top of page

ప్రేమికుడు - పార్ట్ 15


He's an ex

'Premikudu (He's an ex) - Part 15' - New Telugu Web Series Written By BVD Prasada Rao Published In manatelugukathalu.com On 02/09/2024

'ప్రేమికుడు (He's an ex) - పార్ట్ 15' తెలుగు ధారావాహిక

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళతాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని  సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. కోపగించుకుని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ. తల్లి సలహా మీద సంయమనం పాటిస్తుంది.


జాతర కోసం ఊరికి వెళ్లిన శేషగిరి, భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజునుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది.

పార్వతి విషయంలో తన తలిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ.


ఇద్దరూ వాళ్ళ దగ్గరకు వెళ్తారు. పార్వతి సమస్యను వివరిస్తారు.

సానుకూలంగా స్పందిస్తారు వాళ్ళు.



ఇక ప్రేమికుడు పార్ట్ 15 చదవండి. 


"ఇది ఓ ఆప్షన్.. బట్.. ఇదే గుడ్ ఆప్షన్." తేల్చేసాడు నాగేశ్వరరావు.


అప్పుడే రాగిణి అక్కడి వచ్చింది.

"మమ్మీ.. చాక్లెట్ ఇవ్వవా." గిరిజని ముద్దుగా అడిగింది.


"మమ్మీ.. ఏమైనా ఉన్నాయా." అడిగింది సరళని గిరిజ.


"ఆఁ. నిన్న చెప్పావుగా.. ఈ రోజు వస్తున్నట్టు. నిన్ననే పాపకై డాడీ తెచ్చి ప్రిడ్జ్ లో పెట్టారు." చెప్పింది సరళ.


గిరిజ లేచింది. రాగిణితో ఫ్రిడ్జ్ వైపు కదిలింది.

తర్వాత..

సరళ లేస్తూ.. "లంచ్ తయారు చేయాలి. లంచ్ తర్వాత మాట్లాడుకుందాం." చెప్పింది.


"కూర్చో. హోటల్ కు వెళ్దాం. చాలా రోజులైంది కూడా." చెప్పాడు నాగేశ్వరరావు.


"థాంక్స్ డాడీ." రేపర్ తీసిన చాక్లెట్ ని ఇచ్చి.. బాల్కానీ వైపు రాగిణిని పంపించేసి.. అప్పుడే అక్కడికి వచ్చిన గిరిజ సరదా పడుతోంది.

"డన్ తల్లీ. వెళ్దాం. కూర్చో." చెప్పాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"వాట్ అల్లుడుగారూ. హోటల్ మీల్స్ టేస్ట్ చేద్దామా." శేషగిరిని అడిగాడు.


"తప్పక." అనేసాడు శేషగిరి.


"ఆయన దేనికీ వంకలు పెట్టరు." నవ్వింది గిరిజ.


"అందుకే నీ ఆటలు సాగుతున్నాయి." చురక పెట్టింది సరళ సరదాగా.


వాళ్లు నవ్వుకున్నారు.

అప్పుడే సరళ లేచి.. "జస్ట్ ఎ మినిట్. స్వీట్స్ ఉన్నాయి. తింటూ మాట్లాడుకుందాం." అటు వెళ్లింది.


"నీ కోసమేరా.. నీకు ఇష్టమని తెచ్చి పెట్టాను." చెప్పాడు నాగేశ్వరరావు.. గిరిజతో.


"పాలకోవాలా." అడిగింది గిరిజ.


"మరి. అంతేగా." నవ్వేడు నాగేశ్వరరావు.


పాలకోవా పీస్ లతో ఉన్న ప్లేట్ ని తెచ్చి టీపాయ్ పెట్టింది సరళ.

"థాంక్స్ డాడీ." చెప్పింది గిరిజ.. ఒకటి తీసుకుంటూ.


"అమ్మాయి.. మీ నాన్నకి మరి చెప్పి నీ కోసమే తెప్పించింది నేను. ఆ థాంక్స్  నాకు చెప్పు." నవ్వింది సరళ.


"థాంక్స్ మమ్మీ." గిరిజ అనేసింది మరోటి తీసుకుంటూ.


శేషగిరి వీటన్నింటికీ అన్నట్టు పెద్దగా నవ్వేసాడు.

వాళ్లు పాలకోవాలు తింటూ మాటలు తిరిగి మొదలు పెట్టారు.


"మనం రకరకాలుగా ఆలోచించే బదులు.. ఆ అమ్మాయికి జరిగే నష్టం జరిగిపోయింది. వాళ్లని కలపడం దండగ. విడాకులు తీసుకొని.. పార్వతికి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే పోలే. ఆ వెధవ వైపు ఆలోచన ఎందుకు." అనేసింది సరళ.


"పార్వతి ఆలోచన ఇంచుమించు ఇలానే ఉంది. మాత్రం తిరిగి పెళ్లి మాట ఎత్త లేదు. భర్తకి బుద్ధి చెప్పి అతడికి దూరమవ్వాలని అనుకుంటుంది." చెప్పింది గిరిజ.


