మ... మనుషుల్లో భావుకథ లేకపోతే జీవితం నిస్సారం. జీవితాన్ని విశ్లేషించే వాడు కాలం యొక్క విలువని గమనిస్తాడు అలాగే ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుంటాడు. వెరీ ఇన్స్పైరింగ్ షార్ట్ స్టోరీస్

Like

Rated 5 out of 5 stars.

👌👌👌

Like

Puli Teja
Puli Teja
Jun 10
Rated 5 out of 5 stars.

💯💯🔥

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

Viritha
Viritha
Jun 10
Rated 5 out of 5 stars.

🔥

Like
bottom of page