top of page
Original.png

పెద్ద ప్లానే

Updated: Jun 15

పెద్ద ప్లానే, కొత్త విరిత, తెలుగు వ్యాసం, జీవిత తత్వం, ఆధునిక జీవితం, మానవ సంబంధాలు, ఒత్తిడి, సమయ నిర్వహణ, జీవన విలువలు, ప్రేరణాత్మక వ్యాసాలు


Pedda PlanTelugu Inspirational Article | Kotha Viritha

పెద్ద ప్లానే తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత

Publishes in manatelugukathalu.com on 14/06/2026


ఒకప్పుడు పెద్దలు చెప్పిన జీవన సూత్రాలు మనకు ఓపిక, సమతుల్యత, ప్రశాంతతను నేర్పించేవి. కానీ నేటి కాలంలో వేగమే విజయానికి కొలమానంగా మారింది. బాధ్యతల మధ్య మనిషి తనను తాను కోల్పోతూ, సంబంధాల కంటే షెడ్యూల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో "పెద్ద ప్లానే" వ్యాసం ఆధునిక జీవితంలోని పరుగు, ఒత్తిడి, మానవ సంబంధాల మార్పు మరియు మనం కోల్పోతున్న ప్రశాంతత గురించి లోతైన ఆలోచనలను పంచుతుంది.


ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాట “పరిగెత్తుకుంటూ పాలు తాగటం కన్నా, నిల్చొని నీళ్లు తాగటం మంచిది.”


అది మనిషి ఆత్రం గురించి ఒక హెచ్చరిక.

కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకో అడుగు ముందుకెళ్లింది.

ఇప్పటి మనిషికి నిల్చొని నీళ్లు తాగే సమయం కూడా విలాసంగా మారిపోయింది.


ఉదయం గడియారం మోగేలోపే బాధ్యతలు మేల్కొంటున్నాయి.

చేతిలో కాఫీ ఉంటుంది కానీ మనసులో ప్రశాంతత ఉండదు.ఆఫీసులో లక్ష్యాలు పెరుగుతున్నాయి, ఇళ్లలో మాటలు తగ్గిపోతున్నాయి.


రోజంతా “తీరిక లేదు” అని చెప్పుకునే మనుషులు,రాత్రికి తమకే తాము పరాయివాళ్లైపోతున్నారు.


సంబంధాలు ఇప్పుడు ఆప్యాయత ప్రేమ కంటే వాట్సాప్ మేసేజ్ ల మీద ఎక్కువ నడుస్తున్నాయి.


మనుషుల్ని అర్థం చేసుకోవడం కంటే, దూరం పెట్టడం సులభమైపోయింది. వారాంతం అంటే విశ్రాంతి కాదు, అలసటను గోలలో ముంచే ప్రయత్నం. పార్టీలు పెరిగాయి, కానీ మనసు విప్పి మాట్లాడుకునే వాళ్లు తగ్గిపోయారు.


చిన్న పగుళ్లు వచ్చిన ప్రతిదాన్ని బాగుచేయాల్సిన కాలం పోయింది. ఇప్పుడు మార్చేయడం అలవాటైపోయింది వస్తువులైనా, ఉద్యోగాలైనా, సంబంధాలైనా.


మనిషి వేగం పెరిగింది, కానీ జీవితానికి టైం తగ్గిపోయింది. మొత్తానికి ఈ తరం పరుగెత్తడం నేర్చుకుంది, కానీ ఆగి జీవించడం మాత్రం మర్చిపోయింది.


నిల్చొని నీళ్లు తాగడం దేవుడెరుగు, ఇదే వేగం కొనసాగితే, రేపు ఊపిరి తీసుకోవడానికి కూడా పెద్ద ప్లానే వేసుకునే రోజులు రావొచ్చు సుమీ.


కొత్త విరిత

సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్

ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్


***************************************


కొత్త విరిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: కొత్త విరిత


నా పేరు కొత్త విరిత


B.sc B.ed Msc చేశాను

IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.

240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.

4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Radha R
Radha R
Jul 17
Rated 5 out of 5 stars.

Super

Like

Rated 5 out of 5 stars.

Bagundu ra

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

Rated 5 out of 5 stars.

Nice

Like
bottom of page