"మళ్లీ పెళ్లి కుదరనది. మా ఊరి వాళ్ల రీతులు వేరు." కలగచేసుకున్నాడు శేషగిరి.


"విడాకులుకు కారణాలు చూపాలి. జరిగిన అకృత్యాలు ఆ భార్యాభర్తల మధ్యవి. వాటిని బయలు చేయడం ఆ పార్వతికి సాధ్యం పడనది." చెప్పాడు నాగేశ్వరరావు.


ఆ వెంబడే..

"అందుకే సైకియాట్రిస్ట్ వైపు మొగ్గాను. ఆయన ద్వారా దట్ కుమార్ ని మార్చ వచ్చు.. లేదా.. ఆ కుమార్ బలహీనతలు పసి గట్టవచ్చు. అప్పుడు నయాన.. భయాన పద్ధతులు చేపట్టవచ్చు." చెప్పాడు.


"మీరనేస్తున్నారు కానీ. అది చాలా పెద్ద ప్రొసెస్ కదండీ. వ్యయ ప్రయాసలు అవసరమా." మరోసారి తన వాదనకు మొగ్గింది సరళ.


"లేదమ్మా. డాడీ చెప్పింది బాగుంది. ముల్లుని ముల్లుతో తీయగలం. ప్రయత్నిద్దాం." చెప్పింది గిరిజ.

అప్పుడే శేషగిరి కలగచేసుకున్నాడు.


"నాదో ఆలోచన." అన్నాడు.


"చెప్పండి." అంది గిరిజ.


"మనం.. పోనీ.. నేను.. వెళ్లి ఆ కుమార్ ని కలిసి.. పార్వతి తరపున డైరక్ట్ గా ఎప్రోచ్ ఐతే..  ఏదో తెల్తోందిగా." చెప్పాడు శేషగిరి.


"ఏమైనా బెడిసి కొడితే. నేను అలా ఏమీ చేయలేదని ఆ కుమార్ తిరగబడితే.. అప్పుడు పార్వతి పరిస్థితి ఏమిటి." అంది గిరిజ.


ఆ నలుగురు మధ్య కొద్దిసేపు మాటలు లేవు.

అప్పుడే గుర్తొచ్చినట్టు..

"ఆఁ. మా దగ్గర ఫ్రూప్స్ ఉన్నాయి.. పార్వతి మాకు అందించింది.. అని మనం అబద్ధమాడి.. అవి మన దగ్గర ఉన్నట్టు వాడిని నమ్మించి.. వాడిని బెదిరించగలిగితే బాగుంటుందేమో." అన్నాడు శేషగిరి.


"గుడ్. ఇది మంచి చేష్టే." అనేసింది సరళ.


"అక్కడికి వెళ్లి.. అతడిని కలిసి.. ఇంత చేయడం.. సాహసమే ఐనా మంచిదే. కానీ.. అలా చేయగలిగింది ఎవరు." అన్నాడు నాగేశ్వరరావు.


"నేను. అల్రడీ చెప్పాగా." చెప్పేసాడు శేషగిరి.


"మీరా. మీరు ఇంత చేసి పెట్టగలరా." గిరిజ జంకుతోంది.


"రిజా.. నువ్వు   నాకు కాన్ఫిడెన్స్ ఐతే.. నేను చేసేస్తాను." చెప్పాడు శేషగిరి.. భార్యానే తదేకంగా చూస్తూ. 

ఆ వెంబడే..

"నువ్వు దన్ను ఐతే.. నేను పాకేస్తాను." చెప్పాడు.


గిరిజ చిన్నగా నవ్వగలిగింది. కానీ వెంబడే ఏమీ చెప్పలేదు.

భర్తని చూసింది.

అతడు తననే చూస్తున్నాడు.

శేషగిరి చూపుల్లోని పట్టుని గుర్తించాక..

"ప్రయత్నించండి." అనేసింది గిరిజ.


"ప్రతి అంశంలో మీకు మేము అందుబాటున ఉంటాం. మంచి పనే. అమ్మాయి చెప్పినట్టు ప్రయత్నించండి." చెప్పాడు నాగేశ్వరరావు.


"ధైర్యే సాహసే విజయం." అనేసింది సరళ.


"మమ్మీ.. ధైర్యే సాహసే లక్ష్మి.. అంటారేమో." నవ్వింది గిరిజ.


"మా అల్లుడుగారి కోసం మార్చాం." సరళ కూడా నవ్వేస్తోంది.


"అరె. లేవండి. ఒన్ థర్డీ ఐంది. లంచ్ కి వెళ్దాం." లేచాడు నాగేశ్వరరావు.


ఆ తర్వాత.. పావు గంటలోనే.. రాగిణిని తీసుకొని వాళ్లంతా.. కారులో హోటల్ కు బయలు దేరారు.

దార్లో ఉండగా.. 

అప్పలస్వామి నుండి శేషగిరికి ఫోన్ వస్తోంది.

