top of page
Original.png

ప్రయాణంలో తప్పిన ప్రమాదం

1 hour ago
3 min read

రైలు ప్రయాణంలో ప్రమాదం నుంచి బయటపడి భయంతో హ్యాండిల్ పట్టుకున్న రాజారావు

Prayanamlo Tapiina Pramadam - Telugu Social Story | B. N. Satyanarayana

ప్రయాణంలో తప్పిన ప్రమాదం - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 05/11/2026


“ప్రయాణంలో తప్పిన ప్రమాదం” కథలో అనుకోకుండా ప్రమాదకర పరిస్థితిలో చిక్కుకున్న రాజారావు అనుభవం ద్వారా మానవత్వం, బాధ్యత, ప్రయాణ భద్రతపై రచయిత ఆలోచింపజేస్తారు.


రాజారావుకు విశాఖపట్నం పోవాల్సి ఉంది. 


రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో కౌంటర్‌లో టికెట్ తీసుకునేందుకు క్యూలో నిల్చున్నాడు. 


అప్పటికప్పుడు ప్రయాణం కావడం వల్ల జనరల్ టికెట్టే తీసుకోవలసి వచ్చింది.


ఇంతలోనే ట్రైన్ ప్లాట్‌ఫారమ్ మీదకు వచ్చేసింది. 


రాజారావు పరుగు పరుగున ప్లాట్‌ఫామ్ చేరుకున్నాడు. 


ఇంతలో ట్రైన్ కదిలింది. ఆ సమయంలో ముందు, చివరలో ఉన్న జనరల్ కోచ్‌లు అందుకోవడం అతడికి కుదరదని, రిస్క్ తీసుకోవడమూ ప్రమాదకరమేనని భావించి ఆలస్యం చేయకుండా పోయి ఎదురుగా కనిపించిన స్లీపర్ కోచ్‌లోకి ఆయాసపడుతూ ఎక్కాడు.


లోపలికి పోయి సీటు కోసం వెదకసాగాడు. ఒకచోట రెండు సీట్లు ఖాళీగా కనిపించాయి. 


పోయి ఒక సీటులో కూర్చున్నాడు. 


పక్కనే ఉన్న వ్యక్తి "ఎక్కడికి?" అని అడిగాడు హిందీలో. 


"విశాఖపట్నం" అని చెప్పాడు రాజారావు. అతడేమీ అనలేదు, పక్కనున్న తమ వారితో ముచ్చట్లలో మునిగిపోయాడు.


రాజారావుకు తెలుసు అది స్లీపర్ కోచ్ అని. జనరల్ టికెట్‌తో అందులో ప్రయాణం చేయకూడదని, తప్పు అని. 


ఏం చేయాలి? ట్రైన్ కదిలిపోయింది. కాబట్టి తప్పక ఎదురుగా ఉన్న ఆ కోచ్‌లోనే ఎక్కవలసి వచ్చింది అతడికి. టి.టి.ఇ. వస్తే పెనాల్టీ కట్టడానికి మనసులో సిద్ధపడ్డాడు.


ఇంతలో ఒక వ్యక్తి వచ్చాడు. రాజారావును చూసి "ఎవరు నీవు? ఎక్కడికి?" అని హిందీలో అడిగాడు.


రాజారావు "విశాఖపట్నం పోవాలి" అన్నాడు. దానికి అతడు కోపపడిపోతూ "ఇక్కడ నుండి లేచిపో" అన్నాడు. దానికి సమాధానంగా రాజారావు "సీట్లో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది కదా అని కూర్చున్నాను" అన్నాడు.


ఆ మాటకు కోపంతో అతడు రాజారావు భుజం పట్టుకుని పైకి లేపుతూ, "ఇది మిలిటరీ కోచ్! తెలియదా?" అని గట్టిగా అంటూ రాజారావును ట్రైన్ నుండి బయటకు త్రోసివేస్తానంటూ డోర్ వద్దకు తీసుకుపోయాడు.


దాంతో ఒక్కసారిగా రాజారావు భయంతో వణికిపోతూ, "నాకు ఇది మిలిటరీ కోచ్ అని తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేయండి" అని ప్రాధేయపడసాగాడు. అయినా మూర్ఖంగా అతడు వినిపించుకోవడం లేదు. 


రాజారావు భయంతో కోచ్‌కున్న స్పోక్ (హ్యాండిల్) గట్టిగా పట్టుకుని ఈరోజు తనకు చావు తప్పదేమోనని అనుకుంటూనే భయపడిపోతూ మరింతగా అతడిని బ్రతిమిలాడసాగాడు. 


అప్పుడు అతడు రాజారావును కోచ్ లోపలికి తీసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు.


రాజారావుకు ఆ భయం నుండి బయటపడటానికి చాలా సమయమే పట్టింది. 


ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. చావు నుండి బయటపడ్డట్టుగా అదృష్టంగా భావించి కొద్దిగా ఊపిరి తీసుకున్నాడు.


ఇంత జరుగుతున్నా కోచ్‌లో ఏ ఒక్కరూ దానిని పట్టించుకున్నట్లు లేదు. రాజారావుకి చాలా బాధ, భయం, కోపం కలిగాయి.


కొద్దిసేపట్లో కుదుటపడ్డాక తనలో తాను తర్కించుకోసాగాడు. ఏమిటి? ఇది మిలిటరీ కోచీయా? వారంతా సివిల్ డ్రస్సుల్లో ఉండడంతో అది మిలిటరీ కోచ్‌గా తాను తెలుసుకోలేకపోయాడు అని తలపోస్తున్న అతడిలో మరికొన్ని ప్రశ్నలు మొదలైనాయి.


"వీరు మనం గర్వపడే సైనిక సోదరులేనా? దేశ పౌరుల పట్ల వారికి గల గౌరవం ఇదా?! ప్రశాంతంగా విషయాన్ని విని ఆలోచించి ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకుని సహాయం అందించడానికి ప్రయత్నించకుండా ఇలా బలాన్ని ప్రదర్శించడం మన సైనిక సోదరులకు, బిడ్డలకు ఉచితమా?! దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి వారు ఎంతవరకు దేశానికి నిజాయితీగా భక్తితో ధర్మంగా సేవలు అందించగలుగుతారు?" అని లోలోపల తలపోస్తూ, ఇంక ఆలోచించలేక గమ్మున ఉండిపోయాడు రాజారావు.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y





B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page