ఆ కాల్ కి అటెండ్ ఐ.. మాట్లాడేక.. కాల్ కట్ చేసేసాడు శేషగిరి.

"రిజా.. నాన్న ఫోన్ చేసి చెప్పారు.." చెప్పుతున్న భర్తకు..

అడ్డై..

"మెకానిక్ మోటర్ బాగు చేసేసాడు. మోటర్ బాగుంది. అంతేగా." నవ్వుతోంది గిరిజ.


ఆ వెంబడే..

"ఫోన్ లో.. ఇటు మీ మాటలతో.. విషయం నాకు తెలిసి పోయిందండీ." చెప్పింది.


"ఏమైనా.. నేను నీకు చెప్పాలిగా." చెప్పాడు శేషగిరి.


"సంతోషం ప్రభూ." గమ్మత్తుగా అంది గిరిజ.


దాంతో.. శేషగిరితో పాటు.. డ్రయివింగ్ చేస్తున్న నాగేశ్వరరావు.. ఫ్రంట్ సీట్ న ఉన్న సరళ.. ఒకరిని ఒకరు చూసుకున్నాక.. చక్కగా నవ్వుకుంటున్నారు.

కారు సాఫీగా హోటల్ వైపుకు పోతోంది.

***

రాత్రి..

ఇంట్లో లంచ్ తర్వాత..

తమ ఇంటి నుండి.. తిరిగి వాళ్ల ఇంటికి బయలు దేరుతున్న శేషగిరితో..

"అల్లుడుగారూ.. ఆ కుమార్ ని మీరు కలవక ముందు.. ఆ పార్వతితో మాట్లాడండి. తన అభిప్రాయం ముఖ్యం."  చెప్పాడు నాగేశ్వరరావు.


"అలా అంటారా." అన్నాడు శేషగిరి.


"మరే. తన ఆలోచన ఎలా ఉంటుందో మరి." అన్నాడు నాగేశ్వరరావు.


అప్పటికే శేషగిరి మోటర్ సైకిల్ ఎక్కి ఉన్నాడు.

రాగిణిని భర్త ముందు ఫ్లూయిల్ టేంక్ మీద గిరిజ కూర్చుండబెడుతోంది.

"బై తల్లీ." మనవరాలు బుగ్గ గిల్లి చెప్పింది సరళ.


"బై అమ్మమ్మా." రాగిణి చేయి ఊపింది.

ఆ వెంబడే..

"బై తాతా." అంది.


నాగేశ్వరరావు సరదాగా ఊగిపోతూ..

"బై రా." అన్నాడు.. మనవరాలి భుజం తడుతూ.


"మరి బయలుదేర్దామా." భర్త భుజం మీద చేయి వేసింది గిరిజ. చిన్నగా నవ్వుతోంది.


"యయ." అనేసాడు శేషగిరి.


ఆ వెంబడే..

"సరే అంకుల్. నేను పార్వతితో మాట్లాడతాను. తిరిగి మీతో మాట్లాడతాను." చెప్పాడు.


"సరే. బై బాబూ." అనేసాడు నాగేశ్వరరావు. కొద్దిగా వెనుక్కు తగ్గాడు.


గిరిజ మోటర్ సైకిల్ ఎక్కుతోంది.

"బై ఆంటీ." చెప్పాడు శేషగిరి.. సరళతో.


"సరే బాబూ. జాగ్రత్త." తను రెండు అడుగులు వెనుక్కు వచ్చేసింది.


"సరే మమ్మీ. సరే డాడీ." గిరిజ మోటర్ సైకిల్ మీద భర్త వెనుక కూర్చుంది. కూతురు మీదకి తన అర చేయి వచ్చేలా.. భర్త నడుము చుట్టూ పట్టులా చేయి తిప్పింది.


ఆ మోటర్ సైకిల్ కదిలింది.

అది వీథి మలుపు తిరిగేక.. నాగేశ్వరరావు.. సరళ.. ఇంట్లోకి హాయిగా నడిచారు.

 ***

తమ గదిలో పడుకుంటున్నప్పుడు..

"రేపా పార్వతితో మాట్లాడతారు."  చెప్పింది గిరిజ.


ఆ వెంబడే..

"అవునూ.. గ్రామ దేవత పండుగకు ఆ కుమార్ రాలేదు. బహుశా వీళ్లు పిలుపు చేయ లేదా.. లేక.. అతను రాలేదా." తన సంశయం వ్యక్తపరిచింది.


"అవునుగా. మనం పార్వతిని అడగనే లేదు." అన్నాడు శేషగిరి.


"పార్వతికి ఫోన్ చేస్తారుగా. అడగండి." చెప్పింది గిరిజ.


రాగిణి వాళ్లద్దరి మధ్య కదులుతోంది.

గిరిజ ఒత్తిగిల్లింది. 

రాగిణిని జో కొడుతోంది.

అర నిముషం తర్వాత..

శేషగిరి భార్య వైపు ఒత్తిగిల్లి..


========================================================================

ఇంకా వుంది..

======================================================================== 


బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










137 views0 comments

Comments


bottom of page